: డీమానిటైజేషన్ (DEMONETISATION) ( పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ) విజయ వంతం (SUCCESS) అయ్యిందా?
జ : డీమానిటైజేషన్ (DEMONETISATION) ( పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ) విజయ వంతం (GRAND SUCCESS) అయ్యిందనే చెప్పాలి . ఇక దాని తరువాత జరుగ వలిసిన ఆపరేషనే మిగిలి ఉంది .
కొందరు అనుకుంటున్నట్లుగా 'డీమానిటైజేషన్' (DEMONETISATION) ( పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ) ఫేల్ల్యూర్ కాలేదు . అపజయం పాలు కాలేదు. అపహాస్యం కాలేదు. దీని వలన సామాన్య మధ్య తరగతి ప్రజలలో , నల్ల ధనం పై ఎంతటి వ్యతిరేకత ఉందో తెలిసింది . నల్లధనం ఏ రూపం లో ఉంటే , దానిని మార్చు కోలేక పోతారో తెలిసింది . ఏ రూట్లో పోతే నల్లధనాన్ని అరికట్టవచ్చో ప్రభత్వానికి తెలిసింది . దాని పరిణామమే 'ఆధార్ ' లింక్ . నల్లధనాన్ని దక్కించు కోవాలని , ఎలా ప్రయత్నాలు చేస్తారో తెలిసింది . అందుకే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో వేశారు . అవినీతి (CORRUPTION) లేదని గాని , నల్ల ధనం (BLACK MONEY) లేదని గాని , దేశం లో మోసాలు జరగటం లేదని గాని ఎవ్వరూ ఒప్పు కోరు . ఇది అక్షర సత్యం . డీమానిటైజేషన్ (DEMONETISATION) కు సంభందించిన ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు . బ్యాంకింగ్ వ్యవస్థలో వేసిన డబ్బుకు సరియైన లెక్కలు చూపని ఖాతాలను , నిస్వార్ధంగా , నిజాయితీగా, తక్షణమే 100% జప్తు చేసి పెనాలిటీలు వేసి , నిత్యావసర వస్తువుల ధరలు , పన్నుల భారం తగ్గించగలుతే , 'డీమానిటైజేషన్' 100% విజయం సాధించి నట్లే లెక్క .
తేదీ 08.11.2016 నుండి 31.12.2016 వరకు పెద్ద నోట్లయిన రూ . లు . 1,000/- మరియు 500/- నోట్ల రద్దు ప్రక్రియను కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసినదే .
కేంద్ర ప్రభుత్వం , డీమానిటైజేషన్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, నల్లధనాన్ని వెలికి తీయడం , ఉగ్ర వాదాన్ని అరికట్టడం , నకిలీ నోట్లను అరికట్టడం ,వెలికి తీసిన నల్ల ధనాన్ని వినియోగించి , దేశాన్ని అభి వృద్ధి పధం లో నడపడం మొదలగునవి.
అయితే , ఈ డీమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా 3 నుండి 4 లక్షల కోట్ల రూపాయల
నల్ల ధనాన్ని , బ్యాంకింగ్ వ్యవస్థ లోకి రాకుండా బయటనే అరి కట్ట వచ్చు. ఈ ఆదాయం ద్వారా దేశాన్ని వృద్ధి లోకి తీసుకుని రావచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన .
3 రోజుల క్రితం ఆర్బీఐ ( RBI ) వెలువరించిన వార్షిక నివేదిక ప్రకారం, చలామణి లోనుంచి ఉప సంహ రించిన పెద్ద నోట్లయిన 1000, 500 రూపాయల కరెన్సీ నోట్ల విలువ 15.44 లక్షల కోట్ల రూపాయలు . అయితే వాస్తవంగా బ్యాంకింగ్ వ్యవస్థ లో డిపాజిట్ అయిన మొత్తం రద్దయిన పెద్ద నోట్ల విలువ 15.28 లక్షల కోట్ల రూపాయలు . అంటే 16 వేల కోట్ల రూపాయలు డిపాజిట్ జరుగలేదు . దీనిని నల్లధనం గా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం . ఇది పూర్తిగా నల్లధనమా అంటే చెప్పలేని పరిస్థితి .
కేంద్ర ప్రభుత్వం అంచనా వేసినట్లుగా డీమానిటైజేషన్ ప్రక్రియ ద్వారా 3 నుండి 4 లక్షల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని , బ్యాంకింగ్ వ్యవస్థ లోకి రాకుండా ఆగ లేదు . కేవలం 16 వేల రూపాయలు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థ లో డిపాజిట్ కాలేదు. అందుకే డీ మానిటైజేషన్ అపజయం పాలు అయ్యింది అని , ఈ మధ్య ఏ పత్రికను చూసినా ఇదే కనపడుతుంది . దీనికి తోడు మరల పెద్ద నోట్లయిన 2,000 , 500 రూపాయల ప్రింటింగ్ కు , రవాణాకు అయిన ఖర్చు 8 వేల కోట్ల రూపాయలని ప్రభుత్వమే ప్రకటించింది. ఇక మిగిలినది 8 వేల కోట్ల రూపాయలు . బ్యాంకు వెచ్చించిన పని గంటలు , ప్రజలు పడ్డ ఇబ్బందులు , కోర్టు కేసులు , లా & ఆర్డర్ ఇబ్బందులను , ఏ టి ఎం (ATM) లను మరల 2000, 500 నోట్లకు అనుగుణముగా తయారు చేయడానికి అయినా ఖర్చు , ఆర్ధిక రంగం కోల్పోయిన మొత్తం, చిరువ్యాపారుల వ్యాపారాలపై నష్టం మరియు రోజు వారి కూలీల జీవనోపాధిపై దెబ్బ మొదలైన వాటిని పరిగణలోకి తీసుకున్నట్లయితే , ఆ మిగిలిన 8 వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరి పోవు అనేది కొందరు ఆర్ధిక వేత్తల , ఇతరుల వాదన. అందుకే " డీ మానిటైజేషన్ వలన నల్ల ధనాన్ని వెలికి తీయడం అటుంచి , నల్ల ధనాన్ని తెల్ల ధనంగా తెలుపు చేసుకునేందుకు వెసులు బాటు కల్పించిన భారీ ఆర్ధిక కోణంగా " భావించ వచ్చు అని అంటున్నారు . దీనికి తోడు ఇప్పుడు , బ్యాంకులు సర్వీస్ చార్జీలను పెంచడం , పొదుపు పధకాల పై వడ్డీ రేటును 4% నుండి 3.5 % నికి తగ్గించడం, నోట్ల రద్దు తరువాత 2017 జనవరి , మార్చి నాల్గవ త్రైమాసికంలో జి డి పి (GDP=GROSS DOMESTIC PRODUCT)) వృద్ధి రేటు 6.1% కు పడి పోవడం ( 2016 జనవరి - మార్చి నాల్గవ త్రైమాసికంలో జి డి పి (GDP) వృద్ధి రేటు 8%), 2017 ఏప్రిల్ - జూన్ మొదటి త్రైమాసికంలో జి డి పి (GDP) వృద్ధి రేటు 5.7% కి పడి పోవడం మొదలైన వాటిని పరిగణలోకి తీసుకుంటే కొందరు ఆర్ధిక వేత్తల , సామజిక శాస్త్ర వేత్తల విమర్శనలను ఇప్పటికిప్పుడు తప్పు పట్ట లేము .
ఏది ఏమైనా ఆర్ధిక వేత్తలు , సామజిక శాస్త్ర వేత్తలు జి డి పి (GDP) గత చరిత్రను మరిచి పోకూడదు .
2001-02 లో జి డి పి (GDP) 5. 81%
2002-03 లో జి డి పి (GDP) 3. 84%
2003-04 లో జి డి పి (GDP) 8. 52%
2004-05 లో జి డి పి (GDP) 7. 47%
2005-06 లో జి డి పి (GDP) 9. 48%
2006-07 లో జి డి పి (GDP) 9. 57%
2007-08 లో జి డి పి (GDP) 9. 32%
2008-09 లో జి డి పి (GDP) 6. 72%
2009-10 లో జి డి పి (GDP) 8. 59%
2010-11 లో జి డి పి (GDP) 8. 91%
2011-12 లో జి డి పి (GDP) 6. 69%
2012-13 లో జి డి పి (GDP) 4. 47%
(Source: www.statisticstimes.com)
అయితే సరియైన ఆధారాలు కెళ్లెదురుగా కనబడుతున్నపుడు ప్రజలను ప్రక్క దరి పట్టించడం , మార్కెట్లను బెంబేలు కొట్టించాల్సిన అవసరం లేదనుకుంటాను . కేవలం సైక్లోన్ వస్తేనే , దాని నుండి కోలుకోడానికి కనీసం 2 నుండి 3 నెలల సమయం పడుతుంది . ఒక్కో సారి అంత కంటే ఎక్కువనే పట్ట వచ్చు . అలాంటిది దేశాన్నే కుదిపేసిన ' డీమానిటైజేషన్ ' నుండి కోలుకోడానికి కొంత కాలం పట్ట వచ్చు .
ఈ కొద్దీ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి , వ్యవసాయ ఉత్పత్తి మరియు అసంఘటిత వ్యాపారాలు తగ్గడం వలన సాధారణంగా 'జి డి పి' మరియు అన్ని రకాల ఇండెక్స్ తగ్గు మొఖం పడుతాయి . ఇది కొంత కాలం సహజం అనుకుంటి బాగుటుంది . 'జి డి పి ' తగ్గినంత మాత్రం ఇప్పటికిపుడే వచ్చిన సంక్షోభం ఎక్కడా కనబడటం లేదు . ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది . ఏ బంగారం షాపులలో చూసినా , ఏ సెల్ ఫోన్ షాపులలో చుసిన , ఏ ఆటోమొబైల్ షాపులో చూసినా , ఏ వస్త్రాల షాపులలో చూసినా , ఏ డీ మార్తులలో చూసినా విపరీత మైన జనం ఎగబడి కొంటున్నారు . ఇది ప్రాక్టికల్ . ఇది ఆర్ధిక వ్యవస్థకు శుభ పరిణామం . ద్రవ్యోల్భణం అదుపులో ఉంది . నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యంగా ఉన్నాయి . ఒక్క పెట్రోలియం రేట్లు పెరుగుతున్నాయి . ప్రజల డబ్బు బ్యాంకులలో పుష్కలంగా ఉంది . అధిక నిల్వలతో బ్యాంకులు కళ కళ లాడుతున్నాయి . ఫారెక్స్ నిల్వలు అదుపులో ఉన్నాయి . 'డీమానిటైజేషన్' కు తోడు 'జి ఎస్ టి' పుణ్యమా అని ప్రత్యక్ష పన్నులు , పరోక్ష పన్నులు అంచనాకు మించి జమ అవుతున్నాయి . ' ఆర్ బి ఐ ' రేపో రేట్ తగ్గించడం వలన , బ్యాంకులు కూడా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాయి . ఇలా అనేక మైన శుభ పరిణామాలతో కూడిన ఆర్ధిక వ్యవస్థ ఉండగా , సహేతుకమైన కారణాలు ఉన్నపుడు కొద్దీ కాలం ' జి డి పి ' 1 -2 % తగ్గడంవలన , కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం , ప్రజలను , మార్కెట్లను బెంబేలెత్తించడం సరి కాదనుకుంటాను . మంచి పనులను సమర్ధించాలి . సపోర్ట్ ఇవ్వాలి , సలహాలు ఇవ్వాలి , ప్రోత్స హించాలి .
అయితే , ఈ 'డీమానిటైజేషన్' (DEMONETISATION) విమర్శించే మేధావులు , ఆర్ధిక వేత్తలు ఒక్క విషయం గమనించాలి .
01. మరో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి , బ్రతికుంటే బలిసాకైనా తిని బ్రతక వచ్చని , బ్యాంకుల్లో దాచేస్తే , రేపు ఎలాగో తీసు కోవచ్చని కొందరు అవినీతి పరులు , నల్లధన కుబేరులు , రక రకాల చిత్ర విచిత్రాల విధానాలలో మరియు బినామీ పేర్లపై డిపాజిట్ చేసి , పని అయి పోయిందని అనుకున్నారు . అను కుంటున్నారు . నల్లధనము అయినంత మాత్రాన , అది చెల్లుబాటు కాని ధనం కాదు . ఇది గుర్తించాలి . ఎన్నో రోజుల నుండి కూడా బెట్టుకున్న ధనం కదా . వారికీ ఎన్ క్యాష్ చేసుకోడానికి , వేరే ఆల్టర్ నేటివ్ కనబడక బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ చేశారు . దీనికి కేంద్ర ప్రభుత్వం అపజయం పాలయిందని అనడం సరికాదు . వారు అన్నట్లుగా నల్లధనం కేవలం నగదు రూపంలోనే లేదు . రియలెస్టేట్ రూపంలో , బంగారం , వెండి , వజ్రాల రూపంలో , విదేశాలలో పెట్టుబడుల రూపంలో , బినామీల పేర్ల మీద , పరిశ్రమల పెట్టుబడుల రూపంలో , పొదుపు పథకాలలో , ఇన్సూరెన్స్ పాలసీలలో , షేర్లు మ్యూచువల్ ఫండ్స్ లలో , ట్రస్టులలో , చిట్ ఫండ్ల రూపం లో , ప్రయివేటు వ్యక్తుల వద్ద వడ్డీల రూపంలో అనేక రూపాలలో ఉంది . ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియదనుకోవడం సరి కాదు .
02. వాస్తవంగా చూస్తే , బ్యాంకింగ్ వ్యవస్థ లో పూర్తిగా డిపాజిట్స్ చేయడం ప్రభుత్వానికి వరం లాంటిదే . నల్ల కుబేరులకు శాపం లాంటిది . ఎలాగంటే , చలామణిలో ఉన్న పెద్ద నోట్ల మొత్తం నగదు బ్యాంకింగ్ వ్యవస్థ లోకి చేరడం వలన , ఆ మొత్తం డబ్బును తక్షణమే సద్వినియోగం చేసుకోడానికి వీలు కలిగింది . మరల దానికి సమానంగా కరెన్సీని ముద్రించాల్సిన అవసరం , ఖర్చు తప్పింది . సమయం అయ్యింది .
03. ఆ కారణంగానే ఆర్బీఐ (RBI) రెపోరేటును తగ్గించడం , తదునుగుణంగానే బ్యాంకులు ప్రజలకు ఇచ్చే రుణాల రేట్లను తగ్గించ డానికి వీలు కలిగింది .
04. అధిక నగదు నిల్వలతో , అధిక బ్యాంకు చార్జీలతో , సర్వీస్ చార్జీల వడ్డనతో బ్యాంకులు కళ కళ లాడుతున్నాయి .
05. ఎలుకల బోను లోకి ఎలుకలు పోవడమే కానీ బయటకు రావడం కష్టం అన్నట్లు , నల్ల కుబేరులు , అవినీతి పరులు డబ్బులు డిపాజిట్ చేయ గలిగారే గాని , అంత సులువుగా తీసుకోలేక పోతున్నారు . తీసు కోలేరు కూడా . ఇలాంటి అకౌంట్లను సుమారుగా లక్ష అకౌంట్లను గుర్తించి నట్లు ప్రభత్వం చెబుతుంది . ఎక్కడో ఒక చోట బ్యాంకు అధికారుల అండతో , రాజ కీయ పలుకు బడితో కొందరు డ్రా చేయ గలుగుతూ ఉండ వచ్చు .
06. నల్ల డబ్బును , బ్యాంకులో జమ చేయలేక పోయినా లేదా చేయక పోయినా , వారు హాయిగా వారి పనులు చేసుకుంటూ జీవనం సాగించ గలిగే వారు . ఇప్పుడు ఆ అవకాశం ఉండక పోవచ్చు . బ్యాంకింగ్ వ్యవస్థ లో డబ్బును పూర్తిగా డిపాజిట్ చేయడం వలన , కేంద్ర ప్రభత్వం విజయ వంతం ( SUCCESS) అయ్యిందనే చెప్పాలి .
07. బ్యాంకుల్లో అన్ని డిపాజిట్లు , విత్డ్రాయల్స్ తేదీలతో సహా పక్కాగా రికార్డు అయి ఉన్నాయి . ఎంత మొత్తం డబ్బు డిపాజిట్ అయ్యిందో పూర్తి వివరాలతో ప్రతి నెలా ఆర్బీఐ (RBI) కి వెళ్లి పోతుంటుంది .
08. ఎవరు బినామీ , బినామీ అకౌంట్లు ఏవో గుర్తించ గలుగుతున్నారు .
09. అందులో భాగంగానే , ఇన్కమ్ టాక్స్ రిటర్న్లలో కూడా నవంబర్ 8 , 2016 నుండి 31 డిసెంబర్ ,2016 కాలంలో , రద్దయిన నోట్ల విలువ 2 లక్షలు దాటితే అందులో చూపాలని నిబంధన పెట్టారు . అక్కడ నిజం చెబుతారా , అబద్దం చెబుతారా తేలిపోతుంది .
10. అందులో భాగంగానే , ఇప్పడు కేంద్ర ప్రభుత్వం , అట్టడుగునుండి ( FROM THE GRASS ROOTS) సిస్టమ్స్ ను అభివృద్ధి చేస్తున్నది . అవి ,
i) ప్రతి ఒక్కరికీ ఆధార్ నెంబర్ ఒకటే ఉంటుందని , విశ్వసనీయమైనదని గుర్తించడం . ఇది గొప్ప మార్పు . ( గత ఎన్నో సం . రాల నుండి , ఇదే సోషల్ మీడియా ద్వారా ఆధార్ ను లింక్ చేయాలంటే , ఎవరూ నమ్మలేదు , పట్టించు కోలేదు ).
ii) అన్ని పొదుపు పథకాలకు అనగా బ్యాంకు అకౌంట్లకు , ఇన్సూరెన్స్ పాలసీలకు , షేర్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్ కు ఆధార్ నంబరును లింక్ చేయాలని నిబంధన పెట్టడం .
iii) పాన్ కు ఆధార్ నంబరును లింకు చేయాలనీ నిబంధన పెట్టడడం . ఒక వేల లింక్ చేయక పోతే , ఐ .టి . రిటర్న్స్ ఫైల్ చేసినా , చేయనట్లే అని చెప్పడం , 5000 రూపాయలు జరిమానా విధించడం. తాజాగా 31 డిసెంబర్, 2017 వరకు ఆధార్ కు లింక్ చేయడానికి అవకాశం కల్పించింది .
iv) అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ నెంబరును లింక్ చేయడం .
v ) జి ఎస్ టి (GST) విధానాన్ని జులై 1, 2017 నుండి పకడ్బందీగా అమలు చేయడం , దీనికి ఆధార్ నెంబర్ ను పాన్ నెంబర్ ను లింక్ చేయడం , ప్రతి రిటర్నును , డిజిటల్ సిగ్నేచర్ తో లాగిన్ అవ్వడం ,
vi) ఎవరి బ్యాంకు ఖాతాలో ఎంత డబ్బు ఉంది , ఎప్పటికప్పుడు బ్యాంకులనుండి రిపోర్టులు తీసుకుని , అను మానిత ఖాతాల వారికీ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు పంపడం,
vii) మూలం లోనే టి డి ఎస్ ను లేదా టి సి ఎస్ ను డిడక్ట్ చేయాలని నిబంధన పెట్టడం , ఎవరికైనా 10 రూపాయలు టి డి ఎస్ కనిపించినా వారి కి నోటీసులు పంపి ఇన్కమ్ టాక్స్ రిటర్నులు ఫైల్ చేసే విధంగా , వారిని దారికి తీసుకుని రావడం , పన్నుల అధికారులను , పన్నులు చెల్లించే వారితో కలువకు నీయక పోవడం , నిజాయితీగా పన్ను చెల్లించే వారిని వేదించకుండా చర్యలు చేపట్టడం ,
viii) నోటీసులకు స్పందించని వారి ఖాతాలను స్పందింప చేయడం , చర్యలు తీసుకోవడం ,
iX) బినామీ అకౌంట్లను గుర్తించ గలగడం , వారి అసలు కుబేరులు ఎవరో గుర్తించ ప్రయత్నం చేయడం , బినామీలను కట్టడి చేయ బినామీ చట్టాన్ని పాస్ చేయడం మొదలైన అనేకమైన చర్యలను మనం చూస్తున్నాం .
X) నగదు చలామణిని కట్టడి చేయ డానికి , నిభందనలను విధించడం కూడా ఇందులోని భాగమే .
కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం , ఇక మరి కొన్ని నెలల్లో , డీమానిటైజేషన్ విజయమా , అపజయమో చూడ వచ్చు .
అయితే , డీమానిటైజేషన్ సంపూర్ణంగా విజయ వంతం కావాలంటే , ఈ క్రింది చర్యలపై దృష్టి సారించాలి :
01) మన వారు బయటి వారు అని చూడ కుండా , రాజ కీయ పలుకుబడిని చూడ కుండా , నిస్పక్ష పాతంగా , నిస్వార్ధంగా , నిజాయితీగా , ట్రాన్స్పరెంట్ గా చర్యలు తీసు కోవాలి .
02) డీమానిటైజేషన్ వలన సమకూరే ఫలాలు , పేద మధ్య తరగతి ప్రజలకు ప్రత్యక్షంగాను , పరోక్షంగానూ తక్షణమే చేరాలి .
03) పొదుపు ఖాతాలపై వడ్డీని 20 లక్ష ల లోపు వారికీ 3.5% నుండి 4% కు పెంచాలి . అలానే 20 లక్షల పై నిల్వల వారికీ 3.5% గా నిర్ణ యించాలి . ఇతర టర్మ్ డిపాజిట్లపై గతంలోని వడ్డీలనే కోన సాగించాలి . సేవింగ్ అకౌంట్లపై వడ్డీని ప్రతి 3 నెలల కొక సారి చెల్లించాలి .
04) అవి నీతి సొమ్ము అని , నల్ల ధనం అని తేలిన తరువాత , వారి వద్దనుండి 100% డబ్బును జప్తు చేయాలి . అంతే గాని 30% పన్ను , 40% పన్ను అని వసూలు చేయరాదు .
05. చట్టం ముందు అందరూ సమానులే అనే భావనను ప్రజలలో కలిగించాలి .
06. నల్ల ధనానికి సంభందించిన కేసులను ప్రత్యేక కోర్టులలో , కేవలం 90 రోజులలో పూర్తి చేసే విధంగా నిర్ధేశించాలి .
07) నల్ల ధన కుబేరుల , అవినీతి పరులకు వేసే శిక్షల ద్వారా , సామాన్య ప్రజలలో భయాన్ని కల్పించాలి , మార్పును తీసుకుని రాగల్గాలి గాని , అమాయకంగా ఉన్నారని ముందుగానే పేద మధ్య తరగతి ప్రజలపై చర్యలు తీసుకోరాదు .
08) ఒక వ్యక్తి కి ఒకే బ్యాంక్ అకౌంట్ నెంబర్ , ఒకే సెల్ నెంబర్ ఉండే విధంగా నిబంధన చేయాలి . పోర్ట్ బుల్ అవకాశాలుండాలి .
09) ఆధార్ నెంబర్ నే , సెల్ నెంబర్ గా మార్చాలి .
10) పుట్టిన 21 రోజులకే , ప్రతి ఒక్కరికి 'బర్త్ సర్టిఫికెట్' లాగ 'పాన్ కార్డు' ను జారీ చేయాలి . ప్రతి పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేయాలి .
11. ట్రస్టులను (TRUSTS), ఎఫ్ డి ఐ (FDI) లను , గుడులు గోపురాల నిధులను పూర్తి నియంత్రణలో ఉంచాలి .
12. ప్రతి ఇంచు భూమిని రిజిస్టర్ చేయాలి . అన్ లైన్లో ఉంచాలి . అది నివాస భూమి అయినా , వ్యవసాయ భూమి అయినా రిజిస్టర్ చేసి బినామీలను గుర్తించి చర్యలు తీసుకోవాలి . ప్రతి రిజిస్ట్రేషన్ కు ఆధార్ (AADHAR) , పాన్ (PAN) మరియు సెల్ నెంబర్ (CELL NUMBER) ను లింక్ చేయాలి .
13. విదేశాల లోని మన వారి వ్యాపారాలపై , బ్యాంకు ఖాతాలపై నియంత్రణ ఉంచాలి . విదేశాల లోని నల్ల డబ్బును వెల్లడించాలి , రికవరీ చేయాలి .
15. గతంలో ప్రకటించిన బంగారు నిల్వల నిబంధనలను అమలు చేయాలి .
16. పన్నులను ఆదాయాన్ని బట్టి మాత్రమే కాకుండా , ఖర్చును బట్టి కూడా వేయాలి .
17. 25 లక్షల నికరాదాయం , ఐ . టి రిటర్నుల లో చూపి పన్నులు కట్టిన వారిని , సంపన్నులుగా భావించి , అన్ని సంక్షేమ పధకాలు రద్దు చేయాలి . వీటన్నిటికీ సిస్టమ్స్ నే అభివృద్ధి చేయాలి .
18. ప్రభత్వ వినూతనమైన , విప్లవాత్మకమైన 'డీమానిటైజేషన్' మరియు ' జి ఎస్ టి ' లాంటి విధానాల వలన సమకూరిన డబ్బుపై పూర్తి నియంత్రణ ఉండాలి . దానిని తక్షణమే అభివృద్ధికి , నిత్యావసరాల ధరలను , పేద మధ్య తరగతి పై పన్నుల భారాన్ని తగ్గించడానికి ఉపయోగ పడాలి .
19. లోక్ పాల్ బిల్లును పాస్ చేయాలి . దీనిని( రాష్ట్రపతికి మినహాయించి) అందరికీ వర్తింప చేయాలి .
అప్పుడే 'డీమానిటైజేషన్ ' సంపూర్ణంగా విజయ వంతం అయ్యిందని చెప్పాలి .
www.sollutins2all.blogspot.com
ఏది ఏమైనా ఆర్ధిక వేత్తలు , సామజిక శాస్త్ర వేత్తలు జి డి పి (GDP) గత చరిత్రను మరిచి పోకూడదు .
2001-02 లో జి డి పి (GDP) 5. 81%
2002-03 లో జి డి పి (GDP) 3. 84%
2003-04 లో జి డి పి (GDP) 8. 52%
2004-05 లో జి డి పి (GDP) 7. 47%
2005-06 లో జి డి పి (GDP) 9. 48%
2006-07 లో జి డి పి (GDP) 9. 57%
2007-08 లో జి డి పి (GDP) 9. 32%
2008-09 లో జి డి పి (GDP) 6. 72%
2009-10 లో జి డి పి (GDP) 8. 59%
2010-11 లో జి డి పి (GDP) 8. 91%
2011-12 లో జి డి పి (GDP) 6. 69%
2012-13 లో జి డి పి (GDP) 4. 47%
2013-14 లో జి డి పి (GDP) 4. 74%

No comments:
Post a Comment