Saturday, May 21, 2016

మూఢాలు ( MOODHAS) అంటే ఏమిటి ? మూఢాలు ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు ఏమిటి ? పరిశ్కారాలేమిటి ?

ప్ర.  మూఢాలు ( MOODHAS)  అంటే ఏమిటి ?  మూఢాలు  ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు  ఏమిటి ? పరిశ్కారాలేమిటి ?  

జ . మూఢాలు ( MOODHAS)  అంటే  అశుభ దినాలు , అశుభ రోజులు .చీకటి  రోజులు , రోజులు చెడు దినాలు . శుభ కార్యాలు  చేసు కోవడానికి  వీలు కాని రోజులు . మంచి రోజులు కావు అని అర్థం . మూఢాలు ( MOODHAS)  అంటే ఖచ్చితంగా  విడవదగిన కాలం  అని అర్ధం .  

మూఢాలు ( MOODHAS)  రెండు  రకాలు . అవి ఒకటి  గురు మూడం , రెండవది  శుక్ర మూడం.  మూఢాల ను  ( MOODHAS)  మౌడ్యములు (MOUDYAMIES) అని కూడా  అంటారు . 

సామాన్యులకు కూడా  అర్ధమయ్యే విధంగా  చెప్పాలంటే , గురువు  సూర్యునికి  దగ్గరగా వచ్చినప్పుడు  ఏర్పడే దానిని  గురు మూఢమని  . అలానే శుక్రుడు సూర్యునికి  దగ్గరగా  వచ్చి నప్పుడు  ఏర్పడే దానిని   శుక్ర మూఢ మని  అంటారు . 

దీనినే సాంగత్వ  దోషమని  అంటారు . శుభ గ్రహాలు  అస్తాంగాత్వంలో  ఉన్నపుడు  మూఢo  వస్తుంది . సూర్యునికి  దగ్గరగా  గురు , శుక్రులు  వచ్చి నప్పుడు , గురు శుక్రుల  శక్తులు  తగ్గి పోతాయి . బలం తగ్గి పోతుంది . బలహీన మౌతాయి . నీరస పడుతాయి . సన్నగిల్లుతాయి . వేయి  వాట్స్  బల్బు ముందు , ఒక  చిన్న క్యాండిల్  పెడితే , ఆ క్యాండిల్ శక్తి  ఎంత మాములుగా  ఉంటుందో , అలానే సూర్యుడి  ముందు  గురు శుక్రుల శక్తి  అంత తక్కువగా , బాల హీనంగా  ఉంటుంది . అందుకే శుభ కార్యాలు  ఆ రోజులలో  జరుప కూడదు అని అంటారు . 

అందువలన , ఈ కాలంలో  శుభ కార్యాలు , "ముఖ్యంగా  వివాహాలు జరుప కూడదు  , లగ్నం కోటు వేసుకోరాదు . వివాహాలకు  సంభందించి  మాట ముచ్చట్లు  మాట్లాడు  కోరాదు . పుట్టు వెంట్రుకలు తీయ కూడదు . గృహ శంకుస్థాపనలు  చేయ రాదు . ఇండ్లు మారకూడదు." ఎందుకంటే ఇవన్నీ జీవితంలో ఒకే సారి చేయడం జరుగుతుంది . ఎవరయినా మంచి జరుగాలనే కోరు కుంటారు .  అందుకని  మూడాలలో  శుభ కార్యక్రమాలు  చేయ కూడదు. 

మనందరికీ  తెలుసు , ఏ  శుభ కార్యక్రమానికైనా  గురు శుక్రులు బాగుండాలని . దివ్యంగా ఉండాలని . శక్తి మంతంగా ఉండాలని . గురు శుక్రులు బాగుంటేనే  శుభాలు ఎలాంటి ఆటంకం లేకుండా  జరుగుతాయి . పెండ్లిల్లకు  గురు బలం బాగుండాలి . 

అయితే , మూఢాల ( MOODHAS) లో అన్న ప్రాసన చేసుకోవచ్చు . ప్రయాణాలు చేయ వచ్చు . 
రిపేర్లు చేసుకోవచ్చు .  తప్పవు అనుకున్న  పనులు చేసు కోవచ్చు .  భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం , ఉద్యోగాలలో చేరడం , విదేశాలకు వెళ్ళడం అబ్బాయిలను అమ్మాయిలను చూడటం  , వ్యాపారాలు మొదలు పెట్టడం , వెహికిల్స్ కొనుక్కోవడం , బట్టలు కొనుక్కోవడం  మొదలైనవి  చేసు కోవచ్చు . 
మూఢాల ( MOODHAS) కాలం :
01. మొదటి  శుక్ర మూఢం: 30.06. 2016,   రాత్రి  11. 26 ని . నుండి  30.07.2016  ఉదయం 7. 39 ని . వరకు . 
02. గురు మూఢం : 12. 09. 2016 రాత్రి  3. 09 ని . నుండి  10. 10. 2016  రాత్రి  5.51  ని . వరకు . 
03. రెండవ శుక్ర మూఢం: 20. 03. 2017 ,   రాత్రి  4. 13.  ని . నుండి  30.03.2017  రాత్రి 3. 49 ని . వరకు .
మూఢాల ( MOODHAS) కాలంలో శుభ కార్యాలు చేస్తే  ఏమవుతుంది ?
మహర్షులు , జ్యోతిష్య  పండితులు, అనుభవస్తులు   శుభ కార్యాలు  చేయ  కూడదని చెప్పారే గాని , ఏమవుతుందో చెప్ప లేదు . 
కానీ నా అనుభవం  ప్రకారం ,  ఏదయినా  అశుభం  వినవల్సి రావచ్చు . కష్టం  కలుగ వచ్చు , నష్టం  వాటిల్ల వచ్చు.    
  



No comments: