ప్ర. ఆర్ధిక సూత్రా లంటే(ECONOMICAL PRINCIPLES) ఏమిటి ? అవి సమాజానికి ఎంతవరకు ఉపయోగ పడుతాయి ?
జ : ఆర్ధికసూత్రా లంటే (ECONOMICAL PRINCIPLES) డబ్బుకు / ద్రవ్వ్యానికి సంభందించిన సలహాలు . అవి సమాజానికి ఎంతో కొంత ఉపయోగ పడుతాయి . వాటిని వినియోగించుకునే వారిని బట్టి ఆధార పడి ఉంటాయి . మనకు రెండు చేతులు ఉన్నాయి . వాటిని ఎన్నోరకాల అవసరాల కోసం ఉపయోగించు కోవచ్చు . అలానే ఆర్ధిక సూత్రాలు కూడా . ఆర్ధిక సూత్రాలను పాటించడం వలన ఆర్ధికంగా అభివృద్ధిని సాధించ వచ్చు . పొదుపును పెంచుకోవచ్చు . వృధా ఖర్చును అరికట్టవచ్చు . ఇలా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతే , ఆ కుటుంభం అభివృద్ధి చెందుతుంది . ఒక కుటుంభం అభివృద్ధి చెందుతే , ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది . ఆ సమాజం అభివృద్ధి చెందుతే , ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది . అలా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతే , ఆ దేశం అభివృద్ధి చెందుతుంది . అలా దేశాలు అభివృద్ధి చెందితే , ప్రపంచమే అభివృద్ధి చెందుతుంది . ఆ ఆర్ధిక సూత్రాలు ఏమంటే ,
01. ఏదైనా ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకునే టప్పుడు , మన బలాలను , బల హీనతలను , మన స్వభావాన్ని , అనుభవాన్ని , మార్కెట్ తీరును , ఆర్ధిక స్థోమతను , వయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి .
02. అధిక వడ్డీలకు అప్పులున్నట్లయితే , స్థిరాస్తులను అమ్మి అయినా సరే ముందు ఎక్కువ వడ్డీ గల అప్పులు తీర్చాలి .
03. ఎట్టి పరిస్థితులలోనూ బ్యాంకులకు , చిట్ ఫండ్ కంపెనీలకు , ఫైనాన్స్ కంపెనీలకు స్యూ రిటీలు ఇవ్వకూడదు .
04. తెలియని వారికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించ కూడదు .
05. ఎట్టి పరిస్థితులలోనూ పని చేసే కంపెనీ లోని యజమానులకు అప్పులు ఇవ్వ కూడదు , ఇప్పించ కూడదు
06. 3 నుండి 6 నెలల ఖర్చుకు సమానమైన డబ్బుకు మించి సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఉంచ కూడదు . అంత కంటే ఎక్కువగా ఉన్న డబ్బును చిన్న చిన్న మొత్తాలలో " ఫిక్స్డ్ డ్ డిపాజిట్ " చేయాలి . దీని వలన వడ్డీని అధికంగా పొంద వచ్చు . సేవింగ్ అకౌంటులో వడ్డీ రేటు సంవత్సరానికి రూ . లు . 100/- కి 4% అయితే , ప్రస్తుతం " ఫిక్స్డ్ డ్ డిపాజిట్ " వడ్డీ రేటు 7.5%. ( సీనియర్ సిటిజన్స్ కు 8%) . చిన్న చిన్న మొత్తాలలో అనగా రూ . లు . 10,000/ 25,000/ 50,000/1,00,000 , ( స్థాయిని బట్టి ) " ఫిక్స్డ్ డ్ డిపాజిట్ " ఎందుకు చేయాలంటే , ఏదైనా చిన్న అవసరం వచ్చినప్పుడు ,పెద్ద మొత్తాన్ని కదిలించ నవసరం ఉండదు . పన్నులు పడకుండా ఉండాలంటే , ఫామ్ జి / హెచ్ గాని , ప్రతి సంవత్సరం ఏప్రిల్ / మే నెలలో సంభదిత బ్యాంకులో ఇవ్వాలి . ఇవి ప్రతి బ్యాంకులో ఉచితంగా లభిస్తాయి . అయితే ఇవి సంవత్సరానికి రూ . లు . 10,000/- వడ్డీ దాటితేనే వర్తిస్తుంది. ఒక వేళా పన్నులు కట్టే వారైయితే , టి .డి ఎస్ సర్టిఫికెట్ బ్యాంకు నుండి తీసుకుని , జులై 31 లోపు ఐ . టి . రిటర్నులు ఫైల్ చేసి క్లెయిమ్ చేసు కోవచ్చు లేదా ఇతర చెల్లించ వల్సిన పన్నులకు అడ్జస్ట్ చేసు కోవచ్చు
07. ఏ .టి .ఎం కార్డుల గురించి , గుర్తు తెలియని వారి నుండి వచ్చిన ఫోన్లకు రెస్పాండ్ కాకూడదు . అకౌంట్ నెంబర్ చెప్పా మన్నా , పిన్ నెంబర్ చెప్పమన్నా , అడ్రస్ చెప్పమన్నా , ఏ . టి . ఎం కార్డు ఎక్సపైర్ అవుత దన్నా స్పందించ కూడదు . భయ పడ కూడదు . తరుచుగా వచ్చే అలాంటి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేయండి .
08. లాటరీల గురించి , ఉచిత ఇన్స్యూరెన్స్ ల గురించి , గుర్తు తెలియని వారి నుండి వచ్చిన ఫోన్లకు రెస్పాండ్ కాకూడదు . డబ్బులు పంపించాం మన్నా , అడ్రస్ చెప్పమన్నా , స్పందించ కూడదు . భయ పడ కూడదు . తరుచుగా వచ్చే అలాంటి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేయండి .
09. ఎక్కువగా బిజినెస్ జరిగే కిరాణా కొట్లల్లలోనే సరుకు తీసుకోవడం వలన నాణ్యమైన వస్తువులు లభిస్తాయి , తక్కువధరకే లభిస్తాయి .
10. జెనెరల్ ఇన్స్యూరెన్స్ లు , మెడికల్ ఇన్స్యూరెన్స్ లు ఆర్ధిక భద్రతకు , పొదుపుకు , టాక్స్ బెనిఫిట్స్ కు ఉపయోగ పడుతాయని చెబుతారు . అవును . అందులో కొంత వాస్తవం కూడా ఉంది . వీటిల్లో అనేక లోటు పాట్లు కూడా ఉన్నాయి . వీటికంటే బదులు ఎక్కువ ఆదాయం కొరకు , ప్రజలు వారి వారి , అల్పాయుష్షును , దీర్గాయుస్సును , రోగాల తీవ్రతను జ్యోతిష్యం ద్వారా తెలుసుకుని , అల్పాయుషు ఉన్న వారు , అధిక రోగాలు ఉన్న వారు మాత్రమే జెనెరల్ ఇన్స్యూరెన్స్ లు , మెడికల్ ఇన్స్యూరెన్స్ లు తీసుకోవడం మంచిది . మిగిలిన వారు పొదుపు చేయడానికి మంచి మ్యూచువల్ ఫండ్స్ లలో గాని , లేదా బ్యాంకు , పోస్టాఫీస్ పి . పి . ఎఫ్ . లేదా ఆర్ . డి . అకౌంట్ల లో గాని అదే లాంగ్ టర్మ్ లో పొదుపు చేయడం వలన ఆర్ధిక భద్రత ఉంటుంది . పొదుపు అలవాటు పెరుగుతుంది . అధిక ఆదాయం లభిస్తుంది . ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్ ఉంటుంది . అవసరాలకు ఉపయోగ పడు తుంది .
11. అధిక ఆదాయానికి , భద్రతకు , పొదుపుకు అత్యుత్తమ పెట్టుబడి విధానం భూములపై పెట్టుబడి పెట్టడం . అదియును ఓపెన్ ల్యాండ్స్ . ఆ తరువాత ఫ్లాట్స్ . వ్యవసాయ భూములైతే ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి . అయితే లాంగ్ టర్మ్ పెట్టుబడులై ఉండాలి . ఆ తరువాతనే మ్యూచువల్ ఫండ్స్ , షేర్స్ , బంగారం , వెండి , చిట్ ఫండ్స్ , ఫిక్సడ్ డిపాజిట్స్ , ఆర్ . డి . అకౌంట్స్ , ఎన్ . ఎస్. సి. సర్టిఫికెట్లు , ఇన్సూరెన్స్ పాలసీస్ , సేవింగ్ అకౌంట్స్ మొదలైనవి వరుస క్రమంలో ఉంటాయి .
12. ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో గాని , ఇతర అధిక రిస్క్ తో కూడిన పెట్టుబడులు పెట్టేటప్పుడు వయస్సును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి . అందుకు ఒక ఆర్ధిక సూత్రం ఉంది . అది ఏమంటే 100 నుండి మన వయస్సును తీసి వేయాలి . అలా తీయగా మిగిలిన శాతాన్ని మాత్రమే అధిక రిస్క్ గల ఫండ్లల్లో పెట్టుబడులు పెట్టాలి . వయస్సు శాతాన్ని అధిక లిక్విడిటీ ఉన్న ఫండ్లల్లో పెట్టుబడులు పెట్టాలి . ఉదా : రాము వయస్సు 40 అనుకుందాం . 100 నుండి 40 తీసి వేస్తే 60 వస్తుంది . అప్పుడు మన మొత్తం పెట్టుబడులలో 60 శాతాన్ని అధిక రిస్క్ గల ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడి పెట్ట వచ్చు . అంటే ఆ వయస్సున 60 శాతం రిస్క్ తట్టుకునే శక్తి ఉంటుంది . అలానే ఆదాయం అధికంగా ఉంటుంది . ఒకో సారి తక్కువగా ఉండ వచ్చు . అలానే 40 శాతం మొత్తాన్ని తక్కువ రిస్క్ గల ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెట్టాలి . అప్పుడు ఇందులో తక్కువ ఆదాయం లభిస్తుంది . కానీ రిస్క్ ఉండదు .

No comments:
Post a Comment