ప్ర : WHAT IS GST ? జి ఎస్ టి అంటే ఏమిటి ? ఎన్ని రకాల పన్నులు జి ఎస్ టి (GST) లో ఉంటున్నాయి ?
జ : సామాన్య ప్రజానీకానికి అర్థ మయ్యే విధంగా చెప్పాలంటే, జి ఎస్ టి (GST) అనగా 'పన్ను' (TAX). ఇంకాస్త వివరంగా చెప్పాలంటే , ఉత్పత్తి దారులు , వ్యాపారులు , వినియోగదారులు, వారు కొనే వస్తువులపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన ' పన్ను ' ను జి ఎస్ టి (GST) లేదా " వస్తు సేవల పన్ను ( GOODS AND SERVICES TAX) అని అంటారు . " ఒకే దేశం ఒకే పన్ను " అనేది జి ఎస్ టి నినాదం . అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఒకటుంది . " జి ఎస్ టి " అనే పన్ను పేరు మాత్రమే ఒకటి గాని , పన్నుల స్లాబులు మళ్ళీ అనేకం . 0% నుండి మొదలుకుని 1%, 3%, 5%, 12%, 18% 28% ........ 290% వరకు పన్ను స్లాబులు విస్తరించి బడ్డాయి . " ఒకే దేశం ఒకే పన్ను " అంటే దేశం అంతా ఓ 5% మో లేక 18% మో మాత్రం కాదు . తరు వాత మరో విషయం ఏమిటంటే , కొన్ని వస్తువులు జి . ఎస్ . టి (GST) పరిధిలోకి రాలేదు . ఉదా : క్రూడ్ ఆయిల్ , అనగా పెట్రోల్ , డిజిల్ , ఫుయెల్ మరియు మానవులు త్రాగే ఆల్కహాల్ మొదలైనవి జి . ఎస్ . టి (GST) పరిధిలోకి రాలేదు .
జి ఎస్ టి (GST) అంటే ఇప్పటికే అర్థ మయ్యింది అని అనుకుంటాను . ఇప్పుడు మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం . జి ఎస్ టి (GST) అనేది పరోక్ష పన్ను (INDIRECT TAX) . పరోక్ష పన్ను (INDIRECT TAX) అని ఎందుకంటున్నాం అంటే , మనం ఏదేని ఒక వస్తువు కొనేటప్పుడు , దాని పైన టాక్స్ కడుతాం . ఆ టాక్స్ ను అమ్మకపు దారు , 10 , 20 రోజుల తరువాత , తమ తమ జి ఎస్ టి (GST) రిటర్న్స్ సబ్మిట్ చేసి , తనకు రావాల్సిన ఇన్పుట్ టాక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకుని మిగిలినది ప్రభుత్వానికి చెల్లిస్తాడు . అంటే ఆదాయ పన్ను (INCOME TAX) లాగా దీనిని డైరెక్ట్ గా మనం ప్రభుత్వానికి చెల్లించం.
ఇక్కడ జి ఎస్ టి (GST) లో G -అనగా GOODS ., S - అనగా SERVICE., T- అనగా TAX.
ఆ విధంగా జి ఎస్ టి (GST) అనగా " వస్తు సేవల పన్ను ( GOODS AND SERVICES TAX).
అయితే జి ఎస్ టి (GST) కి ఇంత ప్రచారం దేనికి అనే సందేహం మీకు కలుగ వచ్చు . అది సహజం కూడా . అందుకు కారణం లేక పోలేదు . నేటి వరకూ అనగా 30.06.2017 వరకూ , ఒక్కో రాష్ట్రం లో ఒక్కోరకమైన పన్నులు ఉండేవి . రాష్ట్రాలకైతే వ్యాట్ (VAT) పన్నులు ఉండేవి . కేంద్రానికైతే (CST) పన్నులు ఉండేవి . వీటికి తోడు అనేక రకమైన పరోక్ష పన్నులు ఉండేవి . ఉదా : ఎక్సయిజ్ పన్ను , సర్వీస్ టాక్స్ , వినోద పన్ను , ఆక్ట్రాయ్ , వృత్తి పన్ను , సి వి డి , ఎంట్రీ టాక్స్, టోల్ టాక్స్ మొదలగు 16 రకాల పన్నులు ఉండేవి . వీటివలన వస్తువుల ధరలు పెరిగి , అవి చివరికి వినియోగదారుల మీద అధిక భారం పడేది . వీటన్నిటిని ఎత్తి వేసి , ఆ పనులన్నింటికీ బదులుగా , "భారత దేశం " ( INDIA ) మొత్తానికి వర్తించే విధంగా ఒకే రకమైన పన్ను పేరును రూపొందించడం జరిగింది . అదే జి ఎస్ టి (GST).
ఆ విధంగా దేశం మొత్తానికి వర్తించే విధంగా మెజారిటీ వస్తువులను 5 క్యాటగిరీలుగా చేసి , అందులో ఒక క్యాటగిరీకి పన్నులనుండి మినహాహించి ( పాలు , పెరుగు , నూనె , బియ్యం , గోధుమలు , పప్పులు , ఉప్పు , మర మరాలు , అటుకులు , చికెన్ , మటన్ , కూర గాయలు, కారం , చింత పండు , బెల్లం , విద్య , ఆరోగ్యం , మెట్రోరైల్ కు 0% పన్ను ) , మిగిలిన 4 క్యాటగిరీలకు 4 రకాల పన్నులను రూపొందించారు . అవి 5%, 12% , 18% మరియు 28%. ( కొన్ని స్పెషల్ వస్తువులకు ఇతర పన్నురేట్లను విధించారు . ఉదా . బంగారానికి 3% ,గుట్కాలకు 42% , సిగరెట్లకు 290%) . ఇక అన్ని రకాల సేవలకు వర్తించే విధముగా పన్నును నేటి వరకు ఉన్న 15% ను ఎత్తి వేసి , 18% పన్నును విధించడం జరిగింది . దీని వలన అన్ని రకాల సేవలకు గాను 3% అధిక భారం ప్రజలందరి మీద పడబోతోంది .
తేదీ .30.06.2017 న ఫైనల్ గా , జి ఎస్ టి (G. S. T) రాష్ట్రాలు కోరిన విధంగా కొన్ని పన్ను రేట్లకు మార్పులు , చేర్పులు జరుగ వచ్చు .
తేదీ .30.06.2017 న ఫైనల్ గా , జి ఎస్ టి (G. S. T) రాష్ట్రాలు కోరిన విధంగా కొన్ని పన్ను రేట్లకు మార్పులు , చేర్పులు జరుగ వచ్చు .
జి ఎస్ టి (GST) అనేది తేదీ 01. 07. 2017 ( అనగా 30 .06. 2017 అర్ధ రాత్రి ) నుండి దేశం మొత్తం ఒకే సారి అమలు లోకి రావడం జరుగుతుంది . ప్రజలకు అవగాహన కలిగించాల్సిన అవసరం మరియు వ్యాపారస్తులకు సాఫ్టువేర్ ఎలా వాడాలో , ఎలా రిటర్నులు ఫైల్ చేయాలో అవగాహన కలిగించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది . అందుకే ఇంత ప్రచారం జరుగుతుంది .
www.sollutions2all.blogspot.com
www.sollutions2all.blogspot.com
No comments:
Post a Comment