ప్ర : బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (N.P.A .ల ను ) జీరో శాతాని కి తగ్గించ వచ్ఛా ?
జ : బ్యాంకుల నిరర్ధక ఆస్తులను (N.P.A .ల ను ) జీరో శాతాని కి తగ్గించ వచ్చు :
బ్యాంకులు , ప్రజలకు , కంపనీలకు ఇచ్చిన అప్పులకు సంభందించిన వడ్డీలు , నెల సరి వాయిదాలను 60 నుండి 90 రోజులకు మించి బాకీ పడి ఉన్నట్లయితే , ఆ అప్పుల తాలూకు మొత్తాన్ని , నిరర్ధక ఆస్తులు ( N.P.A.s- Non Performing Assets) గా భావిస్తారు . బ్యాంకుల వద్ద ఇప్పుడు సుమారుగా 0.1% నుండి 5% వరకు నిరర్ధక ఆస్తులు ఉన్నాయి . దీనిని బట్టి నిరర్ధక ఆస్తులు , బ్యాంకుల పై , దేశం ఫై ఎంతటి వత్తిడి పెంచు తున్నాయో అర్ధం చేసుకోవచ్చు . వీటి వలన బ్యాంకులకు నష్టమే కాని లాభం ఉండదు . ఇవి కేవలం ఉనుత్పాధక ఆస్తులుగా మిగిలి పోతున్నాయి . ఆ అప్పులు తిరిగి వస్తాయో లేదో తెలియదు . బ్యాంకుల వద్ద పెట్టిన సెక్యూరిటీ లు , వారి అప్పులకు వడ్డీకి సరి పోతాయో లేదో తెలియదు . ఆ సెక్యూరిటీ లను మరెన్ని ఇతర బ్యాంకు ల వద్ద పెట్టారో తెలియదు . తీసు కున్న అప్పులను , సరియయిన వ్యాపారాలకే ఉపయోగిస్తున్నారో లేదో తెలియదు . ఆ అప్పులకు యే రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందో తెలియదు . ఇలా , బ్యాంకులిచ్చే అప్పులు నిరర్ధక ఆస్తులుగా మార డానికి అనేక కారణాలున్నాయి . F/Y 2013 లో ,అన్ని బ్యాంకుల నిరర్ధక ఆస్తులు 1.5 లక్షల కోట్లు ఉంటే , అవి F/Y 2015 లో 3.1 లక్షల కోట్లకు పెరిగాయి . దీనిని బట్టి నిరర్ధక ఆస్తులు , బ్యాంకుల పై , దేశం ఫై ఎంతటి వత్తిడి పెంచు తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
బ్యాంకులు , ఇక నుండయినా బ్యాంకులిచ్చే అప్పులు , నిరర్ధక ఆస్తులుగా మార కుండా జాగ్రత్త పడుతూనే , ఇప్పుడున్న నిరర్ధక ఆస్తులను 0% వరకు తగ్గించ వచ్చు . ఎలాగంటే ,
01. ప్రభుత్వ మరియు రిజర్వ్ బ్యాంక్ అనుమతితో , ఎన్ . పి. ఎ . లను కఠిన మయన నిభంధనలతో , చట్ట బద్దమయిన కమీషన్ ఏజెంట్లకు , అప్ప గించాలి . వారు అప్పులను వసూలు చేసినందుకు , కొంత కమీషన్ చెల్లించాలి . ఎక్కడా లాలూచి , రాజకీయ నాయకుల వత్తిడి ఉండ కూడదు . ప్రత్యేక కోర్టులలో విచారించే విధంగా చట్టాలను సవరించాలి . కేసుల సెటిల్ మెంట్స్ కు పరిమితి ఉండాలి . సాద్యమైనంత వరకు , ఏజెంట్స్ కౌన్సిలింగ్ ద్వారానే అప్పులను వసూలు చేయ గల్గాలి .
0 2 . అలానే , ప్రభుత్వ మరియు రిజర్వ్ బ్యాంక్ అనుమతితో , ఎన్ . పి. ఎ . లను కఠిన మయన నిభంధనలతో , చట్ట బద్దమయిన " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లకు " , నిరర్ధక ఆస్తులను , రావాల్సిన అసలును మరియు మినిమం వడ్డీ మొదటి నుండి లెక్కలు వేసి అమ్మి వేయాలి . కస్టమర్ల అనుమతి తో , " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లకు " అగ్రిమెంట్ చేయించాలి . వరిజినల్ డాక్యుమెంట్స్ ను " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లకు " కస్టమర్ల అనుమతి తో , అప్పగించాలి . ఒక సారి అప్పు వసూలయి , డాక్యు మెంట్స్ అప్పగించారంటే , ఇక ఆ కష్టమర్ తో బ్యాంకు కు సంభందముండదు . అప్పు వసూలు విషయం లో ఎక్కడా లాలూచి పడకూడదు . రాజకీయ నాయకుల వత్తిడి ఉండ కూడదు . ప్రత్యేక కోర్టులలో విచారించే విధంగా చట్టాలను సవరించాలి . కేసుల సెటిల్ మెంట్స్ కు పరిమితి ఉండాలి . సాద్యమైనంత వరకు , " డెల్ క్రెడరీ కమీషన్ ఏజెంట్లు " కౌన్సిలింగ్ ద్వారానే అప్పులను వసూలు చేయ గల్గాలి .