అంశం: విప్లవ జ్వాల
శీర్షిక: *ఎక్కడ వేసిన గొంగళి అక్కడే*
*ప్రభువెక్కిన పల్లకి కాదు*
*దానిని మోసిన బోయలెవ్వరు?*
అంటూ మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్లు
నేతలు పదవులు అధికారం
చేపట్టడంతోనే హీరోలు కారు
అందులో నాయలకు ఓటు వేసి గెలిపించిన
ఓటర్ల శ్రమ ఎంతో ఉంది!
అలాంటి ఓటర్లను ప్రజలను
లెక్క చేయకుండా అధికార దాహంతో
దోచుకుంటూ మోసం చేస్తూ
భూ కబ్జాలు చేస్తూ అవినీతి పాలనతో
ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ!
ఉచితాల మాయలో దింపినా
త్రాగుడుకు బానిసలును చేసినా
చిత్రసీమలో లాగా వారసులను
పోటీలో దింపుతూ దోచకుంటున్నా
దేశ రాష్ట్రాల సంపద ఏవో కొన్ని కుటుంబాల
కబంధ హస్తాలలో బంధించబడినా!
ఏదో ఒక రోజు విప్లవ జ్వాలలా
స్వార్ధ అవినీతి ప్రభుత్వాలను
ప్రజలు గద్దెలు దింపుతారు!
*పిల్లి యే కదా అని దానిని*
*నాలుగు గోడల మధ్య బంధిస్తే*
*అది పులిగా మారి రక్కుతుంది*!
ఎన్నో దశాబ్దాలు గడిచినా
నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నా
ప్రజల సమస్యలు పరిష్కారం
కాక పోవడమే కాదు పై పెచ్చు పెరుగు తుండే!
ప్రజలు కలిసి కట్టుగా ఉండి
విప్లవ జ్వాలలు రగిలిస్తే
అది అగ్ని పర్వతమైనా బద్దలవక తప్పదు
అగ్ని జ్వాలలు ఎగిసి పడక తప్పవు!
No comments:
Post a Comment