వచన కవిత
శీర్షిక: నిప్పుఆకాశంలో
ఉరుములు మెరుపులు
అంతలోనే
కుంభ వర్షం
కాసేపట్లోనే
బీభత్సం
మరికాసేట్లోనే
ప్రశాంతత
అంతా
ప్రకృతి విచిత్రం
భూమి పైన
మనుషులు
ఎన్ని వేషాలు
ఎన్ని యాసలు
ఎన్నియో భాషలు
ఏమి విలాసాలు
ఎన్ని అట్ట హాసాలు
ఈగ
వాలకుండా
చుట్టూరా
రక్షక భటులు
పిలుస్తే వాలే
పరిచారకులు!
బండ్లు
ఓడలవుతాయి
ఓడలు
బండ్లవుతాయన్నట్లు
కాలాన్ని
ఎవరు
ఎదిరించగలరు?
ప్రకృతిని
ఎవరు
శాసించ గలరు?
ఒకే సారి
నింగిలోకి ఎత్తుతుంది
ఒకే సారి
అతః పాతాళానికి తొక్కుతుంది
కాలం గిర్రున తిరిగే
కళ్ళెదుటే గూడు
కదులుతుండే నేడు !
అయినా
మేక పోతు
గాంభీర్యం
లేదు
ఏ కొంచెమైనా
ఔదార్యం
ఏదీ
రాజ సింహాసనం
మసక బారే
పరువు ప్రతిష్ట
కంటికి కానరాని
రక్షక భటులు
కనుమరుగైన
పరిచారకులు!
శిశిర
ఋతువులో
రాలు తున్న
చెట్ల ఆకులలా
చెట్టు కొకరు
పుట్ట కొకరు
పిలిచినా
పలుకని
బంధు మిత్రులు
అరిచినా
కసురుకునే పనివారలు
సహకరించని
కాళ్ళు చేతులు!
నింగిలో
నక్షత్రాలు
ఎన్ని ఉన్నా
ఏమి ఫలం
అవి
ప్రకాశించక పోతే
ఎంత విద్య నేర్చినా
ఏమి లాభం
వినయమనేది
లేకపోతే
భూకబ్జాలెన్ని చేసినా
ఏమి భాగ్యం
భూమికే
భారమై పోతే!
కాయవల్లే వగరు
కులం వల్లే పొగరు
గర్వం అనేది
బుసలు కొడితే
సర్వం
కోల్పోక తప్పదు !
అర్ధం
చేసుకోలేని
మనిషికి
ఎంత చెప్పినా
వ్యర్ధమే
చెవిటి
వాడి ముందు
శంఖం
ఊది నట్లే
*నిప్పు*
రగులు కున్నాక
మండ కుండా
ఆరుతుందా!
తప్పు
చేశాక
రాజైనా భటుడైనా
శిక్ష పడక
తప్పు తుందా!
No comments:
Post a Comment