ప్ర . నల్ల ధనాన్ని , అవినీతిని అరికట్టడానికి రూ . లు . 500/- మరియు రూ . లు . 1,000/- నోట్ల రద్దు ( DEMONETISATION OF Rs.500/- Rs.1,000/-) సరియైయినదేనా ?
జ : భారత దేశంలో నల్ల ధనాన్ని , అవినీతిని మరియు సుమారుగా 10 నుండి 20% చలామణిలో ఉన్న ఫేక్ నోట్స్ ను అరికట్టడానికి రూ . లు . 500/- మరియు రూ . లు . 1,000/- నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి ( 08.11. 2016 అర్ధ రాత్రి నుండి ) రద్దు చేయాలని నేడు ప్రధాన మంత్రి గారు తీసుకున్న నిర్ణయం , ప్రకటన చాలా సాహసోపేతమైనది , విప్లవాత్పకమైనది , అద్భుతమైనది మరియు సరియయినది. నల్ల ధనాన్ని , అవినీతిని మరియు ఫేక్ నోట్స్ ను నియంత్రించే సాధనాలలో ఇది ఒక భాగం .
కొందరు రాజకీయ నాయకులు , వారి కార్య కర్తలు , కొందరు వ్యాపారస్తులు , కొందరు బ్యూరోక్రాట్లు చట్టాలలోని లొసుగులను , మోసాలను , అవినీతిని , రిజర్వేషన్స్ ను అడ్డం పెట్టుకుని , అవినీతి సొమ్ముతో , నల్లధనంతో, బినామీ వ్యాపారాలతో ఎదిగి పోతూ , వేదికలమీద నీతులు మాట్లాడుతూ , నిజాయితీగా కష్టపడి సంపాదించుకుంటూ , సాహ్మణ్య జీవితం గడిపే వారిని చిన్న చూపు చూసే వారికి " బ్లాక్ మనీ పై సర్జికల్ స్ట్రైక్ " చెంప పెట్టు లాంటిది .
ప్రధాన మంత్రి గారి ప్రకటన ముఖ్య సారాంశం నల్ల ధనాన్ని , అవినీతిని అరికట్టడం , మరియు 10% చలామణిలో ఉన్న ఫేక్ నోట్స్ ను పేద మధ్యతరగతి ప్రజలకు వస్తువుల ధరలు , భూముల ధరలు అందుబాటులోకి రావడం , ఉత్పత్తిని పెంచడం , ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం , ప్రతి కుటుంభం ఆర్ధికంగా ఎదుగడానికి , నిజాయితీ గల వారు తల ఎత్తు కుని ధైర్యంగా తిరిగే విధంగా చేయడం , ఉగ్రవాదాన్ని అరికట్టడం మరియు మరెన్నో ఇతర కారణాలు ఇమిడి ఉన్నాయి . రూ . లు . 500/- మరియు రూ . లు . 1,000/- నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి ( 08.11. 2016 అర్ధ రాత్రి నుండి ) రద్దు చేయడం వలన పేదలకు , నిజాయితీ పరులకు ఎలాంటి సమస్య ఎదురుకాదు . పేదలకు ఖర్చు తక్కువ . నిజాయితీ పరులకు , క్రమశిక్షణ గలవారికి చెడు వ్యసనాలు ఉండవు . అందుకని వీరికి పెద్ద నోట్ల రద్దు వలన పెద్ద సమస్య ఉండదు . దానికి తోడు రేపు పేదలకు , నిజాయితీ పరులకు ఖచ్చితంగా మేలు జరుగు తుందను కున్నపుడు , ఈ వరం పది రోజుల డబ్బు కొరత , పెద్ద సమస్యే కాదు . పైగా హర్షిస్తారు . ఈ అర్ధ రాత్రి నుండే అనడం కూడా సరి అయినదే . పెద్ద నోట్ల రద్దు చేసిన ముఖ్య ఉద్దేశ్యమే నల్ల ధనాన్ని , అవినీతి సొమ్మును , ఫేక్ నోట్స్ ను అరికట్టడం . ఏ కొద్దీ సమయం దొరికినా , నల్లధనాన్ని ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకునే వారు . ఇలా తక్షణమే రద్దు చేయడం వలన , నల్ల ధన వీరులకు , అవినీతి పరులకు గిమ్మిక్కులు చేసే అవకాశం చిక్కకుండా పోతుంది . అయితే మరల రూ . లు 500/- మరియు రూ . లు . 2,000/- ప్రవేశ పెట్టే నిర్ణయం తీసుకోవడం వలన , కేవలం నల్లధనాన్ని , అవినీతిని పోస్టుపోన్ చేయడమే అవుతుంది . అవినీతికి అలవాటు పడినవారు , అవకాశం ఉన్నవారు మరో 2 లేదా 3 సంవత్సరాలలో మరల నల్ల ధనాన్ని కూడబెట్ట గలుగుతారు . ఎందుకంటే ఇప్పుడు పెద్ద మొత్తం విలువగల నోట్లు అందుబాటులోకి రాబోతున్నాయి . ఈ వ్యవస్థలో ఆ అవకాశం ఉంది . అందుకని ప్రభుత్వాలు ఆ దిశగా కూడా నియంత్రణ చర్యలు తీసుకోవాలి .
ప్రధాన మంత్రి గారి ప్రకటన లోని ముఖ్య అంశాలు :
01. రూ . లు . 500/- మరియు రూ . లు . 1,000/- నోట్లను ఈ రోజు అర్ధ రాత్రి నుండి ( 08.11. 2016 అర్ధ రాత్రి నుండి ) రద్దు చేయాలని ప్రధాన మంత్రి గారు ప్రకటన చేశారు .
02. వీటి ప్లేసులో కొత్త రూ . లు . 500/- మరియు 2,000/- నోట్లను విడుదల చేయడం.
03.అలానే రూ లు . 100/-, 50/-, 20/-, 10/-, 5/- ,2/-,1/- నోట్లు మరియు అన్ని కాయిన్స్ యధావిధిగా చాలా మణిలో ఉంటాయి .
03. తేదీ 08. 11. 2016 రోజున బ్యాంకుల ను మూసివేస్తారు .
05. తేది . 08. 11. 2016 మరియు 09. 11. 2016 ఏ . టి . ఎమ్ లు పని చేయవు .
06. తేదీ 10. 11. 2016 నుండి ప్రజలు , రోజుకు రూ . లు. 4,000/- ప్రస్తుతం చేతిలో ఉన్న 500/-, 1,000/- నోట్లకు బదులుగా క్రొత్త 500/-, 2,000/- నోట్లను బ్యాంకులనుండి , పోస్టాఫీసుల నుండి తీసుకోవచ్చు . ఇది 24. 11. 16 వరకు వర్తిస్తుంది . ఆ తరువాత మరల రివ్యూ చేస్తారు .
07. ఈ విధంగా 31. 12. 2016 వరకు మార్చు కోవచ్చు . ఆ తరువాత ఆ నోట్లు చెల్లు బాటే కాదు , మార్చు కోడానికి కూడా వీలు కాదు .
08. చెక్ , డెబిట్ కార్డు , క్రెడిట్ కార్డుతో మరియు ఆన్ లైన్ లో ఎంత మొత్తానికైనా ట్రాన్సక్షన్ చేసు కోవచ్చు .
09. ఏ . టి . ఎమ్ ద్వారా రోజుకు 10,000/- లకు మించి డ్రా చేయడానికి వీలు లేదు . అలానే వారానికి 20,000/- లకు మించి డ్రా చేయడానికి వీలు లేదు .
10. ప్రస్తుతం అందు బాటులో ఉన్న రూ . లు . 500/- , 1,000/- నోట్లను బ్యాంకులలో గాని పోటాఫీసులలో గాని ఎంత మొత్తమైనా వారి వారి అకౌంట్లలో డిపాజిట్ చేసు కోవచ్చు . అయితే వారి ఆధార్ కార్డును గాని , ఓటర్ కార్డును గాని , పాన్ కార్డును గాని చూపించాలి . పెద్ద మొత్తాలలో డిపాజిట్ చేస్తే , వీటికి సోర్సు చూపించమని ఆదాయ శాఖ నుండి నోటీసులు రావచ్చు . బ్యాంకుల్లో సి .సి . కెమెరాలలో అన్నీ రికార్డ్ చేస్తారు .
11. పెట్రోల్ బంకులలో , హాస్పటల్ లలో , ప్రభుత్వ స్టోర్సులలో కొనుగోలుకు , రేల్వే , బస్ , ఏర్ లైన్ టికెట్స్ కొనడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ . లు . 500/- మరియు 1,000/- నోట్లు తేదీ 30. 12. 2016 వరకు చెల్లు బాటు అవుతాయి .
నల్ల ధనానికి ముఖ్య కారణాలు ఈ క్రింద సూచించినవి . వీటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో నడుస్తుంది . అదియును గాక ముఖ్యంగా ,
01. చట్టం ముందు అందరూ ,( పేద , మధ్య తరగతి , ధనిక , కుల , మత, ప్రాంత , ఆశ్రిత పక్ష పాతం లేకుండా మరియు అన్ని సమయాలలో ) సమానులే అన్న విధంగా చర్యలు చేపడుతే నల్ల ధనాన్ని , అవినీతిని మరియు ఫేక్ నోట్లను సులువుగా అరి కట్ట వచ్చు .
02. ప్రతీది నిస్వార్ధంగా ఉండాలి , స్వచ్చతగా ఉండాలి . ధృడ సంకల్పంతో ఉండాలి . కక్ష సాధింపు చర్యలు, ఆశ్రిత పక్ష పాతం లేకుండా ఉంటే , ప్రజలు , నాయకులను ఆదర్శంగా తీసుకుంటారు , అనుసరిస్తారు .
03. ఆధార్ కార్డు , పాన్ కార్డు లాగా , ప్రతి ఒక్కరికీ ఒకే బ్యాంక్ అకౌంట్ , ఒకే సెల్ నెంబర్ ఉండే విధంగా చేయడం వలన నల్ల ధనాన్ని అరికట్ట వచ్చు .
04. పేదలకు , మధ్య తరగతి ప్రజలకు , నిజాయితీ పరులకు మేలు చేకూర్చాలనుకున్నా , ధైర్యాన్ని కల్పించాలన్నా , "వోట్ బ్యాంకు" విధానాలకు స్వస్తి పలకాలి .
05. రాజకీయ నిధులకు 100% పన్నులు వేయడం కూడా వృధానే . అసలు రాజకీయ నిధులపై పూర్తిగా నిషేధం విధించాలి .
06. అన్నిటికంటే ముఖ్యముగా , గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తో పాటు , రూ . లు . 1,000/- కోట్ల నిధులు వెచ్చించి , ఇంటిగ్రేటెడ్ మరియు స్వయం ప్రతి పత్తి గల స్వతంత్ర "సి . బి . ఐ " ని ఏర్పాటు చేయాలి. అలానే ప్రత్యేకమైన "ఫాస్ట్ ట్రాక్ " కోర్టులను ఏర్పాటు చేసి , అవినీతి కేసులను 90 రోజులలో పూర్తి చేసే టట్లుగా చర్యలు తీసుకుంటే , నిజంగా నేటి మరియు రేపటి తరాల పేదలకు , నిజాయితీ పరులకు న్యాయం జరుగు తుంది . మేలు కలుగుతుంది . ధైర్యం కలుగుతుంది . తృప్తి మిగులుతుంది . అలానే ఈ ప్రకటనకు ముందు ఆర్ధిక లావాదేవీలను విచారించే పూర్తి అధికారం ఈ " సి . బి . ఐ " కి వీలు కల్పించాలి . ప్రకటనకంటే ముందు 180 రోజుల బ్యాంకు ట్రాన్సక్షన్స్, భారతదేశంలో నివసించే వారందరివి , రూ.లు . 2 లక్షల 50 వేలకె మించిన ఖాతాలను , తెప్పించుకుని వెరిఫై చేయించాలి . అప్పుడే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది . రేపు పడే కష్ట నష్టాలకు ఓర్చు కుంటారు .
ఏది ఏమైనా ప్రధాన మంత్రి గారి నిర్ణయాన్ని పేద , మధ్య తరగతి ప్రజలు , నిజాయితీ పరులు స్వాగతిస్తారనడంలో సందేహం లేదు . ఒకటి రెండు రోజులు కొంత ఇబ్బంది కలుగవచ్చు . కానీ దీర్ఘ కాలంలో బావి తరాలకు ఇది ఎంత గానో ప్రయోజనం చేకూరుస్తుంది
అసలు నల్ల ధనానికి , అవినీతికి ముఖ్య కారణాలు ఇవి , వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాన మంత్రి గారికి విన్నపం:
"MAIN REASONS FOR THE BLACK MONEY , CORRUPTION AND FAKE NOTES ARE AS UNDER , HENCE PRIME MINISTER MUST CONSIDER ALL THESE ALSO : "
"MAIN REASONS FOR THE BLACK MONEY , CORRUPTION AND FAKE NOTES ARE AS UNDER , HENCE PRIME MINISTER MUST CONSIDER ALL THESE ALSO : "
No comments:
Post a Comment