Saturday, April 27, 2024

ఈ తేడాలెందుకో (WHY THESE DIFFERENCES)

 వచన కవిత

శీర్షిక: "ఈ తేడాలెందుకో"


దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా ప్రజా పాలనలో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
ధనికులకు చట్టాల వలన సుఖాలు
పేదలకు చట్టాల వలన కష్టాలు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా కుటుంబ నియంత్రణ
కొందరికి
కుటుంబ నియంత్రణ
నిషిద్దం మరికొందరికి
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా రిజర్వేషన్లు కొందరికి
రిజర్వేషన్లు ఉండవు మరికొందరికి
ఈ తేడా లెందుకో!

దేశం ఓకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా చిల్లర 
ఆర్ధిక నేరస్థులు జైలులో
ఘరాన
ఆర్ధిక మోసగాళ్ళు ఏ.సి.లలో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతల, అధికారుల
పిల్లలు ప్రయివేట్ స్కూల్లో
బీద ప్రజల
పిల్లలు ప్రభుత్వ స్కూల్లో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా  నేతల , అధికారుల
వైద్యం ప్రయివేట్ హాస్పిటల్స్ లో
పేద , మధ్యతరగతి ప్రజల
వైద్యం ప్రభుత్వ హాస్పిటల్స్ లో
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా పాలకులు
హామీలిచ్చి మాటతప్పుతే 
నాయకులు
ప్రజలు
ఓట్లేసి అధికారమిచ్చి ప్రశ్నిస్తే
నేరస్థులు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
గుడులలో
కొందరు హుండీలో సొమ్మును
పంచుకుంటే నేరంకాదు
మరి కొందరు
ఆ ఆదాయాన్ని తీసుకుంటే నేరం
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతలు, అధికారులు
మోసాలు చేస్తే, భూకబ్జాలు చేస్తే నేరం కాదు
పేదలు
పొట్ట కూటి కోసం దొంగిలిస్తే నేరం
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే ,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతల జీత బత్తాలపై
పన్నులు వేయరు
కానీ ఉద్యోగుల జీతభత్యాలపై
పన్నులు వేస్తరు
ఈ తేడాలెందుకో!

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే ,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా లక్షల కోట్లు ఉన్న అవినీతి పరులపై
సంపద పన్ను పెంచరు
యెన్నో మినహాయింపులు
కానీ చిరు ఉద్యోగుల ఆదాయాలపై
అధిక పన్నులు
అనేకమైన ఆంక్షలు
ఈ తేడాలెందుకో !

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
బ్యాంకులు లక్షల కోట్ల అప్పులకు
ఒక్క ప్రశ్న అడుగరు
కానీ, లక్ష రూపాయల అప్పుకు
సవా లక్ష ప్రశ్నలేస్తరు
ఈ తేడాలెందుకో!

దేశం ఒకటే ,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే ,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా నేతలు, అధికారులు, ధనికులు
ఉన్న వారికే పది గృహాలు
కానీ లేని పేద వారికి
ఒక్క గుడిసే ఉండదు
ఈ తేడాలెందుకో !


దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
పేదా మధ్య తరగతి ప్రజలకే
చట్టాలన్నీ వర్తిస్తాయి
నేతలకు, ధనికులకు, బ్యూరోక్రాట్స్ కు
ఏ చట్టాలు వర్తించవు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే,చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
అయినా ప్రతిపక్షాలకు
ఎన్నికల నిబంధనలు వర్తిస్థాయి
పాలకులకు
ఎన్నికల నిబంధనలు వర్తించవు
ఈ తేడా లెందుకో!

దేశం ఒకటే,దైవం ఒకటే
రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే
జనులలో పారే రుధిరం ఒకటే
ధనికులైన 
పేదలైనా
ముసుగు పెట్టుకుని
గుడిసెలో
ముడుసుకుని పడుకున్నా
విమానాలలో విహరిస్తున్నా
వజ్రాల 
పట్టెమంచంపై పవళిస్తున్నా
యముడు
పిలుస్తే
ఎవరైనా పోయేది 
ఒకే చోటుకే
ఈ తేడా లెందుకో!

జరా దేఖో  ప్రైం మినిస్టర్ సాబ్!

No comments: