Sunday, November 24, 2024

ఇక తనంతే

 శీర్శిక: ఇక తనంతే


కోకిల కూసినా
మంచు కురిసినా
ప్రకృతి వికసించినా
పిల్లగాలులు వీచినా
వెన్నెల కాసినా
పరిమళాలు వెదజల్లినా
గులాబీల సువాసన గుప్పుమన్నా
పౌర్ణమి అమావాస్య ఎదురొచ్చినా
తన్మయం చెందు!

సూర్యుడు బగబగ మండినా
ఉరుములు మెరుపులు మెరిసినా
పిడుగులు పడినా
కుంబవర్షం కురిసినా
నదులు పొంగిపొర్లినా
వరదలు పారినా
ఎవరైనా అడ్డుపడినా
అగ్నిగుండంలా మండుతుండు!

నేను నడిచేదే బాట
నేను చెప్పేదే వేదం
నేను చేసేదే న్యాయం
నేను చూసేదే నిజం
నేను వినేదే వాస్తవం
నేను నమ్మేదే సత్యం
నేను అమలు చేసేదే ధర్మం
నాకేంటి
ఈ సమాజంతో సంబందం
నాకేంటి
ఈ కుటుంబతో బంధం
నా జీవితం నా ఇష్టం
ఇదే తన ధోరణి!

వయసు పెరిగినా
బుద్ది పెరుగదు
అనుభవం గడించినా
మనసు మారదు
భూమికి ధూరమైనా
కాటికి దగ్గరైనా
నా దారే రహదారి
ఇదే తన ధోరణి!

అవే వంకర చూపులు
అవే పిచ్చి చేష్టలు
అవే అహంకార మాటలు
అవే అడ్డ దారులు
అవే వితండ వాదాలు
అవే మూఢ నమ్మకాలు
అవే అస్థిర భావాలు
ఇదే తన ధోరణి
ఇక తనంతే!

కలియగంలో ఒక నలక
వ్యవస్థలో ఒక పేలిక
సమాజానికి ఒక మరక
కుటుంబంలో ఒక సుందెలుక
జగతిని కాల్చే నిప్పుకణిక
అంతా దేవునికే ఎరుక
ఇక తనంతే!

ఇదంతా
శరీర స్వభావమా?
లేక హార్మోన్ల ప్రభావమా?
లేక గ్రహాల భ్రమణమా?
లేక సమాజ దుస్వభావమా?
లేక పూర్వ జన్మ కర్మానుసారమా?
అంతా అయోమయం
ఇక తనంతే!

No comments: