Thursday, November 14, 2024

నిమిత్త మాత్రులం

 తేది: 14.11.24

శీర్షిక: నిమిత్త మాత్రులం

ఏది యెప్పుడు జరుగుతుందో
యెవరికి తెలుసు
ఏది ఎక్కడ జరుగనుందో
యెవరికి తెలుసు
ఏది ఎలా జరుగనుందో
యెవరికి తెలుసు!

అంతా మనమనుకున్నట్లే జరుగుతే
ఇక దేవుడెందుకు?
మనిషి ఒకటి తలుస్తే
దైవం మరొకటి తలుస్తుందంటారు!

చావు పుట్టుకలు సహజం
పుట్టిన వారు గిట్టక మానరు
గిట్టిన వారు పుట్టక మానరు
ఆయుష్షు ఉన్నంత వరకే
మనిషి భూమ్మీద బ్రతుకుతాడు
ఎన్ని ప్రయత్నాలు చేసినా
వెళ్లి పోతాడు!

మనిషి నడుస్తూ వెలుతుంటాడు
పోటు రాయి తాకి పడిపోతాడు
హాస్పిటల్ లో చేరిపోతాడు
నీవు చూసుకుని నడుస్తే బాగుండు
ముహుర్తం చూసుకుని పోతే బాగుండు
అంటే ప్రమాదం జరుగకుండా
ఉంటుందా ఏమి?

మనిషి దేహాన్ని వదిలాక
వైన్ త్రాగకుండా ఉంటే బాగుండేది
టీ కాఫీలు త్రాగకుండా ఉంటే బాగుండేది
బీడి సిగరెట్లు కాల్చకుండా ఉంటే బాగుండేది
చికెన్ మటన్ తినకుండా ఉంటే బాగుండేది
బిపి షుగర్ వచ్చేది కాదు
క్యాన్సర్ వచ్చేది కాదు
అంటే తిని త్రాగిన వాల్లందరూ
చని పోతున్నారా ఏమి?

అదే నిజమైతే ప్రభుత్వాలు
ఎందుకు నిషేధించడం లేదు
వీటి వలన ఆరోగ్యం చెడుతుందనేది
ప్రజలకు తెలియదనుకోవాలా
జనులకు బ్రతకాలని లేదనుకోవాలా
చావుకోరుకుని తింటున్నారనీ
త్రాగుతున్నారనీ అనుకోవాలా!

యుద్దమంటే ఎంత నష్టమో
ఇజ్రాయెల్ కు ఇరాక్ తెలియదా
అయినా చేస్తున్నారు
అది కూడా కొన్ని నెలలకు తరబడి
ఎందుకు?
ఎవరి ఉనికి కొరకు వారు
ఎవరి ఉన్నతి కొరకు వారు
ఎవరు చస్తే వారికేంది
ఎంత నష్టమైతే వారికేంది!

నలుగురు కలిసినపుడు
మాట్లాడాలని యేదో
ఊక దంపుడు మాటలు
అనుకోవడమే తప్పా
ఆచరణలో ఏదీ జరుగదు
ఎలా జరుగాల్సింది
అలానే జరుగుతూనే ఉంటుంది
మనమందరం నిమిత్త మాత్రులం !

 

No comments: