వచన కవిత
శీర్షిక: ఎన్నికల సంస్కరణలుజనాల మాయ జేయ, జరుగు జగమెల్ల
ఐదేళ్ళ కొకసారి ఎన్నికల జాతర
పిల్లలకు ముద్దులు వనితలకు వందనాలు
అబ్బో! ఉత్త (ర)ఉపన్యాసాల హోరు
ఆపైన డబ్బు పంపకాల జోరు
ఎంతో వినూతనం, మరెంతో ఆర్భాటం
కానీ.. ఫలితం శూన్యం!
విలువైన సమయం, వేల కోట్ల డబ్బు ,
ఉత్పాదకత... అంతా హుష్ కాకి!
అయినా,ఏది పేదలకు ప్రతిఫలం ?
ఎంగిలి మెతుకులు జల్లుతూ,నేతలు
జనాన్ని మార్చే ఓటు బ్యాంకుల్లా
నాయకులు కుబేరులవ,
ప్రజలను చేసే ఉచితాలకు వారసుల
అధికారం పదవులు పోగానే నేతలు
రంగులు మారుస్తారు ఊసరవెల్లుల్లా
ఉనికిని చాటుకోడానికో ఉంపుడు గత్తెల్లా
దోచింది కాపాడుకోడానికి దొడ్డిదారిన
చేరిపోతారు అధికార పార్టీ లో
తుప్పు పట్టిన ఎన్నికలకిపుడు
రావాలి ఎన్నికల సంస్కరణలు
ఆలోచించాలి విజ్ఞులు, ఆపద వీడను
మునుల కాలం కాదిది, శాపం పెట్ట నేతలకు
80 యేండ్ల వృద్ధునికి పదవి కావాలా?
గెలిచే సత్తా లేనపుడు,రెండు చోట్ల పోటా?
ఓటుకు నోటిచ్చి గెలిచిన వాడు పాలకుడా ?
జాలి ఓట్లతో గెలిస్తే, అదీ గెలుపేనా?
ఊసర వెల్లిలా మారే వారికేద్దామా ఓటు?
ఐదేళ్ళ సేవకు పెన్సనా? అదియూ పన్ను లేకుండా!
మార్పు కొరకే ఈ తపన
అసమానతలు తొలగాలని నా ఆలోచన
వెలుగు నివ్వాలి జగతిన
దేశం సాగి పోవాలి ప్రగతి బాటన
****
No comments:
Post a Comment