ప్ర: 'స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ' (STATE BANK OF INDIA ) బ్యాంక్ , సేవింగ్స్ అకౌంట్లపైన చెల్లించే వడ్డీని 4% నుండి 3. 5% తగ్గించాక , పొదుపు చేసుకునే ప్రజలకు ప్రత్యామ్నాయం ( ALTERNATIVE SAVING METHODS WITH HIGH INTEREST RATES ) ఏమీ లేవా ?
N.B: " MUTUAL FUNDS AND SHARES INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS. READ ALL THE RELATED DOCUMENTS CAREFULLY BEFORE INVESTING".
N.B: " THE SUGGESTIONS GIVEN AT THE INTEREST OF POOR AND MIDDLE CLASS PEOPLE. BEFORE TAKING ANY INVESTMENT DECISIONS , CONTACT ANY RELIABLE INVESTMENTS CONSULTANTS. THIS BLOG WRITER IS NOT LIABLE FOR ANY DAMAGE OR LOSS TO ANY ONE ".
www.sollutions2all.blogspot.com
'
జ : 'స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ' (STATE BANK OF INDIA ) తీసుకున్న నిర్ణయం , చిన్న పొదుపు దారులకు పెను శాపంగా మారి పోయింది . ది . 31.07. 2017 . నుండి కోటి రూపాయల వరకు పొదుపు చేసుకున్న చిన్న మదుపు దారులకు , అకస్మాత్తుగా సాలుసరి వడ్డీని 4% నుండి 3.5% నికి తగ్గించి వేసింది . ఇక కోటి , ఆపైన సేవింగ్ అకౌంట్లల్లో పొదుపు చేసిన వారికీ 4% వడ్డీని యదా విధిగా కొనసాగించ నుంది . రేపు మిగిలిన బ్యాంకులు కూడా అదే బాట పట్ట వచ్చు .
వాస్తవంగా చూస్తే , 3.50% అంటే , రూ . లు . 100/- 365 రోజులు పొదుపు చేస్తే , ఆ తరువాత బ్యాంకు వారు మంకు చెల్లించే వడ్డీ రూ . లు . 3.50/-. అంటే రోడ్డు మీద కనీసం ఒక్క ' టీ ' కూడా రాదన్న మాట . అదే బ్యాంకు వారు మినిమమ్ బ్యాలన్స్ ఒక్క రూపాయి తగ్గినా 100/- రూ . లు. మరియు జి ఎస్ టి 18% కలిపి 118 రూ . లు . సేవింగ్ అకౌంట్లకు డెబిట్ చేస్తారు . కరెంట్ అకౌంట్లో కోట్ల డబ్బు ఉన్నా రూపాయి వద్దే చెల్లించారు . పెద్ద వాండ్లు తీసుకున్న లక్షల కోట్ల రూపాయలను సునాయాసనంగా రద్దు చేస్తారు . ఆర్ . బి . ఐ గణాంకాల ప్రకారం గత 5 సం . రాలలో బ్యాంకులు రద్దు చేసిన రుణాలు , 2012-13 లో 27,231 కోట్లు, 2013-14 లో 34,409 కోట్లు , 2014-15 లో 49,018 కోట్లు ,2015-16 లో 57,586 కోట్లు మరియు 2016-17 లో 81,683 కోట్లు . మొత్తం 2,49,927 కోట్లు .
సామాన్య , మధ్య తరగతి పొదుపు దారుల వద్ద ఎక్కువ డబ్బు ఉందనుకుని , వీరికి ఆదాయ అవకాశాలు అధికమని అనుకుని వడ్డీ రేటును వీరికి 3.50% తగ్గించారా లేక కోటి , ఆపైన పొదుపు చేసిన వారు , పేద వారు అని అను కుంటున్నారా లేక వారి వడ్డీ తగ్గిస్తే బ్యాంకులో ఉన్న డబ్బును విత్ డ్రా చేస్తారని అనుకున్నారో సామాన్య ప్రజలకు తెలియడం లేదు . కోట్ల కొద్దీ డబ్బు కలిగి ఉన్నవారు , నిజాయితీగా కోట్ల కొద్దీ డబ్బు సంపాదించి పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నారు అని వీరికి వడ్డీని యదా విధిగా 4% ఉంచారా , లేదా బ్యాంకులకు పేద వారిని నుండి అయితే ఎక్కువ ఆదాయం సంపాదించ వచ్చు , ఏ పేచీ కూడా ఉండదు అని అను కున్నారా ఏమో పేద మధ్య తరగతి ప్రజలకు పాలు పోవడం లేదు . వీటికి తోడు మదుపు దారులకే , మినిమమ్ బ్యాలన్స్ చార్జీలు , అనేక మెయిన్ ఇతర చార్జీలు పడుతుంటాయి . 31 మే వచ్చిందంటే , ముక్కు పిండి భీమా డబ్బులను వసూలు చేస్తారు . పేద వారు కాబట్టి , ఒక వేల సరిపడా బ్యాలన్స్ లేక పోతే , భీమా డబ్బులు డెబిట్ కాక్క పోతే ' జన్ ధన్ భీమా ' వర్తించదు . కరెక్టుగా మినిమమ్ బ్యాలన్స్ వరకే మెయింటైన్ చేస్తే , ఇలాంటి భీమా డబ్బులు డెబిట్ అయినా , ఎస్ ఎం ఎస్ చార్జీలు డెబిట్ అయినా , మినిమమ్ బ్యాలన్స్ తగ్గిందని మరల చార్జీలు డెబిట్ చేస్తారు . దీనికి జి ఎస్ టి (GST) 15 % నుండి 18% పెరగడం వలన , కొంత కాలం పోతే బ్యాంకు లంటే ప్రజలకు విసుగు కలగ వచ్చు . అప్పుడు మరల ' బార్ట్ ర్ సిద్ధాంతాని ' (BARTER SYSTEM) కి వెళ్లి పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి .
ప్రాక్టికల్ గా ఆలోచిస్తే , కేవలం వేయి రూపాయల నుండి 5 లక్షలు డబ్బు ఉన్న పేద మధ్య తరగతి ప్రజలు మాత్రమే , సేవింగ్ ఆకొంట్లలో డబ్బును అలానే నిల్వ ఉంచు కుంటారు . అధిక మొత్తం కోట్లల్లో ఉన్న వారు ( బినామీ అకౌంట్ హోల్డర్లు , ఫేక్ అకౌంట్ హోల్డర్లు , ఇన్ ఆపరేటివ్ అకౌంట్ హోల్డర్లు , కోర్టు ప్రకారం లావాదేవీలను నిలిపివేసిన హోల్డర్లు మినహాయిస్తే ) ఖచ్చితంగా వారు , ఇంత కంటే ఎక్కువ ఆదాయం లభించే సాధనాలలోనే డిపాజిట్ చేస్తారు .
కాబట్టి 5 లక్షల నగదు నిల్వలు ఉన్న సేవింగ్ అకౌంట్లకు 4% వడ్డీని , 5 లక్షల నుండి ఆపైన ఒక కోటి డబ్బులు కలిగి ఉన్న సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు 3.5% , కోటి ఆపైన నగదు నిల్వలు ఉన్న అకౌంట్లకు 3% వడ్డీని నిర్ణయిస్తే బాగుండేదని పేద మధ్య తరగతి ప్రజల ఆలోచన .
ఏది ఏమైనా , నిర్ణయం జరిగి పోయింది కాబట్టి , చిన్న మదుపు దారులు , అధిక ఆదాయం కొరకు , వడ్డీ ఎక్కువ లభించే ప్రత్యామ్నాయ మార్గాల కొరకు అన్వేషించక తప్పదు . వాటిలో ముఖ్య మైనవి ;
01. సీజనల్ గా చౌకగా దొరికే మనకు కావాల్సిన నిత్యావసర, మరియు అత్యవసర సరుకులను / వస్తువులను 3 నెలలకు సరిపడా లేదా 6 నెలలకు సరిపడా ,లేదా 12 నెలలకు సరిపడా కొని జాగ్రత్తగా నిలవ చేసుకోవాలి . దీని వలన అధిక పొదుపు కల్సి వస్తుంది .
ఉదా : వర్షా కాలంలో ఉల్లిగడ్డలు రూ . లు .10/- కిలో ఉంటే , అవే ఎండా కాలంలో రూ. లు.100 /- లకు కిలో అవుతుంది. చింత పండు 10/- కిలో సీజన్లో ఉంటే , 6 నెలల తరువాత 100/- కి కిలో అవుతుంది . నూనెలు , పప్పు దినుసులు, కరం , పసుపు , ఎల్లిగడ్డలు , బియ్యం, ధాన్యాలు ఇలా ఎన్నో నిలువ ఉండే వస్తువులు / సరుకులు ఉన్నాయి . వాటిల్లో పొదుపు చేయండి . కుండలో నీరు నిండుగా ఉంటే , డబ్బాలో బియ్యం నిండుగా గా వుంటే ఆ మానసిక ధైర్యమే వేరు . జీవించగలమనే ధై ర్యం ఏర్పడుతుంది , జీవించాలనే ఆశ కలుగుతుంది . నేటి మన పొదుపు క్రమ శిక్షణే పొదుపు మనకే కాకుండా , రేపటి తరాలకు కూడా ఆటో మాటిక్ గా పాసాన వుతుంది
02. అధిక వడ్డీ లభించే ఫిక్స్డ్ డిపాజిట్లల్లో పొదుపు చేయాలి . కొన్ని బ్యాంకులు 7 రోజులు ఆ పైన రోజులకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లను ఇస్స్యూ చేస్తున్నాయి . అక్కడ అక్కౌంట్స్ ఓపెన్ చేసుకుని అక్కడ పొదుపు చేయండి . ముందుగా మీకు అకౌంట్ ఉన్న బ్యాంకులోనే ఆరాతీయండి . ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుందో అక్కడే ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి . ఏ బ్యాంక్ అయితే దగ్గరగా ఉంటుందో , ఏ బ్యాంక్ అయితే సరియయిన సేవలను అందిస్తుందో , ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వడ్డీ చెల్లిస్తుందో అబ్యాంకునే ఎంచు కొండి . చిన్న చిన్న మొత్తలుగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి , ఆటోమాటిక్ రోలోవర్ అప్షన్ , మరియు ఆన్ లైన్ ఎనీ వేర్ అప్షన్ కావాలని అడగండి . నామినీ ని రిజస్టర్ చేయ మనండి .
03. బ్యాంకుల కంటే , పోస్టాఫీసులలో కొంచెం అధికంగానే వడ్డీ లభిస్తుంది . వీటినైనా ఎంచు కోవచ్చు . కాక పోతే ఇక్కడ ఏజెంట్ల బెడద అధికంగా ఉంటుంది . బ్యాంకులంత స్పీడ్ ఉండదు . లిక్విడిటీ తక్కువ . ఈ 10 నిమిషాల్లో ఓ 2 లక్షలు కావలనంటే మీనా మేషాలు లెక్క బెడుతారు . కొంత మంది క్లర్కులు కొట్లాటకే దిగుతారు. ఒక రోజు ముందుగా చెప్పాలని వాదిస్తారు . బ్యాంకులలో అలాంటి సమస్యలు లేవు .
04. కాస్త చదువుకున్న వారు , షార్ట్ టర్మ్ కొరకు , మేలిమైన , మన్నికైన ' మ్యూచువల్ ఫండ్స్ ' (MUTUAL FUNDS) లలో ని డెట్స్ ఫండ్స్ లలో గాని , లీక్వ్డ్ ఫండ్స్ ల లో గాని పెట్టుబడులు చేయవచ్చు . అదే లాంగ్ టర్మ్ కొరకయితే లార్జ్ క్యాప్ ఫండ్స్లో గాని , సెక్టార్ ఫండ్స్ ల లో గాని , పన్నులు తగ్గించే ఫండ్స్ (ELSS)ల లో గాని పొదుపు చేయ వచ్చు . ఇక్కడ మరల గ్రోత్ ఫండ్స్ లేదా డివిడెండ్ అప్షన్లను ఎంచు కోవచ్చు .' సిస్టమాటిక్ ఇన్వెస్టుమెంట్ ప్లాన్ ' (SIP) ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయ వచ్చు . 'సిస్టమాటిక్ విత్ డ్రాల్ ప్లాన్ '(SWP) ఎంచు కోవచ్చు . ఎక్కడైనా 50,000/- పొదుపు మించితే ' పాన్ ' (PAN) కంపల్ సరి . అలానే ఇక్కడ పొదుపు చేయాలనంటే 50,000/- లోపైనా ' పాన్ '(PAN) అవసరం .
05. మరింత అనుభవం ఉన్న వారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొరకు , మంచి కంపెనీల షేర్లల్లో పెట్టుబడి పెట్ట వచ్చు . కనీసం 5 , 10 సం . రాలైనా వేచి ఉంటేనే లాభాలకు ఆస్కారం ఉంటుంది . పెన్నీ షేర్ల జోలికి వెల్ల కూడదు . స్పెక్యులేషన్ చేయ కూడదు . అత్యాశకు పోకూడదు . ర్యూమర్లను నమ్మకూడదు . అప్పు చేసి శేర్లల్లో గా ని , మ్యూచువల్ ఫండ్స్ లలో గాని పెట్టుబడులు చేయ రాదు .
06. క్యాష్ లెస్ మెడిక్లైయిం పాలసీలను , కుటుంభం మొత్తానికి కలిపి తీసుకోవచ్చు . సేవింగ్ ఆకొంట్లలో డబ్బు నిలువ ఉంచుకునేది ఇలాంటి అవసరాలకే కదా . అందు కని , ముందు జాగ్రత్త గా , ఇలాంటి పాలసీలను , మంచి ఇన్స్యూరెన్స్ కంపెనీల వద్ద తీసుకున్నట్లయితే , సేవింగ్ అకౌంట్లలో డబ్బు లేకున్నా పెద్ద సమస్య ఉండదు .
07. ఏమైనా హౌసింగ్ లోన్స్ , వెహికిల్ లోన్స్ , బయట ఎక్కువ వడ్డీ అప్పులు ఉన్నట్లయితే , అడ్వాన్సుగా తీర్చి వేయవచ్చు . ఇప్పడు ముందస్తుగా తీర్చినా పన్నులు గాని , రుసుములు గాని ఉండవు .
08. ఖచ్చితంగా అవసరం ఉంటుంది అని మీరు అనుకుంటే ఇప్పుడే అవసరమైన బంగారు నగలను కొని పెట్టు కోవచ్చు . ఎందు కంటే , ఒక వైపు పొదుపు ఖాతాలో వడ్డీ రేటు తగ్గింది . మరో వైపు అక్కడ చౌకగా బంగారు నగలు లభిస్తున్నాయి . మల్లీ బంగారం ధర పెరుగ వచ్చు గాని , ఇప్పట్లో వడ్డీ రేట్లు పెరుగవు .
09. సేవింగ్ అకౌంటల్లల్లో అధిక నగదు నిల్వలు ఉంటె , అదే బ్యాంకులో ' రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ' ఓపెన్ చేస్తే , ఖచ్చితంగా అధిక వడ్డీ లభిస్తుంది.
10. ఎల్ . ఐ . సి . వారి సీనియర్ సిటిజన్స్ పెన్షన్ పధకం లో ( 60 సం . రాలు దాటినా వారు ) గాని , పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ పధకంలో కానీ డిపాజిట్ చేసి నట్లవుతే సాలుసరి 8.3% వడ్డీ లభిస్తుంది .
11. మనకున్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసు కోవచ్చు .
12. ఉన్న గృహాలను రెన్నొవేషన్ చేసు కోవచ్చు . లేదా కొత్తవి కట్టు కోవచ్చు .
13. పిల్లల ఉన్నత చదువులకు , లోన్లు తీసుకునే బదులు , పెట్టుబడులు పెట్టవచ్చు .
14. చట్ట బద్దంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయ వచ్చు .
N.B: " MUTUAL FUNDS AND SHARES INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS. READ ALL THE RELATED DOCUMENTS CAREFULLY BEFORE INVESTING".
N.B: " THE SUGGESTIONS GIVEN AT THE INTEREST OF POOR AND MIDDLE CLASS PEOPLE. BEFORE TAKING ANY INVESTMENT DECISIONS , CONTACT ANY RELIABLE INVESTMENTS CONSULTANTS. THIS BLOG WRITER IS NOT LIABLE FOR ANY DAMAGE OR LOSS TO ANY ONE ".
www.sollutions2all.blogspot.com
'
No comments:
Post a Comment