Tuesday, December 3, 2024

బానిసత్వం బానిసత్వమే

అంశం: సంకెళ్లు

శీర్శిక:బానిసత్వపు సంకెళ్లు 

*కాలం మారుచుంటే*
*కనికట్టు మారిన చందంగా*
మార్చుతున్నారు మోసపు తీరులు
కాలం తోనే సాగుతారు ఈ మోసగాళ్ళు!

శ్వాస ఉన్నన్ని రోజులు ఆశ అనివార్యం
ఆత్యాశ కోరికలు ఉన్నన్నిరోజులు
స్వార్ధం మోసాలు నేరాలు ఘోరాలు
అవకాశవాదులు అతి సహజం!

గొర్రె కసాయినే నమ్ముతుందన్నట్లు
బానిసలు, బలిచేయు వారినే నమ్ముతారు!

మోసపోయే వారు ఉన్నంత కాలం
మోసం చేస్తారు మూర్ఖ జనం 
నీడలా వెంటాడుతునే ఉండటం సహజం
ఉచితాలకు ఆశ పడేవారున్నంత కాలం
నేతలు ఓటర్లను బానిసలుగానే భావించడం
ప్రశ్నించ కూడదనుకునే వారున్నంత కాలం
నాయకులు వంచుతునే ఉండటం నిజం!

చదువులు పెరిగాయి , ఉద్యోగాలు శూన్యం
డిజిటల్ మీడియా పెరిగింది, ఉపాధి లేదు
ఇంటర్నెట్ పెరిగింది, నియంత్రణ తగ్గింది
ఉచితాలకు క్యూ కడుతున్నారు జనం
ఉచిత సంపదకు ఎగబడుతున్నారు స్కామర్లు
జనులను ఆధునిక బానిసత్వ అగాధం లోకి
త్రోసేస్తున్నారు తెల్ల చొక్కాదార్లు

నాడు నేడు భానిసత్వం, ""భానిసత్వమే"
కానీ తీరే మారింది, టెక్నాలజే మారింది
చెరువులు మత్తళ్ళు పడినపుడు
కొత్త చేపలు ఎగసి పడినట్లుగా
కొత్త బానిసలు పుట్టుకొస్తున్నారు
దోచుకునే స్కామర్లు పుడుతునే ఉన్నారు
మోసం చేసే పద్దతులే మారుతున్నాయి!

ప్రతి మనిషికి
ప్రశ్నించే తత్వం అలవడిన
ఉచితాలను ఏవగించుకొనిన
మనుషులను అర్ధం చేసుకొనిన
వ్యక్తిత్వం పెంచుకొనిన
అత్యాశలు కోరికలు తగ్గించుకొనినను
బానిసత్వం *సంకెళ్లను*  పెకిలించవచ్చు
 

No comments: