ప్ర . జి ఎస్ టి (GST) లో 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) అంటే ఏమిటీ ? 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ప్రయోజనాలు ఏమిటి ? 'ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (INPUT TAX CREDIT) కు ఎవరు అర్హులు ? 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు , నిభందనలు ఏమిటి ?
జ. జి ఎస్ టి (GST) లో 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) అంటే, ఒక వ్యాపారస్తుడు లేదా ఉత్పత్తి దారుడు , తమ వ్యాపారానికి లేదా ఉత్పత్తికి సంబందించిన ' రా మెటీరియల్స్ ' గాని , కన్సూమబుల్ గూడ్స్ గాని లేదా ఫినిష్డ్ గూడ్స్ గాని కొనేటప్పుడు కొంత పన్ను చెల్లిస్తాడు . ఇది జి ఎస్ టి (GST) లో 5% నుండి 28% మధ్యలో ఉంటుంది . ఉదా : 100 రూ . ల. వస్తువు కొన్నపుడు 5% పన్ను పడింది అనుకుందాం . అప్పుడు అతను 105 రూ . లు . పెట్టి ఆ వస్తువు కొంటాడు . మరల ఆ కొన్న వస్తువును 15 రూ . ల . లాభం కలుపుకుని రూ .లు 120/- కి , జి. ఎస్. టి . (GST) 5% కలిపి వినియోగ దారుడికి రూ . లు . 126/- అమ్మినట్లైతే, వినియోగ దారుడు భరించాల్సిన ధర 126/-. అమ్మకపు దారుడు, వస్తువు అమ్మినపుడు రూ . లు 6/- పన్ను రూపేన వసూలు చేస్తాడు . కానీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను మాత్రం రూ . లు .1/- మాత్రమే . ఎందుకంటే వస్తువు అమ్మినప్పుడు రూ . లు . 6/- జి ఎస్ టి వసూలు చేసాడు . అదే వస్తువు కొన్నప్పుడు రూ . లు . 5/- జి ఎస్ టి చెల్లించాడు . ఆ చెల్లించిన జి ఎస్ టి ని తగ్గించి , (6-5=1) నికరంగా 1/- రూపాయి మాత్రమే చెల్లిస్తాడు . ఈ విధంగా , ఒక రిజిస్టర్డ్ జి ఎస్ టి (GST) వ్యాపారి , తాను చెల్లించిన జి ఎస్ టి ని , అమ్మకపు జి ఎస్ టి (GST) నుండి తగ్గించు కోవడాన్ని లేదా చెల్లించిన జి ఎస్ టి (GST) ని యదా విధిగా రిఫండ్ తీసుకోవడాన్ని , 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) అంటారు . మరో ముఖ్యమైన విషయం , ఎంత జి ఎస్ టి (GST) చెల్లిస్తే అంత 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) గా తీసుకోవచ్చు . ఈ కారణంగా జి ఎస్ టి (GST) లో 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు అత్యంత ప్రాధాన్యత ఉంది . జి ఎస్ టి లో దీనిది కీలక పాత్ర . ఉత్పత్తి కాస్ట్ ను తగ్గించడంలో మరియు అమ్మకపు కాస్ట్ ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది .
'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ప్రయోజనాలు ఏమిటి ?
01. ఉత్పత్తి దారులకు 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) వలన , ఉత్పత్తి కాస్ట్ తగ్గి , అమ్మకాలు పెరిగి , లాభాలు రావడానికి అవకాశాలు మెండు గా ఉన్నాయి .
02. జి ఎస్ టి వ్యాపారులకు 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) , అమ్మకపు కార్చి తగ్గి , బిజినెస్ పెరిగి లాభాల బాట పట్ట వచ్చు .
03. ఎగుమతి దారులకు జి ఎస్ టి లేదు . ఇక 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) పూర్తిగా ప్రభుత్వం నుండి వాపస్ తీసుకోవచ్చు . ఈ కారణంగా ఎగుమతి వ్యాపారుల బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందు తాయి .
04. వినియోగ దారులకు అనేక మైన వస్తువులు తక్కువధరలకు లభిస్తాయి .
'ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు ఎవరు అర్హులు ?
01. 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు , జి ఎస్ టి ( GST) లో రిజిస్ట్రేషన్ చేయించు కున్న వారు మాత్రమే అర్హులు .
'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) కు , నిభందనలు ఏమిటి ?
01. 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను జి ఎస్ టి ( GST) లో రిజిస్టర్డ్ అయినా వారు మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది .
02. కాంపోజిషన్ స్కీం లో ఉన్న వారు 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను తీసుకోవడానికి వీలు లేదు .
03. చిన్న వ్యాపారస్తులు , జి ఎస్ టి ( GST) లో రిజిస్టర్డ్ కాని వారు , 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను తీసుకోవడానికి వీలు లేదు .
04. 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను 6 నెలలు లేదా 180 రోజుల లోపుననే వినియోగించుకోవాలి లేదా డిక్లేర్ చేయాలి .
05. జి ఎస్ టి ( GST) చెల్లించినట్లుగా వరిజినల్ ఇన్వాయిస్ లు , బిల్లులు ఉండాలి .
06. 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) , జి ఎస్ టి ( GST) లో రిజిస్టర్డ్ అయిన వారి నుండి కొంటేనే వర్తిస్తుంది .
07. వ్యాపార నిమిత్తానికి వినియోగించే వస్తువులు లేదా సేవలకు చెల్లించే పన్ను మాత్రమే 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) గా తీసుకోవడానికి వీలవుతుంది .
08. ఆయా వస్తువులను అమ్మే వ్యాపారికి , ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయీలు ఉండ రాదు . అలానే వారు సక్రమంగా నెల వారీ రిటర్నులు ఫైల్ చేసి ఉండాలి .
09. సి జి ఎస్ టి (CGST) క్రింద పొందిన 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను , ఎస్ జి ఎస్ టి (SGST) మరియు యూ టి జి ఎస్ టి (UTGST) బకాయిలను చెల్లించ డానికి వీలు లేదు . అలానే , ఎస్ జి ఎస్ టి (SGST) మరియు యూ టి జి ఎస్ టి (UTGST) 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను , సి జి ఎస్ టి (CGST) బకాయిలను చెల్లించ డానికి వీలు లేదు .
10. తెలిసో , తెలియకో , కావాలనో 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను , వర్తించకపోయినా తీసుకున్నా లేదా అధికంగా తీసుకున్నా , ఆ మొత్తానికి వడ్డీ పడుతుంది , పెనాలిటీ పడుతుంది , 'ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ '(INPUT TAX CREDIT) ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది .
11. కొనుగోలు రిటర్న్స్ లేదా అమ్మకపు రిటర్న్స్ , ఏమైనా ఉంటే , అవి 6 నెలలు లేదా 180 రోజుల లోపున జరిగి ఉంటే , చెల్లించిన పన్నులను , వసూలు చేసిన పన్నులను సర్దు బాటు చేసు కోవచ్చు .
పూర్తి వివరాలకు ప్రభుత్వ అధికార వెబ్ సైట్లను <www.gst.gov.in> వీక్షించండి .
No comments:
Post a Comment