ప్ర . SBI (ఎస్ . బి . ఐ)బ్యాంక్ SB A/C లో కనీస నిల్వ ఎంత ఉండాలి ? బ్యాంక్ చార్జెస్ ( Minimum balance Bank charges) పడకూడదంటే , కనీస నిల్వను (Minimum balance) ఎంత మెయింటైన్ చేయాలి ? నెల వారి సరా సరి నిల్వ ( Monthly Average Balance) అంటే ఏమిటి ?
జ. SBI (ఎస్.బి.ఐ) బ్యాంక్ SB A/C లో కనీసనిల్వ బ్యాంక్ చార్జీలు ( Minimum balance Bank charges) పడకూడదంటే , కనీస నిల్వను (Minimum balance) ది . 01.04.2017 నుండి ఈ క్రింది విధంగా మెయింటైన్ చేయాలి. లేదంటే కనీస నిల్వ బ్యాంక్ చార్జీలను , SBI (ఎస్.బి.ఐ), బ్యాంక్, మరుసటి నెల నుండి డెబిట్ చేస్తాయి . అయితే ఈ కనీస నిల్వలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి . మరియు ఈ కనీస నిల్వ చార్జీలు సేవింగ్స్ అకౌంట్స్ మరియు సురభి సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమే వర్తిస్తాయి . CSP , Basic Saving Bank Small Accounts కు మరియు PMJDY A/Cs కు వర్తించవు .
బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్ కనీస నిల్వలు మరియు చార్జీల విధింపు ఈ క్రింది విధంగా ఉంటాయి :
01.Metro ప్రాంతాల బ్యాంకులలో మైంటైన్ చేయాల్సిన కనీస నిల్వ Rs.5,000/-.
a) సరాసరి కనీస నిల్వ (MAB) 50% తక్కువగా ఉంటే Rs.50/-+ S.T.
b) సరాసరి కనీస నిల్వ (MAB) 50% నుండి 75% వరకు ఉంటే Rs.75/-+ S.T.
c) సరాసరి కనీస నిల్వ (MAB) 75% కంటే తక్కువగా ఉంటే Rs.100/-+ S.T.
02.Urban ప్రాంతాల బ్యాంకులలో మైంటైన్ చేయాల్సిన కనీస నిల్వ Rs.3,000/-.
a) సరాసరి కనీస నిల్వ (MAB) 50% తక్కువగా ఉంటే Rs.40/-+S.T.
b) సరాసరి కనీస నిల్వ (MAB) 50% నుండి 75% వరకు ఉంటే Rs.60/-+ S.T.
c) సరాసరి కనీస నిల్వ (MAB) 75% కంటే తక్కువగా ఉంటే Rs.80/-+ S.T.
a) సరాసరి కనీస నిల్వ (MAB) 50% తక్కువగా ఉంటే Rs.25/-+.S.T.
b) సరాసరి కనీస నిల్వ (MAB) 50% నుండి 75% వరకు ఉంటే Rs.50/-+ S.T.
c) సరాసరి కనీస నిల్వ (MAB) 75% కంటే తక్కువగా ఉంటే Rs.75/-+ S.T.
04. Rural ప్రాంతాల బ్యాంకులలో మైంటైన్ చేయాల్సిన కనీస నిల్వ Rs.1,000/-.
a) సరాసరి కనీస నిల్వ (MAB) 50% తక్కువగా ఉంటే Rs.20/-+ S.T.
b) సరాసరి కనీస నిల్వ (MAB) 50% నుండి 75% వరకు ఉంటే Rs.30/-+ S.T.
c) సరాసరి కనీస నిల్వ (MAB) 75% కంటే తక్కువగా ఉంటే Rs.50/-+ S.T.
అలానే ఇతర ప్రయివేటు బ్యాంకుల ( Ex. ICICI, HDFC, AXIS, KOTAK, YES Bank etc., )కనీస నిల్వలు (Minimum Balance) రూ . లు . 10,000/- బ్యాంక్ చార్జీలు రూ .లు .150/- నుండి రూ . లు . 350/-. వరకు డెబిట్ చేస్తారు .
ఇక విదేశీ బ్యాంకుల కనీస నిల్వలు (Minimum Balance) రూ . లు . 1,00,000/- , స్విస్ బ్యాంక్ అకౌంట్ కనీస నిల్వ రూ .లు . 100 కోట్లు.
N.B: ప్రస్తుతం S.T. 15% ఛార్జ్ చేస్తున్నారు . ది . 01. 07. 2017 నుండి ( GST అమలు లోకి వస్తుంది ) GST 18% ఛార్జ్ చేస్తారు .
MAB అనగా ఏమిటి ?
