Tuesday, October 11, 2016

సంపద వృద్ధికి ( WEALTH CREATION) మ్యూచువల్ ఫండ్సులలో పెట్టుబడులు పెట్టునపుడు , డివిడెండ్స్ ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) సరియైనదా ? లేక గ్రోత్ ఆప్స్ న్ ( GROWTH OPTION) సరియైనదా ?

ప్ర : సంపద వృద్ధికి  ( WEALTH CREATION) మ్యూచువల్ ఫండ్సులలో  పెట్టుబడులు పెట్టునపుడు , డివిడెండ్స్  ఆప్స్ న్  (DIVIDEND OPTION)  సరియైనదా  ?  లేక  గ్రోత్  ఆప్స్ న్    ( GROWTH OPTION) సరియైనదా  ?

జ : మ్యూచువల్ ఫండ్సులలో  పెట్టుబడులు పెట్టి  నపుడు  మనకు  ఇష్టమైన  ఏ  ఆప్స్ న్ నైనా ఎంచు కోవచ్చు .  డివిడెండ్స్  ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) కావచ్చు   లేక  గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  కావచ్చు .  అది మన ఇష్టం . అసలు డివిడెండ్స్  ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) అంటే ఏమిటి   ?    గ్రోత్  ఆప్స్ న్  ( GROWTH OPTION)  అంటే ఏమిటి ? 

ఎ ) డివిడెండ్స్  ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) అంటే ఏమిటి   ? 

డివిడెండ్స్  ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) ను  ఎంచు కున్నట్లయితే , మ్యూచువల్ ఫండ్సు సంస్థలు  ప్రతి  సంవత్సరం  లేదా లాభాలు  వచ్చినప్పుడు  ప్రకటించే  డివిడెండ్లను , ప్రకటించిన  7 రోజులలో  , పెట్టుబడి దారులకు  చెల్లిస్తారు . 

బి ) గ్రోత్  ఆప్స్ న్  ( GROWTH OPTION)   అంటే ఏమిటి ?

గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  ను  ఎంచు కున్నట్లయితే , మ్యూచువల్ ఫండ్సు సంస్థలు  ప్రతి  సంవత్సరం  లేదా లాభాలు  వచ్చినప్పుడు  ప్రకటించే  డివిడెండ్లను  పెట్టుబడి దారులకు   చెల్లించ కుండా   అందులోనే  పెట్టుబడులు  పెట్టి  సంపదను వృద్ధి చేస్తాయి  , 

 అయితే సంపద వృద్ధికి  మాత్రం  మ్యూచువల్ ఫండ్సులలో   గ్రోత్ ఆప్స్  న్  ( GROWTH OPTION)  ను ఎంచుకోవడమే  ఉత్తమం  అని   చెప్పాలి .  అందుకు ముఖ్యమైన  ఈ క్రింది  కారణాలద్వారా  అర్ధం చేసుకోవచ్చు . 


01. గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  ను  ఎంచు కున్నట్లయితే , దీర్ఘకాలంలో  , అనగా  5 నుండి 25  సంవత్సరాలకు  చూస్తే , ఒకే సారి  పెద్ద మొత్తం  చేతి కి వస్తుంది . మనకూ  ఒక ఆనందం , తృప్తి  కలుగుతుంది . ఉదా :  సెప్టెంబర్ ,1994 లో " ఫ్రాంక్లిన్ ఇండియా ప్రెమా  ప్లస్"  లో  రూ. లు . 1,00,000/-  పెట్టుబడులు పెట్టిన వారికీ  , ఈ రోజు  ( 22 సంవత్సరాల కు  )             రూ . లు .  49,55,400/- చేతికి అందు తున్నాయి .  

02. గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  ను  ఎంచు కోవడం వలన , దీర్ఘ కాలంలో  ఒక లక్ష్యాన్ని  పరి పూర్ణం చేసుకోవచ్చు .  ఇల్లు కొనడం కావచ్చు . కారు కొనడం కావచ్చు . పిల్లల వివాహాలు కావచ్చు . పిల్లల విద్య కావచ్చు . విదేశాలకు వెళ్లడం కావచ్చు . బిజినెస్ ప్రారంభించడం కావచ్చు . 

03. గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  ను  ఎంచు కోవడం వలన , దీర్ఘ కాలంలో  పెద్ద మొత్తం  జమ అవుతుంది . కాబట్టి అత్యవసర  సమయములలో  వాటిని బ్యాంకులలో సేకురిటీగా  పెట్టి  50% వరకు  లోన్ తీసుకోవచ్చు . మ్యూచువల్ ఫండ్సు  ను  డిస్టర్బ్ చేయ వలసిన  అవసరం ఉండదు . 

04.  గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  ను కాకుండా ,   డివిడెండ్స్  ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) ను  ఎంచు కున్నట్లయితే , మ్యూచువల్ ఫండ్సు సంస్థలు  ప్రతి  సంవత్సరం  లేదా లాభాలు  వచ్చినప్పుడు  ప్రకటించి , చెల్లించే   చిన్న చిన్న  డివిడెండ్లను , పెట్టుబడి దారులు  ఎదో ఒక దానికి  ఖర్చు చేయడం జరుగుతుంది .   ఈ చిన్న మొత్తాలు దేనికి  ఉపయోగానికి  రావు .  సంపద వృద్ధి  కనబడదు . యే  ఒక్క లక్ష్యం నేర వే రదు.  అవును కదా . 

05.  డివిడెండ్స్  ఆప్స్ న్ ( DIVIDEND OPTION ) ను  ఎంచు  కోవడం వలన , ఎలాగో  రోజు వారి ఖర్చులకు  డివిడెండ్స్  వస్తాయి గదా అని , సంపాదించే  శక్తిగల సమయంలో కూడా , ఏ పనీ చేయకుండా  కాలాన్ని  అంతా  వృధా చేసే అవకాశం లేక పోలేదు . గడిచిన  కాలం  తిరిగి రాదు .  అప్పటికే  ఇతర విధాలుగా  సంపాదించుకునే  శక్తి తగ్గి పోతుంది . 

06. దీర్ఘ  కాలం పెట్టుబడులు  పెట్టడం వలన కొన్ని స్కీ మ్ లలో  ఆయా సంవత్సరాలలో  పెట్టిన  పెట్టుబడులకు   పన్ను మినహాయింపులు  పొంద వచ్చు .  

07. 12 నెలలు దాటిన   ఏ  మ్యూచువల్ ఫండ్సు  పెట్టుబడులకైనా   ఆదాయ పన్నులు ఉండవు . 

08.  అందుకని కనీసం  60 సంవత్సరాలు  వచ్చేంత వరకు  లేదా రిటైర్ మెంటు అయ్యే వరకు  లేదా  పూర్తిగా  చేతగా నంతవరకు  గ్రోత్  ఆప్స్ న్      ( GROWTH OPTION)  ను  ఎంచు కోవడమే ఉత్తమం 

No comments: