Tuesday, August 15, 2017

వృద్దాప్య దశలో (OLD AGE PERIOD) ఒంటరి తనానికి కారణాలు ఏమిటి ? వృద్ధాప్య దశలో లేదా ఒంటరి తనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ? వీటిని అధిగమించడం ఎలా ?

ప్ర : వృద్దాప్య  దశలో (OLD AGE PERIOD)  ఒంటరి తనానికి  కారణాలు ఏమిటి ? 


జ . వృద్ధాప్య దశ  అనేది  ఎవరికైనా  సహజం . వృద్దాప్య  దశ  ను ( అకాల మరణాలు తప్పా )  ఎవరూ  తప్పించుకోలేరు . అలానే  వృద్దాప్య  దశ లో వచ్చే  మానసిక , శారీరక  మార్పులను , చిన్న చిన్న  జబ్బులను   ధన  వంతులైనా  , పేద వారైనా  , స్త్రీలైనా , పురుషులైనా  అనుభవించి   తీరాల్సిందే .

వృద్దాప్య  దశలో (OLD AGE PERIOD)  ఒంటరి తనానికి  కారణాలు;

01. వృద్ధాప్య దశ లో  భార్య  మరణిస్తే  భర్త  ఒంటరి అవుతాడు . భర్త  మరణిస్తే భార్య ఒంటరి అవుతుంది . 


02. పిల్లలు లేక పోవడం వలన  వృద్ధాప్య దశ లో భార్యా  భర్తలు  లేదా ఎవరో ఒకరు  ఒంటరి వారు అవుతారు . 



03. పిల్లలు  ఉన్నా  , వారు విదేశాలలో  ఉద్యోగాలు చేస్తూ   అక్కడే  స్థిర పడి  పోతే, స్వదేశంలో  తల్లి దండ్రులు  ఒంటరిగానే  జీవించ వలసి వస్తుంది .  

04. స్త్రీలు గాని  , పురుషులు గాని  అసలు వివాహమే  చేసుకోక పోవడం వలన  , చుట్టాలు , బంధువులు  లేదా స్నేహితులు  ఎవ్వరూ  తోడు లేక పోయినా , వృద్ధాప్య  దశలో  ఒంటరి వారవుతారు . 

www.sollutions2all.blogspot.com


   

No comments: