Monday, October 24, 2016

పేదరికం

అంశం: *పేదరికం*

శీర్షిక: *పేదరికం ఒక గొప్ప వరం*

పేదరికం ఒక గొప్ప వరం 
అది తెలుసుకుంటే జీవితం సుగమం 
పేదరికం లోనే తెలియు కష్టం సుఖం 
పేదతనంలోనే పొందెదం ఎంతోఅనుభవం!

ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా 
ఏ భయం వేసినా ఏ అవమానం కలిగినా 
తట్టుకునే శక్తిని యుక్తిని ధైర్యాన్ని అనుభవం నేర్పు!

పేదరికం నేర్పు ,నేర్పు ఓర్పు, జీవిత పాఠం
నడక నడత, ప్రవర్తన, క్రమశిక్షణ త్యాగం 
మనో ధైర్యం, మంచి చెడు, సత్యం అసత్యం
బీదతనం బోధించు "ధర్మం అధర్మం"!

ధనం అహాన్ని అహంభావం అహంకారాన్ని పెంచు
పేదరికం కసి పట్టుదల వినయం మంచితనం పెంచు!

ధనవంతుడికి స్వార్ధం పేదవాడికి త్యాగ నిరతి 
డబ్బున్న వాడిది కఠిన గుండె పేదవాడిది జాలి గుండె!

వేద ఇతిహాసాలు రచించిన ఋషులు పేదలే 
అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ పేదనే
భారత రాజ్యాంగ కర్త డా అంబేడ్కర్ పేదనే
భారత రాష్ట్రపతి డా అబ్దుల్ కలాం పేదనే
బీదతనమే వరం,మంచితనమే అమూల్య ధనం!

_ మార్గం కృష్ణ మూర్తి

No comments: