"ఐక్య రాజ్య సమితి" లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం *సెక్యూరిటీ కౌన్సిల్ ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?
*నేడు సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏక ఛత్రాధిపత్యం వహించే దేశాలు / వీటో పవర్ (Veto Power) / పర్మనెంట్ మెంబర్ షిప్ గల దేశాలు 5 ఉన్నాయి. అవి , ఎ,బి ,సి ,ఎఫ్ & ఆర్. అందులో మన భారత దేశం లేదు.*
*ఐక్య రాజ్య సమితి [యునైటెడ్ నేషన్స్ అఫ్ ఆర్గనైజషన్ (UNO)] 24 , అక్టోబర్ 1945 లో ఏర్పడినది. ఇందులో సుమారుగా 193 దేశాలు ఉన్నాయి . ఐక్య రాజ్య సమితి లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం సెక్యూరిటీ కౌన్సిల్*. ఈ *సెక్యూరిటీ కౌన్సిల్* లో మొత్తం 15 సభ్యత్వ దేశాలు ఉన్నాయి. అందులో 5 పెర్మనెంట్ సభ్యత్వ దేశాలు. 10 పర్మనెంట్ కాని దేశాలు .
*ఐక్య రాజ్య సమితి* చార్టర్ ,1945 ప్రకారం, 5 దేశాలకు *వీటో పవర్* అధికారం లభించింది . వీటినే పర్మినెంట్ దేశాలు అని , బిగ్ 5 అని లేదా పి-5 అని పిలుస్తారు . ఈ 5 దేశాలు మారవు.స్థిరంగా ఉంటాయి . మిగిలిన 10 దేశాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మారుతూ ఉంటాయి.
*ఈ వీటో పవర్ గల 5 దేశాలు ఏవంటే , అమెరికా , బ్రిటన్ , చైనా , ఫ్రెంచ్ మరియు రష్యా *. నేడున్న వీటో పవర్ గల 5 దేశాల దేశాధినేతలు: అమెరికా (డోనాల్డ్ ట్రంప్ ), బ్రిటన్ (బోరిస్ జాన్సన్ ) , చైనా (క్షి జిన్ పింగ్ ) , ఫ్రెంచ్ (ఎమాన్యూల్ మాక్రోన్) మరియు రష్యా (వ్లాడిమిర్ పుతిన్ ).
భారత దేశం, అప్పటి ప్రధాన మంత్రి శ్రీ పి. వి . నరిసింహ రావు గారి కాలం కంటే ముందు నుండే , సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సభ్యత్వం గురించి , చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది . కాని ఇప్పటి వరకు సఫలం కాలేదు . అయితే చాలా కాలం క్రితం 4 దేశాలు అనగా బ్రెజిల్ , జెర్మనీ , భారత దేశం మరియు జపాన్ జి -4 కూటమిగా ఏర్పడి , పర్మనెంట్ సభ్యత్వాలకు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ దేశానికి దక్కలేదు.
ఈ *ఐక్య రాజ్య సమితి* / *సెక్యూరిటీ కౌన్సిల్* యొక్క ప్రధాన బాధ్యత * ప్రపంచంలో శాంతి మరియు రక్షణ కల్పించడం*. ఏదేని సమస్య వచ్చినప్పుడు , దానికి ఒక రెసొల్యూషన్ ను , *సెక్యూరిటీ కౌన్సిల్* డ్రాఫ్ట్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ రెసొల్యూషన్ పాస్ కావాలంటే , ఈ 5 పర్మనెంట్ దేశాల ఓటింగే ( వీటో పవర్ ) అత్యంత కీలకం.
అంతటి కీలక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం మన భారత దేశానికి, స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు దాటినా , ఇప్పటికి లేక పోవడం 130 కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన విషయం. మన భారత దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది . ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టింది మన భారత దేశం. జనాభాలో రెండవ అతి పెద్ద జనాభా గల దేశం. ఆర్ధికంగా పరిపుష్టిగల దేశం భారత దేశం. శాంతి కాముక దేశం భారత దేశం. ఆచారాలు , సంప్రాదయాలు , ఆధ్యాత్మిక విషయాలలో ఉన్నతమైన భావాలూ గల దేశం భారత దేశం . ఎన్నో మతాలు , మరెన్నో కులాలతో కలిసి సంతోషంగా , ఆనందంగా జీవనం సాగిస్తున్న సెక్యూలర్ స్టేట్ మన భారత దేశం. రక్షణ విషయంలో అత్యంత శక్తి వంతమైనది మన భారత దేశం. ప్రపంచ దేశాలన్నిటిలో , మన భారతీయులు సేవలందిస్తున్నారు , కీలకమైన బాధ్యతలను చేపడుతున్నారు , చివరికి ఐక్య రాజ్య సమితిలో కూడా కీలకమైన బాధ్యతలను సునాయాసంగా చేపడుతున్నారు. రాజకీయంగా ఎంతో శక్తి వంతమైనది మన భారత దేశం . ఇన్ని శక్తి సామర్ధ్యాలు ఉన్న మన భారత దేశానికి *సెక్యూరిటీ కౌన్సిల్* లో *పర్మనెంట్ మెంబర్ షిప్* లేక పోవడం *వీటో పవర్* లేక పోవడం బాధాకరమైన విషయం . కనీసం ఇప్పుడైనా , మన ప్రధాన మంత్రి *శ్రీ నరేంద్ర మోడీ* గారి హయాంలోనైనా మనం సాధించి తీరాలి.
No comments:
Post a Comment