ప్ర :కులాలు , మనుష్యుల పేర్లు, ఇంటి పేర్లు , వంశాలు మరియు గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి ?
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో సుమారుగా 145 కులాల వారు నివశిస్తున్నారు.
ఉదా : పూర్వ కాలంలో పుట్టిన వారందరికీ వెంకటేశ్వర్లు , శ్రీనివాస్, పధ్మావతి అని మల్లన్న , రాజన్న , రామయ్య , రామ స్వామి , సీతమ్మ , కృష్ణయ్య అని కల్సి వచ్చే విధంగా పేర్లు పెట్టుకునే వారు . భయంతో ఉప్పలమ్మ , ఉప్పలయ్య , ఉపేందర్ అని పేర్లు పెట్టుకునే వారు . ఆ విధముగా మిగిలిన వన్నీ పేర్లు పెట్టుకునే వారు. ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం , నెట్లో వెతికి రెండు అక్షరాలా , మూడు అక్షరాలా పేర్లు పెట్టుకుంటున్నారు.
ఇంటి పేర్లు :
ఇక ఇంటి పేర్లు అనేవి ఒకే వంశానికి చెందిన వారీగా వ్యక్తుల గుర్తింపు కోసం ఇంటి పేర్లు ఏర్పడ్డాయి. అందరు మనుష్యులే . కాక పోతే వారిలో స్త్రీలు పురుషులు ఉంటారు . ట్రాన్స్ జెండర్స్ ఉంటారు . వీరిని గుర్తించడం ఎలా ? పేర్లు పెట్టుకుంటారు కదా అని మీరు అనవచ్చు.
వీరందరిని ఒకే వంశానికి చెందిన వారుగా గుర్తించడం ఎలా? అందుకని ఇంటి పేరు కావాల్సి వచ్చింది . ఆ ఇంటి పేర్లు ఎలా వచ్చాయంటే , వారు నివసించే ఊరును బట్టి , ప్రాంతాన్ని బట్టి , వారి పనిని బట్టి , వారి ఉనికిని బట్టి ఇంటి పేర్లు వాడుకలోకి వస్తూ ఉన్నాయి . ఒక్కో సారి ఎవరైనా దత్తతకు పోయినప్పుడు , దత్తత తీసుకున్నవారి ఇంటిపేర్లు , వీరి ఇంటి పేర్లుగా మారుతూ ఉన్నాయి . ఉదా : 'తొండ' . ఈ ఇంటి పేరు 'తొండ' అని ఎందుకు వచ్చిందంటే , వారి పూర్వీకులు 'తొండ' అనే గ్రామంలో నివసించి మరో గ్రామానికి బ్రతకడానికి వచ్చారు . అప్పటి నుండి వారికీ ' తొండ ' అనే పదం ఇంటి పేరుగా మారింది . తొండ గ్రామం వలస వచ్చిన ఇతర కులాలకు కూడా ఇంటి పేరు 'తొండ' అనే పిలువా బడుతున్నారు . అంత మాత్రాన అందరూ ఒకే కులం కాదు. అలానే ' బండి '. పూర్వ కాలంలో 'బండి ' అనే ఇంటి పేరు ఎలా వచ్చినదంటే , వారి పూర్వీకులు బండ్లల్లో ఉప్పు బస్తాలు వేసుకుని , ఊరూరా తిరిగి ఉప్పును అమ్ముతుండే వారు . ఆ విధంగా వారికీ ' బండి' అనేది ఇంటి పేరుగా ఆపాదించ బడినది . వరంగల్ జిల్లా , ఘనాపూర్ దగ్గరి తాటి కొండలో నివసించిన వారు , ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికీ , ఇంటి పేరు "తాటి కొండ" అని పేరు వచ్చింది . ధర్మపురిలో నివసించి , ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి , ఇంటి పేరు "ధర్మపురి " అని వచ్చింది . ఆంధ్ర ప్రదేశ్ లోని పందిళ్ళ పల్లి అనే గ్రామం లో నివసించి , ఇతర ప్రాంతాలకు వెళ్లిన అందరికి ఇంటి పేరు " పందిళ్ళ పెళ్లి " అని ఏర్పడినది . తెలంగాణా లోని తాడూరు అనే గ్రామం నుండి వలస వచ్చిన వారికీ "తాడూరు లేదా తాడూరి" అను ఇంటిపేరు వచ్చింది . నారాయణుడికి లేదా శ్రీ రామానుజ చార్యుల వారికీ చేసే సేవలను బట్టి కూడా ఇంటి పేర్లు వచ్చాయి . ఉదా: స్వామి వారి ఊరేగింపులో దివిటీలను (దీపాలు) పట్టుకునే వారి ఇంటి పేరు 'దివిటి' గా వచ్చింది . స్వామి వారికీ వింజామరలు (నెమలి పింఛాలతో) ఊపే వారి ఇంటి పేరు 'వింజామర' , 'వింజమూరి' , 'ఇంజమూరి' అని ఏర్పడినది. అలానే శ్రీ రామానుజా చార్యులవారు నివశించిన పట్టణాల పేర్లు , గ్రామాల పేర్లు , వారు స్థాపించిన మఠాల పేర్లు , వారు వ్రాసిన గ్రంధాల పేర్లను కొందరి ఇంటి పేర్లుగా మారాయి . ఆళ్వారుల పేర్ల మీదుగా కొందరి ఇంటిపేర్లు ఏర్పడ్డాయి . ఇలానే అనేకమైన ఇంటిపేర్లు వచ్చాయి .
ఒక్కో సారి ఎవరైనా దత్తతకు పోయినప్పుడు , దత్తత తీసుకున్నవారి ఇంటిపేర్లు , వీరి ఇంటి పేర్లుగా మారుతూ ఉన్నాయి . ఉదా: "గజవెళ్లి" ఇంటి పేరు గల చిన్న అబ్బాయి , "తాడూరి" వారి ఇంటికి దత్తతకు పోయాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం మొత్తం , "తాడూరి" గానే పిలువబడుతున్నారు.
అలానే "నందగిరి" అనే ఇంటి పేరు గల అబ్బాయి , "వెంకటయోగి" ఇంటికి దత్తతకు వెళ్ళాడు . ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం మొత్తం మరియు వారి తరాలు అన్నీ "వెంకట యోగి" అనే ఇంటిపేరు తోనే పిలువబడుతున్నారు.
అయితే , ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి . ఎవరైతే దత్తతకు తీసుకుంటారో , వారి గోత్రాలే వీరికి వర్తిస్తాయి. అంటే గోత్రాలు కూడా మారుతూ ఉంటాయి . ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు.
అలానే ఎదో ఒక రకమైన కారణంతో మిగిలిన ఇంటిపేర్లు కూడా ఏర్పడ్డాయి . అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమంటే , ఒక ఊరు నుండి బ్రతకడానికి , ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన అన్ని కులాల వారు ఒకే రకమైన వృత్తులను చేసే వారు కాదు .
ఉదా : పూర్వ కాలంలో "తాటి కొండ" గ్రామానికి , "తొండ" గ్రామానికి "కొండ" ప్రాంతానికి , వివిధ కులాల వారు కలిసి బ్రతకడానికి వెళ్లారు. అక్కడ కరువు కాటకాలు వచ్చో , బ్రతుకుదెరువు లేకనో , లేదా మరో కారణంగానో , వివిధ కులాలవారందరూ కలిసి మరో గ్రామానికి లేదా మరో ప్రాంతానికి ఊకుమ్మడిగా కలిసి వచ్చినప్పుడు , వారిని సులువుగా గుర్తుపెట్టుకోడానికి , ఆ గ్రామ ప్రజలు వారిని , పలానా "తాటికొండ" నుంచి వచ్చిన వారని లేదా పలానా "తొండ " గ్రామం నుంచి వచ్చిన వారని లేదా పలానా "కొండ" ప్రాంతం నుండి వచ్చిన వారని , పిలిచే వారు . కొంత కాలానికి అవే ఊర్ల పేర్లు , అక్కడినుంచి వచ్చిన అన్ని కులాల వారికి ఇంటి పేర్లుగా మారాయి . 'తాటికొండ' ఇంటి పేరు వారు బహు జనుల కులంలో ఉన్నారు , 'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో ఉన్నారు . 'బండి' ఇంటి పేరు గల వారు 'గౌడ్' లో ఉన్నారు .'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో కూడా ఉన్నారు . 'కొండ', 'బెల్లం కొండ', 'దాస్యం', ధర్మపురి' ఇంటి పేరు గల వారు 'కాపు' లో ఉన్నారు, 'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో కూడా ఉన్నారు . 'తొండ' ఇంటి పేరు గల వారు 'పద్మ శాలీ' లో ఉన్నారు , 'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో కూడా ఉన్నారు . వాస్తవానికి ఎవరికులం వారికి ఉంది . అందుకని , ఆ విధంగా ఏర్పడిన ఇంటిపేర్లు ఒకటే ఉన్నంత మాత్రాన , అందరూ ఒకే కులం అనడానికి వీలు లేదు. వారందరూ ఒకే కులం వారు కాదు .
