శీర్షిక: *లౌక్యం!*
*పెట్టని తల్లి పెట్టకనే పాయే*
*రోజూ పెట్టే ముదునష్టపుదన్న పెట్టకపాయే*
అనేది వాడుకలో ఉన్న నానుడి
దీనిని అనేక సందర్భాలలోనూ
అన్వయించుకోవచ్చు !
ఎన్ని సార్లు సహాయం చేసినా
ఎన్ని మార్లు ఆహారాలు అందించినా
ఎన్ని సార్లు దానధర్మాలు చేసినా
ఎన్ని మార్లు మంచి సలహాలు ఇచ్చినా
ఎన్ని సార్లు శుభ కార్యాలకు వెళ్ళినా
ఎన్ని మార్లు అశుభ కార్యాలకు పోయినా!
చివరలో ఒక్కసారి చేయక పోతే
గతంలో చేసినన్నీ వ్యర్ధమైపోతాయి
నీవు నీచంగా హీనంగా చూడబడుతావు
అంతేనా కోపం పెరుగవచ్చు
కారాలు మీరాలు రువ్వ వచ్చు
కలతలు పెరుగవచ్చు
బంధుత్వం స్నేహం దూరం కావచ్చు!
అలా కాకుండా!
నీకు ఎప్పుడు వారితో అవసరమో
అప్పుడే సహాయం చేయడమో
ఆ సమయంలో మాంచి సలహాలు ఇవ్వడమో
అప్పుడే వారి కార్యాలకు వెళ్ళడమో చేస్తే
నీకు వేయి సహాయాలు చేసిన గౌరవం
గొప్ప తనం ఆ ఒక్క సారికే దక్కుతాయి
కీర్తిస్తారు కూడా!
ఇది నేటి సమాజ తీరు
స్వార్ధమే కావచ్చు
కానీ *లౌక్యం* అంటే ఇదే!
నీకు సౌఖ్యం లభించేది కూడా ఇక్కడే!
No comments:
Post a Comment