శీర్శిక: ఇక తనంతే
కోకిల కూసినా
మంచు కురిసినా
ప్రకృతి వికసించినా
పిల్లగాలులు వీచినా
వెన్నెల కాసినా
పరిమళాలు వెదజల్లినా
గులాబీల సువాసన గుప్పుమన్నా
పౌర్ణమి అమావాస్య ఎదురొచ్చినా
తన్మయం చెందు!
సూర్యుడు బగబగ మండినా
ఉరుములు మెరుపులు మెరిసినా
పిడుగులు పడినా
కుంబవర్షం కురిసినా
నదులు పొంగిపొర్లినా
వరదలు పారినా
ఎవరైనా అడ్డుపడినా
అగ్నిగుండంలా మండుతుండు!
నేను నడిచేదే బాట
నేను చెప్పేదే వేదం
నేను చేసేదే న్యాయం
నేను చూసేదే నిజం
నేను వినేదే వాస్తవం
నేను నమ్మేదే సత్యం
నేను అమలు చేసేదే ధర్మం
నాకేంటి
ఈ సమాజంతో సంబందం
నాకేంటి
ఈ కుటుంబతో బంధం
నా జీవితం నా ఇష్టం
ఇదే తన ధోరణి!
వయసు పెరిగినా
బుద్ది పెరుగదు
అనుభవం గడించినా
మనసు మారదు
భూమికి ధూరమైనా
కాటికి దగ్గరైనా
నా దారే రహదారి
ఇదే తన ధోరణి!
అవే వంకర చూపులు
అవే పిచ్చి చేష్టలు
అవే అహంకార మాటలు
అవే అడ్డ దారులు
అవే వితండ వాదాలు
అవే మూఢ నమ్మకాలు
అవే అస్థిర భావాలు
ఇదే తన ధోరణి
ఇక తనంతే!
కలియగంలో ఒక నలక
వ్యవస్థలో ఒక పేలిక
సమాజానికి ఒక మరక
కుటుంబంలో ఒక సుందెలుక
జగతిని కాల్చే నిప్పుకణిక
అంతా దేవునికే ఎరుక
ఇక తనంతే!
ఇదంతా
శరీర స్వభావమా?
లేక హార్మోన్ల ప్రభావమా?
లేక గ్రహాల భ్రమణమా?
లేక సమాజ దుస్వభావమా?
లేక పూర్వ జన్మ కర్మానుసారమా?
అంతా అయోమయం
ఇక తనంతే!
తేది: 14.11.24
శీర్షిక: నిమిత్త మాత్రులం
ఏది యెప్పుడు జరుగుతుందో
యెవరికి తెలుసు
ఏది ఎక్కడ జరుగనుందో
యెవరికి తెలుసు
ఏది ఎలా జరుగనుందో
యెవరికి తెలుసు!
అంతా మనమనుకున్నట్లే జరుగుతే
ఇక దేవుడెందుకు?
మనిషి ఒకటి తలుస్తే
దైవం మరొకటి తలుస్తుందంటారు!
చావు పుట్టుకలు సహజం
పుట్టిన వారు గిట్టక మానరు
గిట్టిన వారు పుట్టక మానరు
ఆయుష్షు ఉన్నంత వరకే
మనిషి భూమ్మీద బ్రతుకుతాడు
ఎన్ని ప్రయత్నాలు చేసినా
వెళ్లి పోతాడు!
మనిషి నడుస్తూ వెలుతుంటాడు
పోటు రాయి తాకి పడిపోతాడు
హాస్పిటల్ లో చేరిపోతాడు
నీవు చూసుకుని నడుస్తే బాగుండు
ముహుర్తం చూసుకుని పోతే బాగుండు
అంటే ప్రమాదం జరుగకుండా
ఉంటుందా ఏమి?
