ప్ర . ' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా నేమి ? ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) అనగా నేమి ? ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) చట్ట బద్ద మైనవేనా ? వీటిలో పెట్టుబడికి భద్రత ఉంటుందా ? వీటిలో ఎంత వరకు పెట్టుబడులు పెట్టవచ్చు ? ఇవి ఎందులో పెట్టుబడులు పెడుతాయి ? వీటిల్లో పెట్టుబడులు పెడితే ఆదాయం ఉంటుందా ?
' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా నేమి ?
జ : ' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) అనగా ఒక క్రొత్త పొదుపు విధానం . సక్రమంగా , సరియయిన సమయంలో , సమర్ధత గల మ్యూచువల్ ఫండ్స్ సంస్థలలో పొదుపు చేయ గలుగుతే కొంత మేర ఎక్కువ రాబడి గల ఒక క్రొత్త పొదుపు విధానం. ఏదైనా పెట్టుబడి పెట్టి లాభాలు సాధించాలంటే ముఖ్యంగా కావాల్సింది , పెద్ద మొత్తం లో డబ్బు , ఎక్కువ సమయం , పెట్టుబడుల స్ట్రాటజీ , ఎందులోనైతే పెట్టుబడులు పెడుతారో , అవి బలంగా , సమర్ధవంతంగా ఉండటం , సహనము , ధైర్యం మొదలైనవన్నీ అవసరం . ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉండక పోవచ్చు . అందుకని కొంత మంది మిత్రులు కలిసి పెట్టుబడులు పెట్టాలనుకునే విన్నూతంగా వచ్చిన ఆలోచనే ' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS ) . మొదట కొంత మంది మిత్రుల సహకారం తో ఏర్పాటు చేసుకున్న నిధులే ' మ్యూచువల్ ఫండ్స్ ' ( MUTUAL FUNDS ). వారు ఆ నిధులను , వారి అందరి తెలివితేటలతో, ఒకరినొకరి సహకారంతో కలిసి సమర్ధవంతమైన పెద్ద పెద్ద కంపెనీలలో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు ఆర్జించే వారు .
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) అనగా నేమి ?
మిత్రులకు ఆ విధంగా వచ్చిన ఆలోచనే ఆర్గనైజ్డ్ ' మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) గా రూపాంతరం చెందాయి . ఇవి మొదట రూ .లు. 10/- , రూ .లు. 100/- ,రూ .లు. 1000/- చొప్పున ప్రజలనుండి , సంస్థల నుండి నిధులను సేకరించి , పెద్ద పెద్ద , సమర్ధమైన కంపెనీలలో పెట్టుబడులు పెడుతారు . ప్రారంభంలో వీరికి రూ .లు. 10/- , రూ .లు. 100/- ,రూ .లు. 1000/- చొప్పున నే యూనిట్లను కెటాయిస్తారు . ఉదా : ఒక వ్యక్తి లేదా సంస్థ రూ .లు . 10,000/- పెట్టుబడి పెడితే , వారికీ 10/- చొప్పున అయితే 1000 యూనిట్లను కెటాయిస్తారు . ఇవి ఎన్నడూ మారవు . వీటిల్లో పెట్టుబడులు పెట్టిన వారిని యూనిట్ దారులని (UNIT HOLDERS) , కెటాయించిన భాగాలను యూనిట్లు (UNITS) అని అంటారు . దీర్ఘ కాలంలో లాభాలను ఆర్జిస్తారు . వాటిని పెట్టుబడి దారులకు , ఖర్చులు మినహాయించుకుని , పంచు తారు . ' మ్యూచువల్ ఫండ్స్ లలో ' స్కీమ్ లు ' అనేక రకాలు గా ఉంటాయి . సెక్టార్ ఫండ్స్ అని , బ్యాంకింగ్ ఫండ్స్ అని , ఐటీ ఫండ్స్ అనీ , ఈక్విటీ ఫండ్స్ అనీ , డెట్ ఫండ్స్ అనీ , బ్యాలెన్సుడ్ ఫండ్స్ అనీ , ఈ .ఎల్ .ఎస్.ఎస్. ఫండ్స్ అనీ రక రకాలుగా ఉంటాయి . అలానే క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అనీ , ఓపెన్ ఫండ్స్ అనీ ఉన్నాయి . డివిడెండ్ ఫండ్స్ అని , గ్రోత్ ఫండ్స్ అని అనేక రకాలుగా ఉన్నాయి . ఓపెన్ ఎండెడ్ ' మ్యూచువల్ ఫండ్స్ లలో, ఆ తరువాత ఎప్పుడైనా పెట్టుబడులు పెట్ట వచ్చు , అమ్మ వచ్చు . కానీ అప్పటి ఎన్ . ఏ . వి ( NAV) ప్రకారం అలాట్ అవుతాయి . అంటే ప్రారంభంలో ఉన్న 10/- ధరకు దొరకవు . ఎన్ . ఏ . వి ( NAV) అంటే నికర ఆస్తి విలువ (NET ASSET VALUE) .
