Wednesday, June 1, 2016

" ఆధార్ కార్డుల " (AADHAR CARDS) ను ప్రతి ఒక్కరికి ఎందుకు జారీ చేయాలి ? ఇతర ప్రభుత్వ అధి కార కార్డులతో ఎందుకు అనుసంధానం చేయాలి ?




ప్ర : " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  

ను ప్రతి  ఒక్కరికి ఎందుకు  జారీ చేయాలి  ? ఇతర ప్రభుత్వ అధి కార కార్డులతో  ఎందుకు అనుసంధానం  చేయాలి ? 

జ : " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  ను ప్రతి  ఒక్కరికి   జారీ చేయాలి".  అంతే కాకుండా , ఆధార్ కార్డుల " ను  ప్రతి ఒక్కరికి అతి త్వరగా ఉచితంగా ఇష్యూ చేయాలి . ప్రజలందరికి  దీనిని  ఒక భారతీయ  గ్రీన్ కార్డుగా  భావించాలి .  ఎందు కనగా , వీటిని ఎంతో ముందు జాగ్రత్తతోటి , ఎలాంటి  అవక తవకలకు తావు లేకుండా , ఎలాంటి  డుబ్లికేటువి  తయారు చేయడానికి తావు లేకుండా , వేలుముద్రలు , కంటి గ్రుడ్డు లోపలి  గుర్తులు (Irish) , వ్యక్తుల  పూర్తి  వివరాలు పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా  జారీ చేస్తున్న అధికార ధ్రువ పత్రాలు  " ఆధార్ కార్డులు  " (AADHAR CARDS)

ఇవి  కేవలం గుర్తింపు  కోసం మాత్రమే కాకుండా  వేలాది కోట్ల మోసాలు , అవినీతి  మరియు డుప్లికేట్ మనుష్యులను  లేకుండా చేస్తాయి .  వీటి వలన  అనేక ప్రయోజనాలున్నాయి. అందుకే " ఆధార్ కార్డుల " ను బహులార్ధ సాధక కార్డులుగా  చెప్పుకోవచ్చు . బహుళ ప్రయోజనాలను  దృష్టిలో పెట్టుకుని  వీటిని భారతీయ ప్రజలందరికి  ఉచితంగా శాశ్విత ప్రాతి పదికన జారీ  చేయాలి . ప్రతి ఒక్కరూ  దీనిని  కలిగి ఉండడాన్ని నిర్భందం  చేయాలి . 

"శ్రీ నందనీ నీలకని" గారు ప్రతిష్టాత్మకంగా  చేపపట్టిన  ప్రాజెక్ట్ నూటికీ  నూరు శాతం   విజయం సాధించిందనడంలో  సందేహం  లేదు . నాటి   ప్రభుత్వానికి మరియు  "శ్రీ నందనీ నీలకని" గారికి  అభినందనలు  తెలుపాలి . మొదట  బ్యాంకులు  ఖాతా తెరువడానికి   " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  ను  ఆక్సెప్ట్  చేయ లేదు , ఇన్కంటాక్స్  వారు ' పాన్ ' కార్డుకు  మరియు   గ్యాస్ కంపెనీల వారు, గ్యాస్ కనెక్షన్లకు    " ఆధార్ కార్డుల " (AADHAR CARDS)  ను  ఆక్సెప్ట్  చేయ లేదు , 

ఇప్పుడిపుడే ,  గ్యాస్ కంపెనీల వారు   " ఆధార్ కార్డుల " ను ఇతర ప్రభుత్వ అధి కార కార్డులతో ఉదా : ఓటరు కార్డులతో , డ్రైవింగ్ లైసెన్సులతో , గ్యాస్ కనెక్షన్లతో , పాస్ పోర్టులతో  , పాన్ కార్డులతో , బ్యాంక్ అకౌంటులతో , అన్ని రకాల ,  రిజి ష్ట్రేశన్లతో , డిన్  నెంబరుతో , సెల్ ఫోన్ కనెక్షన్లతో , విద్యార్ధుల  అడ్మీ షన్లతో  , పెన్షన్లతో, రకాల  సంక్షేమ పధకాలతో  మరియు   కొత్తగా చేరే వారి  ఉద్యోగాలతో    అనుసంధానం చేస్తున్నారు . ఇంకను  అన్ని రకాల  సంక్షేమ పధకాలతో  అనుసంధానం చేయాలి  . మనం  ఈ మద్య  పేపర్లలో, టి . వి. చానళ్లలో  లో చూస్తున్నాం , దేశంలో సుమారుగా 5 కోట్ల బోగస్ వోటరు కార్డులు ఉన్నాయని , 5 లక్షల బోగస్ పాన్ కార్డులున్నాయని .  ఎన్ని బోగస్ పాస్ పోర్టులు , ఎన్ని బోగస్ డ్రైవింగ్ లైసెన్సులు , ఎంత మంది బోగస్ ఉద్యోగులు , ఎంత మంది  బోగస్ విద్యార్థులు , ఎన్ని బోగస్  గ్యాస్  కనెక్షన్లు ,  ఎన్ని బోగస్  సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయో  తెలియదు .  ఒక బోగస్ ఓటరు కార్డు ఉందంటే , ఆ కార్డు పై  సంక్షేమ పధకాల రూపేన  ప్రభుత్వాలు  కోట్లాది రూపాయలు నష్ట పోతున్నది . గతంలో  చూసాం , విద్యార్ధులు లేక పోయినా , స్కాలర్ షిప్పులు  వెళ్లాయని , మనుష్యులు లేక పోయినా  , జీతాలు వెళ్లాయని , పెన్శ ర్లు  లేక పోయినా  పెన్షన్ సొమ్ము వేల్లేదని , ఇలా  ఎన్నో అవక తవకలు  , మోసాలు  జరిగాయని .  ఇలా  మరల మరల  జరుగ కుండా  ఉండాలంటే  , ప్రభుత్వాలు  వేల  కోట్ల డబ్బు నష్ట పోకుండా ఉండాలంటే , అదే సమయంలో  నిజమైన  పేద ప్రజలకు  కనీస వసతులతో జీవించాలంటే , " ఆదార్ కార్డుల " ను 
 ఇతర అన్ని  ప్రభుత్వ  అధి కార కార్డులతో అనుసంధానం చేయాలి  . "శ్రీ నందనీ నీలకని" గారిని  , " ఆధార్ కార్డుల "  విశిష్టతను  పెద్దగా  గుర్తించడం లేదు . కానీ ఏదో ఒక రోజు  పూర్తి ' పారదర్శక పాలకులు ' ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రోజు ,  "శ్రీ నందనీ నీలకని" గారిని  బంగారు పల్లకిలో  ఊరేగిస్తారు . ' భారత రత్న ' తో గౌరవిస్తారు . 

ఎ ఒక్కరూ సంక్షేమ పధకాలు పొంద కుండా ఉండ కూడదు . అదే సమయంలో అనర్హులకు తావుండ కూడదు. అందుకని ప్రతి సంక్షేమ పధకాలలో మరియు ప్రతి వ్యవ హారంలో ( అనగా , బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసినా , డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా , పాన్ కార్డు కు అప్ప్లై చేసినా , పాస్ పోర్టుకు అప్ప్లై చేసిన , భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నా , వోటర్ కార్డుకు అప్ప్లై చేసినా , గ్యాసుకు అప్ప్లై చేసినా , ఉద్యోగానికి అప్ప్లై చేసినా , కుల , ఆదాయ ధ్రువ పత్రాలకు అప్ప్లై చేసినా మరియు ఇతర అన్నింటికీ ) 
" ఆధార్ కార్డుల " నునిర్బంధం చేయాలి . అప్పుడే అవినీతి కంట్రోల్ అవుతుంది . అప్పుడే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది . అప్పుడే కోర్టులలో  కేసులు తగ్గి పోతాయి . అప్పుడే లా అండ్  ఆర్డర్  కు పని భారం తగ్గుతుంది .  అప్పుడే రాష్ట్రాలకు , కేంద్రానికి వేల కోట్ల ఆదాయం అందుబాటు లోకి వస్తుంది . ఎంత ఆలస్యం చేస్తే అంత అవినీతి పెరుగుతుంది . 

No comments: