30 రోజుల కాంగ్రెస్ పాలన:
నూతనంగా తెలంగాణా ఏర్పడ్డాక, మొదటి సారి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 న ముఖ్యమంత్రి గా శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గా శ్రీ బట్టి విక్రమార్క గారుప్రమాణ స్వీకారాలు చేసారు.
పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుంది అన్నట్లు,
ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి చేసిన కార్యక్రమాలు:
01. ప్రమాణ స్వీకారం చేశాక మేము ప్రజా పాలకులం కాదు, ప్రజా సేవకులమని స్లోగన్ ఇచ్చారు. ప్రజలలో ఒక ఆత్మీయ భావనను, ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు.
02. ప్రగతి భవన్ ఇనుప కంచెలను, నామ రూపాలు లేకుండా చేసి, తెలంగాణా లోని నాలుగు కోట్ల ప్రజలు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేట్లు చేసారు.
ప్రగతి భవన్ పేరును, "మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్" గా మార్చారు. ప్రజల సమస్యలను చెప్పుకునే విధంగా, వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాలలో, నేరుగా అధికారులను కలిసి, సమస్యలను వ్రాత పూర్వకంగా అందించేందుకు అవకాశం కల్పించారు. వాటిని సమయానుకూలంగా పరిష్కారించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజలు సెక్రటేరియట్ కు నేరుగా వెళ్ళే విధంగా స్వేచ్ఛ ను కలిగించారు.
03. వెంటనే క్యాబినెట్ నెట్ ను ఫామ్ చేసారు.
04. ఆదర్శనీయంగా స్పీకర్ ను నియమింప జేసారు.
05.మ్యానిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలలోని , మహాలక్ష్మి పథకంలోని ఒకటైన , "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" అనే పథకాన్ని, సోనియా గాంధీ గారి జన్మదినం పురష్కరించుకుని డిసెంబర్ 9, 2023 న, ప్రారంభించారు.
అదే రోజు చేయూత పథకంలోని తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ, 10 లక్షల ఉచిత భీమాను ప్రారంభించారు.
06. డైరెక్ట్ రిలేతో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇంట్లోనే కూర్చుని, ఎవరేమి మాట్లాడుతున్నారు, ఎవరు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు అనే విషయాలను తెలుసుకునే విధంగా , పారదర్శకతను పాటించారు.
రేపటి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేశారు.
07. ఐఏస్, ఐపిఎస్, ఇతర అధికారుల ట్రాన్స్ఫర్ లు చేపట్టారు. సమీక్షలు చేశారు.
08. ఆర్ధిక రంగంపై , విద్యుత్ రంగంపై ఒక స్వేత పత్రాన్ని విడుదల చేశారు. అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు 6 లక్షల 71 కోట్లని తేల్చారు.
09. అందు బాటులో ఉన్న నిధుల ప్రకారం ఆర్టీసికి , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొంత డబ్బు చెల్లించారు. భీమా ప్రీమియం చెల్లించారు.
10. అందు బాటులో ఉన్న నిధుల ప్రకారం రైతు బంధును వేశారు. గత ప్రభుత్వంలో లాగానే , ఆసరా పెన్షన్లను వేశారు.
11. UPSC లాగా పరీక్షలు జరిపించాలని, స్వయంగా డిల్లీ వెళ్లి UPSC చైర్మన్ కలిసి సలహాలను తీసుకున్నారు.
12. ఫార్మా సిటీని , ఫార్మా విలేజ్ గా మార్చాలని, ఫార్మా పారిశ్రామిక వేత్తలతో సంప్రదించి, నిర్ణయం తీసుకున్నారు.
13. డిసెంబర్ 28 నుండి - జనవరి 06 ,2024 వరకు "ప్రజా పాలన" స్పెషల్ డ్రైవ్ పెట్టి, ఆరు గ్యారింటీలకు సంబంధించి అప్లికేషన్ లను స్వీకరించారు. వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్ర మొత్తంలో
1,25 ,00,000 అప్లికేషన్లు వచ్చాయి.
14. జనవరి 7 న , ప్రజాపాలన వెబ్ సైట్ www.prajapalana.telangana.gov.in ను ప్రారంభించారు. అప్లికేషన్లను ఎంట్రీ చేయడం ప్రారంభించారు. ఇది జనవరి 17, వరకు పూర్తి అవుతుందని చెప్పారు. జనవరి 18 నుండి, ప్రజలు వెబ్సైట్ లో , వారి అప్లికేషన్ ఆక్సెప్ట్ అయ్యిదా లేదా సులువుగా తెలుసు కోవచ్చంటున్నారు. ప్రతిదీ పారదర్శకం.
15. అవినీతి నాయకుల , అధికారుల , బినామీల లెక్కలను ఒక్కటొక్కటిగా బయటకు తీస్తున్నారు.
16. ఇద్దరు ఎమ్ ఎల్ సి పదవులకు, క్యాబినెట్ మంత్రుల సూచనల మేరకు, తెలంగాణా పోరాట యోధులకు, మేధావులకు అవకాశం కల్పించారు.
పారదర్శక పరిపాలన కొరకు, ఐఏఎస్ లతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు.
గవర్నర్ గారితో, ప్రధాన మంత్రితో, రాష్ట్ర పతితో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
తమ పార్టీ సభ్యులతో, ఇతర పార్టీల సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
తమ కార్యాచరణ ఏమిటో ఒక పత్రికా సంపాదకుల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
తమ సమస్యలను తెలుపుకునే విధంగా, ధర్నాలు రాస్తారోకోలు చేసుకునే విధంగా, ప్రజలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. గత ప్రభుత్వం లో ఏ రోజు ఏమి జరుగుతుందో, పదేండ్లైనా , పార్టీ ఓడి పోయే వరకు ఎవరికీ తెలిసేది కాదు. ఏ జి.వొ. వెబ్సైట్ లో కనబడలేదు. ఇప్పటి వరకైతే వీళ్ళ కొడుకులు, బిడ్డలు, అల్లుండ్లు దోచిన దాఖలాలు లేవు. అంతా
పారదర్శక పాలన ప్రస్తుతానికైతే ప్రజలకు కనబడుతుంది, అవినీతికి పాల్పడిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలిగాయి. మహిళలు , విద్యార్ధినులు తెలంగాణా అంతటా ఉచితంగా తిరిగే స్వేచ్ఛ లభించింది. స్వేచ్ఛ అంటే ఇది. ఆత్మ గౌరవం అంటే ఇది.
అంతకంటే ఇంకేమి కావాలి ప్రజలకు?
గత ప్రభుత్వంలో బాధలు, నిర్భంందాలను అనుభవించిన ప్రజలు, భూదోపిడికి గురైన ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి , రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే నిజాయితీ ప్రజలు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి గల నిధుల లేమిని అర్ధం చేసుకున్న ప్రజలు, ఉచిత పథకాల కొరకు ఎదిరి చూడటం లేదు. డిమాండ్ చేయడం లేదు. ఉచిత పథకాలు వద్దనే వారే చాలా మంది కనబడుతున్నారు. వారు, ప్రశ్నించే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ, ఉచిత విద్య, ఉచిత వైద్యం ,ఉచిత న్యాయం మరియు నీతి వంతమైన పాలన కోరుకుంటున్నారు. కానీ ఉచిత పథకాలు కాదు. నిధుల అవకాశాన్ని బట్టి, ప్రభుత్వమే అందిస్తుంది. అది భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ భాద్యత కూడా. ప్రజలు చెల్లించిన పన్నులను, పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ పథకాలకు ఎలాగో ఖర్చు చేస్తారని, ప్రజలు భావిస్తున్నారు.
No comments:
Post a Comment