మనిషి దేహాన్ని వదిలాక
వైన్ త్రాగకుండా ఉంటే బాగుండేది
టీ కాఫీలు త్రాగకుండా ఉంటే బాగుండేది
బీడి సిగరెట్లు కాల్చకుండా ఉంటే బాగుండేది
చికెన్ మటన్ తినకుండా ఉంటే బాగుండేది
బిపి షుగర్ వచ్చేది కాదు
క్యాన్సర్ వచ్చేది కాదు
అంటే తిని త్రాగిన వాల్లందరూ
చని పోతున్నారా ఏమి?
అదే నిజమైతే ప్రభుత్వాలు
ఎందుకు నిషేధించడం లేదు
వీటి వలన ఆరోగ్యం చెడుతుందనేది
ప్రజలకు తెలియదనుకోవాలా
జనులకు బ్రతకాలని లేదనుకోవాలా
చావుకోరుకుని తింటున్నారనీ
త్రాగుతున్నారనీ అనుకోవాలా!
యుద్దమంటే ఎంత నష్టమో
ఇజ్రాయెల్ కు ఇరాక్ తెలియదా
అయినా చేస్తున్నారు
అది కూడా కొన్ని నెలలకు తరబడి
ఎందుకు?
ఎవరి ఉనికి కొరకు వారు
ఎవరి ఉన్నతి కొరకు వారు
ఎవరు చస్తే వారికేంది
ఎంత నష్టమైతే వారికేంది!
నలుగురు కలిసినపుడు
మాట్లాడాలని యేదో
ఊక దంపుడు మాటలు
అనుకోవడమే తప్పా
ఆచరణలో ఏదీ జరుగదు
ఎలా జరుగాల్సింది
అలానే జరుగుతూనే ఉంటుంది
మనమందరం నిమిత్త మాత్రులం !
శీర్షిక: నిదుర ఎంత మధురం
అదో స్వప్న సుందరి
కంటికి కనబడనిది
చేతికి తగలనిది
ఊహాకు అందనిది!
హాయి నిస్తుంది
అలసట తీరుస్తుంది
స్వాంతన నిస్తుంది
బాధను తగ్గిస్తుంది
భారం తగ్గిస్తుంది
ఆలోచనలు రేకెత్తుస్తుంది!
రోజూ మనతోనే ఉంటుంది
అదను కోసం వేచి చూస్తుంది
మగతలో మైమరిపిస్తుంది
కాదు పొమ్మంటే ఊరుకోదు
ఆద మరిచి పడుకుంటే
ఆకాశంలో విహరించు!
తెల్లని మెరుపు తీగను
వదులదు
పది నిమిషాలు
అలా అలా వెళ్ళి వచ్చు
ఊసులెన్నో మోసుకొచ్చు!
జోకొడుతుండు
బుజ్జగిస్తుండు
మేల్కొలుపుతుండు
పడుకోబెడుతుండు
మరల ఎగిరిపోతుండు!
ఎన్ని మార్లో
ఒక లెక్క లేదు
అన్ని రాత్రులు అంతే
పూదోటలో త్రిప్పు
ప్రేమికులను కల్పించు
సంతోషాలను పంచు
దుఃఖాలను రుచిజూపు!
నరకాన్ని చూపించు
స్వర్గాన్ని చూపించు
జరిగింది చెబుతుండు
జరుగబోయేది దర్శనమిచ్చు
సూచనలు చేయు
హెచ్చరికలు చేయు!
అశ్వమేధం ఎక్కించిందా
ఏనుగులు , పూలతోటలు
దర్శనమిచ్చాయా
నీకు దగ్గరలో
శుభం జరుగనున్నట్లే
సింహాన్ని చూపించిందా
నీకేదో ముంచుకొస్తున్నట్లే
దున్నపోతు ఎక్కించిందా
నీకు ఆరునెలల లోపల
ఏదో అపాయం ఉన్నట్లే!
నిదుర
వెలకట్టలేనిది
అంగడిలో లభ్యమవనిది
కొందామన్నా దొరకనిది
నిదుర ఎంత మధురం!