ప్ర . సాడే సాత్ శని ( SADE SATH SHANI) అంటే ఏమిటి ? దీని వలన సమస్యలు ఏమిటి ? నివారణ చర్యలు ఏమిటి ?
'సాడే సాత్ శని ' ప్రభావం ప్రతీ సారి, ఒకే సారీ 3 రాశుల జాతకులపై ఉంటుంది . ఒక రాశిలోకి శని ప్రవేశించిందంటే దాని ప్రభావం దాని ముందు రాశిపై మరియు దాని వెనుక రాశిపై ఉంటుంది . సామాన్యులకు కూడా అర్ధ మయ్యే విధంగా చెప్పాలంటే , శని ఒక రాశిలోకి వచ్చి మండుతుందంటే , దాని మంట సెగ దాని ముందు రాశికి తగులుంది . అలానే దాని వెనుక రాశిలో మండి మండి వచ్చింది కాబట్టి , దానిలోని బొగ్గుల వేడి అలానే ఉంటుంది కదా . ఆ విధంగా ప్రతి సారి ' సాడే సాత్ శని ' ప్రభావం 3 రాశులపై ఉంటుంది . అలా 3 x 2 1/2 = 7 1/2 సంవత్సరాలు ఏల్నాటి శని అంటారు . ప్రస్తుతం వృచ్చిక రాశిలో శని ఉంది (27 జనవరి 2017 వరకు ) . దాని ప్రభావం , దాని ముందు రాశి అయిన ధనుస్సు లోను , అలానే దాని వెనుక రాశి అయిన తులా రాశి లో , సాడే సాత్ శని ఉంది అని చెబుతారు . మరో విధంగా చెప్పాలంటే జాతకుడి రాశి నుండి లెక్క బెడితే 12,1,2,4 మరియు 8 వ స్థానాలను సాడే సాత్ శని గా చెప్పుకోవచ్చు . 12, 1, మరియు 2 ను సాడే సాత్ గా , 4 ను అర్దాష్టమ శనిగా మరియు 8 వ స్థానాన్ని అష్టమ శనిగా చెబుతారు .
తరువాత అనగా 27 జనవరి ,2017 శని ధనుస్సు రాశి లోకి ప్రవేశిస్తుంది . అప్పుడు సాడే సాత్ శని ప్రభావం ధనుస్సు రాశి లోను , దాని ముందు రాశి అయిన మకర రాశి లోను (27 జనవరి , 2017 నుండి ) మరియు దాని వెనుక రాశి అయిన వృచ్చిక రాశి పైనా ( మిగిలిన కాలం ) శని ప్రభావం ఉంటుంది .
అలానే మేష రాశి జాతకులకు , మేష రాశికి 8 వ రాశి వృచ్చిక రాశి ' అష్టమ శని ' అవుతుంది . మనకు తెలుసు , శని అనేది ఒక అశుభ గ్రహం . శక్తి వంతమైనది . ఒక్కో స్థానంలో ఉన్నపుడు ఒక్కో ప్రభావాన్ని చూపెడుతుంది . కొన్ని గ్రహాలతో కల్సి , ఒకే రాశిలో ఉన్నపుడు దాని ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది . ఉదా : కుజ శని కల్సి ఉండటం , రాహు శని కల్సి ఉండటం , రవి శని , శని కేతు కల్సి ఉండటం మొదలైనవి . అలానే శని , రాహు , కుజ , రవి వరుసగా ఉండటం మొదలైనవి . ముఖ్యంగా శని ఏ రాశిలోనైతే సంచరిస్తుందో ఆ రాశి జాతకులపై , అధిక శని ప్రభావం ఉంటుంది . ప్రస్తుతం శని వృచ్చిక రాశిలో సంచరిస్తుంది.
చంద్ర స్థానం నుండి ( రాశి నుండి ) లెక్కించి నపుడు 12, 1, 2, 4 మరియు 8 వ స్థానం , జాతకుడికి అత్యంత ప్రమాద కరమైన టు వంటి గ్రహం శని గ్రహం .
జ. నవ గ్రహాలలో ' శని గ్రహం ' ఒకటి . శని సూర్యుని పుత్రుడు . అయినా జ్యోతిష్యంలో శని సూర్యుడి కి శత్రువనే చెబుతారు . సాడే సాత్ శని ( SADE SATH SHANI) అంటే "ఏడున్నర సంవత్సరాల కాలం శని " అని అర్ధం . దీనినే ఏల్నాటి శని అని కూడా అంటారు . ప్రతి జాతకుడికి ఇది అత్యంత కష్ట కాలం అని చెబుతారు . దీనిని ఎవరూ తప్పించుకోలేరు . ప్రతి జాతకుడి జీవిత కాలంలో శని సంచారం అనేది కనీసం 2 సార్లయినా వస్తుంది . సాధారణంగా ప్రతి రాశి లో రెండున్నర సంవత్సరాలు శని ఉంటుంది . ఆ విధంగా 12 రాశులు తిరిగి రావడానికి శని కి 30 సంవత్సరాలు పడుతుంది . అయినా సరే జాతకులెవ్వరూ ( ప్రజలెవ్వరూ ) ఏల్నాటి శనికి భయ పడ నవసరం లేదు . ఇది సహజంగా ప్రతి ఒక్కరికీ అనుభవం లోకి వచ్చేదే . ఎవరూ దీని నుండి తప్పించు కోలేరు . శని అన్ని సార్లు , అందరికి చెడు మాత్రమే చేస్తాడనుకోనవసరం లేదు . మంచి కూడా చేస్తాడు . శని కష్ట జీవి . శ్రామికుడు. మన చేత కష్టాలను చూపిస్తాడు . కష్టానికి తగ్గ ఫలితాలను చూపిస్తాడు . అందుకని శని దశాలకైనా , ఏల్నాటి శని కైనా , అర్దాష్టమ , అష్టమ శనికైనా పని గట్టుకుని భయ పడ కూడదు . ఏ గ్రహ సంచారం ఆ గ్రహం చేసుకుంటూనే పోతుంది . మండే ఎండను ఎవరు ఆప గలరు చెప్పండి . కుంభ వృష్టిని ఎవరు ఆపగలరు చెప్పండి . చల్లని వెన్నలను ఎవరు ఆప గలరు చెప్పండి , భూ కంపాలను ఎవరు ఆపగలరు చెప్పండి . మనం చూస్తూ అనుభ వించాలి , ఆస్వాదించాలి తప్పా భీతి చెంద కూడదు . దేన్ని నమ్మినా నమ్మక పోయినా గ్రహాల శక్తిని అందరూ ఒప్పకుంటారు . ఎందుకంటే మనకు ప్రతి రోజూ గ్రహాల శక్తి గురించి కళ్లారా చూస్తున్నాం . అనుభవిస్తున్నాం . ప్రతి రోజూ సూర్యుడు , తూర్పు దశనే , కరెక్ట్ సమయానికి ఉదయిస్తాడు . మనమూ లేస్తాం . సాయంత్రం కరెక్ట్ సమయానికి హస్త మిస్తాడు . మనమూ పడుకుంటాం . అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి మనం విడియా సమయాలలో పనులు చేసు కుంటాం . సూర్యుడు ఎండను ఇస్తాడు . వర్షాన్ని కురిపిస్తాడు . రోగాలను పుట్టిస్తాడు . రోగాలను నయం చేస్తాడు . అలానే చంద్రుడు వెన్నెలను , చల్ల దనాన్ని కల్పిస్తాడు . అలానే భూమి పుత్రుడు కుజుడు ( అంగారకుడు ), బుధుడు , శుక్రుడు , గురుడు , శని మరియు రాహు కేతువులు .
అందుకని శని దోష నివారణ కని , శాంతి కని వేలు , లక్షల రూపాయలను మరెవ్వరికో దోచి పెట్ట నవసరం లేదు . "ఏల్నాటి శని " వచ్చిందని ఏవో కొంపలు మునిగి పోతాయని వైరాగ్యానికి , నిరాశకు గురి కా నవసరం లేదు . భయ పడవలసిన అవసరం అంతకూ లేదు . కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ముందుగానే కొంత అవగాహన తెచ్చుకుని , ఎవరికీ వారే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు . గతంలో ఒక రాజు నాకు శని ఎలా పడుతుందో చూస్తా అని పోయి చెట్టు తొర్ర లో దాక్కున్నాడట . ఆ తొర్రలో దాక్కుండటమే శని పట్టడమని తరువాత గాని తెలుసుకోలేక పోయాడు . జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక సిద్ధాంతాన్ని గురించి చెబుతారు మన జ్యోతిష్య పండితులు , అనుభవజ్ణ్యులు . అదేమంటే " ప్రారబ్ధ కర్మల '' నుంచి ఎవ్వరూ తప్పించు కోలేరు . ఇంకా చెబుతారంటే " ప్రారబ్ధ కర్మలు విడిచిన బాణం లాంటివి " అని . వీటి అర్ధం ఏమిటంటే ,' ఎన్ని వేలు , లక్షలు ఖర్చు పెట్టినా , వచ్చే సమస్యలను ఎవరూ తప్పించ లేరు' అని అర్ధం . ప్రతి జాతకుడి జీవితంలో కనీసం 2 సార్లు సాడే సాత్ శని వస్తుందనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాంటప్పుడు జాతకులు భయ పడాల్సిన అవసర మేమిటి ? వేలు , లక్షలు ఇతరులకు దోచి పెట్టడం దేనికి ? . కొన్నింటిని మాత్రం గుర్తుంచుకోవాలి . అవి మన పురాణ కాలం నాటి సామెతలు . ఒక సామెత కోట్లాది జనుల అనుభవ సారమని చెప్పుకోవచ్చు . అవి ఏమంటే " ధనమ్ మూలం మిదం జగత్ " " ధనమేరా అన్నిటికి మూలం " " డబ్బుకు లోకం దాసోహం " .వీటి అర్ధం ఏమంటే డబ్బును దండిగా పొదుపు చేసుకుని పెట్టుకోవాలి . ఏ అవసరాలకయినా , ఆపదలకైనా డబ్బే కావాలి . నిజాయితీగా డబ్బు సంపాదించి పొదుపు , క్రమశిక్షణ గల వారికి గర్వం ఉండదు . వినయ విధేయతలు కలిగి ఉంటారు . దాన గుణం ఉంటుంది . ప్రేమాభి మానాలు ఉంటాయి . నలుగురితో అనుబంధాలుంటాయి , సత్సంభందాలుంటాయి . భక్తి భావాలు ఉంటాయి . అన్నిటికి మించి మంచి ఏదో చెడు ఏదో వీరికి బాగా తెలిసి ఉంటుంది . ఆరోగ్యం పై మంచి శ్రద్ద ఉంటుంది . అన్నిటి కి కావాల్సింది డబ్బు . సరి పడా డబ్బు కూడా పొదుపు చేసుకునే ఉంటారు . ఇన్ని సుగుణాలు ఉన్న వీరికి శని ఏమి చేస్తుంది చెప్పండి . శని ప్రభావం వీరికి ఎంత మాత్రం కన పడదు .
అందుకని శని దోష నివారణ కని , శాంతి కని వేలు , లక్షల రూపాయలను మరెవ్వరికో దోచి పెట్ట నవసరం లేదు . "ఏల్నాటి శని " వచ్చిందని ఏవో కొంపలు మునిగి పోతాయని వైరాగ్యానికి , నిరాశకు గురి కా నవసరం లేదు . భయ పడవలసిన అవసరం అంతకూ లేదు . కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ముందుగానే కొంత అవగాహన తెచ్చుకుని , ఎవరికీ వారే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు . గతంలో ఒక రాజు నాకు శని ఎలా పడుతుందో చూస్తా అని పోయి చెట్టు తొర్ర లో దాక్కున్నాడట . ఆ తొర్రలో దాక్కుండటమే శని పట్టడమని తరువాత గాని తెలుసుకోలేక పోయాడు . జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఒక సిద్ధాంతాన్ని గురించి చెబుతారు మన జ్యోతిష్య పండితులు , అనుభవజ్ణ్యులు . అదేమంటే " ప్రారబ్ధ కర్మల '' నుంచి ఎవ్వరూ తప్పించు కోలేరు . ఇంకా చెబుతారంటే " ప్రారబ్ధ కర్మలు విడిచిన బాణం లాంటివి " అని . వీటి అర్ధం ఏమిటంటే ,' ఎన్ని వేలు , లక్షలు ఖర్చు పెట్టినా , వచ్చే సమస్యలను ఎవరూ తప్పించ లేరు' అని అర్ధం . ప్రతి జాతకుడి జీవితంలో కనీసం 2 సార్లు సాడే సాత్ శని వస్తుందనేది కూడా మనం తెలుసుకున్నాం. అలాంటప్పుడు జాతకులు భయ పడాల్సిన అవసర మేమిటి ? వేలు , లక్షలు ఇతరులకు దోచి పెట్టడం దేనికి ? . కొన్నింటిని మాత్రం గుర్తుంచుకోవాలి . అవి మన పురాణ కాలం నాటి సామెతలు . ఒక సామెత కోట్లాది జనుల అనుభవ సారమని చెప్పుకోవచ్చు . అవి ఏమంటే " ధనమ్ మూలం మిదం జగత్ " " ధనమేరా అన్నిటికి మూలం " " డబ్బుకు లోకం దాసోహం " .వీటి అర్ధం ఏమంటే డబ్బును దండిగా పొదుపు చేసుకుని పెట్టుకోవాలి . ఏ అవసరాలకయినా , ఆపదలకైనా డబ్బే కావాలి . నిజాయితీగా డబ్బు సంపాదించి పొదుపు , క్రమశిక్షణ గల వారికి గర్వం ఉండదు . వినయ విధేయతలు కలిగి ఉంటారు . దాన గుణం ఉంటుంది . ప్రేమాభి మానాలు ఉంటాయి . నలుగురితో అనుబంధాలుంటాయి , సత్సంభందాలుంటాయి . భక్తి భావాలు ఉంటాయి . అన్నిటికి మించి మంచి ఏదో చెడు ఏదో వీరికి బాగా తెలిసి ఉంటుంది . ఆరోగ్యం పై మంచి శ్రద్ద ఉంటుంది . అన్నిటి కి కావాల్సింది డబ్బు . సరి పడా డబ్బు కూడా పొదుపు చేసుకునే ఉంటారు . ఇన్ని సుగుణాలు ఉన్న వీరికి శని ఏమి చేస్తుంది చెప్పండి . శని ప్రభావం వీరికి ఎంత మాత్రం కన పడదు .
'సాడే సాత్ శని ' ప్రభావం ప్రతీ సారి, ఒకే సారీ 3 రాశుల జాతకులపై ఉంటుంది . ఒక రాశిలోకి శని ప్రవేశించిందంటే దాని ప్రభావం దాని ముందు రాశిపై మరియు దాని వెనుక రాశిపై ఉంటుంది . సామాన్యులకు కూడా అర్ధ మయ్యే విధంగా చెప్పాలంటే , శని ఒక రాశిలోకి వచ్చి మండుతుందంటే , దాని మంట సెగ దాని ముందు రాశికి తగులుంది . అలానే దాని వెనుక రాశిలో మండి మండి వచ్చింది కాబట్టి , దానిలోని బొగ్గుల వేడి అలానే ఉంటుంది కదా . ఆ విధంగా ప్రతి సారి ' సాడే సాత్ శని ' ప్రభావం 3 రాశులపై ఉంటుంది . అలా 3 x 2 1/2 = 7 1/2 సంవత్సరాలు ఏల్నాటి శని అంటారు . ప్రస్తుతం వృచ్చిక రాశిలో శని ఉంది (27 జనవరి 2017 వరకు ) . దాని ప్రభావం , దాని ముందు రాశి అయిన ధనుస్సు లోను , అలానే దాని వెనుక రాశి అయిన తులా రాశి లో , సాడే సాత్ శని ఉంది అని చెబుతారు . మరో విధంగా చెప్పాలంటే జాతకుడి రాశి నుండి లెక్క బెడితే 12,1,2,4 మరియు 8 వ స్థానాలను సాడే సాత్ శని గా చెప్పుకోవచ్చు . 12, 1, మరియు 2 ను సాడే సాత్ గా , 4 ను అర్దాష్టమ శనిగా మరియు 8 వ స్థానాన్ని అష్టమ శనిగా చెబుతారు .
తరువాత అనగా 27 జనవరి ,2017 శని ధనుస్సు రాశి లోకి ప్రవేశిస్తుంది . అప్పుడు సాడే సాత్ శని ప్రభావం ధనుస్సు రాశి లోను , దాని ముందు రాశి అయిన మకర రాశి లోను (27 జనవరి , 2017 నుండి ) మరియు దాని వెనుక రాశి అయిన వృచ్చిక రాశి పైనా ( మిగిలిన కాలం ) శని ప్రభావం ఉంటుంది .
అలానే మేష రాశి జాతకులకు , మేష రాశికి 8 వ రాశి వృచ్చిక రాశి ' అష్టమ శని ' అవుతుంది . మనకు తెలుసు , శని అనేది ఒక అశుభ గ్రహం . శక్తి వంతమైనది . ఒక్కో స్థానంలో ఉన్నపుడు ఒక్కో ప్రభావాన్ని చూపెడుతుంది . కొన్ని గ్రహాలతో కల్సి , ఒకే రాశిలో ఉన్నపుడు దాని ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతుంది . ఉదా : కుజ శని కల్సి ఉండటం , రాహు శని కల్సి ఉండటం , రవి శని , శని కేతు కల్సి ఉండటం మొదలైనవి . అలానే శని , రాహు , కుజ , రవి వరుసగా ఉండటం మొదలైనవి . ముఖ్యంగా శని ఏ రాశిలోనైతే సంచరిస్తుందో ఆ రాశి జాతకులపై , అధిక శని ప్రభావం ఉంటుంది . ప్రస్తుతం శని వృచ్చిక రాశిలో సంచరిస్తుంది.
చంద్ర స్థానం నుండి ( రాశి నుండి ) లెక్కించి నపుడు 12, 1, 2, 4 మరియు 8 వ స్థానం , జాతకుడికి అత్యంత ప్రమాద కరమైన టు వంటి గ్రహం శని గ్రహం .
' సాడే సాత్ శని ' వలన సమస్యలు ఎలా ఉంటాయి ?
01. శని 12 వ ఇంటిలో ఉన్నపుడు ( మీ రాశి నుండి ) , వృధాగా డబ్బు ఖర్చు అవడం , ఖర్చులు పెరగడం , ఉద్యోగాలు పోవడం లేదా ఆటంకాలు కలగడం .
02. శత్రువులు పెరగడం .
03. జైలు పాలు అవ్వడం , పోలీస్టేషనులకు వెళ్లడం , కోర్టుల చుట్టూ తిరగడం .
04. బంధువులు మిత్రుల నుండి ఆపదలు పొంచి ఉండ వచ్చు . అనారోగ్యం పాలు కావచ్చు లేదా ప్రాణి హాని ఉండ వచ్చు .
05. శని 1 వ ఇంటిలో ఉన్నపుడు , మానశిక ఆందోలన , వైరాగ్యం ఏర్పడ వచ్చు . మనిషి పిచ్చి పిచ్చి అయి పోవచ్చు . జ్ఞ్యాపక శక్తి తగ్గి పోతుంది. తప్పుడు తీర్పులను ఇస్తారు . వైవాహిక జీవితంలో అసంతృప్తి ఉంటుంది . భార్యా భర్తల కొట్లాటలు , దూరం దూరం ఉండటం , విడాకుల వరకూ వెల్ల వచ్చు అని అంటారు. అయితే అన్నింటికి ' సాడే సాత్ శనే ' కారణం అనుకోవడం పొరపాటు . భార్యా భర్తల మన: స్పర్ధలు ఎప్పటినుండో ఉండవచ్చు . కారణాలు మరెన్నో ఉండ వచ్చు . నేడు ఎలాంటి ' సాడే సాత్ శని ' లేకుండానే వందలాది కుటుంబాలు కుప్ప కూలి పోతున్నాయి . దానికి కారణం నేటి సాంకేతిక అభి వృద్ధి , గ్లోబలైజేషన్ , పాశ్చ్యాత్య పోకడలు , టీ వీ లు , సినిమాలు , ఇంటర్ నెట్ , సెల్ లు , అందరూ విద్యావంతులు కావడం , ఉద్యోగాలు చేయడం , డబ్బు సంపాదించు కోవడం , ఎవరి వారు కోరుకున్న విధంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకోవడం , అలాంటి అవకాశాలు సమాజంలో ఉండటం , ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు .
06. శని 2 వ ఇంటిలో ఉన్నప్పుడు , ఆర్ధిక ఇబ్బందులు కలుగు తాయి . వ్యాపారంలో నష్టాలు రావచ్చు . సరియయిన సమాచారం లేక మన స్పర్ధలు రావచ్చు .
07. శని 4 వ ఇంటిలో ఉన్నపుడు , కుటుంభం సమస్యలు ఉంటాయి . తల్లి దండ్రులకు అనారోగ్యం కలుగ వచ్చు . మరియు స్త్రీ ల వలన సమస్యలు ఏర్పడ వచ్చు .
08. శని 8 వ ఇంటిలో ఉన్నపుడు , ఆర్ధిక సమస్యలు , లీగల్ సమస్యలు , దీర్ఘ రోగ సమస్యలు లేదా ప్రాణ హాని ఉండవచ్చు అని జ్యోతిష్యం చెబుతుంది .
'సాడే సాత్ శని' కి దోష నివారణ చర్యలు ( REMEDIES) :
01. ముందుగా 'సాడే సాత్ శని' గురించి పూర్తిగా అవగాహన పెంచు కోవాలి . ప్రస్తుతం తులా , వృచ్చిక , ధనస్సు రాశులలో ' సాడే సాత్ శని ' నడుస్తుంది . జాతకుల రాశి నుండే ఎవరికీ వారే 12, 1,2, 4, 8 వ రాశులను లెక్క పెట్టు కోవచ్చు . నివారణ చర్యలను చేపట్ట వచ్చు . ఆర్ధికంగా బలంగా ఉంటే ' సాడే సాత్ శని ' ప్రభావం పెద్దగా మన మీద కన బడదు . ఎప్పటి నుండో ఉన్న దీర్ఘ రోగాలకు , సమస్యలకు ' సాడే సాత్ శనే ' కారణం అని భయ పడ నవసరం లేదు .
02. ఆయా జాతకులు ఓపికను పెంచు కోవాలి . కోపాన్ని తగ్గించు కోవాలి . పూర్తి సమా చారం వచ్చిన తరువాతనే జాగ్రత్త గా మాట్లాడాలి . ప్రశాంతంగా ఉండటం మెల్ల మెల్లగా అలవరచు కోవాలి . వత్తిడిని , అధిక పని భారాన్ని తగ్గించు కోవాలి . తొందర పాటు తనాన్ని ధరి చేయ నీయ రాదు .
03. మెడిటేషన్ అలవరచు కోవాలి , వ్యాయామం అలవర్చుకోవాలి . సరి పడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి . వీటికేమి డబ్బులు ఖర్చు కావు కదా .
04. కుటుంబంలో అన్ని విషయాలలో అడ్జస్ట్ బుల్ తనాన్ని పెంచు కోవాలి . నా మాటే చెల్లా లని ఘర్షణకు దిగ రాదు .
05. ఇంకా సమస్య అధికంగా కన బడితే , సాడే సాత్ శని కాలంలో , శని గ్రహ పూజను ప్రతి శని వారం చేయడం గొప్ప నివారణ చర్య అవుతుంది . పూజ చేయు నపుడు శని గ్రహం మీద ఒక నల్లని కొత్త బట్టను కప్పి , దానిపై మెల్లగా ఒక లీటర్ నువ్వుల నూనెను పోయాలి . నల్లటి నువ్వుల గింజలను 100 గ్రాములు తీసుకుని మెల్లగా శని గ్రహం పై జార విడువాలి . ఆ తరువాత శని గ్రహం చుట్టూ 8 ప్రదక్షణలు చేయాలి .

06. కిలోమ్బావు నల్ల నువ్వులను తీసుకుని , మీటరుంబావు నల్లగుడ్డను , ఒక ముక్క నల్ల బెల్లం , ఒక ఇనుప మొలను మరియు ఒక స్టీల్ కాయిన్ ( రూపాయి లేదా రెండు రూపాయల బిల్ల) కల్పి ఏదయినా గుడిలో ఒక నల్ల పూజారికి శని వారం దానం చేయాలి . అయితే ఎంతో కొంత సంభావన లేకుండా పూజారి శని దానం తీసుకోడు .
07. శని గ్రహ మంత్రాన్ని ఈ ' సాడే సాత్ శని ' కాలంలో 80 వేళా సార్లు పఠించాలి .
08. శివ పంచాక్షరీ మంత్రాన్ని మరియు ' మహా మృత్యుంజయ ' మంత్రాలను పఠిస్తూ శివుడిని పూజించాలి .
09. పక్షులకు ముఖ్యంగా కాకులకు ధాన్యాలను వేయాలి .
10. నల్ల చీమలకు చక్కెరను గాని , తేనె ను గాని తినిపించాలి .
11. ప్రతినిత్యం శని కవచం పఠించాలి .
12. రామాయణ కాలంలో దశరథుడు పఠించిన '; శని స్త్రోత్రాన్ని ' పఠించాలి .
13. హనుమాన్ చాలీసాను ప్రతి రోజు పఠించాలి .
14. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే విధంగా చూసు కోవాలి . ఎదో ఒక వ్యాపకం లో నిమగ్న మవ్వాలి . కళలను అభివృద్ధి చేసు కోవాలి .
15. ప్రతి రోజు కనీసం 3 సార్లు " నీలాంజనం సమా భాసం , రవి పుత్రం యమా గ్రజం ,
ఛాయా మార్తాన్ద సంభూతం , తం నమామి శనైశ్చరం " అని పఠించడం వలన శని గ్రహన్ని శాంతింప చేయ వచ్చు .
వీటిలో ఏవో కొన్ని చేసినా ఫలితం ఉంటుంది .
" సర్వే జన : సుఖినో భవంతు "

.
No comments:
Post a Comment