అందువలన నేడు కొన్ని కులాలవారికి ఇంటి పేర్లు ఒకటే అయినను కులాలు వేరుగా ఉండడం మనం గమనించ వచ్చు . కొందరు వారి అవసరాలకు కులాలను మార్చుకుని ఉండ వచ్చు. కొన్ని ఇంటి పేర్లు , పూర్వకాలంలో రిజిస్ట్రేషన్స్ , సర్టిఫికెట్స్ లేని కారణంగా , వారు ఏ ఊరు నుండి వచ్చారో , ప్రజలు ఎలా పిలిచారో అవే పేర్లు రిజిస్టర్లోకి ఎక్కాయి. అంటే వరిజినల్ ఇంటి పేరు ఒకటి , తరువాత మారిన ఇంటి పేరు ఒకటి . ఆ విధంగా అనేక కారణాల వలన ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఇంటి పేర్లు మారినాయి . ఇంటిపేర్లు మారుతున్నాయి . ఆ ఇంటిపేర్లనే నేడు వంశాలుగా గుర్తిస్తున్నాము.
ఉదా : తెలంగాణలో ,
శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ఎం .బి . సి . చైర్మన్ (కుమ్మరి).
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "తాడూరి" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ తాటికొండ రాజయ్య (మాదిగ ).
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "తాటి కొండ" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ దాస్యం వినయ భాస్కర్ (కాపు )
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "దాస్యం" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీమతి కొండా సురేఖ (కాపు)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "కొండా" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ. ధర్మపురి శ్రీనివాస్ (కాపు)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "ధర్మ పురి" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ బెల్లంకొండ సురేష్ (కాపు)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "బెల్లం కొండ " ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ వకుళాభరణం కృష్ణ మోహన్ (దాసరి)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "వకుళా భరణం " ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
ఈ విధంగా మనం ఎన్నో ఇంటి పేర్లను ఇతర కులాలలో కూడా చూడవచ్చు. అంత మాత్రాన , అందరూ ఒకే కులం కాదు. ఎవరి కులం వారిదే .
అయితే , ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి . పిల్లలను ఎవరైతే దత్తతకు తీసుకుంటారో , దత్తతకు తీసుకున్నవారి ఇంటి పేర్లు మరియు గోత్రాలు , పిల్లలకు వర్తిస్తాయి. అంటే ఇంటి పేర్లు గోత్రాలు కూడా మారుతూ ఉంటాయి . ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు.
సాధారణంగా ఒకే గోత్రంలోని వారు వివాహాలు చేసుకోకూడదు అని అంటారు. కానీ వాస్తవంగా చూస్తే , రామానుజా గోత్రంలోని వారే , ఇప్పటివరకు లక్షలాది పెళ్లిళ్లు చేసుకున్నారు . చేసుకుంటున్నారు . చేసుకుంటారు కూడా. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గోత్రం సమస్య రాలేదు. అందరూ పిల్ల పాపలతో హాయిగా జీవిస్తున్నారు . అయితే వంశాలు ఖచ్చితంగా వేరే ఉండునట్లుగా పాఠిస్తున్నారు . కొందరు పెద్దలు చెబుతారు , వీరి గోత్రాలు వేరే ఉండి ఉంటాయని . అందరికి తెలియక పోవచ్చని . కావచ్చు . పురాణాలు వేరు , వాస్తవాలు వేరు.
ఇప్పటికైనా మనకు పూర్తిగా అర్ధమై ఉండాలి . కులాలు ఎలా ఏర్పడ్డాయి ,మనుష్యుల పేర్లు ఎలా ఏర్పడ్డాయి, ఇంటిపేర్లు ఎలా ఏర్పడ్డాయి మరియు గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి .
- మార్గం కృష్ణ మూర్తి .
www.sollutions2all.blogspot.com
జ : కులాలు :
కులాలు అనేవి ఈనాటివి కావు . త్రేతా యుగం కాలం నుండి కూడా కులాలు ఉన్నాయని మనం గట్టిగా నమ్మ వచ్చు .
గత వేల యేండ్ల క్రిందటి చరిత్రను పరిశీలిస్తే , మనుష్యుల చేతగాని తనం , కొన్ని పనుల పట్ల అనాసక్తి, బలహీనత , అమాయకత్వం , బుద్ది మాంద్యం, విద్య లేక పోవడం , పేద తనం లాంటి అనేక కారణాల వలన వారికి నచ్చిన పనులను మాత్రమే చేస్తుండే వారు . అంతే కాకుండా , అరేయి ఆ పని నీవు చేయి , ఈ పని నీవు చేయి అని కాస్త బలమైన వారు, తెలివైన వారు కమాండ్ గా చెబుతూ ఉండే వారు . ఇక పోతే కొందరు వారి వారి అభిరుచులకు అనుగుణ మైన పనులను లేదా చేత నైనా పనులను ఎంచుకునే వారు . ఇప్పటికి కూడా అలాంటి విధానమే కొన సాగుతుంది . ఏవైతే పనులను వారు , బలమైన వారు చెప్పడం వలన లేదా వారికి ఇష్టమై పనులు చేయడం మొదలు పెట్టారో , అప్పటి నుండి వారు, ఆయా పనులకు అలవాటు పడి కొనసాగిస్తూనే ఉన్నారు . ఎవరు ఏ వృత్తులనైతే చేస్తారో , వారిని వారి వృత్తులు గానే పిలువ బడుతున్నారు . ఉదా : కుండలు చేసే వారిని కుమ్మరి అని , చెక్క పనులు చేసే వారిని వడ్ల వారు అని , బట్టలు ఉతికే వారిని చాకలి వాండ్లు అని , నూనె తీసే వారిని గానుగ వాండ్లు అని , ఇనుప సామాన్ల పనులు చేసే వారిని కమ్మరి వారు అని , చెప్పులు కుట్టే వారిని మోచి (మాదిగలు ) వారని , బట్టలు కుట్టే వారిని మేర వాండ్లని , తాడు ఎక్కేవారిని గౌండ్ల వారని , గొర్రెల , మేకలను పెంచే వారిని గొల్ల వారని , వేదాలు చదివే వారిని , వేద మంత్రాలు , పూజలు పునస్కారాలు చేస్తూ, అత్యంత గౌరవంగా జీవించే వారిని బ్రాహ్మణులని , అక్షయ పాత్రలను పట్టుకుని తిరిగే వారిని , పూజలు పునస్కారాలు చేస్తూ , మడులతో నిష్టగా జీవించే వారిని చాత్తాద శ్రీవైష్ణవులని , సాతానులని, అమ్మకాలు , వ్యాపారం చేసే వారిని వైశ్యులని , యుద్దాలు చేసే వారిని క్షత్రీయులని పిలిచే వారు .ఇలా చేసే వృత్తులను (పనులను) బట్టి రక రకాల కులాలు ఏర్పడ్డాయి . కానీ ఇప్పుడు జీవనోపాధి కొరకు , ఎవరు ఏ వృత్తులు చేపట్టినా , పూర్వపు కులాలే స్థిరంగా ఉండి పోతున్నాయి . అందుకు ముఖ్య కారణం , ప్రభుత్వ రికార్డులలో రిజిస్టరై పోతున్నాయి కాబట్టి . ఆ విదంగా మనుష్యులు మూడు విధాలుగా విభజించ బడ్డారు . వారు బ్రాహ్మణులు , క్షత్రీయులు మరియు శూద్రులు. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో సుమారుగా 145 కులాల వారు నివశిస్తున్నారు.
మనుష్యుల పేర్లు :
ఇక మనుష్యుల పేర్లు అనేవి వ్యక్తుల గుర్తింపు కోసం ఏర్పడినవి . అందరు మనుష్యులే . కాక పోతే వారిలో స్త్రీలు పురుషులు ఉంటారు . ట్రాన్స్ జెండర్స్ ఉంటారు . వీరిని గుర్తించడం ఎలా ? పేర్లు పెట్టుకుంటారు కదా అని మీరు అనవచ్చు. అందుకే మనుష్యులకు కాలక్రమేణా పేర్లు పెట్టడం జరిగింది. అయితే పేర్లు ఎలా పెట్టారో పరిశోధన చేస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. పూర్వ కాలంలో ప్రజలు ఏ దేవుడినైతే ఇష్టాంగా పూజిస్తారో , ఏ దేవతనైతే నమ్ముతారో వారి పేర్లనే పెట్టుకునే వారు . అది వారి నమ్మకం లేదా భయం . ఇలా పెట్టుకుంటే ఆ దేవుడి అంత లేదా ఆ దేవత అంత గొప్పవారవుతారని లేదా వారి ఋణం తీర్చుకున్న వారిమి అవుతామని వారి విశ్వాసం. అంతే కాదు , ఒక వేళా ఆ దేవుడి లేదా ఆ దేవత పేరు పెట్టుకోక పోతే , మనకు హాని చేస్తారేమో నన్న భయము ఉండేది . ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది . మరి కొంత కాలానికి , జ్ఞ్యాపకార్ధం తాతల , అమ్మమ్మల పేర్లు పెట్టుకునే వారు. ఆ తరువాత త్యాగ మూర్తుల పేర్లు , గొప్ప వారి పేర్లు , హీరో , హీరోయిన్ల పేర్లు సంఘటనల గుర్తులను పేర్లుగా పెట్టుకునే వారు . ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం , నెట్లో వెతికి రెండు అక్షరాలా , మూడు అక్షరాలా పేర్లు పెట్టుకుంటున్నారు.ఉదా : పూర్వ కాలంలో పుట్టిన వారందరికీ వెంకటేశ్వర్లు , శ్రీనివాస్, పధ్మావతి అని మల్లన్న , రాజన్న , రామయ్య , రామ స్వామి , సీతమ్మ , కృష్ణయ్య అని కల్సి వచ్చే విధంగా పేర్లు పెట్టుకునే వారు . భయంతో ఉప్పలమ్మ , ఉప్పలయ్య , ఉపేందర్ అని పేర్లు పెట్టుకునే వారు . ఆ విధముగా మిగిలిన వన్నీ పేర్లు పెట్టుకునే వారు. ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారం , నెట్లో వెతికి రెండు అక్షరాలా , మూడు అక్షరాలా పేర్లు పెట్టుకుంటున్నారు.
ఇంటి పేర్లు :
ఇక ఇంటి పేర్లు అనేవి ఒకే వంశానికి చెందిన వారీగా వ్యక్తుల గుర్తింపు కోసం ఇంటి పేర్లు ఏర్పడ్డాయి. అందరు మనుష్యులే . కాక పోతే వారిలో స్త్రీలు పురుషులు ఉంటారు . ట్రాన్స్ జెండర్స్ ఉంటారు . వీరిని గుర్తించడం ఎలా ? పేర్లు పెట్టుకుంటారు కదా అని మీరు అనవచ్చు.
వీరందరిని ఒకే వంశానికి చెందిన వారుగా గుర్తించడం ఎలా? అందుకని ఇంటి పేరు కావాల్సి వచ్చింది . ఆ ఇంటి పేర్లు ఎలా వచ్చాయంటే , వారు నివసించే ఊరును బట్టి , ప్రాంతాన్ని బట్టి , వారి పనిని బట్టి , వారి ఉనికిని బట్టి ఇంటి పేర్లు వాడుకలోకి వస్తూ ఉన్నాయి . ఒక్కో సారి ఎవరైనా దత్తతకు పోయినప్పుడు , దత్తత తీసుకున్నవారి ఇంటిపేర్లు , వీరి ఇంటి పేర్లుగా మారుతూ ఉన్నాయి . ఉదా : 'తొండ' . ఈ ఇంటి పేరు 'తొండ' అని ఎందుకు వచ్చిందంటే , వారి పూర్వీకులు 'తొండ' అనే గ్రామంలో నివసించి మరో గ్రామానికి బ్రతకడానికి వచ్చారు . అప్పటి నుండి వారికీ ' తొండ ' అనే పదం ఇంటి పేరుగా మారింది . తొండ గ్రామం వలస వచ్చిన ఇతర కులాలకు కూడా ఇంటి పేరు 'తొండ' అనే పిలువా బడుతున్నారు . అంత మాత్రాన అందరూ ఒకే కులం కాదు. అలానే ' బండి '. పూర్వ కాలంలో 'బండి ' అనే ఇంటి పేరు ఎలా వచ్చినదంటే , వారి పూర్వీకులు బండ్లల్లో ఉప్పు బస్తాలు వేసుకుని , ఊరూరా తిరిగి ఉప్పును అమ్ముతుండే వారు . ఆ విధంగా వారికీ ' బండి' అనేది ఇంటి పేరుగా ఆపాదించ బడినది . వరంగల్ జిల్లా , ఘనాపూర్ దగ్గరి తాటి కొండలో నివసించిన వారు , ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికీ , ఇంటి పేరు "తాటి కొండ" అని పేరు వచ్చింది . ధర్మపురిలో నివసించి , ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి , ఇంటి పేరు "ధర్మపురి " అని వచ్చింది . ఆంధ్ర ప్రదేశ్ లోని పందిళ్ళ పల్లి అనే గ్రామం లో నివసించి , ఇతర ప్రాంతాలకు వెళ్లిన అందరికి ఇంటి పేరు " పందిళ్ళ పెళ్లి " అని ఏర్పడినది . తెలంగాణా లోని తాడూరు అనే గ్రామం నుండి వలస వచ్చిన వారికీ "తాడూరు లేదా తాడూరి" అను ఇంటిపేరు వచ్చింది . నారాయణుడికి లేదా శ్రీ రామానుజ చార్యుల వారికీ చేసే సేవలను బట్టి కూడా ఇంటి పేర్లు వచ్చాయి . ఉదా: స్వామి వారి ఊరేగింపులో దివిటీలను (దీపాలు) పట్టుకునే వారి ఇంటి పేరు 'దివిటి' గా వచ్చింది . స్వామి వారికీ వింజామరలు (నెమలి పింఛాలతో) ఊపే వారి ఇంటి పేరు 'వింజామర' , 'వింజమూరి' , 'ఇంజమూరి' అని ఏర్పడినది. అలానే శ్రీ రామానుజా చార్యులవారు నివశించిన పట్టణాల పేర్లు , గ్రామాల పేర్లు , వారు స్థాపించిన మఠాల పేర్లు , వారు వ్రాసిన గ్రంధాల పేర్లను కొందరి ఇంటి పేర్లుగా మారాయి . ఆళ్వారుల పేర్ల మీదుగా కొందరి ఇంటిపేర్లు ఏర్పడ్డాయి . ఇలానే అనేకమైన ఇంటిపేర్లు వచ్చాయి .
ఒక్కో సారి ఎవరైనా దత్తతకు పోయినప్పుడు , దత్తత తీసుకున్నవారి ఇంటిపేర్లు , వీరి ఇంటి పేర్లుగా మారుతూ ఉన్నాయి . ఉదా: "గజవెళ్లి" ఇంటి పేరు గల చిన్న అబ్బాయి , "తాడూరి" వారి ఇంటికి దత్తతకు పోయాడు. ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం మొత్తం , "తాడూరి" గానే పిలువబడుతున్నారు.
అలానే "నందగిరి" అనే ఇంటి పేరు గల అబ్బాయి , "వెంకటయోగి" ఇంటికి దత్తతకు వెళ్ళాడు . ఇప్పుడు ఆ అబ్బాయి కుటుంబం మొత్తం మరియు వారి తరాలు అన్నీ "వెంకట యోగి" అనే ఇంటిపేరు తోనే పిలువబడుతున్నారు.
అయితే , ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి . ఎవరైతే దత్తతకు తీసుకుంటారో , వారి గోత్రాలే వీరికి వర్తిస్తాయి. అంటే గోత్రాలు కూడా మారుతూ ఉంటాయి . ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు.
అలానే ఎదో ఒక రకమైన కారణంతో మిగిలిన ఇంటిపేర్లు కూడా ఏర్పడ్డాయి . అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏమంటే , ఒక ఊరు నుండి బ్రతకడానికి , ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన అన్ని కులాల వారు ఒకే రకమైన వృత్తులను చేసే వారు కాదు .
