వచన కవిత
శీర్షిక: వివాహ వ్యవస్థ - సహజీవన వ్యవస్థ
రోజు రోజుకుమానవ
సంబంధాలు
దిగజారి పోతున్నాయిఒకరిపై ఒకరికి
ప్రేమలు గౌరవాలు
తగ్గి పోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థపై
నమ్మకాలు
కరిగిపోతున్నాయి
అక్కడక్కడ
జీడి గింజల్లాంటి
హీనుల వలన
గురువింద గింజల్లాంటి
నీచుల వలన
సమాజం
భ్రష్టు పట్టి పోతుంది!
విధి రాతను
ఎవరూ తప్పించ లేరు
తల రాతను
ఎవరూ మార్చ లేరు !
భార్యది ఒక వంశము
భర్తది ఒక వంశము
భార్యది ఒక గోత్రం
భర్తది ఒక గోత్రం
భార్యది ఒక ఊరు
భర్తది ఒక ఊరు
భార్యది ఒక కులం
భర్తది మరొక కులం కావచ్చు
భార్యది ఒక మతం
భర్తది మరొక మతం కావచ్చు
భార్యది ఒక దేశం
భర్తది మరొక దేశం కావచ్చు
భార్య స్వభావం భార్యది
భర్త స్వభావం భర్తది
భార్య ఆలోచనలు భార్యవి
భర్త ఆలోచనలు భర్తవి
భార్య కోరికలు భార్యవి
భర్త కోరికలు భర్తవి
భార్య జీన్స్ భార్యవి
భర్త జీన్స్ భర్తవి
ఒకరి ఆలోచనలు
మరొకరికి కలువక పోయినా
ఒకరి యిష్టాలు
మరొకరికి కష్టమైనా
ఒకరి స్వభావం
మరొకరికి నచ్చక పోయినా
ఒకరి స్వేచ్ఛకు
మరొకరు అడ్డుతగిలినా
ఒకరి కోరికలకు
మరొకరు భంగం కలిగించినా
భర్తకు భార్యే
యమురాలవుతుందో
భార్యకు భర్తే
యముడవుతాడో
ఎవరికీ తెలియదు
పిల్లలకు తల్లిదండ్రులే
యమదూతలవుతారో
తల్లి దండ్రులకు పిల్లలే
యమదూతలవుతారో
ఎవరూ కాన లేరు
రోజు రోజుకు
మానవ సంబంధాలు
అదుపు తప్పుతున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు, గౌరవాలు
తగ్గిపోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థ పై నమ్మకాలు
మృగ్యమవుతున్నాయి!
కాలం గడుస్తున్న కొద్దీ
తరం మారుతున్న కొద్దీ
మనుష్యుల జీవితాలు
యాంత్రికంగా మారుతున్నాయి
ఒకరికోసం ఒకరు బ్రతకాలన్న
ఆశలు మృగ్యం మవుతున్నాయి
ఒకరు పోతే మరొకరు
స్వేచ్ఛగా బ్రతుకవచ్చన్న
ఆశలు చిగురిస్తున్నాయి
ఒంటరి జీవితానికే
మొగ్గుచూపుతున్నారు
ఒంటరైన వాండ్లను చూస్తూ
ఎంతో హాయిగా, స్వేచ్ఛగా
జీవిస్తున్నారని
మదన పడుతున్నారు
చర్చించుకుంటున్నారు
రోజు రోజుకు
మానవ సంబంధాలు
హీన మవు తున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు, గౌరవాలు
తగ్గిపోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థ పై నమ్మకాలు
కరిగి పోతున్నాయి!
రూపాయి రూపాయి కూడ బెట్టి
ఎవరు ఎవరి కోసం పొదుపు చేయాలనీ
తిన కుండా త్రాగ కుండా మదుపు చేసి
ఇన్స్యూరెన్స్ ఎవరు ఎవరికోసం కట్టాలనీ
రేయింబవళ్ళు శ్రమించి
ఎవరు ఎవరి కోసం ఆస్తులు కూడ బెట్టాలనీ
వాపోతున్నారు
ఒంటరి జీవితం కొరకు
ఒంటరి స్వేచ్ఛ కొరకు
జనాలు పెంపర్లాడుతుంటే
బ్రతకడానికి సరిపడ సంపాదిస్తే
చాలనుకుంటున్నారు
రోజు రోజుకు మానవ సంబంధాలు
మసక బారుతున్నాయి
ఒకరిపై ఒకరికి ప్రేమలు, గౌరవాలు
తగ్గి పోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థ పై నమ్మకాలు
మసకబారు తున్నాయి!
ఇంటి పెద్దలు మరణించినా
భాగస్వామి మరణించినా
ఇంట్లో వారి ఫోటో
అస్తికలు కలుపు వరకే
వారి ఆనవాలు వద్దని గోల
కర్మలు చేయవద్దని రబస
మాషికాలు , తద్దినాలు
వాళ్ళు చూస్తున్నారా
అని హేళన
సంస్కృతి
సాంప్రదాయాలను
హేళన చేస్తే
మనుషులకు
జంతువులకు
తేడా ఉండదు
దహన
సంస్కారాలు
కర్మలు
మాషికాలు
తద్దినాలు
జరిపించకుంటే
పితృ దోషాలు
తప్పవు
తరతరాలకు
పితృ దోషాలు
నీడలా
వెంటాడుతాయి
రోజు రోజుకు
మానవ సంబంధాలు
మంట కలుస్తున్నాయి
ఒకరిపై ఒకరికి
ప్రేమలు, గౌరవాలు
తగ్గి పోతున్నాయి
వివాహ వ్యవస్థపై
కుటుంబ వ్యవస్థపై నమ్మకాలు
క్షీణించి పోతున్నాయి!
నేటి తరానికి
వివాహ వ్యవస్థపై కంటే
సహజీవన వ్యవస్థపైననే
మక్కువ పెరుగుతుంది !