Friday, May 24, 2024

అమ్మ (MOTHER)

 వచన కవిత

శీర్షిక : అమ్మ


(ముందుగా "మాతృ మూర్తి రోజు" శుభాకాంక్షలు)

అమ్మ
అమ్మంటే ఆత్మీయత
అమ్మంటే అనురాగం
అమ్మంటే అపురూపం
అమ్మంటే ఆణిముత్యం!

సృష్టికి మూలం అమ్మ
సృజనకు ప్రతి రూపం అమ్మ !

జన్మ నిచ్చేది అమ్మే
జన్మ రహస్యం తెలిసేది ఒక అమ్మకే!

జగతిలో అమ్మకు అమ్మే సాటి
అమ్మకు లేరు ఎవరూ పోటి!

కని  పెంచేది అమ్మ
కంటికి రెప్పలా కాపాడేది అమ్మ !
విశ్వాన్ని చూపేది అమ్మ
విజయాన్ని కాంక్షించేది అమ్మ !

రక్షణకు నెలవు అమ్మ
శిక్షణకు నెలవు అమ్మ
నిస్వార్ధానికి ప్రతీక అమ్మ
త్యాగానికి ప్రతీక అమ్మ!

కాలికి ముల్లు గుచ్చినా
కంటిలో నలుసు పడినా
మనసుకు గాయమైనా
అమ్మా.. అని అమ్మనే స్మరిస్తాం!

అమ్మ గుణం మంచైనా, చెడైనా
అమ్మది శుక్ల రూపమైనా, కృష్ణ రూపమైనా
అమ్మ కుంటి వారైనా ,గూని వారైనా
అమ్మ గుడ్డి వారైనా ,ఎడ్డి వారైనా
అమ్మ పేద రాలైనా, ధనికు రాలైనా
అమ్మ వయసు రాలైనా, ముసలి వారైనా
అమ్మ గుణం మంచైనా, చెడైనా
అమ్మది శశి రూపమైనా, కృష్ణ రూపమైనా
అమ్మ అమ్మే
అమ్మది దైవ స్వరూపం
అమ్మకు  రారు ఎవరూ సాటి
అమ్మకు లేరు ఎవరూ పోటీ!

అమ్మ ఒక ఆత్మ
అమ్మ ఒక పరమాత్మ
అమ్మ ఒక దైవం
అమ్మ ఒక దైవాంశ సంభూతం!

లాభ పడడానికి
అమ్మను క్షోభ పెట్టకు
పరువు కోసం
అమ్మకు చెరుపు చేయకు
హోదా పెరిగిందని
అమ్మను బాధ పెట్టకు !


అమ్మకు ప్రేమను పంచుదాం
అమ్మ ప్రేమకు పాత్రులమవుదాం
అమ్మకు సేవలు చేద్దాం
అమ్మ ఆశీస్సులు పొందుదాం!


No comments: