Thursday, August 18, 2016

లక్షల కోట్లకు బడ్జెట్లు (BUDGETS) పెరిగినా , ఇంకనూ కోట్లాది ప్రజలు నిరు పేదలుగానో , అడుక్కు తినే వారు గానో ఎందుకుంటున్నారు ? ఎక్కడుంది లోపం ? ఈ సమస్యకు పరిష్కారమేమిటి ?

ప్ర : లక్షల కోట్లకు బడ్జెట్లు (BUDGETS) పెరిగినా , ఇంకనూ  కోట్లాది  ప్రజలు  నిరు పేదలుగానో , అడుక్కు తినే వారు గానో ఎందుకుంటున్నారు ? ఎక్కడుంది లోపం?  ఈ సమస్యకు పరిష్కారమేమిటి ?

జ :  లక్షల కోట్లకు బడ్జెట్లు (BUDGETS) పెరిగినా , ఇంకనూ  కోట్లాది  ప్రజలు  నిరు పేదలుగానో , అడుక్కు తినే వారు గానో  ఉండడానికి ముఖ్య కారణం  "న్యాయ వ్యవస్థను  మించి , రాజకీయ  వ్యవస్థ  బలంగా  ఉండటం , మేధావులు , నిజాయితీ పరులు  రాజా కీయాలకు భయ పడటం , ప్రజలు కూడా  వారిని  గుర్తించక పోవడం , రాజకీయం లోకి వచ్చిన  కొద్ధి  మంది , తల పండిన  రాజకీయ నాయకుల  ధాటికి తట్టుకో లేక , వారి దారినే  నడవటం , పేద తనంలో మ్రగ్గు తున్న ప్రజలు  తాత్కాలిక  ప్రలోభాలకు , తాయిలాలకు  లొంగి పోవడం , వీటిని నియంత్రించే  పూర్తి  యంత్రాంగం  పత్రికలలో తప్పా , వాస్తవంగా  మన దేశంలో  లేక పోవడం. దానికి తోడు , చట్టాల లోని అవకాశాలను , మినహాయింపులను  చక్కగా సద్వినియోగం  చేసుకుంటున్నారు  " . 

భారత రాజ్యాంగ వ్యవస్థ  చాలా పెద్దది . ప్రపంచంలోనే  అతి  పెద్ద ప్రజా స్వామ్యం గల దేశం భారత దేశం . ఇలాంటి దేశంలో  సాధారణంగా  రాజకీయ వ్యవస్థకే అధిక ప్రాముఖ్యత ఉంటుంది . అందులో ఎలాంటి సందేహం లేదు . అయితే వచ్చిన చిక్కల్లా  , మెజారిటీ  నాయకులూ  ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నిక  కాగా పోవడమే . వాటికి సంబంధించిన  కేసులు  కోర్టుల్లో  యేండ్ల కొద్దీ  నానడమో , వీగి పోవడమో , సాక్షాలు ఆధారాలు లేక  కొట్టివేయడమో జరుగు చున్నది  . 

వీటి కారణంగా  నాయకుల బిడ్డలే నాయకులవ్వడమో , నాయకుల  కార్యకర్తలే నాయకులవ్వడమో  జరుగు చున్నది . కేవలం కళాభి మానంతో  సెలబ్రిటీలు నాయకులవ్వడమో జరుగుచున్నది . ఆ విధంగా  ధన వంతులే  ధన వంతులవుతున్నారు, పేద వారు మరింత పేద వారవుతున్నారు . కేవలం ఓటు బ్యాంక్  గా  మారు తున్నారు . వాళ్లు  విద్యా వంతులు  కావడం లేదు . వాళ్ళ హక్కులు వాళ్లకు తెలియడం లేదు .ఒక వైపు  విద్య లేదు , మరో వైపు పేద తనం . పేదలకు చట్టాల గురించి  ఏమాత్రం తెలియదు . రాజ్యాంగం గురించి అసలే తెలియదు .  ఇక వారికి  లక్షల కోట్ల  ప్రభత్వ సంక్షేమ పధకాల గురించి  అడిగే ధైర్యం ఎలా వస్తుంది . దానికి తోడు రోగాలు , నొప్పులు . దానికోసం మరిన్ని అప్పులు , దానికి తోడు వడ్డీలు . ఈ కారణంగా  కోట్లాది  ప్రజలు నీరు పేదలుగానే , అడుక్కుతినే వారు గానో  కాలం ఎల్ల దీస్తున్నారు , కాటికి దగ్గరవుతున్నారు .  

ఈ సమస్యకు చక్కెటి పరిష్కారం ప్రజా స్వామ్య ఎన్నికల  సంస్కరణే  ,

01. ఓట్లకోసం  మరియు  ఎలాగో  నయాన్నో భయాన్నో  అధికారాన్ని సాధించడం కోసం ,  ప్రజలను , ఓటర్లను  ప్రలోభ పెట్టే  బహుమతులు , తాయిలాలు  ఇవ్వడం , బ్యాంకు అకౌంట్లకు  నగదు   జమ చేస్తామని వాగ్దానాలు  చేయడం , ఉద్యోగాలు  ఇప్పిస్తామని ఆశ చూపడం  మొదలైన వాటి మీద   కేంద్ర  ఎలెక్షన్  కమీషన్  మరియు అన్ని రాజ్యాంగ  వ్యవస్థలు  ద్రుష్టి పెట్టాలి . దృష్టి పెట్టడం కాదు  పూర్తిగా నిషేధించాలి .     

02. ప్రజలకిచ్చిన  వాగ్ధానాలకనుగుణంగా  నడుచుకోని  నాయకులను , 6 నెలల తరువాత  ఎప్పుడైనా కాల్ బ్యాక్ చేసే అది కారం  ప్రజలకు  చట్ట బద్ధంగా  కల్పించాలి .

03. అవినీతి పరంగా ఎన్నికైన  నాయకులను  కనీసం  5 సంవత్సరాలైనా   ఎన్నికలకు దూరం పెట్టాలి .  

04. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా  రాజకీయ నాయకుల కేసులను , 1 నుండి 3 సంవత్సరాల లోపే  తీర్పులు వెలుబడాలి . 

05. ప్రతి 6 వ  సంవత్సరం  రాష్ట్రపతి పాలన  ఉండే విధంగా  రాజ్యాంగాన్ని సవరించాలి . 

06. రూ . లు . 1000/- కోట్ల రూపాయల నిధితో  ప్రత్యేకమైన  ఇంటిలీజెన్స్  ను ఏర్పాటు చేయాలి . దీని లోనే సి బి ఐ , ఏ సి బి , ఎన్ఫోర్స్  మెంట్ , ఇంటిలీజెన్స్  కల్సి పోవాలి . వీరికి  పూర్తి  అద్దికారాలు ఉండాలి . ఏ కేసును డీల్ చేసినా , డైరెక్టుగా  కోర్టులోనే వేయాలి  గాని , రాజకీయ నాయకుల చేతిలో పెట్టకూడదు . ( ప్రస్తుతం ఎలా జరుగుందంటే  కేసులను  పీక్ లెవల్  కు తీసుకు వచ్చి , కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఛేదించి , మీడియాను , ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసి , కాల గర్భము న  కలిపేస్తున్నారు . ఇది  ప్రజలకు  మరో రకమైన సందేశాన్ని పంపిస్తుంది . ఆపై  షరా మామూలే ). 

07. సెలబ్రిటీలకు  ఎన్నికలకు రావడానికి  కనీసం 5 సంవత్సరాలముందు  వారి వారి కళలకు  దూరంగా  ఉండాలి . 

08. చట్టం  ముందు అందరూ సమానులే  అనే భావం ప్రజలలో కల్పించాలి . 

09. ప్రస్తుత  పరిస్థితులకు  అనుగుణంగా  80 సం . రాలు నిండిన  రాజకీయ  నాయకులను  ఎన్నికలకు  అనర్హులుగా  ప్రకటించాలి . 

10. ఎం.ఎల్ .ఏ  లకు , ఎం . పి  లకు  ప్రతి  సం . రం . ఇచ్చే నిధులకు  ప్రతి రూపాయికి  లెక్క పారదర్శకంగా  ఉండాలి .  ప్రతి ఓటరు కు అడిగే హక్కు ఉండాలి .   

11. నల్ల ధనాన్ని  వెలికి తీసి  కొంత  అభివృద్ధికి , ఉపాధి కల్పన కు , మరికొంత  పేద ప్రజలకు ఇచ్చిన  వాగ్ధానం  ప్రకారం  పంచాలి . 

12. ప్రతి ఒక్కరికీ , ఓకే ఆధార్ కార్డు , ఒకే ఓటర్ కార్డు , ఒకే పాన్ కార్డు, ఒకే  బ్యాంక్  అకౌంట్ , ఒకే సెల్ నెంబర్ , ఒకే డ్రైవింగ్ లైసెన్స్ , ఒకే పాస్ పోర్ట్ , ఒకే టిన్ నెంబర్ , ఒకే  'టాన్' నెంబర్ , ఒకే  సర్వీస్ టాక్స్  నెంబర్  ఉండే విధంగా కట్టడి ( నిర్బంధం )  చేయాలి . అప్పుడే నల్ల ధనం  అరికట్ట బడుతుంది .  అప్పుడే  పన్నులు ఎగ్గొట్టడం  ఆగి పోతుంది .  అప్పుడే అవినీతి తగ్గు తుంది . ( ఒకే బ్యాంక్  నెంబరుతో  ఏ  బ్యాంకు సేవలకైనా  మారే  విధంగా , ఒకే  సెల్ నెంబర్ తో  యే  సర్వీస్ ప్రొవైడర్ కైనా  మారే  విధంగా  వెసులుబాటు కల్పించాలి) .

13. స్వాతంత్ర్యం  మనకు సిద్ధించి  70 సం . రాలు కావస్తున్నది . ఇక నైనా  రాజ్యాంగాన్ని  సవరించి , దేశం లోని ప్రజలను  కేవలం  " పేదలు - ధనికులు "  అను రెండు భాగాలుగా మాత్రమే విభజించి , పేదలను  అన్ని రకాలుగా   అభి వృద్ధి చేయాలి .  ఇక్కడ    " పేదలు - ధనికులు " అంటే  అన్ని కులాల వారు  , అన్ని వృత్తుల పేద ప్రజలు ఉంటారు . ధన వంతుల  కులాల్లో  పుట్టడమే  వారికి  జీవితాంత పాపమో , శాపమో  కారాదు . పేదలు  ఆ విధంగా పుట్టడం నేరం కాకూడదు .  

నేను  సూచించినవి  అమలు చేస్తే  తప్పకుండా  ఆర్ధిక సమానత్వం ఏర్పడుతుంది . అవినీతి తగ్గుతుంది . నల్లధనం తగ్గు తుంది . నల్ల దనం బయటకు వస్తుంది . పెదాలు , అడుక్కు తినేవారు  మన దేశంలో కనుమరుగవుతారు . 



No comments: