Friday, December 1, 2023

బర్రెలక్క కొరకు దేశ విదేశాల మేధావుల స్పందనకు కారణాలేమిటి?

బర్రెలక్క/ Barrelakka దేశ విదేశాలలోని మానవతా వాదులు, మేధావులు , లాయర్లు, నెటిజన్లు బర్రెలక్క (శిరీష) లో ఏమి చూసి, ఎందుకు ఇంత భారీగా స్పందిస్తున్నారనేది , ఒక సారి పరిశీలిస్తే, ఆమే కులం చూసి కాదు. ఆమే మతం చూసి కాదు. ఆమే ఆడ పిల్ల అని కాదు. ఆమే పేద రాలు , డబ్బు లేదు ఇల్లు లేదు అని కాదు. ఆమే చిన్న వయసు అని కాదు. ఆమే చదువు కున్నదని కాదు. ఆమెకు ఉద్యోగం రాలేదని కాదు.ఇవన్నీ చివరి అంశాలు. బర్రెలక్క లో నెటిజన్లు, మానవతా వాదులు, మేధావులు చూసి స్పందిస్తున్నది ముఖ్యంగా; 01. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, దేశంలో నియంతృత్వ పాలనలు, పేదరికం పోకపోవడం. సమానత్వం లేక పోవడం. రాజ్యాంగం, చట్టాలు బలంగా ఉన్నా అవి అమలు కాక పోవడం మొదటి దైతే. 02. బర్రెలక్క ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం 03. బర్రెలక్క లో ధైర్యం, పట్టుదల 04. బర్రెలక్క లో పోరాట పటిమ ఉండటం 05. బర్రెలక్కలో సాధించే శక్తి ఉందని గ్రహించడం 06. బర్రెలక్క లో చురుకు తనం,కలుపుగోలుతనం 07. బర్రెలక్క లో ముక్కుసూటి తనం ,చతురత 08. బర్రెలక్క ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే మేధా శక్తి ఉండటం. అది కూడా ఒక పేపర్ లేకుండా, ఎవరి సలహాలు, సూచనలు లేకుండా 09. బర్రెలక్క లో అనంతమైన ఏదో ఒక ''సిక్స్ సెన్స్" ఉందని,పేద ప్రజలకు ప్రతినిధి అవుతుందని గ్రహించడం 10. బర్రెలక్కకు దేశం, రాష్ట్రాల ప్రజా సమస్యలపై ప్రాధమిక అవగాహన ఉండటం 11. బర్రెలక్క మాటలలో అబద్దాలు, తడబాటు తనం లేక పోవడం 12. బర్రెలక్క లో కించిత్తు గర్వం కనిపించక పోవడం 13. బర్రెలక్క లో అమాయకత్వం ఉండటం 14. బర్రెలక్క లో ఇతర నిరుద్యోగుల, పేదల సమస్యలు తీర్చాలనే మానవతా దృక్పథం ఉండడం. 15. వ్యవ‌స్థల లోపాలను ఎత్తి చూపాలనే తపన కలిగి ఉండటం. 16. ఇలాగ నిర్భయంగా ఎదిరించే, మాట్లాడే యువతీ యువకులు రాజకీయాల్లోకి రావాలని మేధావులు కోరుకోవడం ఆ తర్వాత నే మొదట "కాదు" అని చెప్పిన అంశాలు వచ్చి చేరినాయి ఈ అంశాలే నెటిజన్లను, మానవతా వాదులను, మేధావులను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి లక్షణాలు/ అంశాలు ఎవరిలో ఉన్నను మానవతా వాదులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, నెటిజన్లు తప్పకుండా స్పందిస్తారు ఇలాంటి యువతీ యువకులను ప్రోత్సహించాల్సిన భాద్యత మనందరిపైనా ఉంది. దేశ సంపదను వికేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments: