Wednesday, May 8, 2024

మానవ నైజం

 వచన కవిత

శీర్షిక: మానవ నైజం

మనిషీ తినేది ఒక మెతుకు
దాని కొరకు నిత్యం వెతుకు
ఆపై  చేస్తాడొక సొతుకు
పరువు పోయాక ఎందుకు ఆ బతుకు !

పొగిడించుకోవాలని ఆశ
పొగడక పోతే నిరాశ
లేదంటే రోజంతా దుర్భాష
అసహనంతో వెళ్ళగక్కుతారు గోస!

తాను చేస్తే సంసారం
అదే ఎదుటి వారు చేస్తే వ్యభిచారం
మనిషికి మనిషిపై ఎందుకో అసహనం
తోటి వారిపై ఎందుకో కోపం
ఇదే మానవ నైజం!

నీచులకుండదు ఏ ఆశయం
ప్రతి దానికీ ఏదో ఒక సంశయం
రోజంతా త్రాగుతారు కషాయం
తోటి వారిపై కప్పుతారు విషవలయం!

తుమ్మ చెట్టైనా ఇచ్చు మేత మేకకు
మర్రిచెట్టైనా ఇచ్చు నీడ మనిషికి
తులసి మొక్కైనా పోయు ప్రాణం, పోయే జీవికి
కానీ కుటిలుడు,
క్షణం క్షణం లాగుతుండు ఎదిగే వారిని!

పాముకు కోరల్లోనే విషం
తేలుకు కొండిలోనే విషం
కుక్కకు పండ్లలోనే విషం
కానీ , మనిషికి నిలువెల్లా విషం

ప్రకృతి అనేది ఒక శక్తి
దాని ముందర మనిషి ఒక వ్యక్తి
పెంచుకోకూడదు ప్రతి దానిపై ఆసక్తి
సద్వినియోగపరుచు కోవాలి యుక్తి
పరమాత్మ పై పెంచాలి భక్తి
దొరుకుతుంది రేపు  ముక్తి !

No comments: