ప్ర : సెల్ ఫోన్ /స్మార్ట్ ఫోన్ ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే ఏమి చేయాలి ?
జ : సెల్ ఫోన్ /స్మార్ట్ ఫోన్ ( CELL PHONE / SMART PHONE ) పోయినట్లవుతే వెంటనే ,
01. అందులోని ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలి . ఒక వేల రింగు అవుతూ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదంటే , అది ఎక్కడో ఒక చోట ఉంది , మనం మరిచి పోయి ఉంటాం అని , తిరిగిన చోట్లన్నీ వెదకుతో , అక్కడికి వెళ్లి చూడాలి . కనబడక పోతే మళ్ళీ ఫోన్ చేయాలి . రింగ్ శబ్దాన్ని బట్టి మనం సులువుగా ఫోన్ ను గుర్తించ వచ్చు .
02. ఆ ఫోన్ లోని నెంబర్లకు ఫోన్ చేసి నట్లయితే , అందరూ ఒక్క తీరుగా ఉండరు కదా . కొందరు న్యాయ బద్దంగా నడుచుకునే వారు , వెంటనే లిఫ్ట్ చేసి ' ఫోన్ పలానా చోట పడిందండి , నా వద్ద ఉంది . వచ్చి తీసుకెళ్లండి ' అని చెబుతారు . వెంటనే థాంక్స్ తెలిపి , వారి వద్దకు వెళ్లి ఫోన్ తీసుకొచ్చు కోవాలి . ఇవన్నీ ప్రాక్టికల్ గా జరిగినవి .
03. ఫోన్ చేసినప్పుడు , ఒక వేల స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లయితే , దానికి మూడు కారణాలు ఉంటాయి . ఒకటి, ఛార్జింగ్ లేక ఫోన్ రింగ్ కాక పోవడం. రెండు , సిగ్నల్స్ లేక పోవడం . మూడు , ఎవరైనా తీసుకుని , దానిలోని సిమ్ లను తీసివేయడం లేదా బ్యాటరీ తీసి వేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం .
04. అన్ని ప్రయత్నాలు చేసాక , ఫోన్ ఎవరి చేతిలోనో పడిందని నిర్ధారించుకున్నాక , ఇక మనకు దొరకదు అనుకున్నపుడు , వెంటనే అందులోని సెల్ నెంబర్లను బ్లాక్ చేయాలి .
05. సెల్ నెంబర్లను బ్లాక్ చేయాలంటే , ఒక్కో సర్వీస్ ప్రొవైడర్ కు , ఒక్కో పద్ధతి , టోల్ నెంబర్స్ ఉంటాయి .
06. BSNL Cell Number అవుతే BSNL Service provider టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి బ్లాక్ చేయ మని చెప్పాలి . ఉదా : BSNL Service provider టోల్ ఫ్రీ నెంబరుకు , BSNL సెల్ నెంబరు నుండే ఫోన్ చేయాలను కుంటే 1503 నెంబరుకు , ఇతర నెట్ వర్క్ నుండి ఫోన్ చేయాలంటే 1800-180-1503 ఫోన్ చేసి , రికార్డెడ్ వాయిస్ ప్రకారం ఫాలో అయి , చివరగా ఆపరేటర్ తో మాట్లాడి , సెల్ నెంబరును బ్లాక్ చేయ మని చెప్పాలి . అప్పుడు వారు బ్లాక్ చేసి మనకొక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు . అటుపిమ్మట BSNL Service provider వద్దకు వెళ్లి , వారిచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి , ఆధార్ జిరాక్స్ కాపీ , ఒక ఫోటో ఇచ్చినట్లయితే 10 రూ . లు . తీసుకుని అదే నెంబర్ తో కొత్త 'SIM' ఇస్తారు . సెల్ నెంబర్ బ్లాక్ చేయడం వలన , మన బ్యాలన్స్ కంటిన్యూ అవుతుంది . కాంటాక్ట్స్ , సిమ్ లోని డేటా కంటిన్యూ అవుతుంది . మరెవ్వరూ మన సెల్ నెంబర్ ను మిస్ యూస్ చేయడానికి , మన పైన ఇతరుల కు సంబందించి న కేసులు పడకుండా ఉండడానికి వీలవుతుంది .
07. అలానే Rel.Jio Cell Number అవుతే, Rel.Jio సెల్ నెంబరు నుండే ఫోన్ చేయాలను కుంటే Rel.Jio Service provider టోల్ ఫ్రీ నెంబరు 198 లేదా 199 కు లేదా ఇతర నెట్ వర్క్ ఫోన్ నుండి ఫోన్ చేయాల్సి వస్తే 1800-88-99999 కు ఫోన్ చేసి ,ఆపరేటర్ కనెక్ట్ అయ్యాక బ్లాక్ చేయ మని చెప్పాలి . అటుపిమ్మట Rel.Jio Service provider వద్దకు వెళ్లి , వారిచ్చిన అప్లికేషన్ ఫిల్ చేసి , ఆధార్ జిరాక్స్ కాపీ , ఒక ఫోటో ఇచ్చినట్లయితే ఉచితంగా అదే నెంబర్ తో కొత్త 'SIM' ఇస్తారు . సెల్ నెంబర్ బ్లాక్ చేయడం వలన , మన బ్యాలన్స్ కంటిన్యూ అవుతుంది . కాంటాక్ట్స్ , సిమ్ లోని డేటా కంటిన్యూ అవుతుంది . మరెవ్వరూ మన సెల్ నెంబర్ ను మిస్ యూస్ చేయడానికి , మన పైన ఇతరుల కు సంబందించి న కేసులు పడకుండా ఉండడానికి వీలవుతుంది .
08. ఆ తరువాత వెంటనే మీ సేవద్వారా అన్ని వివరాలతో , పత్రాలతో కంప్లైన్ట్ చేయాలి . దానికి వారు 145/- రూ . లు . ఫీజు తీసుకుని ఒక రసీదు ఇస్తారు . దానిని తీసుకుని వచ్చి మరల , మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి F. I. R బుక్ చేయించాలి . మీ సెల్ కు ఇన్సూరెన్స్ ఉంటే , మీరు సుమారు 75% వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు . లేక పోతే 2 నుండి 6 నెలల లోపు దొరుకుతే పోలీసులే కాల్ చేసి ఇస్తారు. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ లో వాకబ్ చేస్తూ ఉండాలి . చాన్సెస్ మాత్రం 1 తో 5%.
All the best.
www.sollutions2all.blogspot.com
08. ఆ తరువాత వెంటనే మీ సేవద్వారా అన్ని వివరాలతో , పత్రాలతో కంప్లైన్ట్ చేయాలి . దానికి వారు 145/- రూ . లు . ఫీజు తీసుకుని ఒక రసీదు ఇస్తారు . దానిని తీసుకుని వచ్చి మరల , మీకు దగ్గర లోని పోలీస్ స్టేషన్ లో ఇచ్చి F. I. R బుక్ చేయించాలి . మీ సెల్ కు ఇన్సూరెన్స్ ఉంటే , మీరు సుమారు 75% వరకు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు . లేక పోతే 2 నుండి 6 నెలల లోపు దొరుకుతే పోలీసులే కాల్ చేసి ఇస్తారు. అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ లో వాకబ్ చేస్తూ ఉండాలి . చాన్సెస్ మాత్రం 1 తో 5%.
All the best.
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment