Thursday, December 3, 2020

జి .హెచ్ .ఎం .సి ఎన్నికల(డిసెంబర్ ,2020)లో పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు? (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE IN GHMC ELECTIONS ) & పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి?

;
ప్ర: జి .హెచ్ .ఎం .సి ఎన్నికల (డిసెంబర్,2020) లో పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు? (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE IN GHMC ELECTIONS, DECEMBER,2020 ) & పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి? 

జ:ఎన్నికల సందర్భంగా , ఎన్నికల కమీషన్ మరియు మీడియా అనేక రకాలుగా , అవగాహనా కల్పించినా , ప్రోత్స హించినా , బాధ్యతను గుర్తు చేసినా ,ఎన్నికలలో పోలింగ్ శాతం తగ్గడానికి " కర్ణుడి చావుకి శతకోటి కారణాలన్నట్లు ", అనేక కారణాలున్నాయి. డిసెంబర్ ,2020 లో జరిగిన జి .హెచ్ .ఎం .సి ఎన్నికలలో , స్టేట్ ఎలక్షన్ కమీషనర్ చెప్పిన ప్రకారం , మొత్తం ఓటర్ల సంఖ్య , 74 లక్షల 67 వేల 256 . (ఇది కాన్స్టిట్యూఎన్సీ లిస్ట్ ) 43 శాతం పోలింగ్ జరిగిందని అంటున్నారు . అంటే ఓటర్ల సంఖ్య సుమారుగా 32 , 10 వేల 920 అన్నమాట . ఎన్నికల లిస్టులు చూస్తే , కనీసం 20 శాతం ఓటర్లు డిలీట్ అయినవి . 20 శాతం అంటే 14 లక్షల 93 వేల 451 ఓటర్లను డిలీట్ చేశారు. కరోనా వలన , సాఫ్ట్వేర్ ఇంజినీర్లు , ఇతరులు సుమారుగా 10 లక్షల మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. లేదా గ్రామాలకు వెళ్లి పోయారు. ఇక కనీసం 2 లక్షల మంది ఓటర్లు మున్సిపల్ కార్పొరేషన్ లిస్ట్ ల లోకి వెళ్లి పోయారు . వీటిని తీసివేస్తే జి .హెచ్ .ఎం సి . ఓటర్ల సంఖ్య - 47 లక్షల 73 వేల 805 ఓటర్లు . ఇక పాలయిన ఓట్ల సంఖ్య - 32 లక్షల 10 వేల 920 . ఈ లెక్కన పోలింగ్ శాతం చూస్తే - 67 . 26 శాతం పోలైనట్లు లెక్క. 

  పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు
1. చాలా మంది పేర్లు , ఒకటి కంటే ఎక్కువగా నమోదు కావడం . ఆన్ లైన్ ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా . కరెక్క్షన్స్ కోసం అవకాశం కల్పించడం వలన , అన్ని రకాలుగా సబ్మిట్ చేసారు . తక్కువ సమయం , సిబ్బంది కొరత మొదలైన కారణాల వలన , పాతవి అలానే వుంచి క్రొత్తగా మరల రిజిస్టర్ చేయడం లాంటివి జరుగు చున్నవి. ఫోటోలు మారడము , పేర్లు , అడ్డ్రస్సులు తేడాగా వుండటం వలన , లిస్టులో నుండి రిమువ్ చేయలేక పోతున్నారు. 
2. ఆంద్ర ప్రదేశ్ ప్రజలు మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు, ఇతర జిల్లాల ప్రజలు వారి స్వస్థాలాలోనే కాకుండా , మరల ఇక్కడ కూడా నమోదు చేసుకుని ఉండి ఉండొచ్చు. రెండు సార్లు వేయకుండా , ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు చేపట్టక చేపట్టక పోవడం వలన , ఇక్కడి ఎన్నికలలో పాల్గొన కుండా ఉండటాన్ని కొట్టి పారేయ లేము. 
3. చాలా మంది అర్హత ఉన్న అనేక ఏండ్లు గా ఉంటున్న ఓటర్లను , అనేక కారణాల వలన ఓటర్ల లిస్టుల నుండి తొలగించడం జరిగింది . ఆ కారణంగా చాలా మంది ఓటర్లు, వారి ఓటు హక్కు వినియోగించు కోలేక పోయారు .
4. చాలా మంది ఓటర్లకు , ఎన్నికల సిబ్బంది ఓటరు స్లిప్పులను ఇవ్వడం లేదు . అందు వలన మరియు పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలియక , ఓటు వేయలేక పోయారు .  
5. గ్రేటర్ హైదరాబాదు లో , వివిధ కారణాల వలన అడ్డ్రస్సులు మారే వారు అధికం . అడ్డ్రస్సులు మారిన వారు , పాత అడ్డ్రస్సుల్లో ఉండరు కాబట్టి , ఎన్నికల స్లిప్పులు ఇవ్వడానికి అవకాశమే లేదు . ఆ కారణంగా కూడా కూడా కొంత మంది ఓటర్లు వోటు వేయ లేక , ఓటు శాతం తగ్గింది . 
 6. చని పోయిన వారి పేర్లు ఓటరు లిస్టులో నుండి తొలగించక పోవడం వలన , నమోదయిన ఓటర్ల సంఖ్యా పెరిగి నట్లైంది. ఓటింగ్ శాతం తగ్గి నట్లైంది . 
7. ఈ మద్య కాలంలో నూతనంగా వెరయిటీ ఓటర్ ఐ డి కార్డులు ఇష్యూ చేసారు . వాటి మీద ప్రజెంట్ పోలింగ్ బూతు నెం . పార్ట్ నెం . స్థలం అన్నీ ఉన్నాయి . సులువుగా వీరిని బూతు లోకి అనుమతించ వచ్చు . కాని స్లిప్పులు లేని కారణంగా వీరిని బూతు లోకి అనుమతించ లేదు . తెలియక కొందరు , వాదించడం ఇష్టం లేక కొందరు , లాఠీలకు బయ పడి కొందరు వెను తిరిగి పోయారు . ఓటరు కార్డుల పైననే ఇవన్నీ ఉన్నాయని , ఇలా కొత్తగా ఓటరు కార్డులు పొందిన వారికి మరియు ఎన్నికల సిబ్బంది కి , ఎన్నికల కమీషన్ అవగాహనా కల్పించ లేక పోయారు . 
8. కొందరు అని వార్య కారణాల వలన , ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వలన , ఓటు వేయలేక పోయారు . 
9. మరి కొందరు అనారోగ్య కారణాల వలన , ఓటు వేయలేక పోయారు . 
10. ఇంకొందరు , ఓటు వేసినా , వేయక పోయినా వీరాభి మానుల కారణంగా ఎవరో ఒకరు గెలుస్తారు , మరల యదా విదే , అని ఎన్నికలంటే నిరాసక్తత , నిర్లక్ష్యO , అయిష్టత తో ఓటు వేయ కుండా ఉండ వచ్చు . 
11. డబ్బు , మందు ప్రభావం కొందరిలో ఉత్సాహాన్ని నింపుతే , మరికొందరిలో నిరుత్సాహాన్ని , ఇంకొందరిలో పగలు , కక్షలు , కొట్లాటలు పెంచి ఓటు హక్కు లను దూరం చేసాయి . 
12. కొన్ని చోట్ల పోలింగు బూతులు దూరంగా ఉండటం వలన ఓటు హక్కు వినియోగించు కోలేదు . 13. ఒకే కుటుంభ సభ్యులకు , తల్లి దండ్రులకు పాత కార్డుల ప్రకారం ఒక అడ్డ్రస్సు బూతు , కొత్తగా అవకాశం వచ్చిన పిల్లలకు కొత్త కార్డుల ప్రకారం మరో పోలింగు బూతు పడటం వలన , ఎవరో ఒకరు , లేదా అందరూ ఓటు వేయడం మిస్ చేసు కుని ఉండాలి .వృద్ధులను పోలింగ్ భూత్ లకు తీసుకపోవడం వీలు కాక పోవడం వలన. 
14. ఎండ ప్రతాపం మరియు నీరు , నీడ లాంటి సౌకర్యాలు కొరవవడం కూడా , ఎన్నికల శాతం తగ్గడానికి కారణం అయి ఉండాలి . 
15. వేరే ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉండటం , పోస్టల్ బ్యాలెట్ వోటు హక్కును వినియోగించు కోవడం మరిచి పోవడం మొదలగునవి , ఎన్నో కారణాలు , గ్రేటర్ హైదరాబాదు లో ఓటింగు శాతం తగ్గ డానికి కారణ మయ్యాయి. 

ఎన్నికల కమీషన్ , ఎంతో దూరదృష్టితో వోటర్ కార్డు ప్రాముఖ్యతను గుర్తించి , ఓటరు నమోదు ప్రక్రియ ను ప్రారంభించింది . వోటరు కార్డు అనేది ఇప్పుడు ఒక "బహులార్ధక సాధక సాధనం " . బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా వోటరు కార్డు నే అడ్గు తున్నారు . రేషన్ కార్డు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డు నే అడుగు తున్నారు . టెలి ఫోనుకు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . పాస్ పోర్టు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . డ్రైవింగ్ లైసెన్సు కు అప్లై చేయాలన్నా వోటరు కార్డు కావాలి. చివరికి వోటు వేయాలన్నా వోటర్ కార్డు కావాలి . ఇంత ముఖ్యమైన వోటర్ కార్డు , అప్లై చేసిన ప్రతి చోటా ఉంటాయి . అలాంటిది , వోటర్ లిస్టులో పేరు లేక పోతే , వోటర్ కార్డు విలువ ఏమిటి ?. వోటరు , వోటు వేయడానికి వెళ్లి నప్పుడు వోటు వేసే అర్హత లేదన్నప్పుడు ఎంత క్షోభకు గురి అవుతాడు . బ్యాంకు , పాస్పోర్ట్ , టెలిఫోన్, డ్రైవింగ్ అధి కారులు , ఏదేని అవసరం వచ్చి వోటరును వేడుకుదామనుకుని , వోటర్ లిస్టు వేడుకుతే , అందులో వోటరు పేరు లేక పోతే , ఇక ఎలా ముందు కెలుతారు ?. ఇక ప్రజలకవ్యవస్థలపై విశ్వాసం ఎలా కలుగుతుంది ? 

పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి ? 
1. ప్రతి ఇంటి ఇంటికి ఎన్నికల కమీషన్ నియమించిన సిబ్భందే వెళ్లి , అర్హులైన వోటర్ల గురించి , అనర్హులైన వోటర్ల గురించి ఖచ్చితమైన విచారణ జరిపి , తప్పుడు వోటర్లను , ఓటర్ లిస్టు నుండి తొలగించాలి . అలానే ఓటరు లిస్టులో లేని పేర్లను అక్కడికక్కడే ఫోటోలు దింపి , అప్లికేషన్లను తీసుకోవాలి . ఆ తరు వాత ఓటరు లిస్టులో నమోదు చేయాలి . 
2. విచారణకు నియమించ బడే సిబ్భంది , ఏమి చదివారు అనేది కాకుండా , ప్రజల భాషలు అర్ధం చేసు కోగలరా , మాట్లాడ గలరా , చదువ గలరా , వ్రాయ గలరా , విచారణ భాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ గలరా అనేది పరిశీలించి నియమించాలి . 
3. మరణ ధ్రువ పత్రాలు ఇష్యూ చేసే జి. ఎచ్. ఎం సి నుండి వివరాలు సేకరించి, మరణించిన వారి పేర్లను ఓటరు లిస్టు లో నుండి తొలగించాలి . 
4. ఏ రాజ కీయ నాయకులకు , కార్య కర్తలకు , ఓటరు లిస్టులో పేర్లను తొలగించ డానికి , అవకాశం ఇవ్వ కూడదు . 
5. కేవలం గత ఎన్నికలలో ( వివిధ కారణాల మూలంగా ) ఓటు వేయ లేక పోయి నంత మాత్రాన , వారి పేర్లను ఓటర్ లిస్టులో నుండి తొలగించ కూడదు . 
6.ఒకసారి కంటే ఎక్కువ సార్లు లిస్టయిన పేర్లను , ఫోటోలను , అడ్డ్రస్స్ లను గుర్తిచే , కనీసం రాష్ట్ర పరిధిలో నైనా , సాఫ్టవేర్ ను ఉపయోగించి , డూప్లికేట్ ఓటర్లను గుర్తించి , అనలైజ్ చేసి , నిర్ధారణ చేసు కుని , అలాంటి వాటిని తొలగించాలి . 
7.ఎన్నికల కమీషన్ , కేవలం ఎన్నికల సమయాన్నే మొక్కుబడి గా హడావుడి చేయ కుండా , పూర్తి కాలం వోటర్ల నమోదు , వోటర్ల తొలగింపు పై దృష్టి సారించాలి . 
8. నిస్వార్ధంగా ఎన్నికలను జరిపించాలి . ప్రభుత్వ ఒత్తిడులకు లొంగ కూడదు. 
9. ఎన్నికల బ్యాలెట్ పేపర్లలో గాని , ఈవీఎం లలో గాని , వీరిపై ఇన్ని క్రిమినల్ కేసులు , లేదా ఇతర కేసులు ఉన్నాయి అని ప్రచురించాలి . 
10. రిగ్గింగ్ కు పాల్పడినా , డబ్బులు పంచినా , మద్యం పంపిణీ చేసిన రాజకీయ నేతలను , మరో 5 సంవత్సరాలవరకు ఎన్నికలలో పాల్గొనకుండా చట్టాన్ని తీసుకుని రావాలి . ఆ చట్టాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారో వారి పేర్లను ప్రకటించాలి . 
11. ఓటర్ల ద్వారా ఎన్నికై , వేరే పార్టీ లోకి చేరే వారిని , వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి . మళ్ళీ ఎన్నికల వరకు , ఎన్నికలలో పాల్గొనకుండా చేయాలి . 
12. ఎవరైనా చనిపోతే , అర్హత లేని వారి కుటుంబ సభ్యులను పోటీ లేకుండా ఎనుకో కూడదు. ఇలాంటి వారి వలన ప్రజలు 5 సంవత్సరాలు నష్టపోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా , ప్రజలకు ఎన్నికలంటే , ఎంతో విలువైనవి అనే విధంగా , ఎన్నికల విధానం ఉండాలి . ప్రజలకు ఎన్నికలంటే నమ్మకం , ఉత్సాహం కలిగించాలి.

Monday, July 20, 2020

SRI RAMANUJA PHILOSOPHICAL FOUNDATION TRUST

;
                  *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*

భారత దేశ మంతటికి గాను , దాతలు, శ్రేయోభిలాషులు   మరియు  అప్పటి  జడ్జి  *శ్రీమాన్ లేట్ గోపాల కృష్ణమూర్తి*  గారు , పేద ప్రజలను / బంధువులను ఆదుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో   *చాత్తాద శ్రీవైష్ణవ వెల్ఫేర్ ట్రస్ట్*  1997  లో ఆవిర్భవించింది.  దీని రిజిస్ట్రేషన్ నెంబర్. 69 / 19997 .దీనికై సర్వశ్రీ బి . బాలకృష్ణ  గారు , టి . రాజమన్నార్ గారు మరియు సూర్యనారాయణ గారు మొదలగు విశాఖ వాస్తవ్యులు చేసిన కృషి ఎంతో ప్రశస్త నీయమైనది.   అయితే  , ఆ తరువాత  ఒక సంవత్సరం వరకు , ఇందులో ఎలాంటి కార్యక్రమాలు జరుగలేదు.

ఆ తరువాత , ప్రజాకాంక్షను కోరే పెద్ద మనసు గల దాతలు, శ్రేయోభిలాషులు   కొందరు కలిసి ట్రస్టీస్ గా ఏర్పడి 1998  లో , దీని పేరును *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* గా మార్చడం జరిగినది.
దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్: ఎం .ఐ . జి . II -97 , సెక్టార్ - 3 , ఎం . వి .పి. కాలనీ ,విశాఖపట్నం - 530017 . ఆంధ్ర ప్రదేశ్ .
హైదరాబాద్ చాప్టర్ ఆఫీస్:  2 - 2 - 1146 - 7 - 12 / 1 , న్యూ నల్లకుంట , నర్మదా భవన్, శివమ్ రోడ్ , హైదరాబాద్ - 500044 . తెలంగాణ .

*ఆబ్జెక్టివ్స్  ఆఫ్ ట్రస్ట్:*
01 . కుల మతాలతో సంబంధం లేకుండా , పేద విద్యార్థుల విద్యార్జన కొరకు ఉపకార వేతనములు మరియు ఇతర సదుపాయాలు కలుగ చేయడం.
02 . పేద , బిక్కు , వితంతువులకు , వృద్ధులకు,  వైద్య సదుపాయాలు కలుగజేయడం .
03 . నిరుద్యోగులకు , శారీరక వికలాంగులకు  ఆర్ధిక సహాయాన్ని అందించడం.
04 . ఇతర ప్రజా చారిటబుల్ ట్రస్ట్ లకు , ఇన్స్టిట్యుషన్స్ కు మరియు అసోసియేషన్స్ కు అన్నధానాలకు  నిధులు ఇవ్వడం .
05 . నిరుద్యోగులు  ఉద్యాగాలు పొందడానికి , ట్రైనింగ్  సహకారాలను అందించడం.
06 . నీతివంతమైన , సాంఘీక , వైజ్ఞ్జ్యానిక, సాహిత్య మరియు ఆధ్యాత్మిక పుస్తకాలను  పబ్లిష్ చేయడం, మొదలైనవి .

*శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*   చైర్మన్ గా  *శ్రీ కర్పూరం వెంకటేశ్వర్లు* గారు  2010  వరకు   చైర్మన్ గా కొన సాగారు . ఇప్పటికీ  ట్రస్ట్ మెంబెర్ గానే  కొన సాగుతున్నారు . ఆ తరువాత  శ్రీమంతుడు *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారు చైర్మన్ గా ఉన్నారు .
ఇప్పడు * శ్రీ మాచవరం వెంకటేశ్వర్లు* గారు చైర్మన్ గా కొన సాగుతున్నారు.
ఇప్పుడు  *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* , మన చాత్తాద శ్రీవైష్ణవ సంఘానికి అనుబంధం గానే నడుస్తున్నది.

*శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*  కు ఎంతోమంది దాతలు, దానకర్ణులు ,విశాల హృదయులు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది , దానకర్ణురాలు Dr.*శ్రీమతి నర్మద* గారు . Dr. *శ్రీమతి నర్మద* గారు సుమారుగా  80  వేల డాలర్లు , వాయిదాల  పద్దతిలో ఇచ్చారు . అప్పుడు మన కరెన్సీలో చూసుకుంటే  సుమారుగా 40  లక్షల రూపాయలు. అప్పుడు వారి అనుమతితో  సుమారుగా  23 లక్షలను ఫిక్షుడు డిపాజిట్ చేసి , కొంత డబ్బును *నర్మదా భవన్* నిర్మాణానికి ఖర్చు చేశారు.   

*శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్*  కార్యక్రమాల గురించి , అప్పటి గౌరవ కార్యదర్శి *శ్రీమాన్ దాస్యం మురళీధర్ స్వామి* 2005  రిలీజ్ ఐన సావనీర్ లో ఏమి అన్నారో వారి మాటలలోనే చూడండి. 

*మన సమాజంలో చాల మంది బీద  వారున్నారు . వారిలో ఎక్కువ మంది అతి బీద వారు గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నారు . వీరి సంపాదన కనీసం కూడు , గుడ్డకు సరిపోదు . కొంత మంది తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉచిత విద్యను అందించలేని పరిస్థితులలో ఉన్నారు . పేదరికంతో , అజ్ఞ్యానంతో , అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. కొన్ని సందర్భాలలో సంపాదించే కుటంబ సభ్యుల అకాల మరణంతో భార్యా పిల్లలు  దిక్కులేని స్థితికి చేరుకుంటున్నారు. మరియు కుటుంభంలో సంపాదించే కుమారులు సైతం వేరు పడటంతో  వృద్ధులకు నిలువ నీడ లేని పరిస్థితులు ఏర్పడుతున్నవి*.
*పై సమస్యల బాధల నివారణకై  రాష్త్ర , కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలతో విశేషంగా  కృషి చేస్తున్నవి. కొన్నిమానవతా  సంస్థలు వారికీ నచ్చిన ఆశయాలతో వారి పరిధిలో కొందరి బీద వారికీ సహాయం చేస్తున్నారు. ఇవి కాక కొన్ని ఆర్ధికంగా నిలదొక్కుకున్న కుల సంస్థలు , వారి కులం లోని బీదలకు ఆర్ధిక సహాయం అంద చేస్తున్నాయి . వీటన్నిటి వలన కూడా అందరి బీదలకు పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు*.
బీదల పాట్లు , కష్టాలు ఎలా ఉంటాయో , 2005  లోనే  సావనీర్ లో  *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారు , చాలా చక్కగా రిపోర్ట్ చేశారు . *శ్రీ దాస్యం మురళీధర్ స్వామి* గారికి , మన సమాజం పట్ల , బీదల పట్ల ఎంతటి  అవగాహన , సానుభూతి , దయ ఉందో ,దీనిని బట్టి మనం అర్ధ చేసుకోవచ్చు. అంతే కాదు . వారు పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చిన దయార్ద్ర హృదయుడు.

ఇప్పటికీ ప్రతి సంవత్సరం  ఎంతో మంది దాతలు దేశ , విదేశాలనుండి విరాళాలు పంపిస్తున్నారు. అంతే కాదు, పెద్ద ఉద్యోగంలో ఉన్న ఒక బంధువు , *శ్రీ రామానుజ ఫిలసాఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* కు , తన వేతనంలో , ప్రతి నెలా 1 % ఇస్తానని 2005 లోనే వాగ్దానం చేశాడు.      
ఆ విధంగా వచ్చిన విరాళాలను ,డిపాజిట్ల పై వచ్చే వడ్డీలను మరియు ఇతర ఆదాయాలను 2003 వ సం. నుండి వృద్ధులకు , వితంతంతువులకు పింఛన్లు ఇస్తున్నారు . పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇస్తున్నారు . రోగులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. కుల మత బేధం లేకుండా అన్నదానం నిర్వహించే నాలుగు సంస్థలకు నిధులను అంద చేస్తున్నారు . ముఖ్యంగా మన కమ్యూనిటీ కే అధికంగా నిధులను వెచ్చిస్తున్నారు.

అలానే ప్రతి సంవత్సరం ఆదాయపన్ను  చట్టం ప్రకారం , విరాళాలను ఖర్చులను ఆడిటింగ్ జరిపిస్తున్నారు . ఆ విధంగా చేయడం  వలన , ఆదాయపన్ను చట్టం విరాళాలలకు , 50 %   పన్ను మినహాయింపులు కల్పిస్తున్నది.  ప్రతి విరాళాలను , ఖర్చులను  పారదర్శకంగా , మన పత్రికలో రెగ్యులర్ గా  ప్రచురిస్తున్నారు.
ఎంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించినా , చాల మంది బంధువుల నుండి కొన్ని ఆరోపణలు వస్తున్నవి. అవి ఏమిటంటే , 

01 . *శ్రీ రామానుజ ఫిలాసఫికల్ ఫౌండేషన్ ట్రస్ట్* ఉంది అన్న సంగతి , కమిటీ సభ్యులు ఎవరు ? ఎలా ఎన్నుకోబడుతారు ?  దాని వలన ఎవరికి సహాయం అందుతుంది?  మన కులం వారికేనా?  ఇతర కులాల వారికి  కూడానా?  ఎవరు రెకమండేషన్ చేయాలి?   అన్న విషయం సుమారుగా 70 % బంధువులకు తెలియదు.

02 . ప్రతి సం. రం. కేవలం కొన్ని శాఖలకే పెర్మనెంట్ గా సహాయం అందుతుంది. చాలా శాఖలకు ఆర్ధిక సహాయం అందడం లేదు. రాష్ట్రములో సుమారుగా  46  శాఖలున్నాయి . అంటే మిగిలిన శాఖలలో బీదలు , వృద్దులు , వికలాంగులు , వితంతువులు లేరా?
 
03 . ఎప్పుడు అప్లై  చేయాలి? ఎవరికి అప్లై చేయాలి? ఏమేమి సబ్మిట్ చేయాలి? ఎవరికి  అప్లికేషన్స్  సబ్మిట్ చేయాలి ? ఎవరు రికమండ్ చేయాలి? అనే విషయాలు పత్రికలో అడ్వాన్స్  గా రావడం లేదు . ఒక వేల వచ్చినా , సమయం అయిపోయాక  చేతిక పత్రిక అందడం వలన , మరల సం . వరకు  వేచి ఉండాల్సిన  పరిస్థితి.

04 . ఎంతో మంది అధ్యక్షులు , శాఖల నుండి అప్లికేషన్స్ పంపించినా , ఇంత వరకు సమాధానం లేదు. అనే ఆరోపణలు ఉన్నాయి.

05 . విరాళాలు పంపించిన వారికి  ఎంత శాతం పన్ను మినహాయింపు ఉంటుంది? , ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అనే వివరాలు తెలియడం లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి.

06 . ఒక్క రోజు కూడా మీటింగ్ పెట్టి , ట్రస్ట్ గురించి బంధువులకు అవగాహన కల్పించిన దాఖలాలు లేవు అనే ఆరోపణలు వస్తున్నాయి .

07 . దాతలనుండి  నిరంతరాయంగా విరాళాలు  సేకరించి ,  పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి , కాల నియమాలు  ఎందుకు  అని ప్రశ్నిస్తున్నారు.

08 . ఆన్ లైన్ లో  విరాళాలు అందిస్తే , పెండింగ్ లో ఉన్న మొత్తం  ఇంత  అని పత్రికలో ప్రకటించక పోవడం. పెండింగ్ లో ఉన్న బ్యాంక్ క్రెడిట్ మొత్తాలకు   రసీదులు వ్రాసి పెట్టక పోవడం.

09 . ట్రస్ట్ ఫోన్ నెంబర్ ఏమిటి ? ఎవరిని కాంటాక్ట్ చేయాలి?  వెబ్సైట్ , ఇమెయిల్ ఐడి ఏమిటి ?  

ట్రస్ట్ పై అవగాహన పెంచుకోండి. ఈ ట్రస్ట్ రాష్ట్రం లోని  అర్హులందరికి, ఉన్నంతలో  ఆర్ధిక సహాయం అందిస్తుంది.  తాహత్తు ఉన్నవారు విరాళాలు ఇవ్వండి . పన్ను మినహాయింపులను పొందండి. అడుగడుగునా ప్రశ్నించే తత్వం పెంచుకోండి. అర్హులైన వారు , శాఖల అధ్యక్షుల ద్వారా అప్లై చేయండి. ఆ తరువాత కూడా ఎందుకు రాలేదో విచారించండి. అనర్హులు లబ్ది పొందితే  నిలదీయండి. మౌనం చాలా ప్రమాద కరం*.

PROBLEMS AND SOLUTIONS

;
                                              *సమస్యలు-పరిష్కారాలు*

అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగి గానే ఉంటే , మీ మీ నక్షత్రాల ప్రకారం ఓ పది మొక్కలను నాటి  జాగ్రత్తగా పెంచి పోషించండి. అవి ఫలాలు అందించే లోపు మీకు ఉద్యోగం రావచ్చు. లేదా మీ టాలెంట్ ప్రకారం ,మీకు నచ్చిన బిజినెస్ ఎంచుకోవాలి.

ఏదైనా కార్యాలయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే , క్రమ శిక్షణ తో , సమయపాలన తో ,ఎవరిపైనా చాడీలు చెప్పకుండా ,మీ పని మీరు చేసుకుంటూ , వీలయితే తోటి వారికి సహాయం చేస్తూ , తోటి వారితో సరదాగా ఉంటే ,ఏ సమస్యలు ఉండవు.

ఆ కారణంగా అవమానాల పాలు అవుతున్న వారు , ఇతరుల గురించి పట్టించు కోకుండా ,ఇతరులపై ఈర్ష్య , అసూయలు పెంచుకో కుండా , ఎవరికీ హాని చేయకుండా ,మనవి కాని వాటిపై ఆశలు పెంచు కోకుండా ఉంటే అవమానాలు మన దరి  చేరవు.

దాయాదుల తో ఆస్తి తగువులు ఉన్నవారు , మన వెంటరాని ఆస్తులపై అత్యాశలు పెంచుకో కుండా , అనవసరంగా కోర్టులకు వెళ్ళకుండా, సామరస్యంగా పరిష్కరించుకుంటే ,ఏ తగవులు ఉండవు. చీమలకు పంచదార పోయండి.

సంతానం విషయంలో విచారం ఉన్నవారు , చుట్టుపక్కల ఉన్న పిల్లలను ప్రేమగా చూసుకుంటూ, ప్రతి నెలా మీకు వీలైన రోజు , అనాధ పిల్లల హాస్టల్ కు వెళ్లి, మీకు చేతనైన ఆహారం, పండ్లు ఫలాలు, పుస్తకాలు, పెన్నులు, బట్టలు పంచండి. వీలయితే కొంతకాలం కొరకు పిల్లలను దత్తత తీసుకోండి. చుట్టు పక్కల పిల్లలకు సేవలు చేయండి.

ఇంట్లో వివాహం ఆలస్యం అవుతున్న ఆడపిల్ల ఉంటే  వారంలో ఒక రోజు నానబెట్టిన గోధుమలలో బెల్లం కలిపి ఆవులకు పెట్టండి. ప్రతి రోజూ మొక్కలకు నీరు పోయాలి. నిత్యం ఇష్టమైన దేవుళ్ళకు పూజలు చేయాలి. కుటుంబ సభ్యులకు సేవ చేయాలి.

భూ వివాదాలు ఏర్పడినప్పుడు మన వెంటరాని భూముల గురించి తాపత్రయ పడకుండా, ఊరికే వచ్చే ఆస్తులపై, మోసం సొమ్ము తో కొన్న భూములపై అత్యాశలు  పెంచుకో కుండా , కక్షలకు , ప్రతీకారాలు కూ పోకుండా , చెప్పుడు మాటలు వినకుండా, చట్ట ప్రకారం  కలిసి మాట్లాడు కుంటే ఏ సమస్యా ఉండదు. 

ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు , ఇంటి చుట్టూ మొక్కలను పెంచి , ఇంటి  వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతూ, అందరితో కలుపు గోలుగా ,ప్రేమగా ఉండండి. ఇంట్లో కొంతకాలం నుండి వాడని ఏ వస్తువులు ఉన్నా  ,పాత బట్టలు ఉన్నా పేదలకు ఉచితంగా పంచండి. అలానే ధరపై  కూడా లిబరల్ గా ఉంటే ఇల్లు త్వరగా అమ్ముడు పోతుంది.

రహస్య శత్రువులు ఉన్నవారు , ఒకరిపై మరొకరికి షికాయితలు చేయకుండా, ఎవరిపైనా ఈర్ష్యా అసూయ పెంచుకో కుండా, ప్రశాంతంగా, మనకు సంబంధం లేని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ,తమపని తాము చేసుకుంటూ, అందరితో సరదాగా ఉంటూ ,సమాజ సేవ చేస్తూ ఉంటే ఇక రహస్య శత్రువులు ఉండరు.

పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలాన్ని చక్కగా దున్ని , సరియైన విత్తనాలు వేస్తూ , సేంద్రియ ఎరువులను వాడుతూ, క్రిమి కీటకాలకు తగిన మందులు వాడుతూ , కలుపు మొక్కలు తొలగిస్తూ , తగిన శ్రద్ధ తీసుకోవాలి. భూసార పరీక్షలు చేయించి ,ఆ భూమి ఏపంటకు ఉపయోగపడుతుందో ,ఆ పంటనే వేయాలి. అప్పుడు ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది.

చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే , ఈశాన్యం వైపున , తులసి మొక్కలను ,ఎరుపు మొక్కలను పెంచాలి. 
ఎవరిపైనా ఈర్ష్యా అసూయలు పెంచుకో కుండా, ఈ ఏరియాలో మేమే గొప్ప అనే అహంకారం పెంచుకో కుండా , గోడకాడ, వాకిలి కాడ , కొద్దిగా సర్దుబాటు తో ఉంటూ , చేతనైనంత సహాయం చేస్తూ , అందరితో కలుపు గోలుగా ఉంటే , చుట్టు పక్కల వారితో ఎలాంటి సమస్యా ఉండదు.

అధికమైన రుణ బాధలతో మీరు బాధ పడుతూ ఉంటే ,  గొప్పలకు పోకుండా, ఖర్చులు తగ్గించుకుని , కష్టపడి పనిచేస్తూ , సంపాదించిన డబ్బును, కొద్ది కొద్దిగా తీరుస్తూ, ఎవరికి మోసం చేయకుండా , నిజాయితీ గా ఉంటూ , అందరితో ముఖ్యంగా అప్పుల వారితో ప్రేమగా ఉంటే ఋణ బాధ తగ్గవచ్చు.

మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే , మనకు అవకాశం ఉన్న 24 గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజాయితీ గా కష్టపడి పని చేసి డబ్బు సంపాదించాలి. మోసం చేసి సంపాదిస్తే ,ఏదో ఒకరోజు అవమానాల పాలో ,జైలు పాలో , ఎన్కౌంటరో కావాల్సి వస్తుంది. మీరు చేయదలుచుకుంటే వందల పనులు ఉన్నాయి. సంపాదించ దలుచుకుంటే వందల అవకాశాలు ఉన్నాయి. సంపాదనకు వయసుతో పనిలేదు. అమితాబచన్ నేటికి సంపాదిస్తూనే ఉన్నాడు. డాక్టర్.అబ్దుల్ కలాం, చనిపోయినా పేటెంట్స్ ద్వారా సంపాదిస్తూ నే ఉన్నాడు. ఎవరి స్వభావానికి ,తగిన పనులు వారు ఎంచుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. గొప్పలకు పోకూడదు. రెగ్యులర్ గా పొదుపు చేస్తూ ఉండాలి. డబ్బే డబ్బును సంపాదించే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

అకారణ వివాదాల్లో ఇరుక్కుని ఉంటే , సమాజానికి ఉపయోగపడే సేవల్లో పాలు పంచుకోండి. కరోనా గురించి ప్రచారం చేయండి.  అందరితో ప్రేమగా ఉండండి. 

చదువులో వెనక పడి పోతుంటే ,మీరు రోజు మెడిటేషన్ చేయండి. మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి. చెడు స్నేహాలను ,చెడు అలవాట్లను శాశ్వతంగా విడనాడాలి. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచండి.  కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. చేతనైన సహాయం ఇంట్లో చేయండి. ప్రశాంతంగా కూర్చొని మనసుపెట్టి, ఇష్టంగా, నేర్చుకోవాలనే తపనతో చదవండి. మనసులో చదివింది విశ్లేషించండి. శాశ్వతంగా గుర్తుండి పోతుంది. చదువులో ఫస్ట్ ఉంటారు. 

మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే , మరోసారి తప్పు చేయను ,మీకు ఎలాంటి హాని చేయను, నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను ,మీకు ఇవ్వాల్సింది త్వరలో ఇస్తాను అని దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరండి.

 మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే , మీకు దానికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి.
అర్హతలు పెంచుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. అవకాశం కోసం ఎదురు చూడాలి.

Wednesday, April 22, 2020

"సెక్యూరిటీ కౌన్సిల్" ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?

"ఐక్య రాజ్య సమితి" లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం *సెక్యూరిటీ కౌన్సిల్ ( Security Council) లో భారత దేశానికి , వీటో పవర్ (Veto Power) ఎందుకు ఉండ కూడదు?

*నేడు సెక్యూరిటీ కౌన్సిల్ లో ఏక ఛత్రాధిపత్యం వహించే దేశాలు / వీటో పవర్ (Veto Power) / పర్మనెంట్ మెంబర్ షిప్ గల దేశాలు 5 ఉన్నాయి. అవి , ఎ,బి ,సి ,ఎఫ్ & ఆర్. అందులో మన భారత దేశం లేదు.*
*ఐక్య రాజ్య సమితి [యునైటెడ్ నేషన్స్ అఫ్ ఆర్గనైజషన్ (UNO)] 24 , అక్టోబర్ 1945 లో ఏర్పడినది. ఇందులో సుమారుగా 193 దేశాలు ఉన్నాయి . ఐక్య రాజ్య సమితి లోని అత్యంత శక్తివంతమైన అధికారం గల విభాగం సెక్యూరిటీ కౌన్సిల్*. ఈ *సెక్యూరిటీ కౌన్సిల్* లో మొత్తం 15 సభ్యత్వ దేశాలు ఉన్నాయి. అందులో 5 పెర్మనెంట్ సభ్యత్వ దేశాలు. 10 పర్మనెంట్ కాని దేశాలు .
*ఐక్య రాజ్య సమితి* చార్టర్ ,1945 ప్రకారం, 5 దేశాలకు *వీటో పవర్* అధికారం లభించింది . వీటినే పర్మినెంట్ దేశాలు అని , బిగ్ 5 అని లేదా పి-5 అని పిలుస్తారు . ఈ 5 దేశాలు మారవు.స్థిరంగా ఉంటాయి . మిగిలిన 10 దేశాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మారుతూ ఉంటాయి.
*ఈ వీటో పవర్ గల 5 దేశాలు ఏవంటే , అమెరికా , బ్రిటన్ , చైనా , ఫ్రెంచ్ మరియు రష్యా *. నేడున్న వీటో పవర్ గల 5 దేశాల దేశాధినేతలు: అమెరికా (డోనాల్డ్ ట్రంప్ ), బ్రిటన్ (బోరిస్ జాన్సన్ ) , చైనా (క్షి జిన్ పింగ్ ) , ఫ్రెంచ్ (ఎమాన్యూల్ మాక్రోన్) మరియు రష్యా (వ్లాడిమిర్ పుతిన్ ).
భారత దేశం, అప్పటి ప్రధాన మంత్రి శ్రీ పి. వి . నరిసింహ రావు గారి కాలం కంటే ముందు నుండే , సెక్యూరిటీ కౌన్సిల్ లో పర్మనెంట్ సభ్యత్వం గురించి , చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది . కాని ఇప్పటి వరకు సఫలం కాలేదు . అయితే చాలా కాలం క్రితం 4 దేశాలు అనగా బ్రెజిల్ , జెర్మనీ , భారత దేశం మరియు జపాన్ జి -4 కూటమిగా ఏర్పడి , పర్మనెంట్ సభ్యత్వాలకు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఏ దేశానికి దక్కలేదు.
ఈ *ఐక్య రాజ్య సమితి* / *సెక్యూరిటీ కౌన్సిల్* యొక్క ప్రధాన బాధ్యత * ప్రపంచంలో శాంతి మరియు రక్షణ కల్పించడం*. ఏదేని సమస్య వచ్చినప్పుడు , దానికి ఒక రెసొల్యూషన్ ను , *సెక్యూరిటీ కౌన్సిల్* డ్రాఫ్ట్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ రెసొల్యూషన్ పాస్ కావాలంటే , ఈ 5 పర్మనెంట్ దేశాల ఓటింగే ( వీటో పవర్ ) అత్యంత కీలకం.
అంతటి కీలక విషయాలపై నిర్ణయం తీసుకునే అధికారం మన భారత దేశానికి, స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు దాటినా , ఇప్పటికి లేక పోవడం 130 కోట్ల ప్రజలు ఆలోచించాల్సిన విషయం. మన భారత దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది . ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టింది మన భారత దేశం. జనాభాలో రెండవ అతి పెద్ద జనాభా గల దేశం. ఆర్ధికంగా పరిపుష్టిగల దేశం భారత దేశం. శాంతి కాముక దేశం భారత దేశం. ఆచారాలు , సంప్రాదయాలు , ఆధ్యాత్మిక విషయాలలో ఉన్నతమైన భావాలూ గల దేశం భారత దేశం . ఎన్నో మతాలు , మరెన్నో కులాలతో కలిసి సంతోషంగా , ఆనందంగా జీవనం సాగిస్తున్న సెక్యూలర్ స్టేట్ మన భారత దేశం. రక్షణ విషయంలో అత్యంత శక్తి వంతమైనది మన భారత దేశం. ప్రపంచ దేశాలన్నిటిలో , మన భారతీయులు సేవలందిస్తున్నారు , కీలకమైన బాధ్యతలను చేపడుతున్నారు , చివరికి ఐక్య రాజ్య సమితిలో కూడా కీలకమైన బాధ్యతలను సునాయాసంగా చేపడుతున్నారు. రాజకీయంగా ఎంతో శక్తి వంతమైనది మన భారత దేశం . ఇన్ని శక్తి సామర్ధ్యాలు ఉన్న మన భారత దేశానికి *సెక్యూరిటీ కౌన్సిల్* లో *పర్మనెంట్ మెంబర్ షిప్* లేక పోవడం *వీటో పవర్* లేక పోవడం బాధాకరమైన విషయం . కనీసం ఇప్పుడైనా , మన ప్రధాన మంత్రి *శ్రీ నరేంద్ర మోడీ* గారి హయాంలోనైనా మనం సాధించి తీరాలి.

Tuesday, April 14, 2020

*కోవిద్ - 19 * (Covid-19) వలన ఏర్పడిన ఆర్ధిక మాంద్యం నుండి బయట పడటం ఎలా?

*కోవిద్ - 19 *  (Covid-19) వలన ఏర్పడిన ఆర్ధిక మాంద్యం నుండి బయట పడటం ఎలా?
*కోవిద్ - 19 * (Covid-19)  వలన దేశం మొత్తం దిగ్బంధం (లాక్ డౌన్) అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వేలాది కరోనా పాజిటివ్ కేసులు , వందలు దాటిన మరణాలు చూస్తున్నాం. ఉత్పత్తి , రవాణా , సేవలు అన్నీ స్తంభించి పోయాయి. ఇది కేవలం మన ఒక్క భారత దేశానికి సంబంధించిన విషయం కాదు . ప్రపంచం లోని 218 దేశాలకు ఈ కరోనా వైరస్ మహమ్మారి విస్తరించింది.
అయితే ఇక్కడ మన ప్రభుత్వాలకు మూడు సమస్యలు స్పష్టంగా కనబడుతున్నాయి .
01 . కరోనా వైరస్ ను ఎలా అరికట్టాలి?
02 . పేద మధ్య తరగతి లోని వివిధ వృత్తుల వారిని ఎలా ఆదుకోవాలి? ఉత్పత్తులను , సేవలను అందించే కంపెనీలను ఎలా ఆదుకోవాలి?
03 . ఇంతగా నష్ట పోతున్న ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడం ఎలా?
మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి గొప్ప సారధ్యానికి , దేశ 130 కోట్ల ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి , మరో పదిహేను, ఇరువై రోజులలలో మొదటి రెండు సమస్యలు పూర్తిగా సమసి పోతాయి . అందులో ఏ మాత్రం సందేహం లేదు.
ఇక మిగిలింది , కేవలం ఆర్ధిక వ్యవస్థను ఎలా పరుగు పెట్టించాలి? ఎలా పూర్వ వైభవం తీసుక రావాలి?
ఇది ఆశామాషి విషయం కాదు. అయినా అసాధ్యం మాత్రం కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లు , మన ప్రధాన మంత్రి గారు ,29 రాష్ట్రాల ముఖ్య మంత్రులు , ఇప్పటి లాగానే ,వైద్య నిపుణుల సలహాలకు బదులు, ఆర్ధిక నిపుణుల సలహాలను తీసుకుని , చర్చించి , వారి సూచనల కనుగుణంగా , ఆర్ధిక కార్య క్రమాలను రూపొందిస్తూ , ఇప్పటి లాగానే ప్రజలలో ధృడ సంకల్పాన్ని కూడా గట్ట గలిగి , ప్రజలలో పట్టుదలను , మనో ధైర్యాన్ని , ఉత్సాహాన్ని నింప గలిగితే , ఈ ఆర్ధిక మాంద్యాన్ని , ఒకటి రెండు సంవత్సరాలలో అధిగ మించడం ఏమంత కష్టం మాత్రం కాక పోవచ్చని నేను భావిస్తున్నాను.
ధనికులపై ఈ ఆర్ధిక మాంధ్యం ప్రభావం ఏమి ఉండదు. వీరు హాయిగానే జీవించ గలరు. పేదలను ఎదో విధముగా ప్రభుత్వాలే ఆదుకుంటాయి. వచ్చిన సమస్యల్లా మధ్య తరగతి వారికే.
ఇప్పుడు మధ్య తరగతి ప్రజలు జీవించడానికి చేయ వలసినదల్లా , వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచు కోవాలి. ఖర్చులు తగ్గించు కోవాలి. సరదాలు , జల్సాలు , వృధా ఖర్చులను తగ్గించు కోవాలి . ముందుగా సేవింగ్స్ ను కొంత ప్రక్కకు పెట్టాలి . మిగిలిన దానిని మాత్రమే ఖర్చు పెట్టాలి.
ప్రతి ఒక్కరూ పరిసరాలను , వ్యక్తిగత శుభ్రతను విధిగా పాటించాలి.
ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టు కోవాలి. గత 40 , 50 సంవత్సరాలనుండి చూస్తే , ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు బాగా పెరిగి పోతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి . ఆ కారణంగా నేడు , దేశ సంపద అంతా , కేవలం 10 % ప్రజల మధ్యనే ఉంది . మిగిలిన 90 % ప్రజలలో 50 % ప్రజలు మధ్య తరగతి వారు , 40 % మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు.
*కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా చేపట్టవలసిన చర్యలు*:
01 . దేశ సంపద అంతా 10 % ప్రజల చేతిలో నే ఉందని చెప్పుకున్నాం . ప్రభుత్వాలు , నాయకులు ఆ 10 % ప్రజలలో మనసు మారేటట్లుగా , దేశ భక్తిని , దేశ పరిస్థితులపై సానుభూతి పెంచాలి . వారి వద్ద ఉన్న నల్ల ధనం లో కనీసం 25 % ప్రభుత్వాలకు ఇచ్చేటట్లుగా ఒప్పించాలి . ఇక వారిని , ఈ నల్ల ధనం ఎక్కడిదని అడుగుమని అభయ మివ్వాలి . ఆ తరువాత కూడా , విచారణ చేయ కూడదు.
02 . ఒక రోజు ముఖ్య మంత్రి శ్రీ కె . సి . ఆర్ గారు చికెన్ , మటన్ తినడం వలన ఇమ్మ్యూనిటి పెరుగుతుంది , తినవచ్చు అని అన గానే , తెల్లవారే అక్కడ ప్రజలు బారులు తీరారు . రియాక్షన్ అలా ఉంటుంది .అంతకు ముందు చికెన్ తింటే కరోనా వస్తుందని భయ పడి తినడమే మానేశారు . ఉచితంగా వండి వడ్డించారు . అలానే ప్రధానమంత్రి , ముఖ్య మంత్రులు , విదేశీ వస్తువులను వాడ కూడదు , స్వదేశీ వస్తువులనే వాడటం వలన మన దేశం అభివృద్ధి చెందు తుంది , మనం ఆరోగ్యంగా జీవించ గలుగుతాం అని , ప్రజల మనుషుల్లో నాటుకునే వరకు చెబుతూ ఉంటే , ప్రజలు స్వదేశీ వస్తువులు అధికంగా వినియోగిస్తారు . అప్పుడు మనం దేశ జి . డి .పి. పెరుగుతుంది . అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుంది.
03. కోవిద్ -19 మహమ్మారి కి సంబంధించి , "వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ " జాతీయ విపత్తు కారణంగా భారత దేశానికి రావాల్సిన నిధులపై వత్తిడి తేవాలి.
04 . మరో 5 లక్షల కోట్లను ప్రజల సంక్షేమ పథకాలకు విడుదల చేయాలి.
05 . ఉత్పాదక సంస్థలకు , సేవా సంస్థలకు , రవాణా సంస్థలకు ఎలాంటి ఆటంకాలు సృష్టించ కుండా , వాటి యధావిధి ఉత్పత్తులను, సేవలను కొనసాగించే విధంగా వెసులుబాటు కలిగించాలి.
06 . అసంఘటిత వ్యవసాయ కార్మికులను , పట్టణాల వైపు చూడకుండా , గ్రామాల లోనే ఉపాధి కల్పించాలి .కొత్త ఉపాధులను క్రియేట్ చేయాలి . చేతి వృత్తులను పెంచాలి.
07 . ప్రతి భారతీయుడు తినే ఆహారాన్ని , మన రైతులే పండించే విధంగా , రైతులకు , సబ్సీడీలు ,ప్రోత్సహకాలు యధావిధిగా కొనసాగించాలి .వ్యవసాయానికి సంబంధించిన సలహాలు , సహకారాలను అందించాలి. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరను కలిగించాలి. మధ్య దళారులను తొలగించాలి . ధాన్యాన్ని కొంత కాలం నిల్వ చేసుకోడానికి , కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ లను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి . రైతులే వారి కూరగాయ పంటలను, వారే మార్కెట్లో అమ్ముకునే విధంగా అవకాశం కల్పించాలి. రైతులకు భీమా , పంటలకు భీమాలను ఖచ్చితంగా అమలు చేయాలి.
08. వ్యవసాయ భూములకు ఇచ్చే , ఎకరానికి 8 వేల రూపాయలను , నిజమైన వ్యవసాయదారులకు (రైతులు కావచ్చు , కౌలు దారులు కావచ్చు) ఇవ్వాలి గాని , భూస్వాములకు ఇవ్వకూడదు . 10 ఎకరాల భూమి ఉన్న వారినందరిని భూస్వాములుగా గుర్తించాలి . నాగలి పట్టో , మెషెన్ ను పట్టో దున్నే వాడే రైతు . భూస్వాములకు కౌలు డబ్బు వస్తుంది , భూముల ధరలు పెరుగుతే , ఆ డబ్బు వారికే చెందుతాయి. అలానే మైనింగ్ చేసే వారు , ఒక్క పంట కూడా పండించరు . వారిని రైతులు అనడం , వారికీ ఎకరానికి 8 వేలు ఇవ్వడం తక్షణమే నిలిపి వేయాలి.
09 . భారత దేశంలో దొరకని ముడి సరుకులు, మెషినరీ తప్పా , ఎలాంటి ఆహార పదార్ధాలను, డ్రింక్స్ ను , మందులను రెండు మూడు సంవత్సరాలు దిగుమతి చేయ కుండా నిషేధించాలి . మన ఆరోగ్యాలను పాడు చేసేవే విదేశీ ఆహార పదార్ధాలు.
10 . వ్యక్తి గత ఆదాయ పన్నుల మినహాయింపు పరిమితిని 5 లక్షలకు పెంచాలి . నికర ఆదాయం 5 లక్షలు మించుతేనే రిటర్న్ ఫైల్ చేసే విధంగా మార్పులు చేయాలి. ఇవి అన్ని వయస్సుల వారికీ సమానంగా ఉండాలి. మిగిలిన మినహాయింపులు యధావిధిగా కోన సాగించాలి.
11 . కట్టు దిట్టమైన నిభంధనలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలి.
12 . విదేశీ పెట్టుబడులను ఆహ్వానించే విధంగా , నిభందనలను సడలించాలి.
13. ప్రజలకు బ్యాంకులపై నమ్మకాన్ని కలిగించాలి .ప్రజలకు మరియు బ్యాంకులకు లాభదాయకతను పెంచాలి. బ్యాంకులపై రాజకీయ నాయకుల వత్తిడి తగ్గించాలి. బ్యాంకులు ఇచ్చే లోన్లపై , ఎదుటి వారి వ్యాపారాల లాభదాయకతను, సెక్యూరిటీలను అస్సెస్స్ చేసే నిపుణులను బ్యాంకులలో నియమించాలి . సేవింగ్ అక్కౌంట్లపై వడ్డీ రేటును పెంచాలి . కోటి రూ . లు దాటిన ఎఫ్ . డి . లపై వడ్డీ రేట్లను తగ్గించాలి.
14 . విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని , విద్యార్థులను విదేశాలకు పంపించి వేయాలి . వారికి అన్ని విధాలుగా సహకారాలు అందించాలి.
15 . చదువుకుని ఖాళీగా ఉన్న విద్యార్థులకు, వారి స్వభావానికి అనుకూలమైన 
ఎదో ఒక రకమైన ఉపాధిని కల్పించాలి . కొత్త ఉపాధులను క్రియేట్ చేయాలి.
16 . పెట్రోల్ , డీజిల్ ఉత్పత్తుల వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇక్కడే సుమారుగా 70 % మొత్తం మనం డబ్బు విదేశాలకు వెళుతుంది . దీనికి ఆల్టర్ నేటివ్ గా విద్యుత్ ను లేదా సోలార్ శక్తిని అభి వృద్ధి పరచాలి.
17 . భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మేధావే . ప్రతి ఒక్కరిలో తెలివి తేటలు ఉన్నాయి  . తన దేశం లేదా తన రాష్ట్రం లేదా తన జిల్లా లేదా తన గ్రామం అభి 
వృద్ధి గురించి చెప్పే సూచనలను , సలహాలను పరిగణలోకి తీసుకుని , ఒక నిపుణుల కమిటీలో చర్చించాలి. ఉపయోగం అనిపించిన వాటిని , అమలు చేయాలి.
ప్రభుత్వాలు ఈ చర్యలు చేపట్టినట్లవుతే , దేశ ప్రజలు ఇప్పటి లాగానే ప్రభుత్వాలకు సహక రించినట్లయితే , భారత దేశం కేవలం రెండు మూడు సంవత్సరాలలోనే , నేటి కరోనా వైరస్ సమస్యలవలన ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందులను ,ఆర్ధిక మాంధ్యం నుండి తప్పకుండా గట్టెక్క గలదు.
*మార్గం కృష్ణ మూర్తి*
www.sollutions2all.blogspot.com