Friday, August 18, 2017

ప్ర : Aadhaar Card (ఆధార్ కార్డు ) ఉందా లేదా , ఉంటే సెల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా , ఈ ఆధార్ నెంబర్ గల వారు మగ లేక ఆడ నా , సుమారుగా వయస్సు ఎంత ఉంటుంది మొదలైన విషయాలను తెలుసుకోవడం ఎలా ?

ప్ర :   Aadhaar Card  (ఆధార్  కార్డు )  ఉందా  లేదా , ఉంటే  సెల్ నెంబర్  లింక్  అయ్యిందా లేదా ,  ఈ ఆధార్  నెంబర్  గల వారు  మగ  లేక  ఆడ  నా , సుమారుగా వయస్సు ఎంత ఉంటుంది  మొదలైన  విషయాలను  తెలుసుకోవడం  ఎలా ?


జ :  ఆధార్  కార్డు  ఉందా  లేదా , ఉంటే  సెల్ నెంబర్  లింక్  అయ్యిందా లేదా ,  ఈ ఆధార్  నెంబర్  గల వారు  మగ  లేక  ఆడ  నా , సుమారుగా వయస్సు ఎంత ఉంటుంది  మొదలైన  విషయాలను  తెలుసుకోవడం   చాలా  సులువు . 

ఈ మధ్య కాలంలో  సుమారుగా  80 లక్షల  ఆధార్ కార్డులను  రద్దు చేశారు .  అందుకు  కారణాలు అనేకం .  పిల్లల  వివరాలు  రెండు  సార్లు  తప్పుగా నమోదు చేయడం  కావొచ్చు ,  మరణించినవారివి కావొచ్చు ,  వ్రేలు ముద్రలు  ఒకసారి ఇచ్చి  , మరోసారి ఇవ్వకుండా  , తప్పుడు పేర్లతో  తీసుకోవడం  కావొచ్చు .  ఈ విధమైన  కారణాల వలన  సుమారుగా  80 లక్షలకు  పైగా   ఆధార్ కార్డులను  రద్దు చేశారు .

అందుకని  మీ ఆధార్ కార్డులు  ఉన్నాయా లేక రద్దయినవా  తెలుసుకోవడం  అత్యవసరం . ఎందుకంటే  నేడు  ఆధార్ కార్డులకు  ఉన్నంత ప్రాముఖ్యత  మరో కార్డుకు  లేదు . ఏ  సంక్షేమ పధకాలు  అందాలన్నా ,  సెల్ కనెక్షన్ కావాలన్నా , గ్యాస్ కనెక్షన్ కావాలన్నా , బ్యాంకులో అకౌంట్  తెరువాలన్నా , పాన్ కార్డు , పాస్ పోర్ట్ కావాలన్నా  ఆధార్ కార్డు కావల్సిందే .  రేపు  ఓటు వేయా  లన్నా  ఆధార్ కార్డునే  నిర్బంధం  చేయ వచ్చు .  అందుకనే  దీనిని  ' బహుళార్ధ సాధక  కార్డు '  ఆని చెప్పుకోవచ్చు .  

ఆధార్ కార్డు ఉందా లేదా  తెలుసుకోవడం ఎలా ?

01. www.uidai.gov.in  అనే   వెబ్ సైట్  ను  ఓపెన్ చేయండి . 
02. అందులో 'Home page'  లో   'Aadhar online Services'  క్రింద  3 సబ్  టాబ్స్  కనిపిస్తాయి . 
03.  3 సబ్  టాబ్స్ లలో , 3 వ టాబ్  ' Aadhar Services'   (ఆధార్ సర్వీసెస్ )  క్రింద  ' Verify Aadhar Number'  అని కనిపిస్తుంది . దానిని  క్లిక్  చేయండి . 
04. క్లిక్ చేయగానే  , వేరే పేజీ లోకి వెళుతుంది  అని  మెస్సేజ్ వస్తుంది . అప్పుడు 'OK' ను   క్లిక్  చేయండి . 
05.  వేరే  పేజీ ఓపెన్ అయ్యాక , అక్కడ మీ ఆధార్  నెంబరును  ఎంటర్ చేయండి . 
06.  ఆ తరువాత , 'క్యాప్చాను '  ఎంటర్ చేసి , ' Verify' ని  క్లిక్ చేయండి . 

వెంటనే మీకు  ఎడమ బాగాన , గ్రీన్ కలర్ లో  రైట్ గుర్తు వస్తుంది . అప్పుడు  మీ ఆధార్ కార్డు లైవ్ లో ఉంది అని అనుకోవాలి .  దానితో పాటే ,  సుమారుగా మీ వయస్సు ఎంత , మగ  లేక  ఆడ ,  సెల్ నెంబర్  ఆధారుకు  లింక్ అయ్యిందా  లేదా, ఒక వేల  లింక్ అవుతే  ఏ సెల్ నెంబర్ లింక్ అయ్యింది  మొదలైన  అన్ని వివరాలు  మనకు  కనిపిస్తాయి . 

సద్వినియోగం చేసుకోండి . మీకు నచ్చుతే షేర్ చేయండి . 

www.sollutions2all.blogspot.com

No comments: