WHICH IS BETTER CHITS OR SIP ?
చిట్టీలు కట్టడం మంచిదా లేక మ్యూచ్యువల్ ఫండ్స్ క్రమ పద్దతిలో పొదుపు చేయడం (SIP) మంచిదా ?
చిట్టీలు కట్టడం మంచిదా లేక మ్యూచ్యువల్ ఫండ్స్ క్రమ పద్దతిలో పొదుపు చేయడం (SIP) మంచిదా అంటే ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని చెప్పడం సరికాదు . దేని ప్రయోజనాలు , దేని ఇబ్బందులు దానికి ఉంటాయి . ఒక వ్యక్తి అవసరాలు , అవకాశాలు , రిస్క్ , లక్ష్యాలు , సమర్ధత , రెగ్యులర్ డబ్బు అందుబాటులో ఉండటం మొదలైన అనేక కారణాల పైన ఆధార పడి ఉంటుంది .
1. అవసరాలు : ఉదా . ఒక వ్యక్తికి ఒక సంవత్సరం , రెండు సంవత్సరాలలో డబ్బులు అవసరం ఉన్నాయి అనుకుందాం . అతనికి చిట్టి గానీ , ఫిక్సడ్ డిపాజిట్ కానీ , రీకరింగ్ డిపాజిట్ కానీ మంచిగా ఉంటుంది . తక్కువ రిటర్న్ వచ్చినా , అవసరాలకు, డబ్బు అందుబాటులో ఉంటుంది .
ఇతనికి మ్యూచ్యువల్ ఫండ్స్ సరికాదు . బాగుండదు . కారణం , ఒక సంవత్సరం , రెండు సంవత్సరాలలో రిటర్న్ రావచ్చు , రాక పోవచ్చు . ఒక్కో సారి అసలు పెట్టుబడి కూడా నష్ట పోవచ్చు . మ్యూచ్యువల్ ఫండ్స్ లలో అయితే కనీసం 6 నుండి 10 , 15, 20 సంవత్సరాలు పెట్టుబడి పెడితే అధికంగా వెల్త్ క్రియేట్ చేయడం వీలవుతుంది .
2. అవకాశాలు : ఇప్పటికి , గ్రామాలలో చాలా మందికి మ్యూచ్యువల్ ఫండ్స్ అంటే తెలియదు . ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు . ఎలా కె . వై . సి . తీసుకోవాలో తెలియదు . కొందరికి బ్యాంకులలో ఎలా పొదుపు చేయాలో తెలియదు . ఇలాంటి వారికి , తేలికగా అందుబాటులో ఉండేవి చిట్టీలే అని చెప్పవచ్చు . తెలిసిన వారు , నమ్మకం అయినా వారైతే , ఏ అవసరానికి కావాల్సి వచ్చినా వెంటనే పాట పాడుకోవచ్చు . నెలవారీగా కట్టుకోవచ్చు . కొందరు గుట్టుగా పొదుపు చేసుకోవాలనుకునే వారికి , ఇది చక్కని అవకాశం .
చిట్టీల కాల పరిమితి మహా అయితే 20, 25 , 50 నెలలు ఉంటాయి . ఎన్ని నెలలు ఉంటాయో అంతమంది సభ్యులు ఉంటారు . చిట్టీని నడిపే వారు 3 నుండి 5% వరకు తన కమిషన్ తీసుకుని , మిగిలిన మొత్తాన్ని బిడ్దర్ కు ఇచ్చివేస్తాడు . చిట్టీలలో కూడా వివిధ రకాలుగా ఉంటాయి . ప్రతినెలా పాట పాడేవి , ఫిక్స్డ్ అమౌంట్ ఇచ్చేవి లేదా చిట్టీ నడిపే వారు కమిషన్ ఏ మాత్రం తీసుకోకుండా నడిపే చిట్టీలు ఉన్నాయి . ప్రయివేటు చిట్టీలలో పెనాల్టీలు , వడ్డీలు , చార్జీలు , స్టాంప్ డ్యూటీలు ఏవి ఉండవు . అదే రిజిస్టర్డ్ చిట్టీలలో పెనాల్టీలు , వడ్డీలు , చార్జీలు , స్టాంప్ డ్యూటీలు , ఇతరములు ఉంటాయి . ప్రయివేట్ చిట్టీలయితే షూరిటీ కూడా ఇవ్వనవసరం లేదు . నమ్మకమే షూరిటీ .
3. రిస్క్ : ప్రయివేట్ చిట్టీలైనా , రిజిస్టర్డ్ చిట్టీలైనా రిస్క్ మాత్రం ఉంటుంది . ప్రయివేట్ చిట్టీలు , రిజిస్టర్డ్ చిట్టీలు రెండూ కొన్ని కోర్ట్ కేసులలో ఉన్నాయి . అందరూ ఒకే రీతిగా ఉంటారని చెప్పడం లేదు . చిట్టీలు వేసే టపుడు , అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని వేయాలి . అసలు చిట్టీలు వేసే వారిలో కొందరు ఎందుకు చేతులెత్తేస్తారు ? ఇప్పటివరకు జరిగిన అనేక సంఘటనలను గమనిస్తే , మనకు కొన్ని కనిపిస్తాయి .
ఎ ) చిట్టీలు ఎత్తుకున్న వారు , కొంత మంది కట్ట కుండా వెళ్లి పోతే లేదా ఆలస్యం చేస్తే , ఆ భారం నుండి తప్పించు కోడానికి కొంతమంది చేతులు ఎత్తేస్తారు .
బి ) చిట్టీలు నడిపే వారు , ఏవైనా వ్యసనాలకు అలవాటు పడినా , చిట్స్ అమౌంట్ ను , వేరే పెట్టుబడులలో పెట్టి నష్ట పోయినా , చేతులు ఎత్తేయ వచ్చు . వీరికి మోసం చేయాలని ఏ కోశానా ఉండక పోవచ్చు . కానీ నష్ట పోయారు కాబట్టి , సభ్యులకు చెల్లించ లేరు .
సి ) చిట్టీలు నడిపే వారు కొందరు , అది ప్రయివేటు కావచ్చు , రిజిస్టర్డ్ కావచ్చు , మోసం చేయాలనే ఉద్దేశ్యం తోటే ప్రారంభిస్తారు . చీటీలు ఎత్తిన వారికి కూడా మాయ మాటలు చెప్పి , నేను ఎక్కువ వడ్డీ ఇస్తానని తన వద్దే పెట్టుకుంటారు . మీ అవసరాలకు ఇస్తానని , ఎక్కువ వడ్డీ ఇస్తానని , వారి వద్ద అధనంగా నిల్వ బెట్టుకున్న డబ్బును కూడా తెమ్మంటారు . పలానా చోట భూములు కొంటున్న , పలానా షేర్లలో పెట్టుబడులు పెడుతున్నా అంటూ రక రకాల భరోసాలు ఇస్తూ డబ్బు తన వద్ద పెట్టుకుంటారు . గంభీరంగా కనబడుతారు . మాటకారులై ఉంటారు . తీయగా మాట్లాడుతారు . నమ్మిస్తారు . వమ్ము చేస్తారు . ఇలాంటి వారితో కాస్త జాగ్రత్త గా ఉండాలి .
4. లక్ష్యాలు : ఏవైనా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నవారు , అంటే ఇల్లు కొనుక్కోవడం , పిల్లల పెళ్ళిండ్లు , కారు కొనడం , పెద్ద పెద్ద చదువులు , రిటైర్ మెంట్ లాంటి వాటికి మ్యూచ్యువల్ ఫండ్స్ చాలా చక్కగా ఉపయోగపడుతాయి . మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి తెలిసిన వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకుని మ్యూచ్యువల్ ఫండ్స్ లలో దీర్ఘ కాలం పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేట్ చేయవచ్చు . మ్యూచ్యువల్ ఫండ్స్ లలో ఒకే సారి పెద్ద మొత్తంలో పెట్టుబదులు పెట్టవచ్చు . లేదా నెలవారీగా పెట్టుబడులు పెట్టవచ్చు . నెలవారీగా క్రమ పద్దతిలో పెట్టుబడులు పెట్టడాన్ని SIP లేదా SYSTAMATIC INVESTMENT PLAN అని అంటారు .
5. సమర్ధత : ఫైనాన్సియల్ నాలెడ్జి ఉన్న వారు , సమర్ధత ఉన్నవారు, అవసరాలను బట్టి , అవకాశాలను బట్టి , ఆదాయ పన్నులను దృష్టిలో ఉంచుకొని , దేనిలోనైనా పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకోగలరు . పన్నులను తగ్గించుకోగలరు .
6. రిటర్న్స్ : బ్యాంకులలో ఫిక్సడ్ డిపాజిట్ , చిట్టీలలో 6 నుండి 8 % రిటర్న్ వస్తే , మ్యూచ్యువల్ ఫండ్స్ లలో సంవత్సరానికి 12 నుండి 14% వస్తుంది . అదీ లాంగ్ పిరియేడు కంటిన్యూ చేస్తే . బ్యాంక్ సేవింగ్ అకౌంట్లలో నైతే 3% వడ్డీ లభిస్తుంది .
అర్ధమైంది అని అనుకుంటున్నాను . ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్స్ లలో పోస్ట్ చేయండి . సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను .