*సమస్యలు-పరిష్కారాలు*
అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగి గానే ఉంటే , మీ మీ నక్షత్రాల ప్రకారం ఓ పది మొక్కలను నాటి జాగ్రత్తగా పెంచి పోషించండి. అవి ఫలాలు అందించే లోపు మీకు ఉద్యోగం రావచ్చు. లేదా మీ టాలెంట్ ప్రకారం ,మీకు నచ్చిన బిజినెస్ ఎంచుకోవాలి.
ఏదైనా కార్యాలయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే , క్రమ శిక్షణ తో , సమయపాలన తో ,ఎవరిపైనా చాడీలు చెప్పకుండా ,మీ పని మీరు చేసుకుంటూ , వీలయితే తోటి వారికి సహాయం చేస్తూ , తోటి వారితో సరదాగా ఉంటే ,ఏ సమస్యలు ఉండవు.
ఆ కారణంగా అవమానాల పాలు అవుతున్న వారు , ఇతరుల గురించి పట్టించు కోకుండా ,ఇతరులపై ఈర్ష్య , అసూయలు పెంచుకో కుండా , ఎవరికీ హాని చేయకుండా ,మనవి కాని వాటిపై ఆశలు పెంచు కోకుండా ఉంటే అవమానాలు మన దరి చేరవు.
దాయాదుల తో ఆస్తి తగువులు ఉన్నవారు , మన వెంటరాని ఆస్తులపై అత్యాశలు పెంచుకో కుండా , అనవసరంగా కోర్టులకు వెళ్ళకుండా, సామరస్యంగా పరిష్కరించుకుంటే ,ఏ తగవులు ఉండవు. చీమలకు పంచదార పోయండి.
సంతానం విషయంలో విచారం ఉన్నవారు , చుట్టుపక్కల ఉన్న పిల్లలను ప్రేమగా చూసుకుంటూ, ప్రతి నెలా మీకు వీలైన రోజు , అనాధ పిల్లల హాస్టల్ కు వెళ్లి, మీకు చేతనైన ఆహారం, పండ్లు ఫలాలు, పుస్తకాలు, పెన్నులు, బట్టలు పంచండి. వీలయితే కొంతకాలం కొరకు పిల్లలను దత్తత తీసుకోండి. చుట్టు పక్కల పిల్లలకు సేవలు చేయండి.
ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్ల ఉంటే వారంలో ఒక రోజు నానబెట్టిన గోధుమలలో బెల్లం కలిపి ఆవులకు పెట్టండి. ప్రతి రోజూ మొక్కలకు నీరు పోయాలి. నిత్యం ఇష్టమైన దేవుళ్ళకు పూజలు చేయాలి. కుటుంబ సభ్యులకు సేవ చేయాలి.
భూ వివాదాలు ఏర్పడినప్పుడు మన వెంటరాని భూముల గురించి తాపత్రయ పడకుండా, ఊరికే వచ్చే ఆస్తులపై, మోసం సొమ్ము తో కొన్న భూములపై అత్యాశలు పెంచుకో కుండా , కక్షలకు , ప్రతీకారాలు కూ పోకుండా , చెప్పుడు మాటలు వినకుండా, చట్ట ప్రకారం కలిసి మాట్లాడు కుంటే ఏ సమస్యా ఉండదు.
ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు , ఇంటి చుట్టూ మొక్కలను పెంచి , ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతూ, అందరితో కలుపు గోలుగా ,ప్రేమగా ఉండండి. ఇంట్లో కొంతకాలం నుండి వాడని ఏ వస్తువులు ఉన్నా ,పాత బట్టలు ఉన్నా పేదలకు ఉచితంగా పంచండి. అలానే ధరపై కూడా లిబరల్ గా ఉంటే ఇల్లు త్వరగా అమ్ముడు పోతుంది.
రహస్య శత్రువులు ఉన్నవారు , ఒకరిపై మరొకరికి షికాయితలు చేయకుండా, ఎవరిపైనా ఈర్ష్యా అసూయ పెంచుకో కుండా, ప్రశాంతంగా, మనకు సంబంధం లేని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ,తమపని తాము చేసుకుంటూ, అందరితో సరదాగా ఉంటూ ,సమాజ సేవ చేస్తూ ఉంటే ఇక రహస్య శత్రువులు ఉండరు.
పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలాన్ని చక్కగా దున్ని , సరియైన విత్తనాలు వేస్తూ , సేంద్రియ ఎరువులను వాడుతూ, క్రిమి కీటకాలకు తగిన మందులు వాడుతూ , కలుపు మొక్కలు తొలగిస్తూ , తగిన శ్రద్ధ తీసుకోవాలి. భూసార పరీక్షలు చేయించి ,ఆ భూమి ఏపంటకు ఉపయోగపడుతుందో ,ఆ పంటనే వేయాలి. అప్పుడు ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది.
చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే , ఈశాన్యం వైపున , తులసి మొక్కలను ,ఎరుపు మొక్కలను పెంచాలి.
ఎవరిపైనా ఈర్ష్యా అసూయలు పెంచుకో కుండా, ఈ ఏరియాలో మేమే గొప్ప అనే అహంకారం పెంచుకో కుండా , గోడకాడ, వాకిలి కాడ , కొద్దిగా సర్దుబాటు తో ఉంటూ , చేతనైనంత సహాయం చేస్తూ , అందరితో కలుపు గోలుగా ఉంటే , చుట్టు పక్కల వారితో ఎలాంటి సమస్యా ఉండదు.
అధికమైన రుణ బాధలతో మీరు బాధ పడుతూ ఉంటే , గొప్పలకు పోకుండా, ఖర్చులు తగ్గించుకుని , కష్టపడి పనిచేస్తూ , సంపాదించిన డబ్బును, కొద్ది కొద్దిగా తీరుస్తూ, ఎవరికి మోసం చేయకుండా , నిజాయితీ గా ఉంటూ , అందరితో ముఖ్యంగా అప్పుల వారితో ప్రేమగా ఉంటే ఋణ బాధ తగ్గవచ్చు.
మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే , మనకు అవకాశం ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజాయితీ గా కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాలి. మోసం చేసి సంపాదిస్తే ,ఏదో ఒకరోజు అవమానాల పాలో ,జైలు పాలో , ఎన్కౌంటరో కావాల్సి వస్తుంది. మీరు చేయదలుచుకుంటే వందల పనులు ఉన్నాయి. సంపాదించ దలుచుకుంటే వందల అవకాశాలు ఉన్నాయి. సంపాదనకు వయసుతో పనిలేదు. అమితాబచన్ నేటికి సంపాదిస్తూనే ఉన్నాడు. డాక్టర్.అబ్దుల్ కలాం, చనిపోయినా పేటెంట్స్ ద్వారా సంపాదిస్తూ నే ఉన్నాడు. ఎవరి స్వభావానికి ,తగిన పనులు వారు ఎంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. గొప్పలకు పోకూడదు. రెగ్యులర్ గా పొదుపు చేస్తూ ఉండాలి. డబ్బే డబ్బును సంపాదించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.
అకారణ వివాదాల్లో ఇరుక్కుని ఉంటే , సమాజానికి ఉపయోగపడే సేవల్లో పాలు పంచుకోండి. కరోనా గురించి ప్రచారం చేయండి. అందరితో ప్రేమగా ఉండండి.
చదువులో వెనక పడి పోతుంటే ,మీరు రోజు మెడిటేషన్ చేయండి. మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. చెడు స్నేహాలను ,చెడు అలవాట్లను శాశ్వతంగా విడనాడాలి. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. చేతనైన సహాయం ఇంట్లో చేయండి. ప్రశాంతంగా కూర్చొని మనసుపెట్టి, ఇష్టంగా, నేర్చుకోవాలనే తపనతో చదవండి. మనసులో చదివింది విశ్లేషించండి. శాశ్వతంగా గుర్తుండి పోతుంది. చదువులో ఫస్ట్ ఉంటారు.
మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే , మరోసారి తప్పు చేయను ,మీకు ఎలాంటి హాని చేయను, నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను ,మీకు ఇవ్వాల్సింది త్వరలో ఇస్తాను అని దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరండి.
మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే , మీకు దానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
అర్హతలు పెంచుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి.
No comments:
Post a Comment