Tuesday, September 16, 2025

బహుముఖ ప్రజ్ఞాశాలులు ఇంజినీర్లు

*నేటి అంశం*- *కవితార్చన*

*సమాజాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర

శీర్షిక: *బహుముఖ ప్రజ్ఞాశాలులు ఇంజినీర్లు*

గుండు సూది నుండి విమానాల
తయారీలో
నేల నుండి చంద్రమండలం పైకి
అంతరిక్ష నౌకలను పంపించడంలో
సందులోని కాలువల నుండి సముద్రాలపై
ఆనకట్టలు నిర్మించడంలో
విశ్వంలో విద్యుత్ కాంతులు నింపడంలో
ప్రముఖ పాత్ర పోషించే వారు ఇంజినీర్లు

ఇంజినీర్లు మెకానికల్ ఎలక్ట్రికల్
ఎలాక్ట్రానిక్ ఏరోస్పేస్ మైనింగ్ నేవీ
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎవరైనా కావచ్చు

నాణ్యమైన ఉత్పత్తులకు మూలవిరాట్టులు
నిరుద్యోగ సమస్య నిర్మూలనలో ప్రముఖులు
భారత దేశాభివృద్ధిలో కీలక పాత్రధారులు
ఇంజినీర్లు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలులు

దేశ రక్షణలో  మిస్సైల్స్ యుద్ద విమానాలు
నౌకల తయారీలో
ఆకాశ హార్మ్యాలు నిర్మించడంలో
రాకెట్లు పంపించడంలో 
సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తయారీలో కీలక పాత్ర 
పోషిస్తున్నారు మన ఇంజినీర్లు శాస్త్రవేత్తలు

మోక్షగుండం విశ్వేశ్వరయ్య డాక్టర్ ఎపిజె
అబ్దుల్ కలాం నరేంద్ర సింగ్ సత్య నాధన్
మాధవన్ గోపాల్ ఆల్బిన్ మరెందరో
ప్రముఖ ఇంజినీర్లకు నెలవు పుణ్య దేశం
భారత దేశం!