ఉదా : పూర్వ కాలంలో "తాటి కొండ" గ్రామానికి , "తొండ" గ్రామానికి "కొండ" ప్రాంతానికి , వివిధ కులాల వారు కలిసి బ్రతకడానికి వెళ్లారు. అక్కడ కరువు కాటకాలు వచ్చో , బ్రతుకుదెరువు లేకనో , లేదా మరో కారణంగానో , వివిధ కులాలవారందరూ కలిసి మరో గ్రామానికి లేదా మరో ప్రాంతానికి ఊకుమ్మడిగా కలిసి వచ్చినప్పుడు , వారిని సులువుగా గుర్తుపెట్టుకోడానికి , ఆ గ్రామ ప్రజలు వారిని , పలానా "తాటికొండ" నుంచి వచ్చిన వారని లేదా పలానా "తొండ " గ్రామం నుంచి వచ్చిన వారని లేదా పలానా "కొండ" ప్రాంతం నుండి వచ్చిన వారని , పిలిచే వారు . కొంత కాలానికి అవే ఊర్ల పేర్లు , అక్కడినుంచి వచ్చిన అన్ని కులాల వారికి ఇంటి పేర్లుగా మారాయి . 'తాటికొండ' ఇంటి పేరు వారు బహు జనుల కులంలో ఉన్నారు , 'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో ఉన్నారు . 'బండి' ఇంటి పేరు గల వారు 'గౌడ్' లో ఉన్నారు .'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో కూడా ఉన్నారు . 'కొండ', 'బెల్లం కొండ', 'దాస్యం', ధర్మపురి' ఇంటి పేరు గల వారు 'కాపు' లో ఉన్నారు, 'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో కూడా ఉన్నారు . 'తొండ' ఇంటి పేరు గల వారు 'పద్మ శాలీ' లో ఉన్నారు , 'చాత్తాద శ్రీవైష్ణవ కులం లో కూడా ఉన్నారు . వాస్తవానికి ఎవరికులం వారికి ఉంది . అందుకని , ఆ విధంగా ఏర్పడిన ఇంటిపేర్లు ఒకటే ఉన్నంత మాత్రాన , అందరూ ఒకే కులం అనడానికి వీలు లేదు. వారందరూ ఒకే కులం వారు కాదు .
అందువలన నేడు కొన్ని కులాలవారికి ఇంటి పేర్లు ఒకటే అయినను కులాలు వేరుగా ఉండడం మనం గమనించ వచ్చు . కొందరు వారి అవసరాలకు కులాలను మార్చుకుని ఉండ వచ్చు. కొన్ని ఇంటి పేర్లు , పూర్వకాలంలో రిజిస్ట్రేషన్స్ , సర్టిఫికెట్స్ లేని కారణంగా , వారు ఏ ఊరు నుండి వచ్చారో , ప్రజలు ఎలా పిలిచారో అవే పేర్లు రిజిస్టర్లోకి ఎక్కాయి. అంటే వరిజినల్ ఇంటి పేరు ఒకటి , తరువాత మారిన ఇంటి పేరు ఒకటి . ఆ విధంగా అనేక కారణాల వలన ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఇంటి పేర్లు మారినాయి . ఇంటిపేర్లు మారుతున్నాయి . ఆ ఇంటిపేర్లనే నేడు వంశాలుగా గుర్తిస్తున్నాము.
ఉదా : తెలంగాణలో ,
శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు ఎం .బి . సి . చైర్మన్ (కుమ్మరి).
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "తాడూరి" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ తాటికొండ రాజయ్య (మాదిగ ).
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "తాటి కొండ" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ దాస్యం వినయ భాస్కర్ (కాపు )
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "దాస్యం" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీమతి కొండా సురేఖ (కాపు)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "కొండా" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ. ధర్మపురి శ్రీనివాస్ (కాపు)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "ధర్మ పురి" ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ బెల్లంకొండ సురేష్ (కాపు)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "బెల్లం కొండ " ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
శ్రీ వకుళాభరణం కృష్ణ మోహన్ (దాసరి)
చాత్తాద శ్రీవైష్ణవ కులంలో కూడా "వకుళా భరణం " ఇంటి పేరు గల వారు చాలా మంది ఉన్నారు.
ఈ విధంగా మనం ఎన్నో ఇంటి పేర్లను ఇతర కులాలలో కూడా చూడవచ్చు. అంత మాత్రాన , అందరూ ఒకే కులం కాదు. ఎవరి కులం వారిదే .
