మరణించే విషయం , మరణం తరువాత విషయాలు , మరణించే వారికి తెలుస్తాయా ?
వృద్ధులకు , దీర్ఘ కాల రోగులకు , వారు చనిపోయే విషయాలు , మరణం తరువాత విషయాలు తెలుస్తాయి . కొన్ని సూచనల ద్వారా తెలుస్తుంది . కానీ కొందరు చెప్పలేక పోతారు . అప్పటికే కోమా లోకి వెళ్లి పోతారు . కొందరు చావు అంటే భయం వలన చెప్పలేక పోతారు. పిల్లలు , యువతీ యువకులకు, అకాస్మాత్తుగా చనిపోయే వారికి ఇలాంటి సూచనలు కనబడవు .
కొందరు వృద్ధులకు , చని పోవడానికి 5, 6, నెలల ముందు నుండే , మరణం విషయాలు తెలుస్తుంటాయి . కానీ చెప్పరు భయంతో . ఇలాంటి వారు మనతో మాట్లాడుతారు . అలానే వారికి ఇష్టమైన , చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడుతారు . వారితో సరదాగా ఉంటారు . వారికి అన్ని విషయాలు చెబుతుంటారు . వారితో గతంలో గడిపిన విషయాల గురించి ముచ్చటించు కుంటారు . వీరికి భోజనం పెడితే , వాళ్ల చనిపోయిన అమ్మకు , అక్క చెల్లెన్డ్లకు , అన్న దమ్ములకు ( తన వద్దకు వచ్చిన ఆత్మలకు ) భోజనం పెట్టమంటారు . వారు ఏది తింటే అది , వారు ఏది త్రాగితే అది పోయమంటారు . విచిత్రింగా ప్రవర్తిస్తుంటారు . ఆ ఆత్మలు మనకు కనబడవు . వారినే చూపమంటే , ఇప్పటి దాకా ఇక్కడే వుంది , నా ప్రక్కలోనే పడుకుంది అని అంటారు . మనకు మాత్రం ఎవరూ కనబడరు , శబ్దం వినిపించదు .
అంటే ఇప్పుడు వారు , చావు వద్దకు వెళుతున్నారు , చావడం ఇష్టం లేక , మల్లి మన లోకం లోకి వస్తున్నారని అర్ధం చేసుకోవాలి . వీరికి చావు గురించి తెలుస్తుంది . కానీ , ఈ లోకాన్ని విడువ లేక భయంతో చెప్పడం లేదు . ఇంకా తీరని కోరికలు ఉన్నప్పుడు ఇలా చేస్తుంటారు .
No comments:
Post a Comment