కులాలను నిర్ణయించేవి A,B,C,D, లు కావు , వారి తరాలు , వార సత్వాలు :
- మార్గం కృష్ణమూర్తి.
;
దేశ మంతా విస్తరించి ఉన్న పేద మరియు మధ్యతరగతి బంధువులగురించి ఆలోచించడం అనేది చాలా గొప్పవిషయం. ఇలాంటి ఆలోచనలు కేవలం మనసున్న వారికే వస్తుంటాయి. ఇక సంకుచిత మనస్థత్వం గల వారు ఈకలు తోకలు పీకుతూ వీరు మన బంధువులు కాదు వారు మన బంధువులు కాదు అని దూరం పెట్టడం సరికాదు. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా లేదా కుల పెద్దల వత్తిడి వలన లేదా ఎన్నికల్లో లభ్ధి పొందడానికి కుల కాటగిరీలు ఎ ,బి ,సి ,డి లు గా మరియు సబ్ కాటగిరీలుగా మారుస్తూ ఉంటారు.రాజకీయ నాయకులు జీవితాంతం ఒకే పార్టీలో గానీ , ఓకె ప్రభుత్వం లో గాని ఉంటున్నారా? . అలాంటి వారు చేసే క్యాటగిరీలకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలా? వాటిని బేస్ చేసుకుని మేమే గొప్పకులస్థులం అని చెప్పుకోవడం తగదు. కులస్థుల మూలాలు , తరాలు చూడాలి. జీన్స్ చూడాలి. వారి కుటుంభాల వారసత్వం చూడాలి. వారి వృత్తులను చూడాలి. వారి గోత్రాలను చూడాలి.(కొందరివి వేరే ఉండవచ్చు). అసలు వేరే కులస్థులు మన దానిలోనికి ఎందుకు వస్తారు. వాల్లకు వేరే సంఘాలు ఉన్నాయి. మన దాంట్లోకి వస్తున్నారంటే వారు మనకులస్థులే. నేను గమనించాను , మన కులస్థుల ఒక అమ్మాయి వేరే కులస్థుడిని వివాహం చేసుకుంది. అమ్మాయి మన సంఘంలో ఉంది. అబ్బాయి వారి సంఘంలో ఉన్నాడు. వీరి వారసత్వం టోటల్ గా వేరే సంఘంలోకి వెల్లి పోయారు. ఇక మన అబ్బాయి వేరే కులం అమ్మాయిని చేసుకుంటే ,ఆటోమేటిక్ గా అమ్మాయిది వేరే సంఘం , వారసత్వం టోటల్ గా మన కులం లోకే వచ్చారు. ఇంత చిన్న విషయాల కోసం చాలా మంది పెద్దలు , అనుభవజ్ఞ్యలు , తలలు బద్దలు కొట్టుకొంటున్నారు. మరో ఉదాహరణ చెబుతాను. నదులలో జీవించే చేపలకు , అప్పటి కాల పరిస్థితుల ప్రకారం ఒక కాటగిరీ అలాట్ చేసారనుకుందాం . ఆ జాతి చేపలే , అజ్ఞ్యానం కారణంగానో , వాటి వసతుల ప్రకారమో , నదులలోని చేపలు రానివ్వక పోవడం వలననో , ఆ చేపలను చూసి భయపడటం వలననో , కొన్ని చెరువులలో , కాలువలలో ,కుంటలలో , బొందలలో చేపలు జీవించడానికి అలవాటు పడ్డాయి. అంత మాత్రాన అవి చేపలు కాకుండా పోతాయా. అదే విదంగా మన కులస్థులు వివిద కారణాల వలన , అనగా , నిరక్ష రాస్యత ,అజ్ఞ్యానం , పేద తనం , అవగాహన లేక పోవడం వలన అనేక గ్రామాలలో వివిద పేర్లతో , చాత్తాద , సాతాని , అయ్యవార్లు , పంతుళ్లు , వైష్ణవులు అని రక రకాలుగా పిలువ బడుతున్నారు. వివిద వృత్తులలోో జీవనం కొనసాగిస్థున్నారు. అంత మాత్రాన వారు చాత్తాద శ్రీ వైష్ణవులు కాకుండా పోతారా. ఎక్కడ ఉన్నా ,ఎలాజీవిస్థున్నా మన కులస్థులందరిని కలుపుకొని పోవాలి. పేద బంధువులను వారి కాల్లమీద వారు నిల బడేట్లు చేయాలి. చాత్తాద శ్రీ వైష్ణవుల ఉనికిని నిలబెట్టాలి .
శ్రీమతే రామానుజాయ నమః 🌷🙏- మార్గం కృష్ణమూర్తి.
No comments:
Post a Comment