Wednesday, June 14, 2017

IS IT POSSIBLE TO SAVE THE BANK CHARGES? బ్యాంక్ చార్జీలను తగ్గించు కోవడం సాధ్యమా ?


ప్ర . IS IT POSSIBLE TO SAVE THE BANK CHARGES?  బ్యాంక్  చార్జీలను తగ్గించు కోవడం  సాధ్యమా ?

జ . Yes it is  possible to save the Bank Charges. అవును.  బ్యాంక్  చార్జీలను తగ్గించు కోవడం  సాధ్యమే .


ముందుగా  బ్యాంక్ చార్జీలు  ఏ  అకౌంట్లో  పడుతున్నాయి ? ఎలా పడుతున్నాయి ? ఎందుకు పడుతున్నాయి ? ఎప్పడు పడుతున్నాయి ?  ఎంత పడుతున్నాయి ,అనలైజ్  చేసుకోవాలి .  ఒక్కొక్కరి  ట్రాన్సక్షన్స్ ఒక్కోరకంగా ఉంటాయి . వారి వారి  అవసరాలను బట్టి , వారి  కున్న  అకౌంట్లు , డెబిట్  కార్డులు , క్రెడిట్ కార్డులను  బట్టి   ఒక్కొక్కరి  బ్యాంక్ చార్జీలు  ఒక్కోరకంగా ఉంటాయి .



బ్యాంకు చార్జీలు  తగ్గించుకోవాలని  ఆసక్తి  ఉంటే  ఈ క్రింది వాటిని  పరిశీలించ వచ్చు :



01. చాలా మందికి , అనేక మైన  బ్యాంక్   అకౌంట్లు ఉంటున్నాయి . అవసరం లేని వాటిని  క్లోజ్  చేయండి . దీని వలన  ఈ అకౌంట్ కు  సంభందించిన  , అనగా  ATM Card , Debit Card ,Credit Card , SMS , Bank Account Maintenance, Bank statement, With Drawl,  Deposit  మొదలైనవన్నీ  తగ్గి పోతాయి .



02. కొందరు  ఒక  బ్యాంక్ అకౌంటులో  పెద్ద మొత్తం  ఉంచి , మిగిలిన అకౌంట్లను  పట్టించు కోరు . దీని వలన  మినిమమ్ బ్యాలన్స్ తక్కువగా  ఉన్న  అకౌంట్లలో బ్యాంక్ చార్జీలు పడుతాయి . పట్టించుకోక పోతే  మైనస్ బ్యాలెన్స్ కూడా రావచ్చు . అప్పుడు  ఆ  మైనస్  బ్యాలన్స్ ను  డిపాజిట్ చేస్తేనే , బ్యాంక్ అకౌంట్ ను  క్లోజ్ చేయడం వీలవుతుంది .  అందు వలన , ఎక్కువ  మొత్తం  ఉన్న బ్యాంక్ అకౌంట్ లో నుండి తీసి , బాలన్స్  తక్కువగా  ఉన్న బ్యాంక్  అకౌంట్లలో  వేస్తే , మినిమమ్ బ్యాలన్స్ బ్యాంకు చార్జీలు  తగ్గి పోతాయి . కాబట్టి తక్షణమే  ఉపయోగం లేని  మరియు మరిచి పోయిన అకౌంట్లను  వెతికి పట్టి  క్లోజ్ చేయండి . లేదంటే మైనస్  బ్యాలన్స్ లోకి వెళ్లి పోతుంది . అప్పుడు  మైనస్ బ్యాలన్స్ కాళీయర్ చేసే దాక అకౌంట్ క్లోజ్ చేయడం వీలు కాదు . ప్రతి బ్యాంక్ అకౌంట్ కు  ' ఆధార్ ' మరియు ' పాన్ కార్డు ' నెంబర్ లింక్ చేస్తారు .( అసలు GST  రిజిస్ట్రేషన్ తోటే అన్ని లింక్ అయి పోతున్నాయి ). 



03. అనవసరమైన  బ్యాంక్ ట్రాన్సాక్షన్స్  తగ్గించు కోవాలి . ఒక నెలలో 3 ట్రాన్సక్షన్స్  కంటే ఎక్కువ కాకుండా  చూసుకోవాలి . అంతా  ఆన్ లైన్లోనే వ్యవహారాలు సాగించాలి . మెయిన్ అకౌంట్ సెల్ నెంబర్ కే  ' OTP' నెంబర్ వచ్చే విధంగా ఏర్పాటు చేసు కోవాలి . సాధ్య మైనంత వరకు  ప్రతి 15 రోజులకోసారి  'పాస్వర్డ్ ' మార్చు కోవాలి . అలానే  స్వంత 'లాప్ టాప్ ' లేదా ' కంప్యూటర్ ' లోనే  ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ చేయాలి . 



04. సాధ్యమైనంత వరకు  హోమ్ బ్రాంచిలోనే  నగదు డిపాజిట్ చేయాలి .  విత్ డ్రా చేయాలి . దీని వలన  బ్యాంక్  చార్జీలు  తగ్గించు కోవచ్చు . SBI బ్యాంకులో , ఇతర బ్రాంచులలో  డబ్బులు  వేసినా , తీసినా, ఒక్కో ట్రాన్సక్షన్ కు   50/- రూ . లు .  డిపాజిట్ అయినా అకౌంట్లో  కట్ అయి పోతాయి . 



05. ఎక్కువ సార్లు  ATM లకు వెళ్లకుండా  ప్లాన్  చేసుకోవాలి . ప్రతి నెలా  కొంత మొత్తాన్ని , అవసరాన్ని బట్టి , పిల్లల  లేదా  ఫ్యామిలీ బేసిక్  అకౌంట్లకు  ఆన్ లైన్  ద్వారా  ట్రాన్స్ఫర్ చేసుకోవాలి . అక్కడి నుండి  డబ్బులు  డ్రా చేసినా . వేసినా , ATM , DEBIT , కార్డులను వదినా చార్జీలు , ఏ  బ్యాంక్ అకౌంట్  లోనూ  పడవు . అయితే  కొన్ని  నిభందనలు  ఉన్నాయి . అవి ఏమంటే , నెలలో  4 ట్రాన్సాక్ష న్స్  కంటే  ఎక్కువ చేయ నీయరు . పది వేల  కంటే ఎక్కువ తీయ లేము . లక్ష  కంటే  ఎక్కువ  నిలువ ఉండరాదు . యాభై  వేళా కంటే ఎక్కువ ఒకే సారి  డిపాజిట్ చేయ వీలు లేదు . కనీస నిల్వ  నిబంధన లేదు . 



06. అన్ని  ఖాతాలు ఉంచాలనుకుంటే , మినిమమ్ బ్యాలన్స్ ఉన్న అకౌంట్లకు , SMS  అలర్టులు , ATM , DEBIT ,CREDIT కార్డులను క్యాన్సిల్ చేయాలి . దీని వలన బ్యాంక్  చార్జీలు  తగ్గి పోతాయి . నెల కోసారి  పాస్ బుక్ ఎంట్రీ చేయించుకుంటే  సరి పోతుంది .



07. గ్యాస్  కనెక్షన్ ను  మినిమమ్ బ్యాలన్స్  ఉన్న అకౌంట్  కు లింక్ చేయాలి .  ఇందులో సబ్సిడీ అమౌంట్  క్రెడిట్  అవుతూ ఉంటుంది . దానిని అలానే ఉంచండి . 



08. నగదు రహిత లావాదేవీలను  పెంచు కోవాలి .



09.  ఇన్సూరెన్స్  అకౌంట్ ను , మెయిన్ అకౌంటుకు  లింక్ చేయాలి .




10. బ్యాంక్ అకౌంటులో  ఎక్కువ  మొత్తము  ఉన్నట్లయితే , ఎప్పటి కప్పుడు  F.D. లు గాను  ,  R.D లు గాను  మార్చు కోవాలి . దీని వలన  సేవింగ్ అకౌంట్ కంటే  కాస్త ఎక్కువ వడ్డీ  వస్తుంది .  15 రోజుల  నుండి ఎంత కాలానికైనా  F.D. లు చేసు కోవచ్చు . మరల  అర గంటలో , కావాలనుకున్నప్పుడు  , F.D లను  క్యాన్సిల్ చేసి  సేవింగ్ అకౌంట్ కు మార్చు కోవచ్చు .



11. అత్యవసర మైనప్పుడు , బ్యాంక్ చార్జీల కంటే  ఎక్కువ  ఆదాయం  వస్తుందనుకున్నపుడు , ఇంట్లో  ధైర్యానికి ఉండాలనుకున్నపుడు , బ్యాంక్ చార్జీలు పడినా  పెద్ద సమస్య  కాదు . అప్పుడు  నిరభ్యరంతంగా  , బ్యాంకులో కనీస  నిల్వ మైంటైన్ చేయ నవసరం  లేదు . భయ పడ  నవసరం లేదు . 




12. ప్రతి ఒక్కరికి  పోస్టాఫీస్ లో గాని , పోస్ట్  పేమెంట్  బ్యాంకులో  గాని  , ఒక అకౌంట్  ఉండటం , అన్నివిధాల  శ్రేయస్కరం . చిన్న బ్యాంక్ అకౌంట్ల లాగానే , కనీస నిల్వ నిభందనలు లేవు , పోస్టల్ చార్జీలు ఉండవు . ఒక్కో  సారి  బ్యాంకులు  పని చేయ నప్పుడు , దూర భారమైనప్పుడు , వీటిని  ఉపయోగించు కోవచ్చు . 



13. అయితే పోస్టాఫీసులు , బ్యాంకులు  డబ్బుకు  పూర్తిగా  భరోసా నిస్తాయి , నమ్మకాన్ని  కలిగిస్తాయి , అందులో  ఉంచిన  డబ్బులు ఎక్కడికి పోవు  అని  గ్రుడ్డిగా  ఎప్పుడూ  నమ్మ కూడదు . ' గ్రహ చారం  బాగా లేక పోతే , తాడే  పామై కరుస్తుంది అన్నట్లు ' , అకౌంటులో  ఉన్న డబ్బులు  మాయ మయ్యే అవకాశాలు  లేకపోలేదు . గతంలో  ఒక వ్యక్తి , బ్యాంకులో  డబ్బు భద్రంగా  ఉంటుందని  రూ . లు . 25,000/- , వడ్డీ కూడా కల్సి వస్తుందని  హాయిగా  కాలం  గడుపుతున్నాడు . ఒక విధంగా  , బ్యాంకుపై  నమ్మకంతో  మరిచి పోయాడు  కూడా .  అకౌంట్ ను రెగ్యులర్  గా  ఉపయోగించక పోవడం వలన అది కాస్తా , ఇన్ ఆపరేటివ్  అకౌంట్ గా  మారి పోయింది .  యేండ్లు  గడిచాయి . ఎవరూ  అకౌంట్  హోల్డర్  లేడని , ఆ డబ్బులకు  కాస్తా  రెక్కలు  వచ్చి  ఎగిరి పోయాయి . అంటే  ఎవరో  ఒకరిద్దరు కల్సి ,  ఆ డబ్బులను  కాజేశారు . కొన్ని యేండ్ల  తరువాత ,  అసలు  అకౌంట్  హోల్డర్ కు  అవసరం  ఏర్పడి ,  ఆ డబ్బుల గురించి గుర్తుకు వచ్చి ,  బ్యాంకులో  వాకబు చేశాడు . అప్పుడు బ్యాంక్ వారు  అతనికి తెలిపిన విషయం మేమంటే ,  నీ  అకౌంట్  ఎప్పుడో  క్లోజయింది . డబ్బులు  ఎప్పుడో నీవే  డ్రా చేసి ఉంటావు . ఇప్పడు  ఆ రికార్డ్స్ కూడా  వెంటనే అందుబాటులో లేవు  అన్నారు . అప్పుడు  అతనికి  ఏమి చేయాలో  పాలు  పోలేదు.  ఆ విషయం ఆ  నోటా , ఈ నోటా  పడి  ప్రధానమంత్రి  ఆఫీసు వరకు  వెళ్ళింది . అక్కడి నుండి  ఫోన్ రాగానే , ఆగ మేఘాలమీద ,  ఆ బ్యాంకు వారు  , అతని అకౌంటులో   గప్  చుప్ గా , వడ్డీతో సహా మొత్తం డబ్బును జమ చేశారు . ఈ  స్టోరీ  అంత చదివాక  చాలా మందికి  ఆ అకౌంట్  హోల్డర్ ఎవరో  గుర్తుకు వచ్చే ఉంటుంది ...  

ఆ అకౌంట్  హోల్డర్ ఎవరో కాదు  మన మాజీ రాష్ట్రపతి  డాక్టర్ . అబ్దుల్ కలాం గారు . 


ఇక బ్యాంకుల్లో  సైబర్ నేరాలు  మనకు తెలియనివి కావు . ఈ విధంగా  డబ్బు పొదుపు చేసుకుని  నష్ట పోయిన  ప్రజలు  వెలది మంది ఉన్నారు .  అందు కనీ ఎప్పుడూ  అప్రమత్తంగానే  ఉండాలి . ' అవసరానికి  ఉపయోగ పడని  పొదుపు, తనకు మాలిన  ధర్మం  ఎప్పుడూ  పనికి రాదు '.  


www.sollutions2all.blogspot.in

No comments: