అంశం: సామాజికం
శీర్షిక: "దిక్కు లేని పక్షులు"
ప్రక్రియ: మణిపూసలు (లఘు కవితలు)
(రూప కర్త: శ్రీ వడిచర్ల సత్యం )
పరువుగల కుటుంబం
అన్యోన్య కుటుంబం
చిన్న మనస్పర్ధలొచ్చె
విడిపోయె కుటుంబం!
సంపాదనకనీ పోయె
అవకాషముందని పోయె
నీవెంతని అహము తోటి
భర్త భార్య నిడిచి పోయె!
సంపాదనలొ పడిపోయె
త్రాగుడుకు బానీసాయె
కుటుంబాన్ని మరవడంతొ
అనుబంధం దూరమాయె!
అందముందని భార్య
వయసుఉందని భార్య
భర్తపై తాను అహముతొ
పనివాడితొ వెళ్ళె భార్య!
మోజులో వాడుకునే
లోగుట్టు తెలుసుకునే
ఉన్నదంతా ఊడ్చుకొని
తరిమి తరిమి కొట్టెనే!
సమస్యలూ సహజము
అందరికవి నిత్యము
కూర్చుని మాట్లాడుకునిన
ఉండేడిది ఫలితము !
ఉభయులకూ అర్ధమాయె
కాలమంత గడిచిపోయె
కోర్టుల చుట్టూ తిరుగుతు
దిక్కు లేని పక్షులాయె !
భర్త పెళ్ళి చేసుకున్న
భార్య పెళ్లి చేసుకున్న
అది రెండో పెళ్ళేగా
ఎలా పెళ్లి చేసుకున్న!
కలిసి మాట్లాడుకుంటే
తప్పులు తుడిచేసుకుంటే
స్వర్గమే ఆ కుటుంబము
ఒకరికొకరు కలిసుంటే!
మణి పూసలు ప్రక్రియ లక్షణాలు:
01. ప్రతి కవితలో 4 పాదాలు ఉండాలి
02. ప్రతి పాదంలో 10 నుండి 12 మాత్రలే ఉండాలి
03. 1,2 మరియు 4 వ పాదంలో సమానమైన.
మాత్రలే ఉండాలి
04. 3 వ పాదంలో 10 నుండి 12 మధ్యలో
మాత్రలు ఉండాలి.
05. 1,2 మరియు 4 వ పాదం ఒకేరకమైన అక్షరం
చివరన ఉండాలి
06. 3 వ పాదం ఏ అక్షయమైన చివరన ఉండవచ్చు.
07. 4 పాదాలలో సమన్వయం ఉండాలి
No comments:
Post a Comment