అవును. నిస్సందేహంగా ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) చట్ట బద్ద మైనవే . వీటిపైనా RBI , SEBI, FEMA , MINISTRY OF FINANCE మొదలగు ప్రభుత్వ సంస్థల , పూర్తి కంట్రోలింగ్ అధికారుల ఆజమాయిషీ , నిఘా నిరంతరం ఉంటుంది . చక్క బెట్టే అధికారం , అవసరమైతే రద్దు చేసే అధికారం ఉంటుంది . యూనిట్ దారులకు ఎలాంటి మోసాలు జరుగ కుండా చూస్తుంది .
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో ( MUTUAL FUNDS ORAGANISATIONS) పెట్టుబడికి భద్రత ఉంటుందా ?
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో ( MUTUAL FUNDS ORAGANISATIONS) పెట్టిన పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుంది . మోసం అంటూ ఉండదు . రిటర్న్స్ ను బట్టి రిస్క్ కూడా ఉంటుంది .
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో ( MUTUAL FUNDS ORAGANISATIONS) ఎంత వరకు పెట్టుబడులు పెట్టవచ్చు ?
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో ( MUTUAL FUNDS ORAGANISATIONS) కొన్నింటిలో కనీస మొత్తం రూ . లు . 500/- , మరి కొన్నింటిలో రూ . లు . 1000/- పెట్టుబడులు పెట్టాలనే నియమం ఉంది . అలానే గరిష్టంగా పెట్టుబడులు పెట్టడానికి పరిమితి అంటూ ఏమి లేదు . ఎంత డబ్బైనా , ఎంత కాలమైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు .
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) ఎందులో పెట్టుబడులు పెడుతాయి ?
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) , ప్రజల నుండి , సంస్థల నుండి , బ్యాంకుల నుండి సేకరించిన పెట్టుబడులను , నేటి కాలపు సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించుకుని , పెద్ద పెద్ద కంపెనీలలో , లాభదాయక కంపినీలలో షేర్ల రూపేణా పెట్టుబడులు పెడుతాయి . కొంత మొత్తాన్ని ప్రభత్వ సెక్యూరీటీలలో, కొంత మొత్తాన్ని కాల్ మనీ రూపంలో పెట్టుబడులు పెడుతాయి . మరి కొంత మొత్తాన్ని నగదురూపంలో ఉంచుకుంటాయి . అవి పెట్టిన పెట్టుబడులపై ఆర్జించిన ఆదాయాన్ని , ఖర్చులకు మినహాయించుకుని , కొంత మొత్తాన్ని రిజర్వులకు మళ్లించి , మిగిలిన మొత్తాన్ని ప్రతి సంవత్సరం లేదా అవకాశాలను బట్టి యూనిట్ దారులకు పంచుతారు .
' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలలో ( MUTUAL FUNDS ORAGANISATIONS) పెట్టుబడులు పెడితే ఆదాయం ఉంటుందా ? ఇంకను ఎలాంటి సదుపాయాలు ఉంటాయి ?
' మ్యూచువల్ ఫండ్స్ ' లలో పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో ఆదాయం లభిస్తుంది . అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు సరియయిన ' మ్యూచువల్ ఫండ్స్ ' లను , సరిఅయిన సెక్టార్లను , మన అవసరాలను బట్టి ఎంచు కోవాలి . వయస్సును బట్టి , ఆర్ధిక పరిస్థితులను బట్టి , రిస్కును బేర్ చేసే కెపాసిటీని బట్టి ఎంచు కోవాలి . ఇక్కడ పొరపాటు జరుగుతే అసలు కూడా నష్ట పోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు . మంచి వాటిని ఎంచుకుని, సరిఅయిన సమయంలో , దీర్ఘ కాలం పెట్టుబడులు పెడితే సుమారుగా 12 నుండి 14% వరకు ఆదాయం పొందవచ్చు . ప్రస్తుతం ఇది ఫిక్స్డ్ డిపాసిట్స్ కు డబుల్. పెట్టుబడికి ఎలాంటి నష్టం ఉండదు . పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది . లిక్విడిటీ ఉంటుంది . ఆదాయం లభిస్తుంది . ఇన్కమ్ టాక్స్ ఫండ్లల్లో కనీసం 3 సంవత్సరాలు పెట్టుబడులు పెడితే , పన్ను మినహా యింపులు ఉన్నాయి . ప్రయవసీ ఉంటుంది . రిస్క్ తక్కువ గా ఉంటుంది . టెన్షన్ ఫ్రీ గా జీవించ వచ్చు . ప్రతి సం . రం రెస్యూల్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు . ఫారం జి / ఎచ్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు . పారదర్శకంగా ఉంటుంది . ప్రతి ట్రాన్సక్షన్ కు ఎస్ ఎం ఎస్ ల రూపంలో , మెయిల్స్ రూపంలో తెలియ జేయడం జరుగు తుంది .
పెట్టుబడులు పెట్టిన షేర్ల నుండి ఆదాయాలు వస్తాయి . డివిడెండ్ల రూపేనా , వడ్డీ ల రూపేనా , కమీషన్ల రూపేనా , సర్వీస్ చార్జీల రూపేనా ఆదాయం లభిస్తుంది .
సమర్ధ వంతమైన , ప్రొఫెషినల్ ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) ఏవి ?
ప్ర . నా వయస్సు 80 సంవత్సరాలు . నేను ఎందులో పెట్టుబడులు పెట్ట వచ్చు ?
ప్ర . నా వయస్సు 40 సంవత్సరాలు . నేను ఎందులో పెట్టుబడులు పెట్ట వచ్చు ?
ప్ర. '' మ్యూచువల్ ఫండ్స్ '' లలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రొసీజర్ ఏమిటి ?
ప్ర . " ఆన్లైన్ లో పెట్టుబడులు పెట్టె టప్పుడు ' డీ మ్యాట్ అకౌంట్ ' ను 'టిక్ '(SELECT) చేయాలా ?
సమర్ధ వంతమైన , ప్రొఫెషినల్ ' మ్యూచువల్ ఫండ్స్ ' సంస్థలు ( MUTUAL FUNDS ORAGANISATIONS) అనేకంగా ఉన్నాయి . అందులో ముఖ్యమైనవి , ఫ్రాంక్లిన్ ' మ్యూచువల్ ఫండ్స్ ' , బిర్లా ' మ్యూచువల్ ఫండ్స్ ' , ఎస్ బి ఐ ' మ్యూచువల్ ఫండ్స్ ' , ఆక్సిస్ ' మ్యూచువల్ ఫండ్స్ ' , ఎల్ & టి ' మ్యూచువల్ ఫండ్స్ ' , రిలియన్స్ ' మ్యూచువల్ ఫండ్స్ ' , టాటా ' మ్యూచువల్ ఫండ్స్ ' , ఎచ్ . డి . ఎఫ్ . సి . ' మ్యూచువల్ ఫండ్స్ ' , డి ఎస్ పి ' మ్యూచువల్ ఫండ్స్ ' , సుందరం ' మ్యూచువల్ ఫండ్స్ ' , కెనరా ' మ్యూచువల్ ఫండ్స్ ' ఇలా అనేకంగా ఉన్నాయి .
ప్ర . నా వయస్సు 80 సంవత్సరాలు . నేను ఎందులో పెట్టుబడులు పెట్ట వచ్చు ?
