ప్ర : వృద్ధాప్య దశలో లేదా ఒంటరి తనంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? వీటిని అధిగమించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏమి చేయాలి ? చివరి దశ వరకు సుఖ మయ జీవనం గడపాలంటే ఏమి చేయాలి ?
జ : ఏ ఉద్యోగం లేని వారికీ వృద్ధాప్య దశ అనగానే కొందరికి భయం మొదలవుతుంది . ఇక ఉద్యోగం చేసే వారికీ రిటైర్మెంట్ దగ్గర పడుతుందంటే భయం మొదలవుతుంది . ఈ భయానికి అనేక మైన కారణాలు ఉన్నాయి . అవి ,
01. అసలు భయానికి ముఖ్య కారణం ఏమంటే " ప్రాణం మీద తీపి " . ఇంకా నేను చాలా కాలం హాయిగా బ్రతకాలి , సంపాదించాలి , సుఖాలు అనుభవించాలి అని అనుకునే " కోరిక". అంతే కాకుండా కొందరికి , నేను సంపాదించిన ఆస్తులు , బంగళాలు , బంగారాలు ఇక్కడే వదిలి పెట్టి పోవాల్సివస్తుంది గదా అనే భయం పట్టుకుంటుంది. మరి కొందరికి , తమ కుటుంబ సభ్యులను వదిలి పెట్టి పోవాల్సి వస్తుందిగదా అన్న భయం ఉంటుంది . ఇంకొందరికి వారి వారి కర్మలను బట్టి స్వర్గానికి పోతానో , నరకానికి పోతానో అక్కడ ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తుందో నాన్న భయం ఉంటుంది.
02. సహజంగానే వయసు మీద పడటం వలన , ఏ పనులు చేసుకోడానికి కూడా శరీరం సహకరించక పోవచ్చు ,
03. వృద్ధాప్య దశలో సంపాదన తగ్గి పోతుంది . ఏ పనీ లేని వారికీ అసలు సంపాదనే ఉండదు ,చేతిలో పని లేక పోవడం , ఇంట్లో ఖాళీగా ఉండటం , డబ్బు సంపాదించ లేక పోవడం వలన , ఇంట్లో వారికీ వీరిపై చులకన భావం ఏర్పడుతుంది. లెక్క చేయరు . తీసి పారేసినట్లుగా మాట్లాడుతారు. ఆ కారణంగా ఆరోగ్యం క్షీణించి పోవచ్చు. అయితే ఇదే విధానం అందరి ఇందులో ఉంటుందని నేను చెప్పలేను. ఉదా: మదర్ థెరిస్సాను , అక్కినేని నాగేశ్వర్ రావు గారిని , ఇంకా బ్రతుకాలనే కోరుకున్నారు. అమితా బచన్ గారిని , వారి కుటుంబ సభ్యులు ఇంకా బ్రతుకాలనే కోరుకుంటారు.
04. ఒంటరి తనం కావచ్చు . భార్య ఉండి , భర్త లేక పోవడం , భర్త ఉండి భార్య లేక పోవడం , పిల్లలు లేక పోవడం లేదా దూర దేశాలలో ఉండటం , అందరు వున్నా లేమి వలన , బంధు మిత్రులు దగ్గరికి రానివ్వక పోవడం వలన ఒంటరిగా ఫీల్ కావాల్సి రావచ్చు ,
05. వయసు మీద పడుతున్న కొలది , శరీరంలో రోగ నిరోధక శక్తి (RESISTANCE POWER) తగ్గి పోయి , రోగాలు , జబ్బులు బయట పడుతుంటాయి . బావిలో నీరు తగ్గి పోయినపుడు , రాళ్లు , రప్పలు , పెంకాసులు , సీసపు ముక్కలు , మట్టి కనపడ్డట్లు , అప్పటి వరకు దాగి ఉన్న , జబ్బులన్నీ , ఒక్కొక్కటిగా బయట పడుతుంటాయి ,
06. అప్పుల భాదలు , భాద్యతలు , సంపాదన తక్కువ అవడం , అయినా వారు ఒక్కొక్కరు దూరమవడం వలన ( బెల్లం ఉన్నంత కాలమే ఈగలు చుట్టుముడుతాయి) , మానసిక రందులు పెరుగుతాయి ,
07. వీటికి తోడు , పిల్లలు చేసిన తప్పుడు పనుల వలననో, స్వ కార్యాల వలన నో, ఆస్తుల తగాదాల వలననో లేదా మరే ఇతర కారణాల వలననో , కోర్టు కేసులలో ఇరుక్కోవడం జరుగుతుంటాయి ,
08. మరి కొందరు పుట్టుక నుండే అంగ వైకల్యులుగానో , పేద తనం లోనో జీవించవల్సి రావడం
పైన చెప్పిన విధంగా , వృద్ధాప్య దశలో ఆర్ధిక ఇబ్బందులు , శారీరక ఇబ్బందులు మానసిక ఇబ్బందులు , ఒంటరి తనం ఇబ్బందులు , అనారోగ్య పర మైన ఇబ్బందులు కలుగుతుంటాయి. వీటిలో కొన్నిటిని తప్పించు కోవచ్చు , మరి కొన్నిటిని తప్పించు కోలేం .
వృద్ధాప్య దశ ను అధిగ మించాలన్నా , ఎక్కువ కాలం జీవించాలన్నా , చివరి దశ వరకు సుఖ మయంగా జీవించాలన్నా , ఎవరికి వారే , వారికీ సాధ్యమైన అవకాశాలను వినియోగించుకుని సుఖమయ జీవితం గడపాలి.
01. వృద్ధ దశకు వచ్చిన వారు గాని లేదా ఇక ఏమి సంపాదించే శక్తి లేని దశకు వచ్చిన వారు గాని ముఖ్యంగా గుర్తుంచు కోవాల్సిన విషయం ఏమంటే , మేము ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులు (అవి అక్రమమో , సక్రమమో, భూములు , భవనాలు , వ్యాపారాలు , డబ్బు , బంగారు నగలు , వజ్ర వైఢూర్యాలు ,డాలర్లు , ధాన్యం మరియు ఇతరములు) అన్నియు మా పిల్లలవే . మా తరాలవే . మేము పోయే టప్పుడు ఏ ఒక్కటి వెంట తీసుకుని పోము . అన్నిటినీ ఇక్కడనే వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది అనే పచ్చి నిజాన్ని , స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. అప్పుడు మీరు పూర్తిగా ఫ్రీ అయి పోతారు.
02. మన మానసిక , శారీరక శక్తి సామర్ధ్యాలను , ఆరోగ్య పరిస్థితులను , కుటుంభం విలువలను , ఆర్ధిక పరిస్థితులను , తరాల మార్పులను అర్ధం చేసుకోవాలి , వాటికనుగుణంగా నడుచు కోవాలి.
03. సాధ్యమైనంత వరకు , పాజిటివ్ గా ఆలోచించాలి . జీవితానుభవాలను గుర్తు కు తెచ్చుకుని కోపాన్ని తగ్గించు కోవాలి . బేసీజలకు పోకూడదు . క్రమ శిక్షణ వలన , ధ్యానం వలన సహనం లభిస్తుంది . కోపం తగ్గుతుంది .ఆ విధంగా గౌరవం పెరుగుతుంది .
04. ప్రతిరోజు తమ స్వభావానికి , అభిరుచులకు తగిన, తమ వృత్తులకు సంభందించిన ఎదో ఒక వ్యాపకాన్ని తప్పనిసరీగా ఎంచుకోవాలి . అది నాలుగు డబ్బులు సంపాదించి పెట్టేదే కావచ్చు లేదా సమాజ / సంఘ సేవా కావచ్చు .
ఉదా :
1. పుస్తక పఠనం కావచ్చు ,
2. రచనలు కావచ్చు ,
3. ఫ్రీ లాన్సర్ కావచ్చు ,
4. ఫొటోగ్రఫీ కావచ్చు ,
05. వాస్తు , జ్యోతిష్యం , సంఖ్యా శాస్త్రం కావచ్చు ,
06. పూజారి తనం కావచ్చు,
07. కిరాణా, బట్టల , హోటల్ , పాన్ షాప్ , మరేదైనా వ్యాపారం కావచ్చు ,
08. అనుభవానికి సంబందించిన అకౌంటింగ్ , మార్కెటింగ్ , కన్సల్టింగ్ , మరేదైనా కావచ్చు ,
09. ఆన్ లైన్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ కావచ్చు ,
10. ఎల్ ఐ సి లాంటి వాటికీ ఏజెన్సీ గా వర్క్ చేసి కమీషన్ సంపాదించ వచ్చు ,
11. షేర్స్ , మ్యూచువల్ ఫండ్స్ , ఫైనాన్స్ వ్యాపారం కావచ్చు ,
12. నటన , మేకప్ మరేదైనా ట్రైనింగ్ కావచ్చు ,
13. సెక్యూరిటీ , వాచ్ మన్ లాంటి మరియు తోటమాలి ఉద్యొగాలు కావచ్చు .
14. మీకు ఇష్టమైన మరేదైనా వ్యాపారం కావచ్చు.
05. సాధ్యమైనంత వరకు ఒంటరిగా జీవించ కుండా చూసుకోవాలి . కుటుంభ సభ్యులతో గాని , మనుమలు మనుమరాండ్లతో గాని , ఎప్పుడూ వారితో సరదాగా , సంతోషంగా కాలం గడుపుతూ ఉండాలి . వారి పుట్టిన రోజులకు , పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలుపుతూ , వారికీ దగ్గరవ్వాలి . శుభకార్యాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి . భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి . మీ అనుభవాలను సద్వినియోగం చేయాలి.
06. బంధువులతో , స్నేహితులతో మంచి స్వభావంతో మాట్లాడుతూ ఉండాలి . సలహాలు ఇవ్వాలి , సలహాలు తీసుకోవాలి. ఎవ్వరు లేక పోతే దేశం లో 130 కోట్ల జనాభా ఉంది . ప్రపంచం మొత్తంలో సుమారుగా 740 కోట్ల జనాభా ఉంది మీరు పరిచయాలు పెంచుకోడానికి . విశాలమైన భూమి ఉంది . మనసుంటే మార్గం ఉంటుంది .
07. ఇంకా ఎదో సాధించాలనే ఆలోచన ( ఇతరులకు , తమకు నష్టం వాటిల్లకుండా ఉంటే పర్వాలేదు) , నా మాటే చెల్లాలనే మొండి పట్టు , నేను చెప్పినట్లే అందరూ వినాలి అనే భావన మనసులోకి రానీయ కూడదు . దీని వలన కుటుంభం సభ్యుల మధ్య ఘర్షణలు పెరిగి వివాదాలు, గొడవలు పెరుగుతాయి. ఈ గొడవలు మానసిక రందులకు దారి తీస్తాయి. ఆ వెంటనే రోగాలకు దారితీస్తాయి . ఆ గొడవలు , రందులు , రోగాలు ఆర్ధిక పరిస్థితులను దిగదారుస్తాయి . ఇవన్నీ మనిషికి సుఖ శాంతులు లేకుండా చేస్తాయి .
08. ఇతరులను మోసం చేయాలని గాని , హింసించాలని గాని , ఎదుటి వారు చెడి పోయేటట్లు చేయాలనే భావన మనసులోకి రాకూడదు . అందరు బాగుండాలి అనే ఆలోచనే మనసులో మెదలాలి .
09. ప్రతి రోజు కొంత దూరం నడుస్తూ ఉండటం , వ్యాయాయం , ధ్యానం చేస్తూ ఉండాలి .
10. ఏ విషయం లోనూ ఎదుటివారిని / ఇతరులను విమర్శించడం అనే దానిని ఒక వ్యాపకంగా పెట్టుకోకూడదు . విమర్శల వలన , ఈ వయస్సులో మీకు లాభం కన్నా , నష్టమే ఎక్కువగా జరుగుతుంది.
11. సరియైన పద్దతిలో ఆహరం తీసుకోవడం , క్రమంగా డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఉండాలి. చిన్న నాటి నుండి మీరు , మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న జబ్బులను , అవి రావడానికి గల కారణాలను , వాటికీ వాడిన మందులను , ఒక క్రమ బద్దంగా డైరీ లో వ్రాసుకుంటూ , వాటినీ రెగ్యులర్ గా అనుసరిస్తున్నట్లయితే , మీ ఇంటికి మీరే ఒక డాక్టర్ .
12. తమ కంటే పెద్ద వారి యొక్క , గొప్పగా జీవించిన వారి యొక్క అనుభవాలను , ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలి.
ఉదా : మహాత్మా గాంధీ , మధర్ థెరిస్సా , డాక్టర్ . అబ్దుల్ కలాం , డాక్టర్ అక్కినేని నాగేశ్వర్ రావు మొదలయిన వారి జీవితాలను చదువాలి . అర్ధం చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకోవాలి .
ఈ విధంగా నడుచుకున్నట్లయితే , చివరి దశ వరకూ సంతోషంగా , ఆనందంగా సుఖ మయ జీవనం గడపవచ్చు . జీవితానికి సార్ధకత చేకూర్చవచ్చు.
మార్గం కృష్ణ మూర్తి.
No comments:
Post a Comment