Friday, June 30, 2017

ప్ర : HOW TO LINK AADHAR NUMBER TO PAN NUMBER ? ఆధార్ నంబర్ (AADHAR NUMBER) ను పాన్ నంబర్ (PAN NUMBER) కు లింకు చేయడం ఎలా ?

ప్ర :  ఆధార్ నంబర్  (AADHAR NUMBER)  ను పాన్ నంబర్ (PAN NUMBER)  కు  లింకు చేయడం  ఎలా ? 

జ : ఆధార్ నంబర్  (AADHAR NUMBER)  ను పాన్ నంబర్ (PAN NUMBER)  కు  లింకు చేయడానికి  చివరి తేదీ  30.06. 2017. 

01. ఆధార్ నంబర్  (AADHAR NUMBER)  ను పాన్ నంబర్ (NUMBER)  కు  లింకు చేయడం  చాలా  సులువు .  అందుకు గాను ,  https://incometaxindiaefiling.gov.in/  అనే  వెబ్ సైట్ ను  టైప్ చేసి , ఎంటర్ కొట్టండి .  లేదా  Google Search లో   incometaxindia అని  టైపు చేసి ఎంటర్ కొట్టండి .  అప్పుడు అనేకమైన  అడ్డ్రస్ లు  కనిపిస్తాయి . అందులో నుండి  మీకు కావాల్సిన  లింకును   https://incometaxindiaefiling.gov.in/ సెలక్ట్ చేసుకుని  క్లిక్ చేయండి .

02. అప్పుడు మీకు  ' e-Filing Anywhere Anytime ' అనే   ఆదాయ  పన్నుల శాఖ వారి , ఒక  బ్రోవుజర్ (Browser ) ఓపెన్ అవుతుంది .   

03. అక్కడ  ఎడమ బాగాన (LEFT SIDE), 'Link Aadhar New ' అనే  లింక్ కనబడుతుంది . దానిని  క్లిక్ చేయండి . అప్పుడు మరో  బ్రోవుజర్ (Browser ) ఓపెన్ అవుతుంది . 

04.  ఇక్కడ   కొన్ని వివరాలను  నింపమని  అడుగుతుంది .  అందులో  
మొదటిది,  PAN  . -----పాన్ నంబర్  ను  క్యాపిటల్ లెటర్స్ లో  ఎంటర్ చేయండి . 
రెండవది ,  Aadhar Number     అడుగుతుంది . ఆధార్ నంబర్ ను  ఎంటర్ చేయండి . 
మూడవది , Name as per Aadhar   అడుగుతుంది.  కరెక్టుగా  ఆధార్ ప్రకారముగా  ఎంటర్ చేయండి .   
నాల్గవది , I have only year of  birth in Aadhar card.     'టిక్'     చేయండి . 
ఐదవది , క్యాప్చాను  ....... ... ఎంటర్ చేయండి . 

ఆ తరువాత  దేనిని టచ్  చేయ కుండా , ' Link Aadhar ' ను  క్లిక్ చేయండి . 

సరిపోతుంది .  అప్పుడు మీకు 'Aadhar link with PAN successful'  నే మెస్సేజ్ వస్తుంది . అంటే  ఆధార్ నంబర్  , పాన్ నంబర్  కు  లింక్ అయ్యింది  అని  గుర్తించాలి . 

N.B: ఇక్కడ  ఒక ముఖ్య విషయాన్ని  గమనించాలి .  ఆధార్ కార్డు లోని పేరు ,  పుట్టిన రోజు  అలానే  పాన్ కార్డు లో ఉన్న పేరు,  పుట్టిన రోజు  అక్షరం ముక్క తేడా లేకుండా  ఉండాలి . అప్పడే  లింక్  అవుతుంది . లేక పోతే ఎట్టి  పరిస్థితులలో కూడా  లింకు కాదు .  దాని గురించి  10 సార్లు ప్రయత్నం  చేయ కూడదు .  సర్వర్ బిజీ  గాకుండా మరొకరికి  అవకాశం ఇవ్వాలి .  ఇక  ఆధార్ కార్డు సరిచేసు కోడానికి  https://uidai.gov.in/te  ని  సందర్శించండి .  అలానే  పాన్ కార్డు సరిచేసి కోడానికి ,  సెల్ నెంబర్  ఆప్డేట్  చేసు కోడానికి  దగ్గరలో ఉన్న  అధికార బ్రోకర్ సంస్థ లను  గాని ,  ఇన్కమ్ టాక్స్  డిపార్ట్మెంట్    ను గాని సందర్శించండి . 

www.sollutions2all.blogspot.com 


No comments: