Saturday, May 21, 2016

మూఢాలు ( MOODHAS) అంటే ఏమిటి ? మూఢాలు ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు ఏమిటి ? పరిశ్కారాలేమిటి ?

ప్ర.  మూఢాలు ( MOODHAS)  అంటే ఏమిటి ?  మూఢాలు  ఎందుకు వస్తాయి ? మూఢాల వలన సమస్యలు  ఏమిటి ? పరిశ్కారాలేమిటి ?  

జ . మూఢాలు ( MOODHAS)  అంటే  అశుభ దినాలు , అశుభ రోజులు .చీకటి  రోజులు , రోజులు చెడు దినాలు . శుభ కార్యాలు  చేసు కోవడానికి  వీలు కాని రోజులు . మంచి రోజులు కావు అని అర్థం . మూఢాలు ( MOODHAS)  అంటే ఖచ్చితంగా  విడవదగిన కాలం  అని అర్ధం .  

మూఢాలు ( MOODHAS)  రెండు  రకాలు . అవి ఒకటి  గురు మూడం , రెండవది  శుక్ర మూడం.  మూఢాల ను  ( MOODHAS)  మౌడ్యములు (MOUDYAMIES) అని కూడా  అంటారు . 

సామాన్యులకు కూడా  అర్ధమయ్యే విధంగా  చెప్పాలంటే , గురువు  సూర్యునికి  దగ్గరగా వచ్చినప్పుడు  ఏర్పడే దానిని  గురు మూఢమని  . అలానే శుక్రుడు సూర్యునికి  దగ్గరగా  వచ్చి నప్పుడు  ఏర్పడే దానిని   శుక్ర మూఢ మని  అంటారు . 

దీనినే సాంగత్వ  దోషమని  అంటారు . శుభ గ్రహాలు  అస్తాంగాత్వంలో  ఉన్నపుడు  మూఢo  వస్తుంది . సూర్యునికి  దగ్గరగా  గురు , శుక్రులు  వచ్చి నప్పుడు , గురు శుక్రుల  శక్తులు  తగ్గి పోతాయి . బలం తగ్గి పోతుంది . బలహీన మౌతాయి . నీరస పడుతాయి . సన్నగిల్లుతాయి . వేయి  వాట్స్  బల్బు ముందు , ఒక  చిన్న క్యాండిల్  పెడితే , ఆ క్యాండిల్ శక్తి  ఎంత మాములుగా  ఉంటుందో , అలానే సూర్యుడి  ముందు  గురు శుక్రుల శక్తి  అంత తక్కువగా , బాల హీనంగా  ఉంటుంది . అందుకే శుభ కార్యాలు  ఆ రోజులలో  జరుప కూడదు అని అంటారు . 

అందువలన , ఈ కాలంలో  శుభ కార్యాలు , "ముఖ్యంగా  వివాహాలు జరుప కూడదు  , లగ్నం కోటు వేసుకోరాదు . వివాహాలకు  సంభందించి  మాట ముచ్చట్లు  మాట్లాడు  కోరాదు . పుట్టు వెంట్రుకలు తీయ కూడదు . గృహ శంకుస్థాపనలు  చేయ రాదు . ఇండ్లు మారకూడదు." ఎందుకంటే ఇవన్నీ జీవితంలో ఒకే సారి చేయడం జరుగుతుంది . ఎవరయినా మంచి జరుగాలనే కోరు కుంటారు .  అందుకని  మూడాలలో  శుభ కార్యక్రమాలు  చేయ కూడదు. 

మనందరికీ  తెలుసు , ఏ  శుభ కార్యక్రమానికైనా  గురు శుక్రులు బాగుండాలని . దివ్యంగా ఉండాలని . శక్తి మంతంగా ఉండాలని . గురు శుక్రులు బాగుంటేనే  శుభాలు ఎలాంటి ఆటంకం లేకుండా  జరుగుతాయి . పెండ్లిల్లకు  గురు బలం బాగుండాలి . 

అయితే , మూఢాల ( MOODHAS) లో అన్న ప్రాసన చేసుకోవచ్చు . ప్రయాణాలు చేయ వచ్చు . 
రిపేర్లు చేసుకోవచ్చు .  తప్పవు అనుకున్న  పనులు చేసు కోవచ్చు .  భూములు కొనడం , అమ్మడం , అగ్రిమెంట్లు చేసుకోవడం , ఉద్యోగాలలో చేరడం , విదేశాలకు వెళ్ళడం అబ్బాయిలను అమ్మాయిలను చూడటం  , వ్యాపారాలు మొదలు పెట్టడం , వెహికిల్స్ కొనుక్కోవడం , బట్టలు కొనుక్కోవడం  మొదలైనవి  చేసు కోవచ్చు . 
మూఢాల ( MOODHAS) కాలం :
01. మొదటి  శుక్ర మూఢం: 30.06. 2016,   రాత్రి  11. 26 ని . నుండి  30.07.2016  ఉదయం 7. 39 ని . వరకు . 
02. గురు మూఢం : 12. 09. 2016 రాత్రి  3. 09 ని . నుండి  10. 10. 2016  రాత్రి  5.51  ని . వరకు . 
03. రెండవ శుక్ర మూఢం: 20. 03. 2017 ,   రాత్రి  4. 13.  ని . నుండి  30.03.2017  రాత్రి 3. 49 ని . వరకు .
మూఢాల ( MOODHAS) కాలంలో శుభ కార్యాలు చేస్తే  ఏమవుతుంది ?
మహర్షులు , జ్యోతిష్య  పండితులు, అనుభవస్తులు   శుభ కార్యాలు  చేయ  కూడదని చెప్పారే గాని , ఏమవుతుందో చెప్ప లేదు . 
కానీ నా అనుభవం  ప్రకారం ,  ఏదయినా  అశుభం  వినవల్సి రావచ్చు . కష్టం  కలుగ వచ్చు , నష్టం  వాటిల్ల వచ్చు.    
  



Thursday, May 12, 2016

తెల్ల "రేషన్ కార్డులు" (RATION CARDS) ' రేషన్ ' కే పరిమితం చేయడం సమంజసమా ?

ప్ర . తెల్ల  "రేషన్  కార్డులు" (RATION CARDS)  ' రేషన్ ' కే  పరిమితం  చేయడం  సమంజసమా  ?

జ . ప్రభుత్వం  ఎన్నో వెరిఫికేషన్లు జరిపించిన తరువాత , ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టి  కేవలం  పేద , మధ్య తరగతి  ప్రజల  సామాజిక  , ఆర్ధిక  మరియు గుర్తింపుగా జారీ చేసిన  అధికార ధ్రువ పత్రాలయిన "తెల్ల రేషన్ కార్డుల" ను  రేషన్ కే  పరిమితం  చేయడమో , రద్దు చేయడమో  చేయ కూడదు .  

ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసే "తెల్ల రేషన్ కార్డు లు" *RATION CARDS), అనేక విధాలుగా ఉపయోగ పడుతున్నాయి . ఒక విధంగా చెప్పాలంటే వీటిని " బహు లార్ద సాధక కార్డులు" అని చెప్ప వచ్చు.

"తెల్ల రేషన్ కార్డులు"  ప్రభుత్వం అధికారకంగా  జారీ  చేసే ధ్రువ పత్రాలు . "తెల్ల రేషన్ కార్డులు" నేడు కేవలం    పేద మధ్యతరగతి ప్రజలు  నెల నెలా  రేషన్ సరుకులు  తీసుకోవడానికే కాకుండా , బ్యాంకులలో , గ్యాస్  సంస్థలలో , డ్రైవింగ్  లైసెన్సులకు , విద్యాలయాలలో   మరియు  ప్రతి చోటా అడ్రస్  ప్రూఫ్ కు  ఉపయోగ పడుతున్నాయి . వోటు  వేయడానికి  ఐ . డి . కార్డులుగా ఉపయోగ పడుతున్నాయి . పాన్ కార్డు తీసుకోవడానికి  , పాస్ పోర్ట్  తీసుకోవడానికి  ఉపయోగ పడుతున్నాయి . 
ఇలాంటి వాటిని " ఒక కార్డు - ఒక ప్రయోజనం " అనే విధంగా కాకుండా, అనేక రకాలుగా ఉపయోగపడే  తెల్ల రేషన్ కార్డు లను అర్హులకే చేరేవిదంగా నియంత్రిస్తే సరి పోతుంది . విది విధానాలు రూపొందించి , అమలు చేస్తే సరి పోతుంది .
"తెల్ల రేషన్ కార్డులు" ఇప్పటి లాగానే , నిత్యావసర సరుకుల కొరకే కాకుండా , 'ఆరోగ్య శ్రీ' సేవలు పొంద డానికి మరియు ఫి రియంబర్స్ మెంటుకు అర్హత కల్పించాలి . ప్రతి ఇతర  అధికార  పత్రాలతో  "తెల్ల రేషన్ కార్డుల" ను  లింక్ చేయాలి .  అడ్రస్ లో  మార్పులు చేసుకుంటే అన్ని పత్రాలు ఆటోమేటిక్  గా  మారిపోయే విధంగా  సాఫ్ట్ వేర్  ను  తయారు చేసుకోవాలి . 

ధన వంతుల కు , 20 లక్షలకు  ఆ పై విలువగల  స్వంత ఇండ్లు  ఉన్న వారికి , ఇండ్లను కిరాయీలకు ఇచ్చి రాజాల్లా బ్రతికే వారికి , బడా వ్యాపారస్తులకు , అధిక ఆదాయా పన్నులు కట్టే ధన వంతులకు  , కార్లు , లారీలు ,  బస్సులు ఉన్న వారికి , 3 ఎకరాలు  ఆపై భూములు ఆస్తులు ఉన్న వారికి , 10 లక్షలకు మించి  ఇన్సురెన్స్  కడుతున్న వారికి లక్షల్లొ బ్యాంకుల్లో నిధులు ఉన్నవారికి , లాకర్లలో ఆభరణాలు , నిధులు ఉన్న వారికి , విదేశాలలో నల్ల దానం ఉన్నవారికి , బినామి ఆస్తులున్న వారికి ,  ప్రభుత్వ ఉద్యోగస్తులకు , పట్టణాలలో సం. రానికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం గల వారికి ( గ్రామాలలో  2 లక్షల  ఆదాయం ఉన్న వారికి ) , రాజ కీయ నాయకులకు  "తెల్ల రేషన్ కార్డు లు"  జారీ చేయ కూడదు.  నేడు అధి కారుల అండతో  వీరిలో  కొందరికి  "తెల్ల రేషన్ కార్డు లు" సులభంగా అందుతున్నట్లుగా  రద్దు చేసే  "తెల్ల రేషన్ కార్డు ల" ను బట్టి  అర్ధ మవుతున్నది . అందుకని , బోగస్ కార్డులను , బినామి కార్డులను తొలగించాలి . తెలంగాణా లోగో ను ముద్రించి "తెల్ల రేషన్ కార్డు లు"  ఇష్యూ చేయాలి . "తెల్ల రేషన్ కార్డుల" ను  రేషన్ కే  పరిమితం  చేయడమో , రద్దు చేయడమో  చేయ కూడదు .  దీని వలన  ప్రభుత్వానికి  ఇన్ని రోజులు  పడిన శ్రమ , కోట్లాది  రూపాయల వ్యయం  ' బూడిదలో  పోసిన పన్నీరు ' అవుతుంది . అంతే కాదు  ప్రజలకు  , ప్రభుత్వంపై  ఒక చెడు అభి ప్రాయం ఏర్పడుతుంది . 

బోగస్ , బినామి "తెల్ల రేషన్ కార్డు లు" తొలగించడానికి , ప్రభుత్వ పరమయిన చర్యలే కాకుండా , ప్రజలు ఇన్ఫర్మేషన్ ఇవ్వ డానికి రూ .లు 10 వేల పారి తోషికం, గుర్తింపు పత్రం ఇవ్వ చూపాలి . వారి వివరాలను గోప్యంగా ఉంచాలి , రక్షన కల్పించాలి . తెలుప వలిసిన ఫోన్ నెంబర్ , ఇ.  మెయిల్ అడ్డ్రస్ , పోస్టల్ అడ్డ్రస్ అన్ని పేపర్లలో ప్రకటించాలి .

Friday, May 6, 2016

పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు (REASONS FOR THE REDUCE OF POLLING PERCENTAGE )? పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి ( WHAT TO DO INCREASE THE POLLING PERCENTAGE ) ?

ప్ర . పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు (REASONS  FOR THE REDUCE OF POLLING PERCENTAGE ) ? పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి  ( WHAT TO DO INCREASE  THE POLLING PERCENTAGE )  ?

జ . ఎన్నికల సందర్భంగా , ఎన్నికల కమీషన్ మరియు మీడియా అనేక రకాలుగా , అవగాహనా కల్పించినా , ప్రోత్స హించినా , బాధ్యతను గుర్తు చేసినా ,  ఎన్నికల లో  పోలింగ్ శాతం తగ్గడానికి  , " కర్ణుడి చావుకి శత కోటి కారణాలన్నట్లు ", పోలింగ్ తగ్గ డానికి అనేక కారణాలున్నాయి.

పోలింగ్ శాతం తగ్గ డానికి కారణాలు :
*************************************
1. చాలా మంది పేర్లు , ఒకటి కంటే ఎక్కువగా నమోదు కావడం . ఆన్ లైన్ ద్వారా మరియు ఇతర మార్గాల ద్వారా . కరెక్క్షన్స్ కోసం అవకాశం కల్పించడం వలన , అన్ని రకాలుగా సబ్మిట్ చేసారు . తక్కువ సమయం , సిబ్బంది కొరత మొదలైన కారణాల వలన , పాతవి అలానే వుంచి క్రొత్తగా మరల రిజిస్టర్ చేయడం లాంటివి జరిగినవి . ఫోటోలు మారడము , పేర్లు , అడ్డ్రస్సులు తేడాగా వుండటం వలన , లిస్టులో నుండి రిమువ్ చేయలేక పోయారు . 

2. ఆంద్ర ప్రదేశ్ ప్రజలు మరియు ఇతర రాష్ట్రాల ప్రజలు వారి స్వస్థాలాలోనే కాకుండా , మరల ఇక్కడ కూడా నమోదు చేసుకుని ఉండి ఉండొచ్చు. రెండు సార్లు వేయకుండా , ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు చేపట్టడం వలన , ఇక్కడి ఎన్నికలలో పాల్గొన కుండా ఉండటాన్ని కొట్టి పారేయ లేము. 

3. చాలా మంది అర్హత ఉన్న అనేక ఏండ్లు గా ఉంటున్న ఓటర్లను , అనేక కారణాల వలన ఓటర్ల లిస్టుల నుండి తొలగించడం జరిగింది . ఆ కారణంగా చాలా మంది ఓటర్లు, వారి ఓటు హక్కు వినియోగించు కోలేక పోయారు .

4. చాలా మంది ఓటర్లకు , ఎన్నికల సిబ్బంది ఓటరు స్లిప్పులను ఇవ్వలేదు . అందు వలన కూడా, పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలియక , ఓటు వేయలేక పోయారు .

5. గ్రేటర్ హైదరాబాదు లో , వివిధ కారణాల వలన అడ్డ్రస్సులు మారే వారు అధికం . అడ్డ్రస్సులు మారిన వారు , పాత అడ్డ్రస్సుల్లో ఉండరు కాబట్టి , ఎన్నికల స్లిప్పులు ఇవ్వడానికి అవకాశమే లేదు . ఆ కారణంగా కూడా కూడా కొంత మంది ఓటర్లు వోటు వేయ లేక , ఓటు శాతం తగ్గింది . 

6. చని పోయిన వారి పేర్లు ఓటరు లిస్టులో నుండి తొలగించక పోవడం వలన , నమోదయిన ఓటర్ల సంఖ్యా పెరిగి నట్లైంది. ఓటింగ్ శాతం తగ్గి నట్లైంది .

7. ఈ మద్య కాలంలో నూతనంగా వెరయిటీ ఓటర్ ఐ డి కార్డులు ఇష్యూ చేసారు . వాటి మీద ప్రజెంట్ పోలింగ్ బూతు నెం . పార్ట్ నెం . స్థలం అన్నీ ఉన్నాయి . సులువుగా వీరిని బూతు లోకి అనుమతించ వచ్చు . కాని స్లిప్పులు లేని కారణంగా వీరిని బూతు లోకి అనుమతించ లేదు . తెలియక కొందరు , వాదించడం ఇష్టం లేక కొందరు , లాఠీలకు బయ పడి కొందరు వెను తిరిగి పోయారు . ఓటరు కార్డుల పైననే ఇవన్నీ ఉన్నాయని , ఇలా కొత్తగా ఓటరు కార్డులు పొందిన వారికి మరియు ఎన్నికల సిబ్బంది కి , ఎన్నికల కమీషన్ అవగాహనా కల్పించ లేక పోయారు . 

8. కొందరు అని వార్య కారణాల వలన , ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వలన , ఓటు వేయలేక పోయారు .

9. మరి కొందరు అనారోగ్య కారణాల వలన , ఓటు వేయలేక పోయారు .

10. ఇంకొందరు , ఓటు వేసినా , వేయక పోయినా వీరాభి మానుల కారణంగా ఎవరో ఒకరు గెలుస్తారు , మరల యదా విదే , అని ఎన్నికలంటే నిరాసక్తత , నిర్లక్ష్యమ్ , అయిష్టత తో ఓటు వేయ కుండా ఉండ వచ్చు .

11. డబ్బు , మందు ప్రభావం కొందరిలో ఉత్సాహాన్ని నింపుతే , మరికొందరిలో నిరుత్సాహాన్ని , ఇంకొందరిలో పగలు , కక్షలు , కొట్లాటలు పెంచి ఓటు హక్కు లను దూరం చేసాయి .

12. కొన్ని చోట్ల పోలింగు బూతులు దూరంగా ఉండటం వలన ఓటు హక్కు వినియోగించు కోలేదు .

13. ఒకే కుటుంభ సభ్యులకు , తల్లి దండ్రులకు పాత కార్డుల ప్రకారం ఒక అడ్డ్రస్సు బూతు , కొత్తగా అవకాశం వచ్చిన పిల్లలకు కొత్త కార్డుల ప్రకారం మరో పోలింగు బూతు పడటం వలన , ఎవరో ఒకరు , లేదా అందరూ ఓటు వేయడం మిస్ చేసు కుని ఉండాలి . 

14. ఎండ ప్రతాపం మరియు నీరు , నీడ లాంటి సౌకర్యాలు కొరవవడం కూడా , ఎన్నికల శాతం తగ్గడానికి కారణం అయి ఉండాలి .

15. వేరే ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో ఉండటం , పోస్టల్ బ్యాలెట్ వోటు హక్కును వినియోగించు కోవడం మరిచి పోవడం మొదలగునవి , ఎన్నో కారణాలు , గ్రేటర్ హైదరాబాదు లో ఓటింగు శాతం తగ్గ డానికి కారణ మయ్యాయి.

ఎన్నికల కమీషన్ , ఎంతో దూరదృష్టితో వోటర్ కార్డు ప్రాముఖ్యతను గుర్తించి , ఓటరు నమోదు ప్రక్రియ ను ప్రారంభించింది . వోటరు కార్డు అనేది ఇప్పుడు ఒక "బహులార్ధక సాధక సాధనం " . బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా వోటరు కార్డు నే అడ్గు తున్నారు . రేషన్ కార్డు కు అప్లై 

చేయాలన్నా వోటర్ కార్డు నే అడుగు తున్నారు . టెలి ఫోనుకు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . పాస్ పోర్టు కు అప్లై చేయాలన్నా వోటర్ కార్డే కావాలి . డ్రైవింగ్ లైసెన్సు కు అప్లై చేయాలన్నా వోటరు కార్డు కావాలి. చివరికి వోటు వేయాలన్నా వోటర్ కార్డు కావాలి . ఇంత ముఖ్యమైన వోటర్ కార్డు , అప్లై చేసిన ప్రతి చోటా ఉంటాయి . 

అలాంటిది , వోటర్ లిస్టులో పేరు లేక పోతే , వోటర్ కార్డు విలువ ఏమిటి ?. వోటరు , వోటు వేయడానికి వెళ్లి నప్పుడు వోటు వేసే అర్హత లేదన్నప్పుడు ఎంత క్షోభకు గురి అవుతాడు . బ్యాంకు , పాస్పోర్ట్ , టెలిఫోన్, డ్రైవింగ్ అధి కారులు , ఏదేని అవసరం వచ్చి వోటరును వేడుకుదామనుకుని , వోటర్ లిస్టు వేడుకుతే , అందులో వోటరు పేరు లేక పోతే , ఇక ఎలా ముందు కెలుతారు ?. ఇక ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం ఎలా కలుగుతుంది ?.

పోలింగ్ శాతం పెర్గ డానికి ఏమి చేయాలి ?
*****************************************
1. ప్రతి ఇంటి ఇంటికి ఎన్నికల కమీషన్ నియమించిన సిబ్భందే వెళ్లి , అర్హులైన వోటర్ల గురించి , అనర్హులైన వోటర్ల గురించి ఖచ్చితమైన విచారణ జరిపి , తప్పుడు వోటర్లను , ఓటర్ లిస్టు నుండి తొలగించాలి . అలానే ఓటరు లిస్టులో లేని పేర్లను అక్కడికక్కడే ఫోటోలు దింపి , అప్లికేషన్లను తీసుకోవాలి . ఆ తరు వాత ఓటరు లిస్టులో నమోదు చేయాలి .

2. విచారణకు నియమించ బడే సిబ్భంది , ఏమి చదివారు అనేది కాకుండా , ప్రజల భాషలు అర్ధం చేసు కోగలరా , మాట్లాడ గలరా , చదువ గలరా , వ్రాయ గలరా , విచారణ భాధ్యతలను సక్రమంగా నిర్వర్తించ గలరా అనేది పరిశీలించి నియమించాలి .

3. మరణ ధ్రువ పత్రాలు ఇష్యూ చేసే జి. ఎచ్. ఎం సి నుండి వివరాలు సేకరించి, మరణించిన వారి పేర్లను ఓటరు లిస్టు లో నుండి తొలగించాలి .

4. ఏ రాజ కీయ నాయకులకు , కార్య కర్తలకు , ఓటరు లిస్టులో పేర్లను తొలగించ డానికి , అవకాశం ఇవ్వ కూడదు .

5. కేవలం గత ఎన్నికలలో ( వివిధ కారణాల మూలంగా ) ఓటు వేయ లేక పోయి నంత మాత్రాన , వారి పేర్లను ఓటర్ లిస్టులో నుండి తొలగించ కూడదు . 

6.ఒకసారి కంటే ఎక్కువ సార్లు లిస్టయిన పేర్లను , ఫోటోలను , అడ్డ్రస్స్ లను గుర్తిచే , కనీసం రాష్ట్ర పరిధిలో నైనా , సాఫ్టవేర్ ను ఉపయోగించి , డూప్లికేట్ ఓటర్లను గుర్తించి , అనలైజ్ చేసి , నిర్ధారణ చేసు కుని , అలాంటి వాటిని తొలగించాలి . 

7.ఎన్నికల కమీషన్ , కేవలం ఎన్నికల సమయాన్నే మొక్కుబడి గా హడావుడి చేయ కుండా , పూర్తి కాలం వోటర్ల నమోదు , వోటర్ల తొలగింపు పై దృష్టి సారించాలి .

Thursday, May 5, 2016

బ్యాంకులలో మొండి బకాయీలు మరియు నిరర్ధక ఆస్తులు ( BAD DEBTS AND NON PERFORMING ASSETS) పెరిగి పోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ?

ప్ర . బ్యాంకులలో  మొండి బకాయీలు  మరియు  నిరర్ధక ఆస్తులు ( BAD DEBTS AND NON PERFORMING ASSETS) పెరిగి పోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి ?

జ . అసలు  మొండి బకాయీలు  అంటే ఏమిటో  మరియు  నిరర్ధక  ఆస్తులు  అంటే ఏమిటో  ముందు తెలుసుకుందాం . 

ఒక నెల  అసలు  వాయిదా మొత్తం మరియు  దానిపై  వడ్డీని  అప్పు తీసుకున్న వారు  చెల్లించ నట్లవుతే , దానిని  మొండి బకాయీలు ( BAD DEBTS) గా  భావిస్తారు . అలాంటి వాయిదాలనే  వరుసగా 3 నెలలు  ( 90 రోజులు ) చెల్లించ లేక పోయి నట్లవుతే , దానిని  నిరర్ధక ఆస్తులు (NON PERFORMING ASSETS) గా  భావిస్తారు .  


'' కర్ణుడి చావుకు  శతకోటి కారణాలన్నట్లు ", బ్యాంకులలో  మొండి బకాయీలు  మరియు  నిరర్ధక ఆస్తులు ( BAD DEBTS AND NON PERFORMING ASSETS) పెరిగి పోవడానికి  అనేక  కారణాలను  చెప్పుకోవచ్చు . అందులో ముఖ్యమైనవి :




01. కమీషన్లకు  కక్కుర్తి పడో , మోహ మాటాలాకో ( OBLIGATIONS ) ,నీకిది నాకదనో ( QUID PRO)

 ,నాయకులకు  , పై అది కారులకు  భయ పడో  , మోసగాండ్ల  మాట కారి తనాలను తట్టుకో లేక నో  , పెద్ద పెద్ద వ్యాపారస్తులకు , తగినంత  సెక్యూరిటీ  లేకుండానే  ఉదారంగా  అప్పులు ఇవ్వడం . 


02. రాజ కీయ నాయాకుల  పరోక్ష వత్తిడి . 

03. బ్యాంకుల కు  స్వయం నిర్ణయాధి కారం లేక పోవడం . 


04. బ్యాంకులకు సరియయిన  రేటింగ్ వ్యవస్థ , అప్పులను తిరిగి చెల్లించే శక్తి  ఉందా లేదా అనే దానిని  అంచనా వేసే  టెక్నికల్ అధికారులు, సాఫ్ట్ వేర్  , ఫాలో అప్  అధికారులు  లేక పోవడం , 



05. సరే అని కోర్టులకు వెళ్తే , డబ్బు ఉన్న వారికి  మేధావి న్యాయ వాదులు , చట్టాల లోని మినహా ఇంపులను  ఆసరాగా చేసుకుని , కొన్ని ఏండ్లు కోర్టుల చుట్టూ త్రిప్పడం . 



06. దానికి  తోడు  ఆర్ధిక  మాంద్యం . జి డి పి  కుంటూ పడటం . 

07. చట్టాలలో , రాజకీయాలలో  మార్పులు చేర్పులు , సవరణలు , రద్దులు . 

08.  ప్రకృతి వైపరీత్యాలు  చోటు చేసుకోవడం . ఉదా : సైక్లోన్ , భూ కంపాలు , వరదలు , ప్రమాదాలు , యుద్దాలు . 

09. వడ్డీలు  , అప్పులు  మాఫీ చేయడం . సబ్సీడీలు ఇవ్వడం . 

10. విదేశాలకు వెళ్ళిన  అప్పు ఎగ వేత  దారులను  తీసుకుని రావడానికి , అక్కడి చట్టాలు అడ్డు రావడం . 

11. బ్యాంకులకు సామాజిక భాద్యత కలిగి ఉండాల్సి రావడం . 


12. దేశ విదేశాలలో  పలుకుబడి  గల  వారికి , పలుకుబడి గల సంస్థలకు  అప్పులు అధికంగా ఇవ్వాలని  బ్యాంకులు పోటీ  పడటం  మొదలైన వన్నీ ఈ రోజు  , సుమారుగా  8 లక్షల  కోట్ల  బ్యాంకుల అప్పులు  నిరర్ధక  ఆస్తులుగా  మారడానికి  కారనాలైనాయి . 

Wednesday, May 4, 2016

' ప్రోగేరియా వ్యాది ' (PROGERIA DISEASE) అనగా నేమి ?

ప్ర . ' ప్రోగేరియా వ్యాది ' (PROGERIA DISEASE) అనగా నేమి ?


జ . చిన్న తనం లోనే  ముసలి తనం  లక్షణాలు  కనబడటాన్ని ' ప్రోగేరియా వ్యాది ' అంటారు . ఇలాంటి వారు మన భారత దేశంలో సుమారుగా 65 మంది  ఈ వ్యాధి బారిన  పడి  ఉంటారని ఒక అంచనా.  ' ప్రోగేరియా వ్యాది ' భారత దేశ ' ప్రోగేరియా వ్యాది ' ప్రచార  కర్త (బ్రాండ్ అంబాసిడర్ ) (' ప్రోగేరియా వ్యాది ' బారిన పడిన వ్యక్తి )  బీట్ల  నేహాల్  ' ప్రోగేరియా వ్యాది ' తో  ఎండ  వడ దెబ్బకు మరణించాడు . ఇతని వయస్సు  15 సంవత్సరాలు . కాని  ఇతడు 60 యేండ్ల ముసలి వాడిగా కనిపిస్తాడు . ఇతడిది  కరీం నగర్ జిల్లా , సుల్తానాబాద్ మండలం , పూసాల గ్రామానికి చెందిన వాడు . ఇతడి తల్లి దండ్రులు  శ్రీనివాస్  మరియు  శ్రీదేవి .