బ్యాంకింగ్ షేర్లలో , బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టడం వలన ఏమైనా సమస్యలు ఉన్నాయా ?
(INVESTMENTS IN BANKING SHARES & MUTUAL FUNDS . IS IT SAFE OR NOT HERE AFTER?)
బ్యాంకింగ్ షేర్లలో , బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టడం ఇక నుండి అంతగా లాభదాయకం కాదేమో అని అనిపిస్తుంది .
అందుకు కారణాలు ప్రధాన మైనవి ,
01. బ్యాంకు లపై అధికంగా రాజకీయ ప్రభావముండటం .
02. బ్యాంకులలో కరెంట్ అకౌంట్స్ లలో , సేవింగ్ అకౌంట్స్ లలో నిల్వలు (CASA) తగ్గుతూ ఉండటం .
03. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా అప్పులు తీసుకుని ,అవి అసలు , వడ్డీ చెల్లించలేని పరిస్థితులలో ఉండటం . దీని వలన బ్యాంకులు భారీగా నష్ట పోవచ్చు .
04. గతంలో 9౦ రోజులు దాటితేనే , మొండిబాకీల అసలు మరియు వడ్డీకి ప్రొవిజిన్ చేసే వారు . ఇప్పుడు అలా కాకుండా , అప్పు తీసుకున్న వారు , ఇక చెల్లించ లేరు
అని తెలుస్తే చాలు , ప్రొవిజిన్ పెట్టాల్సిందే అని చెబుతున్నారు . దీని వలన , బ్యాంకుల లాభాలు , క్షీణించడానికి అవకాశం మెండుగా ఉంది . అంతే కాదు ,
మరెన్నో చీకటి కోణాలకు దారి తీసే అవకాశం లేక పోలేదు .
05. బ్యాంకు లకు , రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా కు , కేంద్ర ప్రభుత్వానికి , బడా కంపెనీల అప్పులను రైట్ ఆఫ్ చేసే అధికారం ఉంది , చేస్తున్నాయి కూడా . రేపు ఇంకా విపరీతంగా రైట్ ఆఫ్ చేస్తారు. దీని వలన బ్యాంకు ఆదాయాలు తగ్గిపోతాయి .
ఆ కారణంగా షేర్ల ధరలు తగ్గి , షేర్ హోల్డర్స్ నష్ట పోవచ్చు .
06. బ్యాంకులు మొండి బకాయిలను వసూలు చేయకుండా , తెలివిగా ఇతర ఏజెన్సీ లకు అమ్ముతున్నారు . ఎలా అమ్ముతున్నారంటే , ఉదా : రూలు . 24, ౦౦౦౦ కోట్ల అప్పులను , రూలు . 12,౦౦౦ కు అమ్మేస్తున్నారు . మరికొన్ని బ్యాంకులు రూలు . 1౦,౦౦౦ కోట్ల అప్పులను , రూలు . 3,౦౦౦ కోట్లకు అమ్ముతున్నారు . ఆ వెసులుబాటు ఉంది . ఇక మిగిలిన అప్పులను , లాభాలనుండి తగ్గిస్తున్నారు . దీనివలన షేర్ల ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి . దీని కారణంగా , షేర్ హోల్డర్స్ భారీగా నష్ట పోతున్నారు .
ఇక మరి కొన్ని బ్యాంకులు , బాండ్లను జారీ చేసి , దానిలో ఒక రిస్క్ క్లాజ్ పెట్టి , మొత్తం బాండ్లను రద్దు చేస్తున్నారు . ఇది ఎంత అన్యాయం . అసలు ఆ క్లాజే ఉండ కూడదు .
07. బ్యాంకింగ్ స్కీం లు నడిపే మ్యూచువల్ ఫండ్స్ కూడా , బ్యాంకింగ్ షేర్లలోనే ఇన్వెస్ట్ చేస్తాయి . షేర్ల ధరలు తగ్గిపోతే , ఆటోమాటిక్ గా , ఎన్ . ఏ . వి తగ్గి పోతుంది .
ఆ విధంగా ఇన్వెస్టర్స్ నష్ట పోతారు.
08. కొన్ని బ్యాంకులు , కొన్ని ఇస్యూలను , షేర్ హోల్డర్స్ కు , తేలియా నీయకుండా చేస్తున్నాయి . అవి కోర్టుల నుండి నెగటివ్ తీర్పులు వచ్చే వరకు ఇన్వెస్టర్స్ కు తెలియక , అధికంగా పెట్టుబడులు పెట్టిన వారు భారీగా నష్ట పోతున్నారు.
నోట్ : ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే . పెట్టుబడులు పెట్టేముందు డాక్యూమెంట్స్ ను పూర్తిగా చదివి మీ స్వంత నిర్ణయాలు గాని లేదా మీకు నమ్మకమైన ఫైనానాన్సియల్ కన్సల్టెంట్ సలహాలు , సూచనలతో , పెట్టుబడులు పెట్టగలరు .
You can also watch my youtube channel for other and related share market information:
No comments:
Post a Comment