Thursday, May 5, 2016

బ్యాంకులలో మొండి బకాయీలు మరియు నిరర్ధక ఆస్తులు ( BAD DEBTS AND NON PERFORMING ASSETS) పెరిగి పోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ?

ప్ర . బ్యాంకులలో  మొండి బకాయీలు  మరియు  నిరర్ధక ఆస్తులు ( BAD DEBTS AND NON PERFORMING ASSETS) పెరిగి పోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ?

జ . అసలు  మొండి బకాయీలు  అంటే ఏమిటో  మరియు  నిరర్ధక  ఆస్తులు  అంటే ఏమిటో  ముందు తెలుసుకుందాం . 

ఒక నెల  అసలు  వాయిదా మొత్తం మరియు  దానిపై  వడ్డీని  అప్పు తీసుకున్న వారు  చెల్లించ నట్లవుతే , దానిని  మొండి బకాయీలు ( BAD DEBTS) గా  భావిస్తారు . అలాంటి వాయిదాలనే  వరుసగా 3 నెలలు  ( 90 రోజులు ) చెల్లించ లేక పోయి నట్లవుతే , దానిని  నిరర్ధక ఆస్తులు (NON PERFORMING ASSETS) గా  భావిస్తారు .  


'' కర్ణుడి చావుకు  శతకోటి కారణాలన్నట్లు ", బ్యాంకులలో  మొండి బకాయీలు  మరియు  నిరర్ధక ఆస్తులు ( BAD DEBTS AND NON PERFORMING ASSETS) పెరిగి పోవడానికి  అనేక  కారణాలను  చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైనవి :




01. కమీషన్లకు  కక్కుర్తి పడో , మోహ మాటాలాకో ( OBLIGATIONS ) ,నీకిది నాకదనో ( QUID PRO)

 ,నాయకులకు  , పై అది కారులకు  భయ పడో  , మోసగాండ్ల  మాట కారి తనాలను తట్టుకో లేక నో  , పెద్ద పెద్ద వ్యాపారస్తులకు , తగినంత  సెక్యూరిటీ  లేకుండానే  ఉదారంగా  అప్పులు ఇవ్వడం . 


02. రాజ కీయ నాయాకుల  పరోక్ష వత్తిడి . 

03. బ్యాంకుల కు  స్వయం నిర్ణయాధి కారం లేక పోవడం . 


04. బ్యాంకులకు సరియయిన  రేటింగ్ వ్యవస్థ , అప్పులను తిరిగి చెల్లించే శక్తి  ఉందా లేదా అనే దానిని  అంచనా వేసే  టెక్నికల్ అధికారులు, సాఫ్ట్ వేర్  , ఫాలో అప్  అధికారులు  లేక పోవడం , 



05. సరే అని కోర్టులకు వెళ్తే , డబ్బు ఉన్న వారికి  మేధావి న్యాయ వాదులు , చట్టాల లోని మినహా ఇంపులను  ఆసరాగా చేసుకుని , కొన్ని ఏండ్లు కోర్టుల చుట్టూ త్రిప్పడం . 



06. దానికి  తోడు  ఆర్ధిక  మాంద్యం . జి డి పి  కుంటూ పడటం . 

07. చట్టాలలో , రాజకీయాలలో  మార్పులు చేర్పులు , సవరణలు , రద్దులు . 

08.  ప్రకృతి వైపరీత్యాలు  చోటు చేసుకోవడం . ఉదా : సైక్లోన్ , భూ కంపాలు , వరదలు , ప్రమాదాలు , యుద్దాలు . 

09. వడ్డీలు  , అప్పులు  మాఫీ చేయడం . సబ్సీడీలు ఇవ్వడం . 

10. విదేశాలకు వెళ్ళిన  అప్పు ఎగ వేత  దారులను  తీసుకుని రావడానికి , అక్కడి చట్టాలు అడ్డు రావడం . 

11. బ్యాంకులకు సామాజిక భాద్యత కలిగి ఉండాల్సి రావడం . 


12. దేశ విదేశాలలో  పలుకుబడి  గల  వారికి , పలుకుబడి గల సంస్థలకు  అప్పులు అధికంగా ఇవ్వాలని  బ్యాంకులు పోటీ  పడటం  మొదలైన వన్నీ ఈ రోజు  , సుమారుగా  8 లక్షల  కోట్ల  బ్యాంకుల అప్పులు  నిరర్ధక  ఆస్తులుగా  మారడానికి  కారనాలైనాయి . 

No comments: