Thursday, May 12, 2016

తెల్ల "రేషన్ కార్డులు" (RATION CARDS) ' రేషన్ ' కే పరిమితం చేయడం సమంజసమా ?

ప్ర . తెల్ల  "రేషన్  కార్డులు" (RATION CARDS)  ' రేషన్ ' కే  పరిమితం  చేయడం  సమంజసమా  ?

జ . ప్రభుత్వం  ఎన్నో వెరిఫికేషన్లు జరిపించిన తరువాత , ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి  కేవలం  పేద , మధ్య తరగతి  ప్రజల  సామాజిక  , ఆర్ధిక  మరియు గుర్తింపుగా జారీ చేసిన  అధికార ధ్రువ పత్రాలయిన "తెల్ల రేషన్ కార్డుల" ను  రేషన్ కే  పరిమితం  చేయడమో , రద్దు చేయడమో  చేయ కూడదు .  

ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసే "తెల్ల రేషన్ కార్డు లు" *RATION CARDS), అనేక విధాలుగా ఉపయోగ పడుతున్నాయి . ఒక విధంగా చెప్పాలంటే వీటిని " బహు లార్ద సాధక కార్డులు" అని చెప్ప వచ్చు.

"తెల్ల రేషన్ కార్డులు"  ప్రభుత్వం అధికారకంగా  జారీ  చేసే ధ్రువ పత్రాలు . "తెల్ల రేషన్ కార్డులు" నేడు కేవలం    పేద మధ్యతరగతి ప్రజలు  నెల నెలా  రేషన్ సరుకులు  తీసుకోవడానికే కాకుండా , బ్యాంకులలో , గ్యాస్  సంస్థలలో , డ్రైవింగ్  లైసెన్సులకు , విద్యాలయాలలో   మరియు  ప్రతి చోటా అడ్రస్  ప్రూఫ్ కు  ఉపయోగ పడుతున్నాయి . వోటు  వేయడానికి  ఐ . డి . కార్డులుగా ఉపయోగ పడుతున్నాయి . పాన్ కార్డు తీసుకోవడానికి  , పాస్ పోర్ట్  తీసుకోవడానికి  ఉపయోగ పడుతున్నాయి . 
ఇలాంటి వాటిని " ఒక కార్డు - ఒక ప్రయోజనం " అనే విధంగా కాకుండా, అనేక రకాలుగా ఉపయోగపడే  తెల్ల రేషన్ కార్డు లను అర్హులకే చేరేవిదంగా నియంత్రిస్తే సరి పోతుంది . విది విధానాలు రూపొందించి , అమలు చేస్తే సరి పోతుంది .
"తెల్ల రేషన్ కార్డులు" ఇప్పటి లాగానే , నిత్యావసర సరుకుల కొరకే కాకుండా , 'ఆరోగ్య శ్రీ' సేవలు పొంద డానికి మరియు ఫి రియంబర్స్ మెంటుకు అర్హత కల్పించాలి . ప్రతి ఇతర  అధికార  పత్రాలతో  "తెల్ల రేషన్ కార్డుల" ను  లింక్ చేయాలి .  అడ్రస్ లో  మార్పులు చేసుకుంటే అన్ని పత్రాలు ఆటోమేటిక్  గా  మారిపోయే విధంగా  సాఫ్ట్ వేర్  ను  తయారు చేసుకోవాలి . 

ధన వంతుల కు , 20 లక్షలకు  ఆ పై విలువగల  స్వంత ఇండ్లు  ఉన్న వారికి , ఇండ్లను కిరాయీలకు ఇచ్చి రాజాల్లా బ్రతికే వారికి , బడా వ్యాపారస్తులకు , అధిక ఆదాయా పన్నులు కట్టే ధన వంతులకు  , కార్లు , లారీలు ,  బస్సులు ఉన్న వారికి , 3 ఎకరాలు  ఆపై భూములు ఆస్తులు ఉన్న వారికి , 10 లక్షలకు మించి  ఇన్సురెన్స్  కడుతున్న వారికి లక్షల్లొ బ్యాంకుల్లో నిధులు ఉన్నవారికి , లాకర్లలో ఆభరణాలు , నిధులు ఉన్న వారికి , విదేశాలలో నల్ల దానం ఉన్నవారికి , బినామి ఆస్తులున్న వారికి ,  ప్రభుత్వ ఉద్యోగస్తులకు , పట్టణాలలో సం. రానికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం గల వారికి ( గ్రామాలలో  2 లక్షల  ఆదాయం ఉన్న వారికి ) , రాజ కీయ నాయకులకు  "తెల్ల రేషన్ కార్డు లు"  జారీ చేయ కూడదు.  నేడు అధి కారుల అండతో  వీరిలో  కొందరికి  "తెల్ల రేషన్ కార్డు లు" సులభంగా అందుతున్నట్లుగా  రద్దు చేసే  "తెల్ల రేషన్ కార్డు ల" ను బట్టి  అర్ధ మవుతున్నది . అందుకని , బోగస్ కార్డులను , బినామి కార్డులను తొలగించాలి . తెలంగాణా లోగో ను ముద్రించి "తెల్ల రేషన్ కార్డు లు"  ఇష్యూ చేయాలి . "తెల్ల రేషన్ కార్డుల" ను  రేషన్ కే  పరిమితం  చేయడమో , రద్దు చేయడమో  చేయ కూడదు .  దీని వలన  ప్రభుత్వానికి  ఇన్ని రోజులు  పడిన శ్రమ , కోట్లాది  రూపాయల వ్యయం  ' బూడిదలో  పోసిన పన్నీరు ' అవుతుంది . అంతే కాదు  ప్రజలకు  , ప్రభుత్వంపై  ఒక చెడు అభి ప్రాయం ఏర్పడుతుంది . 

బోగస్ , బినామి "తెల్ల రేషన్ కార్డు లు" తొలగించడానికి , ప్రభుత్వ పరమయిన చర్యలే కాకుండా , ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వ డానికి రూ .లు 10 వేల పారి తోషికం, గుర్తింపు పత్రం ఇవ్వ చూపాలి . వారి వివరాలను గోప్యంగా ఉంచాలి , రక్షన కల్పించాలి . తెలుప వలిసిన ఫోన్ నెంబర్ , ఇ.  మెయిల్ అడ్డ్రస్ , పోస్టల్ అడ్డ్రస్ అన్ని పేపర్లలో ప్రకటించాలి .

No comments: