Friday, May 24, 2024

కర్మ సిద్ధాంతం (PRINCIPLE OF WORK)


వచన కవిత
శీర్షిక: కర్మ సిద్ధాంతం


సృష్టి
విచిత్రమైనది
ప్రకృతి
శక్తివంతమైనది

భూమి
నిత్యం
తన చుట్టూ
తాను తిరుగుతుంది
సూర్యుడి చుట్టూ
తిరుగుతుంది
పగలు రేయిని
ఏర్పరుస్తుంది

భానుడు
ప్రతినిత్యం
తూర్పునే
ఉదయిస్తాడు
పడమరనే
అస్తమిస్తాడు


సృష్టికి
లోకంలో
అందరూ
సమానమే

వారు
సెలబ్రిటీలా
రాజకీయ నాయకులా
ధనవంతులా
పేద వారలా
పండితులా
పామరులా
మాట కారులా
మూగ వారలా
దానికి
సంబంధం లేదు
విధి రాతను
ఎవరూ
మార్చ లేరు

కర్మ
సిద్ధాంతం
ఎప్పటికీ
మారదు

తెలిసి చేసినా
తెలియక చేసినా
కర్మ కర్మే
కర్మ
నీడలా
వెంటాడుతూనే
ఉంటుంది

యోగాలు
చేసినా
యాగాలు
చేసినా
లాయర్లకు
కోట్లు వెదజల్లినా
చట్టాలను
అనుకూలంగా
మార్చుకున్నా
జనులను
మభ్యపెట్టినా

కోట్లు
కూడ బెట్టినా
లక్షలు
ఖర్చు పెట్టినా
శిక్షలు
పడక తప్పవు

నేడు
భార్యా
ఇద్దరు పిల్లలు ఉండి
భార్యా పిల్లలను
అనాధలను చేసి
ప్రకృతిని ధిక్కరించిన
రావణ కావచ్చు

భర్తా
ఇద్దరు పిల్లలు ఉండి
భర్తా పిల్లలను
దిక్కు లేని వారిని చేసి
కర్మను కాలదన్నిన 
పదేళ్లు పెద్దదైన
రక్కసి కావచ్చు

రేపు
మరొకరు కావచ్చు
మరో సంఘటన కావచ్చు
ఏదైనా
కర్మ సిద్ధాంత
ఫలితమే !

No comments: