Thursday, June 30, 2016

ఆస్ట్రోలజి (ASTROLOGY) / జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి ? జ్యోతిష్య శాస్త్రం / ఆస్ట్రోలజి (ASTROLOGY) శాస్త్ర బద్ధమైనదా ? దీనిలో వాస్తవ మెంత ?

ప్ర :  ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం   అంటే  ఏమిటి ?  జ్యోతిష్య  శాస్త్రం / ఆస్ట్రోలజి  (ASTROLOGY)  శాస్త్ర బద్ధమైనదా ?  దీనిలో వాస్తవ మెంత ?

జ : ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య   అనేది  ఒక శాస్త్రం . ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం    అనంతమైన  విశ్వం లాంటిది .  ఇది ఒక సెల యేరు  లాంటిది . అంతం తెలియని  కోనేరు లాంటిది . ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం  ఒక విషయానికే  పరిమితం కాదు . ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం  ఇతర  అనేక శాస్త్రాలతో అవినాభావ   సంభంధం  కలిగి  ఉంటుంది.  ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం  అనగా   గ్రహాల కదలికలను బట్టి , ముందు ముందు  జరుగ బోవు  సంఘటనలు , పగలు రాత్రులు , రుతువులు , కాలాలు , శుభ  అశుభ  సమయాలతో  పాటు , ముఖ్యముగా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల  పుట్టుకను , పుట్టుక దోషాలను , జీవితాన్ని , జీవిత  గమనాన్ని , ఆయుష్షును . ఆపదలను , వాటి దోషాలను   సంపూర్ణంగా  తెలియ జేసే ఒక విజ్ఞ్యాన  ఘని. గ్రహాల చక్ర గతే  ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం. 

జ్యోతిష్య  శాస్త్రం / ఆస్ట్రోలజి  (ASTROLOGY)  శాస్త్ర బద్ధమైనదా ?  దీనిలో వాస్తవ మెంత ?

లోకంలో దేవుడున్నాడని  పూర్తిగా నమ్మే వారున్నారు ( వీరినే ఆస్తికులు  అని అంటారు ) . దేవుడు లేడని నమ్మే  వారున్నారు . ( వీరినే నాస్తికులు అని  అంటారు ) . ఇక  మూడో  వర్గం ప్రజలు , అదృష్టం , సుఖాలు సంతోషాలు   కలిగినప్పుడు  దేవున్నాడని ఒక సారి ,  దుర దృష్టం , కష్టాలు నష్టాలు  ఎదురైనప్పుడు దేవుడు లేడని  మరొక సారి  అనుకుంటూ  జీవిత గడిపేవారున్నారు . లోకంలో ఈ మూడో వర్గం ప్రజలే అధికంగా  ఉంటారు . ఇక పోతే ,  తప్పు చేసిన  వారు  బయపడి  దేవుడికి మ్రొక్కె వారు కొందరైతే , నేను ఏ  తప్పూ  చేయ లేదు కాబట్టి నేనెందుకు  దేవుడికి మ్రొక్కాలి అనుకునే వారు మరికొందరున్నారు .  ప్రజలకు  మంచి  పాలనను అందించిన  గొప్ప వారిని , మహాను బావులను  కాల క్రమేణా  ఈ రోజు మనం  వారిని దేవుళ్లుగా  పూజిస్తున్నాం . మనః శాంతిని  పొందుతున్నాం . పాపాలు కడిగేసుకుంటున్నాం , లెంపలేసుకుంటున్నాం ,  ఆదర్శంగా  తీసుకుంటున్నాం .  

కానీ ఈ సృష్టికి  ఏదో ఒక శక్తి ఉందని మాత్రం  అందరూ  నమ్ముతారు . ఆ శక్తే  లేక పోతే  ఖచ్చితమైన  సమయంలో  ప్రతి రోజూ  పగలు రాత్రి  ఎలా ఏర్పడుతున్నాయి ?  రుతువులు, కాలాలు   ఎలా ఏర్పడుతున్నాయి ? ఎండలు ఎలా కొడుతున్నాయి ? వర్షాలు ఎలా  కురుస్తున్నాయి ?  జీవ కోటి ఎలా పుడుతుంది ? ఎలా  హస్తమిస్తుంది ?  ఒక అయస్కాంతాన్ని  ఎక్కడ ఉంచినా  దాని  నార్త్ నోడ్  , ఉత్తరాన్నే  చూపిస్తుంది గాని  దక్షణాన్ని చూపించదు.  ఇది ఎలా జరుగుతుంది  ? భూమి  తన చుట్టూ  తిరగడం  వలన  పగలు రాత్రులు  ఏర్పడుతున్నాయని , అలానే భూమి సూర్యుని  చుట్టూ  తిరగడానికి  ఒక సంవత్సర  కాలం పడుతుందని  మన శాస్త్రవేత్తలు  ఏనాడో కనిపెట్టారు . ఆ శక్తిని విశదీకరించేదే  " ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం ". 


వీటన్నింటికి  మూలం సూర్య , చంద్ర  , భూమి  మొదలగు  గ్రహాలు , నక్షత్రాలే  అనేది నగ్న సత్యం .  ఈ గ్రహాలు , నక్షత్రాల గురించి  సవివరంగా  తెలియజేసేదే  ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం .  ఇక ఖచ్చితత్వమనేది , లెక్కలువేసే  అనుభవజ్ణ్యులపై  ఆస్ట్రోలాజిస్టులపై  ఆధార పడి  ఉంటుంది.  ఈ  యదార్ధాలను  కంటితో  చూస్తూ , వాస్తవంగా  అనుభవిస్తు న్నాము . కాబట్టి  జ్యోతిష్య  శాస్త్రం / ఆస్ట్రోలజి  (ASTROLOGY)  శాస్త్ర బద్ధమైనదనే  విషయం చెప్పక తప్పదు . 

ఆస్ట్రోలజి  (ASTROLOGY) / జ్యోతిష్య  శాస్త్రం  ప్రజలకు   వాస్తవంగా  ఎంత వరకు  ఉపయోగపడుతుంది ? ఎలా ఉపయోగ పడుతుంది ?

ప్రజలు   జన్మించిన   ఖచ్చితమైన తేదీని , సమయాన్ని , స్ధలాన్ని ఆధారంగా చేసుకుని  వారి గ్రహ సంచారం ఎలావుందీ అనేది  తెలుసుకో గలుగు తున్నారు .  ఆ గ్రహాల , నక్షత్రాల  సంచారాన్ని బట్టి  వారి విద్యను , అభి వృద్ధిని , వివాహ  బంధాన్ని , వారి బలాలను , బలహీనతలను , మనస్తత్వాలను , నడవడికను , కాల సర్ప  దోషాలను , శని సంచారాన్ని ,  ఆయురార్ధాయాన్ని , లాభ నష్టాలను , యోగాలను , కష్ట సుఖాలను  ఆస్ట్రాలజిస్టులు / జ్యోతిష్యులు  అంచనా వేయ గలుగుతున్నారు . తెలుసుకో గలుగుతున్నారు . ఆ విధంగా తెలుసుకుని  ఆయా  జాతకులకు  ఎలాంటి చెడు  గాని , హాని గాని  జరుగకుండా   సూచనలు చేయడం , తగు నివారణ చర్యలు  చేపట్టి , సాధ్యమైనంత వరకు  వారికి రక్షణ  కల్పించడం జరుగు చున్నది . అంతే కాకుండా  ఆ జాతకుల  వారసత్వానికి  ( HEREDITARY)  కూడా  ఆపదలు (సర్పిత్  యోగా ) అంచనా వేసి , వారికి  ఎలాంటి హాని జరుగ కుండా   చర్యలు  చేపట్ట గలుగుతున్నారు .  మానవ జీవితానికి  ఒక  అద్దం లాంటిది  ఆస్ట్రాలోజి . 

సాధ్యమైనంత వరకు , ఆధ్యాత్మికంగా , యాంత్రికంగా , మానసికంగా  తగు జాగ్రత్తలు  , నివారణ చర్యలు  చేపట్టి , ఆయా జాతకులను  రక్షించడం , వారి జీవితాలు సాఫీగా  సాగేటట్లు  చూడటమే ఆస్ట్రోలజిష్టుల / జ్యోతిష్యుల  ముఖ్య ఉద్దేశ్యం . 

ఎన్ని ప్రయత్నాలు చేసినా  , సీరియస్ ను బట్టి  కొన్ని అవాంతరాలను , ఆపదలను  మానవ రూపంలో ఉన్న ఆస్ట్రోలజిష్టులు  / జ్యోతిష్యులు   తప్పించ లేక పోవచ్చు . విధి రాతను ఎవరూ తప్పించలేరు . ఉదా : ప్రకృతి భీభత్సాన్ని  ఎవరైనా  నివారించ గలరా ? శాశించ గలరా ? అయిననూ  మానవుడి ప్రయత్నం  మానవుడిదే . ఎందుకంటే  మానవుడు ఆషా  జీవి .

ఆస్ట్రోలోజీ  ఎలాంటి దంటే , ఉదా : ఒక మనిషి  చీకటిలో వెలుతున్నపుడు  కర్రే పాములా కంగారు పెట్టవచ్చు , భయ పెట్ట వచ్చు . ' మ్యాన్  హోల్సే '  ప్రాణం తీయ వచ్చు . అల్లాంటప్పుడు , త్రోవలో  పురుగుబూసి  ఎదురు కాకుండా , వాటికవే బయపడి , ప్రాణాలను రక్షించుకోడానికి , తప్పుకుని పోవడానికి  లేదా  త్రోవలో  ఏదీ అడ్డు తగలకుండా  సాఫీగా నడవడానికి ఉపయోగ పడే  " టార్చి లైట్ " లాంటిది  ఆస్ట్రోలోజి .  అంతే గాని  నదిలో నడిచే ట ప్పుడు , సముద్రంలో  నడిచే టప్పుడు , మనిషి వస్తున్నాడని  నది గాని , సముద్రం గాని  దారిని కల్పించేది కాదు  ఆస్ట్రోలోజి . 

పూర్వకాలం నుండే మనకు  ఒక నానుడి వాడుకలో ఉంది . " పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుంది " అని . ఉదా : మల్లె , సంపెంగ , గులాబీ ,మొగిలి  పూలు పూయ గానే  వాటి సువాసన అల్లంత దూరం  గుప్పుమంటుంది . అలా పూసిన చెట్లు ఎప్పటికీ అలాంటి పూలనే  పూస్తాయి . అలానే  మంచి నక్షత్రాన , యోగాన , లగ్నాన  , రాశిని  పుట్టిన  జాతకులు , కేంద్ర , కోన స్థానాలలో , ఉచ్చ స్థానాలలో , మిత్ర స్థానాలలో , శుభ గ్రహాల వీక్షణ గల జాతకులు  ఎప్పటికీ  మంచి అభివృద్ధినే   సాధిస్తారు , మంచి కార్యాలు చేస్తారు . సమాజానికి  ఇతోధికంగా ఉపయోగ పడుతారు . నిస్వార్ధంగా జీవిస్తారు . ఎవ్వరికీ హాని , కీడు తలపెట్టరు . జీవించడం  తక్కువ కాలమే అయినా , లోకంలో  శాశ్వతంగా  నిలిచిపోతారు . ఉదా :  స్వామి  వివేకా నందుడు ,  గౌతమ బుద్ధుడు . 

అలానే  మరో నానుడి కూడా  వాడుకలో  ఉంది . అది ఏమంటే  " పుర్రెకు పుట్టిన బుద్ది               పుడుకలతోనే పోతుంది " అని .  దీని భావం ఏమంటే , మనిషి పుట్టినపుడు  ఏదైయితే  బుద్ది ఉంటుందో , మనిషి  జన్మించినపుడు  ఏదైయితే మన:స్తవత్వం ఉంటుందో , పెరిగి పెద్ద పెరిగి , యుక్త వయస్సు , ముసలితనం  వచ్చే వరకు , చివరికి  చని పోయే వరకు  అదే  మన:స్తవత్వం  ఉంటుంది . అదే నడవడిక  ఉంటుంది . ఇలాంటి వారు ఎక్కువ కాలం జీవిస్తారు కావచ్చు గాని , ప్రజల మనస్సులనుండి  దూరమవుతారు . ఉదా : పిచ్చి వారు ,  తల్లి దండ్రులను , తో బుట్టువులను , ప్రజలను విసిగించే  వారు , మోసగించే వారు , ప్రజల  చెమటను ఆల్కాహాలుగా త్రాగే వారు , ప్రజలను  కిరాతకంగా  చంపే వారు ,  ప్రజల అమాయకత్వాన్ని , చట్టాలలో లొసుగులను సొమ్ము చేసుకునే వారు , దోచిన సొమ్మును  విదేశాలలో దాచే వారు  ఈ కోవకే చెందు తారు . 

ఆ విధంగా  ఆస్ట్రోలోజి  / జ్యోతిష్య  శాస్త్రం  100 సంవత్సరాల  మనిషి  జీవిత చరిత్రను  , ఆ వ్యక్తి పుట్టిన రోజునే  అంచనా వేస్తుంది . ఆస్ట్రోలోజి  / జ్యోతిష్య  శాస్త్రం  మనిషి జీవితానికి  MRI / X-RAY లాంటిది .  అంటే  ఆస్ట్రోలోజి  / జ్యోతిష్య  శాస్త్రం  ఎంత  గొప్పదో , విశ్వ మానవాళికి   , వాత వారణానికి  ఎలా ఉపయోగ పడుతుందో  మనకు సులువుగా  అవగత మవుతుంది . 

ఇప్పటి వరకు  మన ఋషులు , శాస్త్ర  వేత్తలు  తెలుసుకున్నది, తెలియ జేసింది  చాలా తక్కువ . కానీ , వేగం కొరకు , ఖచ్చితత్వాని  కొరకు  కంప్యూటర్ సాఫ్ట్ వెర్  తప్పా , ఇప్పటి వరకు మన ఋషులు , శాస్త్ర  వేత్తలు  తెలుసుకున్నది, తెలియ జేసింది మాత్రమే  మనం ఉపయోగించుకుంటున్నాం .  అయితే ఇంకనూ మనం  తెలుసుకోవాల్సింది  , తెలియ జేయాల్సింది  చాలా  ఉంది . ప్రయత్నిద్దాం .

 జ్యోతిష్యాన్ని ( జాతక చక్రాన్ని)   మనం ఎన్నో విధాలుగా  ఉపయోగించు కోవచ్చు. అందులో కొన్ని : 

ఉదా : 01. '' జాతక చక్రాన్ని '  ఆధార్ కార్డుల  కు  లింక్ చేయడం వలన  ,   వ్యక్తుల  గుర్తింపు  విషయంలో   98%   ఖచ్చితత్వం  ఏర్పడుతుంది ". ఎందుకంటే  ' రాశీ చక్రం ' ఒక వ్యక్తికి మరో వ్యక్తికి  ఖచ్చితంగా  తేడా ఉంటుంది .  20, 30 నిమిషాల తేడాలతో  పుట్టినా 'లగ్నాలు '  మార వచ్చు .  జీవిత కాలంలో మనుష్యులు మారుతారు గాని  జాతకాలు  మారవు .  ఇక్కడ 2% గ్యాప్  ఎందుకు పెట్టానంటే , చంద్రుడు    2 -1/2 రోజుల కొకసారి  ఒక  రాశి మారు తుంటాడు . ఇక రెండవది  ప్రతి రోజూ  ఎక్కడో ఒక చోట పుడుతూనే ఉంటారు , మరనిస్తూనే  ఉంటారు . మరియు ఒకో సారి కవలలు  పుడుతుంటారు . ఇద్దరూ  మగ పిల్లలే కావచ్చు , లేదా ఇద్దరూ  ఆడపిల్లలే  కావచ్చు . కొద్ది  నిమిషాల తేడాల లోనే పుడతారు కాబట్టి  రాశులతో పాటు  లగ్నం కూడా  మారక పోవచ్చు .  వీరికి ఒకే రకమైన రాశీ చక్రం , ఒకే రకమైన లగ్నం ఉంటుంది . అయితే  ఇలాంటి వారు చాలా అరుదు . వీటన్నింటికి  కలిపి  2% ఖచ్చితత్వం  ఉండక పోవచ్చు అని అంచనా వేస్తున్నాను . 

02. " జాతక చక్రాల ద్వారా  అల్పాయుష్షును , దీర్గాయుషును ,  జబ్బులను  తెలుసుకుని  భీమాలను  తీసుకోవడం వలన  పేద  మధ్యతరగతి  ప్రజలకు  ఎంతో మేలు జరుగుతుంది" . 
ఈ రోజు  జీవిత భీమా సంస్థలు (Life Insurance Corporations)  , ఆరోగ్య  భీమా  సంస్థలు (Health Insurance Companies) , మూడు పువ్వులు  ఆరు కాయలుగా  వెలుగొందుతున్నాయి .  ప్రతి ఒక్కరికి  రక రకాల  భీమాలను  అంట  గట్టి , కోట్లాది రూపాయలను గడిస్తున్నారు . కేవలం  ఏజెంట్లే  కోటీశ్వరులవుతున్నారు .   ఇది అంతా ఎవరి  డబ్బు . బీమాలను అంటగట్టేటప్పుడు , ఏజెంట్లు  అమాయక ప్రజలను ఉక్కరి బిక్కిరి  చేస్తుంటారు .  ప్రజలకు  జరిగే మేలు ఎంత ? కోట్లల్లో  కేసులు , తిప్పలు  తప్పా .  డబ్బులు కట్టించు కొనేటప్పుడు  వారి  అడ్డ్రస్సులుంటాయి ,  కానీ క్లైమ్ సమయాన వారి అడ్డ్రస్సులు మరిచి పోతారు . డబ్బులు కట్టించు కొనేటప్పుడు  వారి జబ్బులు గుర్తుకు రావు . కానీ క్లైమ్ సమయాన వారి జబ్బులు గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతారు .  3 సంవత్సరాల  లోపు  విరమించుకుంటే   కనీసం కట్టిన డబ్బులైనా వాపస్  ఇవ్వరు .  ప్రీమియంలు  కట్టడం లేటవుతే  వడ్డీలు , అపరాధ రుసుములు , పాలసి  లాప్స్  లు జరుగుతుంటాయి .  అప్పుడు  డెత్ క్లెయిమ్  కు అర్హత  కోల్పోతారు . దీనికి తోడు  ప్రభత్వం కూడా  FDI's ను 100% పెంచింది .  వీటన్నింటికి  ఒకటే చక్కటి మార్గం . జాతక చక్రాన్ని  చూపించుకుని  , అల్పాయషు  ఉన్న వారు  మాత్రమే  'జీవిత  భీమా పాలసీలను' , అనారోగ్య బారిన పడ  బోయే వారు   మాత్రమే  'ఆరోగ్య భీమాలను '    తీసుకోవడం  ద్వారా   98% విజయాన్ని సాధించ వచ్చు . ( ఇలాంటివి  ఆక్సెప్ట్  చేస్తారా చేయరా అనేది భీమా సంస్థల  ఇష్టం.)    మిగిలిన వారు  బ్యాంక్  పి . ఎఫ్ .  అకౌంట్ల లోనో ,  5 సంవత్సరాల ఫిక్సడ్ డిపాజిట్ల లొనో, మ్యూచువల్  ఫండ్ల లోనో  దీర్ఘ కాలం  పెట్టుబడి పెట్టడం  లాభ దాయకం .  ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినా మనకు , వారు ఉదర  గొట్టే  ' పొదుపు అలవాటు  ' ఉంటుంది . ' రక్షణ ' ఉంటుంది .  ' ఆదాయ పన్నుల మినహాయింపు '  ఉంటుంది .                         '  ఈజీ లిక్విడిటీ  ' ఉంటుంది . ' పెట్టుబడి గ్రోత్ ' ఉంటుంది . డబ్బు ఎప్పుడంటే  అప్పుడు  అందు బాటులో ఉంటుంది . వీటి పై  రుణ సదుపాయం  కూడా ఉంటుంది . 

03. " జాతక చక్రాల ద్వారా  అల్పాయుష్షును , దీర్గాయుషును ,  జబ్బులను  తెలుసుకుని  రెండా వ సంతానాన్ని  కనాల వద్దా , ఆపరేషన్  చేయించు కోవాలా  వద్దా  అనే  నిర్ణయం  తీసుకోవడం  వలన , ఒక అబ్బాయో , అమ్మాయో  తో  ఆపేసి , ఆ తరువాత  , వారు కూడా లేని  దంపతులకు , ఎంతో  మానసిక  వేదనను  తగ్గిస్తుంది . మానసిక  సంతృప్తిని ఇచ్చేది , ఆర్ధిక భద్రతను  కల్పించేది  , వృద్ధాప్య  సమయంలో  ఆదుకునేది కన్నా బిడ్డలే  కదా . ఖర్మ  కాండలు చేసేది  పిల్లలే కదా . ఏదైనా  ప్రాక్టికల్ గా  ఆలోచించాలి .  

నోట్ : ఇది కేవలం నా అనుభవం మాత్రమే . ఎవరి నిర్ణయాలకు , ఎవరి పెట్టుబడులకు  వారే భాద్యులు . కేవలం ఆలోచించమని  మాత్రమే గాని , ఇది ఖచ్చితంగా  పాటించ మని  చెప్పడం లేదు . పెట్టుబడులు పెట్టేటప్పుడు  మీకు దగ్గరిలోని  ఫైనాన్సియల్  అడ్వైజర్స్  అడిగి నిర్ణయాలు తీసుకో గలరు . ఆల్ ద  బెస్ట్ . 



  




రోడ్డు రవాణా సంస్థల్లో (ROAD TRANSPORT CORPORATION) లాభాలు మెరుగు పరుచడానికి ఏమైనా ఉపాయాలు ఉన్నాయా ?

ప్ర : రోడ్డు రవాణా  సంస్థల్లో ( ROAD TRANSPORT CORPORATION) లాభాలు మెరుగు పరుచడానికి  ఏమైనా  ఉపాయాలు ఉన్నాయా ?


SOLUTIONS: "IDEAS TO IMPROVE  THE PROFITS IN ROAD TRANSPORT CORPORATION "

పరిష్కారాలు : " రోడ్డు రవాణా  సంస్థల్లో  లాభాలు మెరుగు పరుచడానికి  ఉపాయాలు "

” PASSENGERS ARE THE ‘GODS’ TO THE TRANSPORT CORPORATION”

రోడ్డు రవాణా  సంస్థకు ప్రయాణికులు  దేవుళ్ళు "

YES,  PASSENGERS ARE THE SERVICE UTILIZERS, INCOME IMPROVERS ,  WELL WISHERS, GUIDERS AND HENCE THEY ARE ONLY THE  ‘GODS’ TO THE TRANSPORT CORPORATION TO RUN  IN PROFITABLY, SO,  TRANSPORT  CORPORATION  MUST CONSIDER THE FOLLOWING STEPS TO IMPROVE FURTHER:

అవును  ప్రయాణికులు,   సేవలను  ఉపయోగించు కునే వారు,   ఆదాయాలను  పెంచే వారు . అభివృద్ధిని కాంక్షించే  వారు , సూచనలను  చేసే వారు . కనుక  రోడ్డు రవాణా సంస్థ  లాభాలలో నడవాలంటే ప్రయాణికులు మాత్రమే రోడ్డు రవాణా సంస్థ కు  దేవుళ్ళు . అందుకని  రోడ్డు రవాణా  సంస్థ  మరింత అభి వృద్ధి  సాధించాలంటే , లాభాల బాట పట్టా లంటే ,  కొన్ని విధానాలను  తప్పకుండా  పరిగణలోకి తీసుకుని , వాటిని అమలు పరచాలి .  

First step:

The Intention  of the management should be clear, open and transparent to run the Organisation smoothly and  Profitably.


 మొదటి  ప్రాధామ్యం :

రోడ్డు రవాణా  సంస్థ  సాఫీగా మరియు  లాభాలలో  నడవాలంటే , యాజమాన్యం ఉద్దేశ్యం పరిశుద్ధముగా  మరియు లక్ష్యం  బలంగా  ఉండాలి.  దాపరికం లేకుండా  మరియు పార దర్శకంగా   ఉండాలి . చెప్పేది  చేసేది రెండూ ,  ఒకటే అయి  ఉండాలి . అది గుండె నుండి రావాలి . ఎదో  ఒక  మార్పును  తీసుకుని రావాలనే  తపన ఉండాలి .  


Second step:

Appoint well qualified ,experienced,trusted and ethically capable persons in the key posts. So that they can concentrate on every aspect  of organisation. viz.,Buying , Selling of products, spare parts, recruitment, maintenance and running the organisation , properly.

రెండవ ప్రాధామ్యం : 

కీలకమైన  పదవులలో  అనుభవం ఉన్న వారిని , బాగా చదివిన వారిని , నీతి నియమాలకు కట్టుబడి ఉన్న వారిని , నమ్మకమైన వారిని ,  సమర్థులను నిస్వార్ధంగా , నిస్పక్ష పాతంగా  నియమించాలి . అలానే వారిపై  నమ్మకం  ఉంచాలి , సరియైన  వేతనాలు  చెల్లించాలి , సదుపాయాలు  కల్పించాలి , గుర్తింపు నివ్వాలి . గౌరవమివ్వాలి .హోదా ఇవ్వాలి . సదుపాయాలు  కల్పించాలి . ఫ్రీడమ్ ఇవ్వాలి . వారిచ్చిన  రిపోర్టులపై  తక్షణమే  ఉన్నతాధికారులతో  , ప్రభుత్వాలతో చర్చించి  తగిన నిర్ణయాలు తీసుకోవాలి . లేదా  ఎందుకు జాప్యం జరుగుతుందో వివరించాలి . అప్పుడే  వారు  రోడ్డు రవాణా  సంస్థ  లో జరిగే ప్రతి విషయాన్ని  క్షున్నంగా  పరిశీలిస్తారు . ప్రతి నిమిషాన్ని  వృధా  చేయ కుండా  శ్రమిస్తారు .  అవి , డీజిల్ , స్పేర్ పార్ట్శ్ , బస్సులు కొనుగోళ్లు కావచ్చు , స్క్రాప్  అమ్మకాలు కావచ్చు , నియామకాలు కావచ్చు , బస్సుల రిపేర్లు కావచ్చు . ప్రయాణికుల సేవలు కావచ్చు , మిగులు స్థలాలను సద్వినియోగం చేసుకోవడం కావచ్చు , మరేదయినా కావచ్చు . 


Third step:

To control the  passengers rush  at bus stops in major cities, it is more essential to increase further the short route shuttles.  To atract more passengers , put " SHUTTLES'' name plates. these shuould be visible even in nights also . The buses should be coloured in special shades. So that most of the passengers will be distributed to different places without any traffic problems. Besides to that  long route buses also should be continued for every 5 mts. then , there will not be any huge rush in the buses and passengers will travel safely.

మూడవ ప్రాధామ్యం : 

ముఖ్యమైన  కూడళ్లలో , పట్టణాలలో  ప్రయాణికుల ఇబ్బందులను, సమస్యలను తగ్గించడానికి తక్కువ దూరం గల   " షటిల్స్ " ప్రారంభించాలి . బస్సులపైన  ఆ విధంగా  " షటిల్స్ " బోర్డులు పెట్టించాలి .  అవి అందరికి కన బడే విధంగా ఉండాలి . వాటికి ప్రత్యేకమైన రంగులు వేయాలి .  ఆ విధంగా  ఎక్కువ మంది   ప్రయాణికులు , షటిల్స్ లలో  వెళ్లడం వలన  ట్రాఫిక్ సమస్య  తగ్గిపోతుంది . అదే విధంగా  ఎక్కువ దూరం ప్రయాణం చేసే బస్సులను కూడా  ప్రతి 5  నిమిషాలకు  ఒకటి చొప్పున                  ( అవసారాను బట్టి )  కంటిన్యూ  చేయాలి .  ఈ విధంగా చేయడం వలన  రద్దీ తగ్గి పోయి  , ప్రయాణికులు  హాయిగా  ప్రయాణం చేయడానికి  వీలు కలుగుతుంది . 


Fourth step:

Just counsel the drivers and conductors to maintain good relationship with the passengers. And give free hand to the controllers and drivers and conductors to run the buses at the convenience of the passengers. Stopping of buses at bus stops,  running of the buses at nearest to the bus bays , maintenance of gap from bus to bus, maintain co ordination  among all types of drivers etc., So give free hand to drivers to maintain some gap from one bus to another bus,where ever possible. If the  drivers can not stop the buses in bus stops , must impose the penalties.Penalties should be just punishment but not treat as a RTC income.  Arrange more buses in the morning and evening times . Seasonally , give more concessions to attract more passengers.Then rush will increase in the  buses and profits will increase  to the organisation. 

Besides to that every day the Passengers and the Coductors are facing  lot of problems like fighting , quarrelling, Crying and  some times stopping the Buses in middle  etc ., is due to simple " Change Money ( Balance Money) " By seeing it looks like  small & simple. But every day and in evry bus it is a big issue. To solve this problem, there is  good ideas.  01. Simply alter the ticket charges to nearest Rs.5/-, 10/- , 15/- , 20/-  and 25/- etc., 02. Provide more change to the Conductors and provide the fascility to the conductors to get the change at every big bus stops, if required. 03. In addition to that issue the tokens for the balance money and allow the passengers to  en cash the amount with the tokens at evry Bus pass issue ceteres and to further to accept  the Conductors to travel in other Buses in different routes. 


నాల్గవ ప్రాధామ్యం :

రవాణా సంస్థలకు  దేవుళ్లతో  సమానమైన  ప్రయాణికులతో  ఎలా మెదులు కోవాలో  , వారితో  ఎలా మంచి సంభందాలు  ఏర్పరుచుకోవాలి  , ఎప్పటికప్పుడు  డ్రైవర్లకు  , కండక్టర్ల కు , కంట్రోలర్లకు  మరియు ఇతర ఉద్యోగులకు  సూచనలు చేయాలి . సలహాలు ఇవ్వాలి . అలానే కొంతమంది  నమ్మకమైన  , సమర్థులైన  కంట్రోలర్లకు , డ్రైవర్లకు , కండక్టర్ల కు  , ప్రయాణికుల రద్దీని  బట్టి , ప్రయాణికులకు అనుకూలంగా ,  బస్సులను నడిపే విధంగా  ఫ్రీడమ్ ఇవ్వాలి .  దీని వలన  ఎంతో డీజిల్ ఆదా అవుతుంది . ప్రయాణికులు హాయిగా ప్రయాణం చేస్తారు . ప్రయాణికులు  ఆటోల కోసం , క్యాబు   కోసం  పరుగెత్తరు . ప్రయాణికులకు  ఆర్ టీ  సి  పై నమ్మకం  పెరుగుతుంది . ఆ విధంగా ఆదాయం పెరుగుతుంది . ప్రతి బస్సును  బస్  స్టాప్  లలో , బస్  బే లలో  ఆపే  విధంగా కట్టడి చేయాలి .  బస్సులను ఆపని డ్రైవర్లకు  పెనాలిటీలను విధించాలి . అయితే  ఆ పెనాలిటీలు  వారిలో మార్పు కోసమే  అయి  ఉండాలి  గాని , ఆర్ టీ  సి కి  ఆదాయముగా ఎంచరాదు . ప్రయాణికుల రద్దీని బట్టి  ఉదయం  , సాయంత్రం  ఎక్కువ బస్సులు  , మధ్యాహ్నం తక్కువ బస్సులు నడపాలి . పండుగలు , పబ్బాలు , పరీక్షలు , పెళ్లిళ్లు , పుష్కరాలప్పుడు బస్సులను  ఎక్కువగా నడపాలి .  ఈ విధంగా  మార్పులు చేయడం వలన    ప్రయాణికులకు  ఆర్ టీ  సి పై నమ్మకం  పెరుగుతుంది . క్రమేణా రద్దీ పెరుగు తుంది . ఆ విధంగా  ఆర్ టీ సి కి ఆదాయం పెరుగుతుంది . 


అదియును గాక ప్రతి రోజు  ప్రయాణికులు , కండక్టర్లు  ఎదుర్కునే  సమస్య , కొట్లాడుకునే సమస్య , కొట్టుకునే సమస్య , ఇతర ప్రయాణికులకు  ఇబ్బంది కలిగే సమస్య , ఒక్కో సారి బస్సులను ఆపి వేసే సమస్య " చిల్లర సమస్య " . చూస్తే  ఇది చిన్నదే . కానీ  అనుభవించిన ప్రయాణికులకు , కండక్టర్లకు   తెలుస్తుంది  దీని ప్రభావం  ఎంతో . నష్ట పోయే ప్యాసింజర్లే  ఎక్కువగా కనబడుతారు .ఈ సమస్యకు చక్కటి  పరిష్కారాలున్నాయి . అవి , 01. బస్సు చార్జీలను  రూ లు  5/-, 10/- ,15/- , 20/-,25/- కి  దగ్గరగా  మార్చాలి . 02. కండక్టర్లకు  ఎక్కువ  చిల్లరను అందించాలి . ప్రతి పెద్ద బస్సు స్టాప్ లలో , కండక్టర్లు చిల్లరగా మార్చుకునేందుకు  అవకాశం కల్పించాలి . 03.  వీటికి అదనంగా  టోకెన్లను జరీ చేయాలి . మరియు  అవి  ప్రతి  పెద్ద  బస్సు పాస్ సెంటర్లలో  నగదుగా మార్చు కునేందుకు   మరియు / లేదా  ఇతర ప్రాంతాలకు  వేరే బస్సులలో అవే  టోకెన్లతో  ప్రయాణం చేసేందుకు  అవకాశం కల్పించాలి . 

Fifth step:

Concentrate on competitors.  competitors are  other sector  buses, SETWIN  buses, Autos, Cabs etc. If the corporation is able  to provide more facilities to the passengers , Passengers can not try for  Autos,Setwin buses and Cabs.If we observe closely, SETWIN buses always  run with heavy rush. But we can not find that much rush in the buses or in the mini buses all the times. Because ,SETWIN bus people  will wait at every bus stop and call the passengers and guide them where they have to get down.  Generally, passengers desire  " SPEED, SECURITY, SAFETY, RUSH FREE, CONVENIENT , STOPPING BUSES NEAREST TO THE OTHER CITY/ SUBURBAN BUS  STOPS  & RAIL WAY STATIONS  AND  LOW CHARGES " Hence, must  introduce the Mini Buses to go every nook & corner of the city and  stop the Buses, where ever  the passenger show the hand. Because ,their intention is to increase the occupancy and to  earn more profits.  Passengers are the Gods to the any transport corporation. So take the suggestion and ideas from the passengers and implement  at appropriate time and then watch the result. Issue the quarterly ,half yearly and yearly bus passes on passengers request. After verification only ,students are submitting the bus pass applications along with evidences. So the  organisation arrange to issue the students Bus passes with in minuts only. Encourage the passengers for the valuable ideas with free gifts and cash awards.

ఐదవ ప్రాధామ్యం :

పోటీ దారులపైన  దృష్టి పెట్టాలి . పోటీ దారులంటే  ప్రయివేటు బస్సులు , సెట్విన్ బస్సులు , ఆటోలు , క్యాబులు , రైళ్లు , పడవలు  మొదలైనవి . అవి రోజు రోజుకు మూడు పువ్వులు ఆరు కాయలు గా , ఎలా ఎదుగు తున్నాయో  అర్ధ చేసుకోవాలి . ప్యాసెంజర్లు ఆటోలను , క్యాబులను , ప్రయివేటుబస్సులను , రైళ్లనే ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలుసుకోవాలి .    కారణాలు ఏమిటో విశ్లేషించుకోవాలి .ప్యాసెంజర్ల  సలహాలను , సూచనలను  స్వీ కరించాలి. ప్యాసెంజర్లను  అడిగి తెలుసుకోవాలి . వాటికీ అనుగుణంగా సరియైన  చర్యలు చేపట్టాలి . ప్యాసెంజర్లకు  సరియైన  సదుపాయాలు కల్పించాలి . బస్సు షెల్టర్ల్  కావచ్చు , టాయిలెట్స్ కావచ్చు . సీటింగ్స్ కావచ్చు , ఫాన్స్ , లైటింగ్  కావచ్చు . బస్సుల టైమింగ్స్ ,  ప్రయాణికులకు గైడ్స్  మరియు  ఆయా నియమాలను పాటించడం  మొదలైనవి . 
ప్యాసెంజర్  ఎక్కడ  చెయ్యి లేపి ఆపమన్నా , ఆపే  విధంగా డ్రైవర్లకు , కండక్టర్లకు  సూచనలు చేయాలి .  సాధారణంగా  ప్యాసింజర్లు  ఏమి కోరుకుంటారంటే , " వేగం , రక్షణ  స్వేచ్ఛ , అధిక రష్  లేక పోవడం , అనుకూలత, ఇతర సిటీ/ సబర్బన్  బస్ స్టాప్ లకు , రైల్వే  స్టేషన్లకు  చేరువలో ఆపడం   మరియు  తక్కువ చార్జీలు"  అందుకని , ప్రతీ  వీధి  మూలలకు  వెళ్లేవిధంగా  మినీ బస్సులను ప్రవేశ పెట్టాలి .   బస్సుల్లో ఆక్యుపేషన్  పెంచాలనే ఉద్దేశ్యం డ్రైవర్లకు , కండక్టర్లకు కలుగ చేయాలి . ఏ రోడ్డు రవాణా సంస్థ కయినా  ప్యాసింజర్లే  దేవుళ్ళు . అందుకని  వారి సలహాలను , సూచనలను  సేకరించాలి . హంసల్లాగా  మంచి వాటిని ఇంప్లి మెంట్  చేయాలి . మిగిలిన వాటిని  పరిశీలనలో  పెట్టాలి .  విద్యార్థులకు  మరియు  ఇతర ప్యాసింజర్లకు  నెల వారీ , మూడు నెలల వారీగా , ఆరు నెలల వారీగా  బస్ పాస్ లను జారీ  చేయాలి . విద్యార్థుల బస్  పాసులను 15 నిమిషాలలో జారీ చేసే విధంగా  యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి . టెక్నాలజీని  ఉపయోగించు కోవాలి .  డెబిట్ , క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో  తీసుకునే విధంగా ఆప్ లను  తయారు చేయాలి .  మంచి మంచి  సలహాలకు , సూచనలకు , బహుమతులతో , నగదు  అవార్డ్స్  తో  ప్యాసింజర్లను  ప్రోత్సహించాలి . 


Sixth step:

Concentrate to utilize the  fixed assets, Buildings and variable assets to earn additional income.
If the any transport organisation takes the above steps at appropriate time, again it will turn into profits with in a short period.

ఆరవ ప్రాధామ్యం :

స్థిర  ఆస్తులను అనగా  బిల్డింగులు, ఖాళీ స్థలాలు , మడిగెలు  మరియు ఇతర  ఆస్తులను , అదనపు ఆదాయము  వచ్చే  విధంగా  , సరియైన విధంగా  ఉపయోగించుకోవడం పై దృష్టిని సారించాలి .  ఈ విధంగా చేయడం వలన , అతి కొద్దీ సమయం లోనే  లాభాలు కనబడుతాయి . 


Seventh step:

Try to implement  latest and  new schemes/services time to time to attract  all the passengers and also give the chance for  the young  generation suggestions and ideas.

ఏడవ ప్రాధామ్యం :

అన్ని రకాల  ప్యాసెంజర్లను  ఆకట్టుకోడానికి , ఎప్పటికప్పడు  క్రొత్త క్రొత్త  స్కీమ్ లను , సర్వీసులను ప్రవేశ పెట్టె ప్రయత్నం చేయాలి . 

Eighth step:

Must see that to provide better amenities to the passengers. Ex: Water , Shelters, Toilets , Wash rooms, Wall clocks, Fans, Eatable items at lower cost, Easy Tickets booking facilities , Bus pass issuing facilities , Entertainment facilities  and others time time may be identified. And also , must arrange route boards on buses , front side , back side and entrance side etc., to easily identify by the passengers in the nights also.  Must provide guides  where ever trafic is more. 

ఎనిమిదవ ప్రాధామ్యం :

ప్యాసింజర్స్ కు  తప్పనిసరిగా  సరియైన  సదుపాయాలను  కల్పించాలి . ఉదా :  త్రాగు నీరు , బస్సు స్టాపులు ,  ఉచిత మల మూత్ర శాలలు , గోడ గడియారాలు ,  ఫ్యాన్లు , తక్కువ ధరలకు  టీలు , తిను బండారాలు , కరెంటు , టికెట్ బుకింగ్  సదుపాయాలు , సులువుగా  బస్సు పాస్  పొందే సదుపాయాలు , ఎంటర్టైన్  మెంట్  సదుపాయాలు , వై ఫై మొదలైనవాటిని  కల్పించాలి . అలానే  ప్యాసింజర్లకు  రాత్రి సమయాలలో  కూడా కనపడే విధంగా  రూట్ బోర్డులను  బస్సుల ముందు భాగాన ,  వెనుక భాగాన , ప్రక్క భాగాన  పెట్టాలి . రద్దీ బస్సు స్టాప్ లలో  గైడ్ లను  నియమించాలి . 

Nineth step:

Must concentrate on cost reduction and cost control . For example, while purchasing Buses , or while calling tenders etc., there must be transparent. Diesel consumption, unauthorized salaries and Wages, Spare parts purchase, Sale of scrap etc., To reduce the travelling routes , where ever trafic is low, use short cut routes to reduce the the diesel cost. Must concentrate on utilization of RTC buildings and spaces by giving rents or lease , By reducing administration cost where ever possible,  imposing huge penalties  for miss using of Bus passes and Ticket less travelers / passengers / students etc.,

తొమ్మిదవ ప్రాధామ్యం :

ధరలను తగ్గించడం లో , వృధా ఖర్చును  కంట్రోల్  చేయడం పై తప్పని సరీగా  దృష్టిని సారించాలి . ఉదా : క్రొత్త బస్సులను కొను నపుడు , టెండర్లు పిలుచునపుడు  పారదర్సకత  ఉండాలి . బస్సుల రిపేర్లు , డీజిల్  వినియోగం , అనధికారిక  జీతాలు , వేతనాలు , స్పేర్ పార్ట్స్  కొనుగోళ్లలో  , స్క్రాప్ అమ్మడంలో నియంత్రణ  పెంచాలి  . ప్రయాణ  రూట్ల  దూరాలను , ట్రాఫిక్ తక్కువ ఉన్న చోట , డీజిల్ ఖర్చును   తగ్గించుకునే విధంగా  షార్ట్ కట్ రూట్లను ఎంచుకోవాలి . ఆర్ .టి.సి.బిల్డింగులను , ఖాళీ స్థలాలను , సైన్ బోర్డులను  కిరాయిలకు లేదా లీజులకు  ఇచ్చి అదనపు ఆదాయాన్ని  పొందాలి . అలానే  ఎక్కడ వీలైతే అక్కడ  అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను  తగ్గించాలి .  బస్సు పాస్ లను మిస్ యూజ్  చేసిన  వారికీ  అధిక పెనాలిటీలు విధించాలి . 


Tenth Step:

The Govt. concerned must compansate  to the RTC , what ever amount , the RTC is loosing by way of "Free Bus passes" , "Concessional Passes" and other General passes issued to the Passengers  and Students  and  running the buses to the students at free of charges  etc., This may be  about Rs.800/- Crores to Rs. 1,000/- Crores, every year. Must co operate and co ordinate with the different Govt. Departments. Viz., GHMC, Police Department, Electricity Department and others. Saying  that the RTC is losses is vague , when the buses are  running with 'skin tight' passengers, 

పదవ ప్రాధామ్యం :

ప్రతి సంవత్సరం  ఆర్ . టి . సి ,  ఉచిత బస్సు పాసుల మూలంగా ,  ప్యాసింజర్లకు జారీ చేసే  బస్సు  పాసుల వలన  , కన్సీషన్  రూపంలో  మరియు  విద్యార్థులకు ఉచితంగా నడిపే  బస్సుల వలన  నష్ట పోయే  మొత్తాన్ని , సంభందిత  ప్రభుత్వాలు , ఆర్ . టి . సి  కి  చెల్లించాలి . ప్రతి సంవత్సరం ఇది  సుమారుగా రూ . లు . 800/- కోట్ల నుండి 1,000/- కోట్లు ఉంటుందని అంచనా . ముఖ్యంగా  వివిధ ప్రభుత్వ  విభాగాలతో  సత్సంభందాలు , సహకారాలు  వుండేట్లుగా చూసుకోవాలి . ఉదా : జి . హెచ్ . ఎం సి ., పోలీస్ డిపార్ట్మెంట్ , ఎలిక్ట్రిసిటీ  డిపార్ట్మెంట్  మరియు ఇతర ప్రభత్వ సంస్థలు . బస్సులు 'కిక్కరిసిన ' (SKIN TIGHT) ప్రయాణికులతో  నడుస్తుంటే  రోడ్డు రవాణా సంస్థ  నష్టాలలో ఉందనడం  హాస్యాస్పదం . 

When we  impliment the above plans and suggestions , then we can not listen or see any losses in  the RTC, in any year. We will see  only the profits.

పైన  సూచించిన  విధానాలను  అమలు చేసినట్లవుతే , మనం  ఆర్ టి సి  లో ఎలాంటి నష్టాల గురించి  వినం ,  చూడం . ప్రతి సంవత్సరం లాభాల గురించే వింటాం , చూస్తాం . 


All the success! Best of luck!


అంతా విజయమే జరుగుగాక ! అదృష్టం వరించు గాక !

www.sollutins2all.blogspot.com

Wednesday, June 1, 2016

" ఆధార్ కార్డుల " (AADHAR CARDS) ను ప్రతి ఒక్కరికి ఎందుకు జారీ చేయాలి ? ఇతర ప్రభుత్వ అధి కార కార్డులతో ఎందుకు అనుసంధానం చేయాలి ?




ప్ర : " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  

ను ప్రతి  ఒక్కరికి ఎందుకు  జారీ చేయాలి  ? ఇతర ప్రభుత్వ అధి కార కార్డులతో  ఎందుకు అనుసంధానం  చేయాలి ? 

జ : " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  ను ప్రతి  ఒక్కరికి   జారీ చేయాలి".  అంతే కాకుండా , ఆధార్ కార్డుల " ను  ప్రతి ఒక్కరికి అతి త్వరగా ఉచితంగా ఇష్యూ చేయాలి . ప్రజలందరికి  దీనిని  ఒక భారతీయ  గ్రీన్ కార్డుగా  భావించాలి .  ఎందు కనగా , వీటిని ఎంతో ముందు జాగ్రత్తతోటి , ఎలాంటి  అవక తవకలకు తావు లేకుండా , ఎలాంటి  డుబ్లికేటువి  తయారు చేయడానికి తావు లేకుండా , వేలుముద్రలు , కంటి గ్రుడ్డు లోపలి  గుర్తులు (Irish) , వ్యక్తుల  పూర్తి  వివరాలు పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా  జారీ చేస్తున్న అధికార ధ్రువ పత్రాలు  " ఆధార్ కార్డులు  " (AADHAR CARDS)

ఇవి  కేవలం గుర్తింపు  కోసం మాత్రమే కాకుండా  వేలాది కోట్ల మోసాలు , అవినీతి  మరియు డుప్లికేట్ మనుష్యులను  లేకుండా చేస్తాయి .  వీటి వలన  అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే " ఆధార్ కార్డుల " ను బహులార్ధ సాధక కార్డులుగా  చెప్పుకోవచ్చు . బహుళ ప్రయోజనాలను  దృష్టిలో పెట్టుకుని  వీటిని భారతీయ ప్రజలందరికి  ఉచితంగా శాశ్విత ప్రాతి పదికన జారీ  చేయాలి . ప్రతి ఒక్కరూ  దీనిని  కలిగి ఉండడాన్ని నిర్భందం  చేయాలి . 

"శ్రీ నందనీ నీలకని" గారు ప్రతిష్టాత్మకంగా  చేపపట్టిన  ప్రాజెక్ట్ నూటికీ  నూరు శాతం   విజయం సాధించిందనడంలో  సందేహం  లేదు . నాటి   ప్రభుత్వానికి మరియు  "శ్రీ నందనీ నీలకని" గారికి  అభినందనలు  తెలుపాలి . మొదట  బ్యాంకులు  ఖాతా తెరువడానికి   " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  ను  ఆక్సెప్ట్  చేయ లేదు , ఇన్కంటాక్స్  వారు ' పాన్ ' కార్డుకు  మరియు   గ్యాస్ కంపెనీల వారు, గ్యాస్ కనెక్షన్లకు    " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  ను  ఆక్సెప్ట్  చేయ లేదు , 

ఇప్పుడిపుడే ,  గ్యాస్ కంపెనీల వారు   " ఆధార్ కార్డుల " ను ఇతర ప్రభుత్వ అధి కార కార్డులతో ఉదా : ఓటరు కార్డులతో , డ్రైవింగ్ లైసెన్సులతో , గ్యాస్ కనెక్షన్లతో , పాస్ పోర్టులతో  , పాన్ కార్డులతో , బ్యాంక్ అకౌంటులతో , అన్ని రకాల ,  రిజి ష్ట్రేశన్లతో , డిన్  నెంబరుతో , సెల్ ఫోన్ కనెక్షన్లతో , విద్యార్ధుల  అడ్మీ షన్లతో  , పెన్షన్లతో, రకాల  సంక్షేమ పధకాలతో  మరియు   కొత్తగా చేరే వారి  ఉద్యోగాలతో    అనుసంధానం చేస్తున్నారు . ఇంకను  అన్ని రకాల  సంక్షేమ పధకాలతో  అనుసంధానం చేయాలి  . మనం  ఈ మద్య  పేపర్లలో, టి . వి. చానళ్లలో  లో చూస్తున్నాం , దేశంలో సుమారుగా 5 కోట్ల బోగస్ వోటరు కార్డులు ఉన్నాయని , 5 లక్షల బోగస్ పాన్ కార్డులున్నాయని .  ఎన్ని బోగస్ పాస్ పోర్టులు , ఎన్ని బోగస్ డ్రైవింగ్ లైసెన్సులు , ఎంత మంది బోగస్ ఉద్యోగులు , ఎంత మంది  బోగస్ విద్యార్థులు , ఎన్ని బోగస్  గ్యాస్  కనెక్షన్లు ,  ఎన్ని బోగస్  సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయో  తెలియదు .  ఒక బోగస్ ఓటరు కార్డు ఉందంటే , ఆ కార్డు పై  సంక్షేమ పధకాల రూపేన  ప్రభుత్వాలు  కోట్లాది రూపాయలు నష్ట పోతున్నది . గతంలో  చూసాం , విద్యార్ధులు లేక పోయినా , స్కాలర్ షిప్పులు  వెళ్లాయని , మనుష్యులు లేక పోయినా  , జీతాలు వెళ్లాయని , పెన్శ ర్లు  లేక పోయినా  పెన్షన్ సొమ్ము వేల్లేదని , ఇలా  ఎన్నో అవక తవకలు  , మోసాలు  జరిగాయని .  ఇలా  మరల మరల  జరుగ కుండా  ఉండాలంటే  , ప్రభుత్వాలు  వేల  కోట్ల డబ్బు నష్ట పోకుండా ఉండాలంటే , అదే సమయంలో  నిజమైన  పేద ప్రజలకు  కనీస వసతులతో జీవించాలంటే , " ఆదార్ కార్డుల " ను 
 ఇతర అన్ని  ప్రభుత్వ  అధి కార కార్డులతో అనుసంధానం చేయాలి  . "శ్రీ నందనీ నీలకని" గారిని  , " ఆధార్ కార్డుల "  విశిష్టతను  పెద్దగా  గుర్తించడం లేదు . కానీ ఏదో ఒక రోజు  పూర్తి ' పారదర్శక పాలకులు ' ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రోజు ,  "శ్రీ నందనీ నీలకని" గారిని  బంగారు పల్లకిలో  ఊరేగిస్తారు . ' భారత రత్న ' తో గౌరవిస్తారు . 

ఎ ఒక్కరూ సంక్షేమ పధకాలు పొంద కుండా ఉండ కూడదు . అదే సమయంలో అనర్హులకు తావుండ కూడదు. అందుకని ప్రతి సంక్షేమ పధకాలలో మరియు ప్రతి వ్యవ హారంలో ( అనగా , బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా , డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా , పాన్ కార్డు కు అప్ప్లై చేసినా , పాస్ పోర్టుకు అప్ప్లై చేసిన , భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నా , వోటర్ కార్డుకు అప్ప్లై చేసినా , గ్యాసుకు అప్ప్లై చేసినా , ఉద్యోగానికి అప్ప్లై చేసినా , కుల , ఆదాయ ధ్రువ పత్రాలకు అప్ప్లై చేసినా మరియు ఇతర అన్నింటికీ ) 
" ఆధార్ కార్డుల " నునిర్బంధం చేయాలి . అప్పుడే అవినీతి కంట్రోల్ అవుతుంది . అప్పుడే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది . అప్పుడే కోర్టులలో  కేసులు తగ్గి పోతాయి . అప్పుడే లా అండ్  ఆర్డర్  కు పని భారం తగ్గుతుంది .  అప్పుడే రాష్ట్రాలకు , కేంద్రానికి వేల కోట్ల ఆదాయం అందుబాటు లోకి వస్తుంది . ఎంత ఆలస్యం చేస్తే అంత అవినీతి పెరుగుతుంది .