జ. మీరు 80 సంవత్సరాలు అంటున్నారు . 100 నుండి 80 తీసి వేయండి . 20 వస్తుంది . అంటే మీరు 20 శాతం మాత్రమే రిస్క్ బేర్ చేయ గలరు . ఎందుకంటే అప్పటికే మీరు వయస్సు మీరు పోటీ ఉంటుంది . ఏమి చేత గాని పరిస్థితి . ఏమి సంపాదించలేరు . ఎవరి తోనూ గట్టిగా వాధించి వసూలు చేసుకోలేరు . దానికి తోడూ పుట్ట గొడుగుల్లా రోగాలు చుట్టూ ముసురుతాయి . ఎందుకంటే రోగ నిరోధక శక్తి తగ్గి పోతుంది కాబట్టి . అలానే నెలా , నెలా డబ్బులు ఈ పెట్టుబడుల నుండే రావాలి అనుకుంటారు . అందుకని మీ పెట్టుబడులలో 20 శాతం మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లల్లో ( డివిడెండ్ చెల్లించే విధానంలో లేదా నెల వారి డివిడెండ్ విధానంలో ), మిగిలిన 80 శాతం లో 70 శాతాన్ని సెక్యూర్డ్ , డెట్ ఫండ్లల్లో , 10 శాతాన్ని ఎస్ బి . అకౌంట్ లో క్యాష్ రూపంలో ఉంచండి . క్యాష్ రూపంలో ఎందుకంటే నెల వారి సరుకుల ఖర్చు , హాస్పిటల్ ఖర్చులు , , ప్రయాణ ఖర్చులు మొదలైన వాటికీ ఉపయోగ బడటానికి .
జ. మీరు 40 సంవత్సరాలు అంటున్నారు . 100 నుండి 40 తీసి వేయండి . 60 వస్తుంది . అంటే మీరు 60 శాతం వరకు రిస్క్ బేర్ చేయ గలరు . అందుకని మీ పెట్టుబడులలో 60 శాతం మొత్తాన్ని ఈక్విటీ ఫండ్లల్లో ( ఇక్కడ రిస్క్ అధికంగా ఉంటుంది , అలానే రిటర్న్/ ఆదాయం అధికంగా ఉంటుంది ) , మిగిలిన 40 శాతం లో 25 శాతాన్ని సెక్యూర్డ్ , డెట్ ఫండ్లల్లో , 15 శాతాన్ని ఎస్ బి . అకౌంట్ లో క్యాష్ రూపంలో ఉంచండి . క్యాష్ రూపంలో ఎందుకంటే నెల వారి సరుకుల ఖర్చు , ఎంటర్ టైన్ మెంట్ ఖర్చు , హాస్పిటల్ ఖర్చులు , పిల్లల స్కూల్ ఫీజులు , ప్రయాణ, ఫంక్షన్ల ఖర్చులు మొదలైన వాటికీ ఉపయోగ బడటానికి .
ప్ర . నాకు కొద్దిగా ఆదాయం వచ్చిన పర్వా లేదు . కానీ అసలు మొత్తం తగ్గ కూడదు. కానీ , కనీసం బ్యాంక్ లలోని 'ఫిక్స్డ్ వడ్డీ' రేట్ కంటే కొంచెం ఎక్కువ రావాలంటే , ఎలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి ?
జ . మీకు కొద్దిగా ఆదాయం వచ్చిన పర్వా లేదు . కానీ అసలు మొత్తం తగ్గ కూడదు. కానీ , కనీసం బ్యాంక్ లలోని 'ఫిక్స్డ్ వడ్డీ' రేట్ కంటే కొంచెం ఎక్కువ రావాలంటే , లార్జ్ క్యాప్ లలో గాని , బాలన్సుడ్ ఫండ్లల్లో , డెట్ ఫండ్లల్లో , సమర్ధ వంత మైన ' మ్యూచువల్ ' ఫండ్లల్లో పెట్టుబడులు పెట్టాలి.
ప్ర . నాకు ' మ్యూచువల్ ఫండ్స్ ' అంటే అస్సలే తెలియదు. అలాంటి నేను పెట్టుబడులు పెడితే నష్టపోకుండా ఉండగలనా ?, పెట్టుబడి పైనా ఆదాయం అందుకోగలనా ? మోసాలు ఏమైనా ఉంటాయా ?
ప్ర . నాకు ' మ్యూచువల్ ఫండ్స్ ' అంటే అస్సలే తెలియదు. అలాంటి నేను పెట్టుబడులు పెడితే నష్టపోకుండా ఉండగలనా ?, పెట్టుబడి పైనా ఆదాయం అందుకోగలనా ? మోసాలు ఏమైనా ఉంటాయా ?
ప్ర . పుట్టుకతోటి యే బిడ్డకు ఏమి తెలియదు. ఏ బిడ్డ బంగారు చెమ్చాను నోట్లో పెట్టుకుని పుట్టడు . ఏ బిడ్డా సరస్వతిని చంకన పెట్టుకుని పుట్టడు . ఆ తరువాతనే మాటలు , నడక, విద్య , ప్రయాణం , లోక జ్ఞ్యానం , మంచి చెడు , సంపాదన గురించి నేర్చుకుంటాడు . కాబట్టి దేనికి భయ పడా నవసరం లేదు . వేప గింజలు అమ్ముకుని జీవించిన అబ్దుల్ కలాం గారికి ప్రసిడెంటుగా ఎలా నడుచుకోవాలో అతనికి ముందే తెలుసు అని అనుకొన గలమా ? భారత దేశానికి ప్రసిడెంట్ అవుతాడని ఎవరైనా ఊహించారా ? టీ లు అమ్ముకుని జీవించిన మోడీ గారికి దేశాన్ని ఎలా పాలించాలో ముందే తెలుసు అని అనుకున్నాడా ? 125 కోట్ల జనాభా గల , ప్రపంచం లోనే రెండవ అతిపెద్ద మన భారత దేశానికి ప్రధాన మంత్రి అవుతారని ఎవరైనా ఊహించారా ? కేవలం విద్య వినయం తో పాటు , ధైర్యం , పట్టుదల , అందివచ్చిన అవకాశాలను , టర్నింగ్ పాయింట్స్ ను అందిపుచ్చుకున్నారు .
కాబట్టి '' మ్యూచువల్ ఫండ్స్ '' అంటే ఏమి తెలియనందుకు ఫీలవ్వ నవసరం లేదు . ఏమి తెలియకున్నా మీరు దైర్యంగా ' మ్యూచువల్ ఫండ్స్ ' లలో దీర్ఘ కాలంగా , ఆర్ధిక సలహాదారుల సలహాలతో పెట్టుబడులు పెడితే ఎలాంటి నష్టం ఉండదు . పెట్టుబడి పైనా ఆదాయం అందుకోగలరు . మోసాలు ఏమీ ఉండవు . ప్రతి ట్రాన్సక్షన్ రిజిస్టరైన బ్యాంకు అకౌంట్ ద్వారానే జరుగుతుంది . ప్రతి ట్రాన్సక్షన్ గురించి మేయిల్స్ ద్వారా , ఎస్ . ఎమ్ . ఎస్ , ల ద్వారా ఎప్పటికప్పుడు తెలియ జేస్తారు .
జ . '' మ్యూచువల్ ఫండ్స్ '' లలో పెట్టుబడులు పెట్టాలంటే ముందు ' కె .వై . సి '. ఫామ్ ను సబ్మిట్ చేయాలి . ఇది మ్యాండేటరీ . దీనికి ' కె .వై . సి '. ఫామ్ ను , (పేరు , అడ్రస్ , ఫోన్ నెంబర్ , మెయిల్ ఐ డి మొదలయిన వివరాలు) ఫిల్ చేసి దాని పైన ఒక ప్రస్తుత పాస్ ఫోటోను అతికించి దాని పైన క్రాస్ గా సంతకం చేయాలి . అలానే అందులోని వివరాలు కరెక్ట్ అని అదే ఫారమ్ క్రింద సంతకం చేయాలి . దీనితో పాటు ఆధార్ కార్డు గాని , ఓటర్ కార్డు గాని మరియు 'పాన్ ' కార్డును జత చేసి సంబంధిత బ్రోకర్ ఆఫీస్ లలో గాని ,'' మ్యూచువల్ ఫండ్స్ '' లలో గాని సబ్మిట్ చేయాలి . వర్జినల్స్ వెరిఫై చేస్తారు . అన్నీ కరెక్ట్ అయితే రెండు మూడు రోజులలో మీ ' కె .వై . సి ' వెరిఫై అయినట్లుగా మీకు ఇంటిమేషన్ వస్తుంది . ఆ తదుపరినుండి మీరు '' మ్యూచువల్ ఫండ్స్ '' లలో పెట్టుబడులు పెట్టవచ్చు .
జ . ఆన్లైన్ లో పెట్టుబడులు పెట్టె టప్పుడు ' డీ మ్యాట్ అకౌంట్ ' ను 'టిక్ ' (SELECT) చేయాలంటే మీకు అంతకు ముందే ' డీ మ్యాట్ అకౌంట్ ' కలిగి ఉండాలి . ' డీ మ్యాట్ అకౌంట్ ' ఉంటేనే సెలెక్ట్ చేయాలి . లేదంటే చేయ కూడదు. దీని వలన ఉపయోగం ఏమిటంటే , అన్ని '' మ్యూచువల్ ఫండ్స్ '' యూనిట్స్ అన్నీ ఒకే అకౌంట్ లో చూసుకోవచ్చు . అయితే తప్పని సరి ఏమీ కాదు . అదే షేర్స్ కొనాలన్నా , అమ్మా లన్నా ' డీ మ్యాట్ అకౌంట్ ' తప్పని సరీగా ఓపెన్ చేయాలి .
ప్ర . ఆన్లైన్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్ ను ఎంచుకోవచ్చా ?
జ . ఆన్లైన్ లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ' డైరెక్ట్ ' (DIRECT) ఆప్స్ న్ ను ఎంచుకోవచ్చు . డైరెక్టుగా కొన వచ్చు . అమ్మ వచ్చు . స్విచ్ చేసుకోవచ్చు . సిప్ చేసుకోవచ్చు . పెట్టుబడులు పెట్టడం , లాభాలు లేదా నష్టాలు పొందడం మన ఇష్టం . మన డబ్బు మన ఇష్టం . ఎక్కడ నిర్బంధం ఉండదు . డైరెక్టుగా కొనేటప్పుడు 0.5% - 1% కమీషన్స్ బ్రోకర్లకు చెల్లించాల్సిన అవసరం ఉండదు . ' రెగ్యులర్ ' (REGULAR) ను సెలెక్ట్ చేస్తే , బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేస్తే 0.5% - 1% , వీరికి కమీషన్ మ్యూచ్యువల్ ఫండ్ సంస్థ చెల్లిస్తుంది . ( వీరిలో అనేక మైన లెవల్స్ బ్రోకర్లు ఉంటారు ). 'సెబీ ' (SEBI) గుర్తించ బడిన బ్రోకర్ సంస్థల ద్వారా కొనడం వలన అనేక మైన ప్రయోజనాలు ఉంటాయి . డైరెక్టుగా కొనేటప్పుడు సెకండరీలో ( అంటే పబ్లిక్ ఇష్యూ అయిపోయిన తరువాత ) , ఎన్. ఏ . వి . కూడా , 'రెగ్యులర్' కంటే అధికంగానే ఉంటుంది . అలానే అమ్మే టప్పుడు కూడా ఎన్. ఏ .వి . అధికంగా ఉంటుంది డైరెక్టుగా కొనేటప్పుడు మన సొంత నిర్ణయాలతోటే పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది . లాభాలు రావచ్చు , నష్టాలు రావచ్చు . ఉదా : DSPBR TECHNOLOGIES FUND కొన్నట్లయితే ఈ రోజున 12.78% నష్టం వచ్చేది . అలానే TATA DIGITAL INDIA FUND కొన్నట్లయితే ఈ రోజున 9.72% నష్టం వచ్చేది . అలానే SBI PHARMA FUND కొన్నట్లయితే ఈ రోజున 9.27 % నష్టం వచ్చేది . అలా అనేక మైన '' మ్యూచువల్ ఫండ్స్ '' స్కీమ్స్ నష్టాల లో కూడా నడుస్తున్నాయి .
గమనిక : '' మ్యూచువల్ ఫండ్స్ '' పెట్టుబడులు మార్కెట్ ఒడుదొడు కు లకు అనుగుణంగా నడుచుకుంటాయి , అదే విధంగా లాభ నష్టాలను అందిస్తాయి . ఎవరి పెట్టుబడులకు వారే బాధ్యులు . పెట్టుబడి పెట్టేముందు దానికి సంభందించిన డాక్యుమెంట్లను పూర్తిగా చదవండి , అలానే మీ ఆర్ధిక సలహా దారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి .
No comments:
Post a Comment