గోత్రాలు :
గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి అంటే , పూర్వ కాలంలో ప్రజలు అనేక రకాలైన ఋషులను , గొప్ప వారిని గురువులుగా పూజించే వారు . కొంత కాలానికి , వారు ఏ గురువునైతే పూజించారో వారినే గోత్రం గా భావించు కుంటూ వచ్చారు . గోత్రాలు అనేవి ఋషుల పరంపర . మనకు ఏడుగురు ఋషులు ఉన్నట్లుగా తెలుసు . వారినే సప్త ఋషులని అంటారు . వారు , అత్రి మహర్షి , కశ్యప మహర్షి ,భరద్వాజ మహర్షి , గౌతమ మహర్షి , జమదగ్ని మహర్షి , విశ్వామిత్రుడు , వశిష్ట మహర్షి మొదలైన వారు . వీరే కాకుండా , వీరి వంశ పరంపర ఋషులు 108 మంది ఋషులు ఉన్నారు . వీరి పేర్ల మీదుగా అనేకమైన గోత్రాలు ఏర్పడ్డాయి . గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి అంటే , పూర్వ కాలంలో ప్రజలు అనేక రకాలైన ఋషులను , గొప్ప వారిని గురువులు గా పూజించే వారు . కొంత కాలానికి , వారు ఏ గురువునైతే పూజించారో వారినే గోత్రం గా భావించు కుంటూ వచ్చారు . నేడు మనం ఏ గోత్రాలను చూసినా మన ఋషుల పేర్లు , వారి శిష్యుల పేర్లు మాత్రమే గోత్రాలు గా కనబడుతాయి . అలానే శ్రీ రామానుజా చార్యుల ప్రభోదాలు , ప్రవచనాల ద్వారా , వారి అనుచరులుగా , శిష్యులుగా ,సేవకులుగా , భక్తులుగా మారినవారు కొందరు , శ్రీ రామానుజా చార్యులను వారి గురువుగా భావించి , వారి గోత్రాలను రామానుజా గోత్రంగా పెట్టుకున్నారు . వారి కి ప్రత్యేకమైన గోత్రం ఉన్న , అది తెలియక , సులువుగా విన బడే , రామానుజా గోత్రాన్నే చాలా మంది పెట్టుకున్నారు . శ్రీ రామానుజ చార్యులు ఎవరినీ దూరం పెట్టలేదు . అందరికినీ అక్కున చేర్చుకున్నారు. వారిది విశాల హృదయం.అయితే , ఇక్కడ మరో విషయం గుర్తు పెట్టుకోవాలి . పిల్లలను ఎవరైతే దత్తతకు తీసుకుంటారో , దత్తతకు తీసుకున్నవారి ఇంటి పేర్లు మరియు గోత్రాలు , పిల్లలకు వర్తిస్తాయి. అంటే ఇంటి పేర్లు గోత్రాలు కూడా మారుతూ ఉంటాయి . ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు.
సాధారణంగా ఒకే గోత్రంలోని వారు వివాహాలు చేసుకోకూడదు అని అంటారు. కానీ వాస్తవంగా చూస్తే , రామానుజా గోత్రంలోని వారే , ఇప్పటివరకు లక్షలాది పెళ్లిళ్లు చేసుకున్నారు . చేసుకుంటున్నారు . చేసుకుంటారు కూడా. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి గోత్రం సమస్య రాలేదు. అందరూ పిల్ల పాపలతో హాయిగా జీవిస్తున్నారు . అయితే వంశాలు ఖచ్చితంగా వేరే ఉండునట్లుగా పాఠిస్తున్నారు . కొందరు పెద్దలు చెబుతారు , వీరి గోత్రాలు వేరే ఉండి ఉంటాయని . అందరికి తెలియక పోవచ్చని . కావచ్చు . పురాణాలు వేరు , వాస్తవాలు వేరు.
ఇప్పటికైనా మనకు పూర్తిగా అర్ధమై ఉండాలి . కులాలు ఎలా ఏర్పడ్డాయి ,మనుష్యుల పేర్లు ఎలా ఏర్పడ్డాయి, ఇంటిపేర్లు ఎలా ఏర్పడ్డాయి మరియు గోత్రాలు ఎలా ఏర్పడ్డాయి .
- మార్గం కృష్ణ మూర్తి .
Please watch my YOUTUBE Channel:
https://www.youtube.com/@margamsahitya