MAB అనగా - (Monthly Average Balance) నెలసరి సరాసరి నిల్వ . ఒక వేల కంటిన్యూ గా కనీస నిల్వలను ( ఉదా : 10,000/-,5,000/- 3,000/- , 2,000/-, 1,000/-) మైంటైన్ చేయలేక పోతే దీనిని చూస్తారు . అంటే ఒక వేల పెద్ద మొత్తం , బ్యాంక్ అకౌంట్ లో కొన్ని రోజులు ఉన్నట్లయితే , మిగిలిన రోజులు జీరో (0) బ్యాలన్స్ ఉన్నా బ్యాంక్ చార్జీలు పడవు . MAB (Monthly Average Balance) నెలసరి సరాసరి నిల్వ ను ఎలా లెక్క కడుతారు?. ఉదా : X అనే వ్యక్తి తన సేవింగ్ అకౌంట్ లో , నెలలో ఎదో ఒక రోజు Rs. 1,50,000/- ఉంచాడు అనుకుందాం . అప్పుడు ఇతని MAB = Rs.5,000/-. ( Rs.1,50,000*1(Day)/30 (Days). అప్పుడు ఆ నెలలోని మిగిలిన రోజులలో కనీస నిల్వ లేక పోయినా చార్జీలు పడవు . ఒక వేల ఒక నెలలో 31 రోజులు వచ్చాయి అనుకోండి . అప్పుడు రూ . లు . 1,55,000/- ఉంచాల్సి వస్తుంది . లేదా 2 రోజులైతే రూ . లు . 72,500/- నివ ఉంచినా , మిగిలిన రోజులలో బ్యాలెన్స్ లేక పోయినా , బ్యాంక్ చార్జీలు దీనికి సంభందించి పడవు . కనీస నిల్వ బ్యాలన్సులను , ఒక్కో బ్యాంక్ ఒక్కోరకంగా , ఆవిరేజ్ లెక్క గడుతాయి . SBI అవుతే నెల వారిగాను , ANDHARABANK మరియు కొన్ని ప్రయివేటు బ్యాంకులు అయితే 3 నెలల లోక సారి లెక్క గడుతాయి .
'SBI (ఎస్.బి.ఐ) బ్యాంక్' ఇతర సర్వీస్ చార్జీలు :
01. హోమ్ బ్రాంచ్ లో కాకుండా ఇతర బ్రాంచ్ లలో నగదు డిపా జిట్ చేస్తే రూ . లు . 50/- , డబ్బు ఎవరి అకౌంట్లో డిపాజిట్ అవుతుందో వారికీ డెబిట్ చేస్తారు . 'SBI (ఎస్.బి.ఐ) బ్యాంక్' ఇతర సర్వీస్ చార్జీలు :
02. NEFT / RTGS / IMPS ద్వారా ఇతరుల అకౌంట్లకు డబ్బు పమిస్తే (Money transfer to other Accounts) చార్జీలు ఇలా ఉంటాయి .
అ) NEFT ( National Electronic Funds Transfer ) ద్వారా అయితే ,
రూ . 1 నుండి రూ .లు . 10,000/- వరకు రూ . లు . 2/- + S.T.
రూ . లు .10,001/- నుండి రూ .లు . 1,00,000/- వరకు రూ . లు . 5/- + S.T
రూ . లు .1,00,001/- నుండి రూ .లు . 2,00,000/- వరకు రూ . లు . 15/- + S.T
ఆ) .RTGS ( Real Time Gross Settlement ) ద్వారా అయితే ,
రూ . లు .2,00,001/- నుండి రూ .లు . 5,00,000/- వరకు రూ . లు . 25/- + S.T
రూ . లు .5,00,001/- నుండి ఆ పై ఎంత వరకైనా రూ . లు . 50/- + S.T
ఇ ) IMPS ( Immediate Payment Service) ద్వారా అయితే ,
NEFT / RTGS కంటే కాస్త అధికంగా ఉంటాయి . IMPS అనగా ఎవరికీ వారే వారి వారి
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తక్షణమే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం.
03. SMS సర్వీస్ చార్జీలు :
ప్రతి 3 నెలల కొక సారి రూ . లు . 15/- + S.T. డెబిట్ చేస్తారు .
04. Cheque Book ఇష్యూ చార్జీలు :
10 చెక్కుల బుక్ కు రూ . లు . 30/- + S.T. డెబిట్ చేస్తారు .
25 చెక్కుల బుక్ కు రూ . లు . 75/- + S.T. డెబిట్ చేస్తారు .
50 చెక్కుల బుక్ కు రూ . లు . 150/- + S.T. డెబిట్ చేస్తారు .
05. Signature attestation చార్జీలు :
Signature attestation చార్జీలు రూ .లు . 50/- నుండి 150/- + S.T. డెబిట్ చేస్తారు .
అలానే ATM విత్ డ్రాయల్ / డిపాజిట్ చార్జీలు , ATM/DEBIT CARD/CREDIT CARD ఇస్యూ చార్జీలు , అకౌంట్ మైంటైన్ చార్జీలు , బ్యాంక్ స్టేట్ మెంట్ చార్జీలు, చిరిగిన నోట్ల మార్చడానికి చార్జీలు , ఇలా అనేకంగా డెబిట్ చేస్తారు .
N.B: 01. పూర్తి వివరాలకు బ్యాంక్ వెబ్ సైట్ ను చుడండి . లేదా బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించండి .
02. కనీస నిల్వలు , బ్యాంక్ చార్జీలు బ్యాంక్ బ్యాంక్ కు మరియు , ప్రభుత్వ రంగ , ప్రయివేట్ రంగ బ్యాంకులకు తేడాలున్నాయి .
03. June '17 లో కనీస నిల్వలను మైంటైన్ చేయాలి . July'17 నుండి కనీస నిల్వల చార్జీలు పడుతాయని బ్యాంకులు మెసేజ్ లు పంపిస్తున్నాయి .
No comments:
Post a Comment